Twitter: కొత్త ప్రయోగం.. ట్విటర్‌ కూల్‌ | Twitter Cool Feature To Help Users Avoid Heated Conversations | Sakshi
Sakshi News home page

ట్విటర్‌ కొట్లాటల్ని తగ్గించే ఫీచర్‌! ఏం చేస్తదంటే..

Published Fri, Oct 8 2021 11:56 AM | Last Updated on Fri, Oct 8 2021 4:32 PM

Twitter Cool Feature To Help Users Avoid Heated Conversations - Sakshi

సోషల్‌ మీడియా వేదికగా రకరకాల చర్చలు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఆ చర్చలు వాడీవేడి పరిణామాలకు.. అటుపై విపరీతాలకూ దారితీస్తుంటాయి. అయితే ఆ హీట్‌ డిబేట్‌లను తగ్గించే ప్రయత్నాలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు చేయలేవా?.. ఇందుకోసమే ట్విటర్‌ ఇప్పుడు రంగంలోకి దిగింది.


సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ త్వరలో ఓ కూల్‌ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. చర్చ అటుఇటు తిరిగి వాదులాటకు దారితీసే క్రమంలో ట్విటర్‌.. సదరు ట్వీపుల్స్‌(ట్విటర్‌ పీపుల్స్‌)ను అప్రమత్తం చేస్తుందట. ఇందుకోసం యూజర్ల సంభాషణ మధ్యలో కింద ఆఫ్షన్స్‌తో ఓ ఫీచర్‌ను డిస్‌ప్లే చేయబోతోంది. అప్పుడు యూజర్లు విచక్షణతో స్పందిస్తే.. ఆ ట్వీట్‌-రీట్వీట్ల సంభాషణపర్వం వేడెక్కకుండా అక్కడితోనే చల్లబడే ఛాన్స్‌ ఉంటుంది.

అయితే సంభాషణకు సంబంధించి ఏ సందర్భంలో అలర్ట్‌ చేస్తుంది, అసలు ఎలా అంచనా వేయగలుగుతందనేది, ఎలా పని చేస్తుందనే విషయాల్ని ట్విటర్‌ ఇప్పుడే చెప్పట్లేదు.  ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌  దశలో ఉందట. ఇది పూర్తయ్యాక ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌.. రెండింటిలోనూ ఈ కూల్‌ ఫీచర్‌ను అప్‌డేట్‌ ద్వారా తీసుకురాబోతున్నారు. 

ఇదిలా ఉంటే ట్విటర్‌లో ఈమధ్య సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ట్విటర్‌ టైం లైన్‌లో వాటికవే రిఫ్రెష్‌ అయ్యి.. ట్వీట్లు కనిపించకుండా పోతున్నాయి. దీనిపై స్పందించిన ట్విటర్‌ ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా ఓ ఫీచర్‌ను తెస్తామని హామీ ఇచ్చింది.

చదవండి: ఫేస్‌బుక్‌కి దెబ్బ.. వీళ్లేమో పండగ చేస్కున్నరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement