ట్విటర్‌ను కొనుగోలు అనంతరం ఎలాన్ మస్క్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. తాజాగా, ఆయన ట్విటర్‌లో కాల్స్, మెసేజ్‌లను పంపుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.
మస్క్ గత ఏడాది ‘ట్విటర్ 2.0 ది ఎవ్రిథింగ్ యాప్’ పేరుతో ఎన్‌క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్‌లు, లాంగ్ ఫార్మ్ ట్విట్‌లు,పేమెంట్స్ సంబంధిత లావాదేవీలు జరిపేలా కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా త్వరలో ట్విటర్ నుంచి వాయిస్, వీడియా కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవని, ఇందుకోసం ఎలాంటి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
మెటా తరహాలో
ఎలాన్ మస్క్ చెప్పినట్లుగా ట్విటర్‌లోని ఈ సరికొత్త ఫీచర్లు ఇప్పటికే మెటా ఎనేబుల్ చేసింది. మెటా, ఇన్‌స్టాగ్రామ్ తరహాలో ట్విటర్‌లో ఉపయోగించుకునే సౌకర్యం ఉంది
యాక్టివ్ లేని ట్విటర్ అకౌంట్లను
బాస్‌గా అడుగు పెట్టిన నాటి నుంచి మస్క్.. ట్విటర్‌లో అనేక మార్పులు చేర్పులు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా వినియోగంలోని ట్విటర్ అకౌంట్లను డిలీట్ చేస్తున్నామని, తద్వారా కొంతమందికి ఫాలోవర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఇటీవల ట్విటర్ ద్వారా వెల్లడించారు.
చదవండి👉 వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్‌జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి!
Comments
Please login to add a commentAdd a comment