క్రికెట్ లవర్స్‌కు ట్విటర్ గుడ్‌న్యూస్‌ను అందించింది. క్రికెట్ అభిమానుల కోసం ట్విటర్‌లో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. టీ20 ప్రపంచకప్-2021 రావడంతో భారత్‌లో తొలిసారిగా కమ్యూనిటీస్ ఫీచర్‌ను ట్విటర్ అందుబాటులోకి తెచ్చింది. “Cricket Twitter - India’’ పేరుతో కమ్యూనిటీస్ ఫీచర్‌ను ట్విటర్ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా క్రికెట్ అభిమానులు లైవ్ స్కోర్‌ను కూడా తెలుసుకోవచ్చును. గత నెలలో ట్విటర్ ‘కమ్యూనీటీస్’ ఫీచర్‌ను అమెరికన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
చదవండి: స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై జియో బంపర్ ఆఫర్...!
అసలు ఏంటీ కమ్యూనిటీస్ ఫీచర్..!
ఫేస్‌బుక్‌లోని పలు గ్రూప్స్ మాదిరిగానే ట్విటర్ కమ్యూనిటీలతో ఇతర యూజర్లు తమ అభిప్రాయాలను ఈ గ్రూప్స్‌లో పంచుకోవచ్చును. ఈ గ్రూప్స్‌లోకి ఇతర యూజర్లను ఆహ్వానించవచ్చును. ఈ గ్రూప్ నుంచి ఆహ్వానం ఉంటేనే కమ్యూనిటీ ఫీచర్‌లో యాడ్ కావచ్చును. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో ట్విటర్‌లో యూజర్లకు క్రికెట్ ఎక్స్‌ప్లోర్ ట్యాబ్, లైవ్ మ్యాచ్ స్కోరును కూడా ట్విటర్ అందిస్తోంది.
పబ్లిక్ ట్వీట్‌ల మాదిరిగానే ప్రతి ట్విటర్ యూజర్ కమ్యూనిటీ ట్వీట్‌లను చదవవచ్చును ఆయా ట్విట్స్‌పై రిపోర్ట్ కూడా చేయవచ్చును. కాగా ట్విటర్ కమ్యూనిటీస్‌లో భాగం కానీ యూజర్లు మాత్రం ఆయా ట్విట్లకు రిప్లే ఇవ్వలేరు. ప్రస్తుతం ట్విటర్ ప్లాట్‌ఫారమ్‌లో కమ్యూనిటీలను సృష్టించడానికి యూజర్ల అందరికీ ఇంకా అనుమతించలేదు.
చదవండి: జుమ్‌జుమ్మని... బోయింగ్ సర్వీసులకు వీలుగా..
Comments
Please login to add a commentAdd a comment