శాన్‌ఫ్రాన్సిస్కో : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్ల డేటా లీక్‌తో ఇబ్బందులు పడుతున్న ఫేస్‌బుక్ సంస్థకే స్వయంగా సొంతగూటిలో డేటాలీక్ ముప్పు తప్పలేదు. సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు, ఇతర ముఖ్యమైన అధికారులకు మధ్య జరిగిన అంతర్గత సంభాషణలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ముఖ‍్యంగా 2012లో వివిధ ప్రైవసీ పాలసీ విధానాలకు సంబంధించిన అతికీలకమైన విషయాలు ఆన్‌లైన్‌లో బహిర్గతం కావడం కలకలం రేపింది.
ఫేస్‌బుక్, సిక్స్4ఆర్ మధ్య దావాకు సంబంధించిన 60పేజీల ఈమెయిల్ సమాచారం,ఇతర పత్రాలు గిట్ హబ్‌లో పోస్ట్ అయ్యాయని ది గార్డియన్ శుక్రవారం నివేదించింది. షెడ్యూల్‌కంటే ముందే కంపెనీ ఆర్థిక ఫలితాలను ఆన్‌లైన్‌లో బహిర‍్గం చేసిందని పేర్కొంది. దీంతోపాటు గోప్యతా రక్షణపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్, అక్కడి నేర విభాగం అధిపతితో చర్చించిన అంశాలు కూడా లీక్ అయ్యాయని నివేదించింది.
ఆండ్రాయిడ్ పరికరాల్లో డేటా సేకరణకు సంబంధించి ప్రణాళికలు చర్చలు బహిర్గతం కావడం రెండవ అదిపెద్ద లీక్‌గా పత్రిక రిపోర్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనుసరించిన విధానంపై ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ మార్నే లివైన్‌కు చెందిన 2012 జులైనాటి 8పేజీల మెమోగా భావిస్తున్నారు. థర్డ్ పార్ట్ యాప్స్ ద్వారానే గోప్యతా ఉల్లంఘన జరిగినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. అయితే దావా పత్రాలను కాలిఫోర్నియా కోర్టు సీజ్ చేసిన నేపథ‍్యంలో తామేమీ వ్యాఖ్యానించలేదమని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment