వాషింగ్టన్: మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గత ఏడాది కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులో ఎన్నో మార్పులు చేస్తున్నారు. ట్విట్టర్ పేరును ‘ఎక్స్’గా మార్చారు. పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను పొందుపర్చారు. ఆదాయం పెంపే లక్ష్యంగా మరో నిర్ణయం తీసుకున్నారు. ‘ఎక్స్’లో ఇకపై ఆడియో, వీడియో కాల్స్ సదుపాయం కలి్పంచనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.
ఫోన్ నంబర్ అవసరం లేకుండానే యూజర్లతో కాల్స్‌ను కనెక్ట్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్‌్కటాప్ సహా వినియోగదారులంతా ఈ సదుపాయం పొందవచ్చని సూచించారు. ప్రభావవంతమైన ప్రపంచ ఆడ్రస్ బుక్‌కు ‘ఎక్స్’ వేదిక కానుందని, ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉంటాయని వివరించారు. ‘ఎక్స్’లో ప్రస్తుతం ట్వీట్ డెక్ సరీ్వసులు ఉచితంగా అందిస్తున్నారు. వాటిని పెయిడ్ సరీ్వసులుగా మారుస్తున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment