audio
-
గెలిపించేందుకు సిద్ధం
ఆకాశ్ జగన్నాథ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తల్వార్’. కాశీ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, షిన్ టామ్ చాకో, అనసూయ భరద్వాజ్, అజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వార్నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై భాస్కర్ ఈ.ఎల్.వీ నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ‘తల్వార్’ నుంచి పవర్ఫుల్ ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘యుద్ధం జరిగే తీరు మారినా... చివరకు రక్తపాతంతో ముగుస్తోంది’, ‘అధర్మంతో అయినా ధర్మాన్ని గెలిపించేందుకు సిద్ధం’ వంటి డైలాగ్స్ గ్లింప్స్‌లో ఉన్నాయి. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘తల్వార్’. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జానీ బాషా, కెమేరా: త్రిలోక్ సిద్ధు, సంగీతం: కేశవ కిరణ్. -
వీఆర్ వో నాగేంద్రతో టీడీపీ నేత నరసింహ యాదవ్ ఫోన్ సంభాషణ
-
Karimnagar: సీఐ బాత్రూం బకెట్లో 3లక్షలు.. ఫోన్ కాల్ వైరల్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నేను మీ తమ్ముడిని.. ఇవన్నీ పిట్టకథలు వద్దు... బాజప్తా మీ బాత్రూంలో రూ.3 లక్షలు పెట్టిన.. అని ఆడియో లీక్‌కాగా, మరునాడు సామాజిక కార్యకర్త సదరు సీఐని విచారణ చేయాలంటూ వీడియో విడుదల చేయడం రెండు రోజులుగా జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట టౌన్ సీఐ, సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీతో డబ్బుల విషయంలో మాట్లాడిన సంభాషణ ఆడియో రికార్డు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. సదరు ఆడియోలో ఎస్సీ, ఎస్టీ కేసులో సీఐకి మూడు లక్షల రూపాయలు లంచంగా సీఐ ఛాంబర్లోని వాష్‌రూమ్‌లో పెట్టి అందజేసినట్లు ఆడియోలో ఉంది. తాజాగా ఆడియోలో మాట్లాడిన సామాజిక కార్యకర్త షేక్‌సాబీర్ అలీ మరిన్ని వివరాలతో వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో షేక్‌సాబీర్ అలీ మాట్లాడుతూ.. ‘జెర్రంశెట్టి కృష్ణారావు, గోవిందరెడ్డి, మర్రుతో పాటు ఎస్ఆర్కే డెయిరీ చైర్మన్ బండారు మాధురి మధ్య ఉన్న వివాదాల్లో మధ్యవర్తిత్వం కోసం కృష్ణారావు నన్ను ఆశ్రయించారు. గత అక్టోబర్ 28 నుంచి 30 వరకు వివాదం పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లో సీఐ రవితో మాట్లాడటం జరిగింది. కృష్ణరావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయొద్దంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితులతో మాట్లాడి రూ.3 లక్షలు తీసుకొచ్చి సీఐ వద్దకు వెళ్లగా, సీఐ ఛాంబర్లోని బాత్రూంలోని బకెట్లో పెట్టాలని సూచించాడు. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా కృష్ణారావుపైనే కేసు నమోదు చేశాడు’ అని వీడియోలో పేర్కొన్నాడు. దీంతో గత ఏడాది డిసెంబర్ 30న సీఐకి ఫోన్‌చేసి, రూ.3 లక్షలు తీసుకొని బాధితుడిపైనే కేసు ఎలా నమోదు చేస్తారని సూటిగా అడిగిన. దానికి అతడు తడబడ్డాడు కానీ.. పైసలు తీసుకోలేదని మాత్రం చెప్పలేదు. డబ్బులు ఇచ్చేటప్పుడు స్పై కెమెరాతో రికార్డు చేశానని చెప్పడంతో నిన్ను నమ్మటం తప్పా అని సీఐ అన్నాడని అందులో చెప్పాడు. తర్వాత ఆరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మారేపల్లి రాజుతో రోడ్డుపై నడిచి వెళ్తుండగా నా మొబైల్‌ను పల్సర్ బైక్‌మీద వచ్చిన ఇద్దరు ప్రైవేట్ యువకులు లాక్కోనిపోయారు. అప్పటికే సదరు ఆడియోను మా మిత్రులకు షేర్చేసి చేసిన కాబట్టి ఆ ఆడియోను మీడియాకు లీక్ చేయగలిగాను. గతంలో ఇలా ప్రశ్నించినప్పుడు నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా కేసులు బనాయించే అవకాశం ఉంది. బాధితులను బెదిరించి డబ్బులు ఇవ్వలేదని చెప్పించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. పోలీస్ ఉన్నతాధికారులు గత ఏడాది అక్టోబర్ 28 నుంచి 30 వరకు పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సదరు వీడియోలో షేక్ సాబీర్ అలీ పేర్కొన్నారు. పోలీసుల మౌనం వెనక అనుమానాలురెండు రోజులుగా జిల్లాలో ఆడియో, వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నా... పోలీస్ వర్గాల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం పలుఅనుమానాలకు తావిస్తోంది. మధ్యవర్తి తేదీ, సమయంతో పాటు పూర్తివివరాలు చెబుతుండడం, లీకైన ఆడియోలో సామాజిక కార్యకర్త సీఐను ఏకవచనంతో సంభోదించటం, పదేపదే డబ్బులు ఇచ్చానని చెప్పుతున్నా... సీఐ మాత్రం స్టేషన్‌కి రా మాట్లాడుకుందాం అంటూ సున్నితంగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు మాట్లాడటం.. నిన్ను నమ్మడం తప్పా అని సీఐ అనటంలో అంతర్యం ఏంటని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఈ జమ్మికుంట ఎపిసోడ్లో విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఇలా ఉంటే గురువారం రాత్రి జమ్మికుంట పోలీసులు మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అందులో ఆడియో, వీడియోలోని మాటలను ఖండించకుండా కేవలం సాబీర్ అలీ బ్లాక్‌మెయిలర్, అతడిపై గతంలో చాలా కేసులు నమోదు అయ్యాయంటూ పేర్కొనడం గమనార్హం. రిమాండ్ చేసి సస్పెండ్ చేయాలిజమ్మికుంట పట్టణ సీఐ వరిగంటి రవి అవినీతి తిమింగలంగా మారి రూ.3లక్షలు లంచం తీసుకోవడం ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ. పోలీస్ యూనిఫామ్ ధరించి ప్రజల నమ్మకాన్ని దోచుకోవడం దుర్మార్గం. తెలంగాణ డీజీపీ, ఏసీబీ డీజీపీ, కరీంనగర్ సీపీలు ఇలాంటి అవినీతి పురుగులను రిమాండ్ చేసి సస్పెండ్ చేయాలి. ప్రజల రక్షణ కోసం ఉన్న యూనిఫామ్‌కి మచ్చ తెచ్చే వారిని వదిలిపెట్టవద్దు.– పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేషాక్కు గురయ్యా సాబీర్ నా మీద అంత పెద్ద ఆరోపణ చేసేసరికి ఒక్కసారిగా షాక్ తిన్న. అందుకే, కాస్త వెనక్కి తగ్గినట్లు మాట్లాడాను. అతన్ని పట్టుకునేందుకు రప్పిద్దామని అనుకున్నా. సాబీర్‌పై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయి. ఈ ఘటన విషయంలో అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాం.– వి.రవి, జమ్మికుంట టౌన్ సీఐ -
మోహన్ బాబు కొత్త ఆడియో విడుదల
-
రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలు ఆవిష్కరణ
సాక్షి, తిరువనంతపురం: గజల్ శ్రీనివాస్ గానం చేసిన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవి ముక్తేశ్వరానంద సరస్వతి ఆవిష్కరించారు.పోతన విరచిత భాగవతంలోని ముఖ్య 108 పద్యాలు, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని ముఖ్య 108 పద్యాలు, డా.ముకుంద శర్మ వ్రాసిన గేయ రామాయణాల ఆడియోలను ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీ తిరువనంతపురం (కేరళ) పద్మనాభ స్వామి వారి ఏకాంత దర్శన అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.మన సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను ఒకే రోజు ఆవిష్కరించడం అతి గొప్ప ధార్మిక కార్యక్రమం అని, వీటిని స్వరపరచి సందర్భ, తాత్పర్య సహితంగా అందరికీ అర్ధమయ్యేలా గానం చేసిన డా.గజల్ శ్రీనివాస్ అభినందనీయుడని శంకరాచార్య అన్నారు. ఆడియో తొలి ప్రతులను సి.ఎల్.రాజం దంపతులకు, మిజోరమ్ పూర్వ గవర్నర్ కుమ్మనం రాజ శేఖర్‌లకు స్వామి అందించారు. -
కొంటున్నారు.. వింటున్నారు!
న్యూఢిల్లీ: దేశీయంగా ఆడియో డివైజ్‌ల ఆఫ్‌లైన్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. జూన్‌తో ముగిసిన పన్నెండు నెలల వ్యవధిలో మూవింగ్ యాన్యువల్ టర్నోవర్ (ఎంఏటీ) ప్రాతిపదికన 32 శాతం పెరిగి రూ. 3,400 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల స్థాయికి చేరింది. మరింత మెరుగైన అనుభూతినిచ్చే సౌండ్ టెక్నాలజీలు రావడం, వ్యక్తిగత–గృహ కేటగిరీల్లో అత్యంత నాణ్యమైన ఆడియో ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వంటి అంశాలు ఈ విభాగ వృద్ధికి తోడ్పడుతున్నాయి.పర్సనల్ ఆడియో సెగ్మెంట్లో అమ్మకాల పరిమాణం 61 శాతం మేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్, కన్జూమర్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎన్ఐక్యూలో భాగమైన జీఎఫ్కే రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆడియో డివైజ్‌లపై భారతీయ వినియోగదారుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. సినిమాటిక్ అనుభూతిని పొందేందుకు, సౌకర్యవంతంగా వినేందుకు వారు మొగ్గు చూపుతున్నారు.మార్కెట్లో ఇప్పటికీ కాంపాక్ట్ స్టీరియో సిస్టమ్స్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, హోమ్ థియేటర్, స్మార్ట్ ఆడియో విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. జెన్ జెడ్ కస్టమర్లకు హెడ్ఫోన్లు, హెడ్సెట్లు, మినీ/బ్లూటూత్ స్పీకర్లు తప్పనిసరి డివైజ్‌లుగా మారాయి. పాడ్‌కాస్ట్‌లు, ఆడియో సిరీస్ల్లాంటి కొత్త రకం కంటెంట్ ఫార్మాట్లు పెరుగుతుండటం కూడా ఈ ఉత్పత్తులకు దన్నుగా ఉంటోంది.నివేదికలోని మరిన్ని విశేషాలు..» వైర్లెస్, ట్రూ వైర్లెస్ డివైజ్‌లకు, నాయిస్ క్యాన్సిలేషన్, వాయిస్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ వంటి అధునాతన ఫీచర్లకు డిమాండ్ పెరిగింది. సగటు అమ్మకం ధర సుమారు 18 శాతం తగ్గింది. » పర్సనల్ ఆడియో సెగ్మెంట్లో ట్రూ వైర్లెస్ హెడ్‌సెట్స్‌కి గణనీయమైన ఆదరణ నెలకొంది. దీంతో ఈ విభాగంలో వాటి వాటా 38 శాతానికి పెరిగింది. » మినీ/బ్లూటూత్ స్పీకర్ల అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందాయి. రూ. 2,000 వరకు ధర ఉండే ఎంట్రీ లెవెల్ ప్రోడక్టుల విక్రయాలు 3 శాతం పెరిగాయి.» లౌడ్‌స్పీకర్ అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది రూ. 1,100 కోట్లకు చేరాయి. ఇందులో సౌండ్బార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 70 శాతం అమ్మకాలు బడా రిటైల్ చెయిన్ల ద్వారా ఉంటున్నాయి. ఇందులోనూ సౌత్ జోన్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు లౌడ్‌స్పీకర్ల డిమాండ్‌కి హాట్స్పాట్లుగా మారాయి. చిన్న పట్టణాలు, నగరాల్లో అమ్మకాలకు ఈ విభాగంలోని విక్రయాల్లో దాదాపు 30 శాతం వాటా ఉండటమనేది, మెట్రోపాలిటన్యేతర ప్రాంతాల్లో కూడా ఈ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తోంది. -
విశాఖలో దారుణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న పద్మిని ఆడియో
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. వివాహితను హత్య చేసిన అత్త, మామ, భర్త ఆత్మహత్యగా చిత్రీకరించారు. అత్త,మామ, భర్త, వేధింపులు భరించలేక మృతురాలు పద్మిని.. బంధువులకు ఆడియో రికార్డ్ చేసి పంపించింది. నోటిలో పురుగులు మందు బలవంతంగా పోసి భార్యను భర్త సోమేశ్వరరావు హత్య చేశాడు. ఈ నెల ఒకటో తేదీన ఘటన చోటు చేసుకోగా, కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. భర్త, అత్త మామలను గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు.వరకట్నపు వేధిపులు కేసు ఆడియో ‘సాక్షి’కి చిక్కింది. మృతురాలు పద్మిని తన మావయ్యకి ఆడియో పంపింది. పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకొని రావాలని భర్త వేధింపులకు గురిచేశాడు. పురుగులు మందు నీటిలో పోసి.. భర్త సోమేశ్వరరావు చేతిని అడ్డు పెట్టాడు. 25 సార్లు వాంతులు చేసుకున్న పద్మిని ఆడియో కన్నీరు తెప్పిస్తుంది. -
వాట్సాప్‌లో మూడు అదిరిపోయే ఫీచర్లు
వాట్సాప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం అప్డేటెడ్ ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ తరుణంలో తాజాగా ఆడియోతో స్క్రీన్ షేరింగ్, పార్టిసిపెంట్ కెపాసిటీ, స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్ అనే మూడు కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది.ఆడియోతో స్క్రీన్ షేరింగ్: వాట్సాప్ ఇప్పుడు వినియోగదారులు ఆడియోతో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ద్వారా తమ స్క్రీన్ & ఆడియోను ఏకకాలంలో పంచుకునేందుకు వీలుంటుంది. స్క్రీన్ షేరింగ్ అనేది గతంలోనే వాట్సాప్ పరిచయం చేసినప్పటికీ.. ఇప్పుడు మెరుగైన ఆడియో సఫోర్ట్ జోడించింది.వీడియో కాల్లలో పెరిగిన పార్టిసిపెంట్ కెపాసిటీ: ఇప్పటి వరకు ఒక మీటింగ్ అంటే జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి యాప్స్ ఉపయోగించి ఉంటారు. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా ఒకేసారి 32 మంది వీడియో కాల్లో పాల్గొనవచ్చు.స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్: కాల్లో ఎవరు మాట్లాడుతున్నారో ట్రాక్ చేయడం కోసం స్మార్ట్‌ఫోన్ యాప్‌లో కష్టంగా అనిపించినప్పటికీ, మాట్లాడే వ్యక్తిని ఆటోమేటిక్‌గా హైలైట్ చేయడానికి స్పాట్లైట్ ఫీచర్‌ను కూడా జోడించింది.వాట్సాప్ ఇప్పుడు ఆడియో, వీడియో నాణ్యతను మెరుగుపరచడం మీద ఎక్కువ ద్రుష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సరికొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్స్ అన్నీ త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ తప్పకుండా వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. -
భూతల్లి పై ఒట్టేయ్...
‘శౌర..’ అంటూ చైతన్య గీతం పాడారు సేనాపతి. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో విడుదలైన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (‘భారతీయుడు’). ఈ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ (‘భారతీయుడు 2, 3’)’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శంకర్. ఈ చిత్రంలో సేనాపతి పాత్రలో కనిపిస్తారు కమల్‌హాసన్. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ్ర΄÷డక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక జూన్ 1న చెన్నైలో జరగనుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని తొలి పాటను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘భూతల్లి పై ఒట్టేయ్... తెలుగోడి వాడి చూపెట్టేయ్...’ అంటూ సాగే తెలుగు పాట ‘శౌర..’కు సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం అందించగా, రితేష్ జి. రావ్, శ్రుతికా సముద్రాల పాడారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ చిత్రం విడుదల కానుంది. -
వైఎస్ఆర్సీపీ పై షర్మిల కుట్ర.. ఆడియో లీక్ తో అడ్డంగా దొరికిపోయింది..
-
Neelima Penumarthy: కథలకో గంట 1/24.. నీలిమ చెప్పే కథ చదవండి!
స్కూల్లో మ్యాథ్స్ అవర్... సైన్స్ అవర్ అంటుంటాం. చట్టసభలో జీరో అవర్ అనే మాట వింటుంటాం. స్టోరీ అవర్... ఈ గంట ఎక్కడ నుంచి వచ్చింది?నీలిమ పెనుమర్తి ఆలోచన నుంచి వచ్చింది. రోజుకో గంట కథలు వినమని చెప్తున్నారీమె. యూకేలో ఆచరణలో పెట్టి... ఇండియాకి తెచ్చారు. విశ్వవ్యాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆడియో బుక్స్‌తో స్వచ్ఛమైన భాష నేర్పిస్తున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నీలిమ ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. పిల్లల పెంపకంలో కథలు కూడా ఒక భాగం అయి తీరాలని నమ్ముతారామె. మనదేశంలో స్కూల్ కరికులమ్‌లో పిల్లలకు కథలు లేక΄ోవడం విచారకరం అంటారామె. కథ ్రపాధాన్యం తెలిసిన అభివృద్ధి చెందిన దేశాలు పిల్లల రోజువారీ క్రమంలో ఓ గంట కథల కోసం కేటాయిస్తున్నాయని, మన దగ్గర అది లోపించడంతో ఎంత పెద్ద చదువులు చదివినప్పటికీ ఒక విషయాన్ని చక్కగా కళ్లకు కట్టినట్లు వివరించగలిగిన నైపుణ్యం కొరవడుతోందన్నారు నీలిమ. భాష ఏదైనా ఆ భాషలో పదాలను స్పష్టంగా ఉచ్ఛరించడం అలవాటు చేయాలంటే ఇంట్లో తల్లిదండ్రులు అంత స్వచ్ఛంగా మాట్లాడే నేపథ్యం ఉండాలి. ఆ వెసులుబాటు లేని పిల్లలకు తన ప్రయత్నం మంచి భాషను, చక్కటి భావ వ్యక్తీకరణను నేర్పిస్తుందన్నారు నీలిమ. ఏడేళ్ల కిందట ‘స్టోరీ అవర్‘ ఆలోచనకు బీజం పడిన సందర్భాన్ని ‘సాక్షి’తో పంచుకున్నా రామె.ఓ గంట నిడివిలోనే కథ ‘‘నాకు లండన్ ఇంపీరియల్ కాలేజ్‌లో కెమిస్ట్రీలో ఎంఎస్ చేయడానికి స్కాలర్షిప్ వచ్చింది. మా వారు కూడా స్కాలర్షిప్ మీద లండన్‌లోనే వచ్చారు. అలా 30 ఏళ్ల కిందట యూకేకి వెళ్లడం, చదువు, ఉద్యోగం, ఇద్దరు పిల్లలతో అక్కడే సెటిలయ్యాం. రెండవసారి గర్భిణిగా ఉన్నప్పుడు పీహెచ్‌డీలో విరామం తీసుకున్నాను. ఆ విరామం నా ఆలోచనలను కథల మీదకు మళ్లించింది. పెద్ద బాబుకి కథలు చెప్పడం మొదలుపెట్టాను. అమరచిత్ర కథ చదవడం అలవాటు చేశాను. అదే చిన్నబాబుకి కూడా అలవడింది. మా అబ్బాయిలిద్దరూ గ్రీక్ ΄ûరాణిక గ్రంథాలను కూడా చదివారు. వాళ్లిద్దరి మాటల్లో ఆ పాత్రల గురించిన చర్చ వస్తుండేది.అప్పుడు మన రామాయణాన్ని పరిచయం చేశాను. అదే సమయంలో మా పెద్దబ్బాయి స్కూల్ వాళ్లిచ్చిన ్రపాజెక్ట్ కోసం ఒక స్టోరీ బోర్డ్ చేయాల్సి వచ్చినప్పుడు రామాయణం ఇతివృత్తంగా చేశాడు. ఆ తర్వాత పిల్లలకు సెలవుల్లో రామాయణం మీద వాళ్ల వెర్షన్ రాయమని చె΄్పాను. ఆ టాస్క్‌లో మరో చాలెంజ్... కథనం గంటకు మించరాదు. తమకు తోచినట్లు ఎడిట్ చేసుకుంటూ సీతారామలక్ష్మణులు యుద్ధం తర్వాత విజేతలై అయోధ్యకు రావడం దీపావళి వేడుక చేసుకోవడంతో ముగింపు ఇవ్వాలన్నమాట. ఆ సాధన ఆడియో బుక్ ఆలోచనకు రూపమిచ్చింది.పిల్లలే పాట రాశారు!మాల్గుడి డేస్ వీడియోలకు సిగ్నేచర్ ట్యూన్ ఉన్నట్లే మా ఆడియో బుక్స్‌కి కూడా ట్యూన్ ఉండాలని పాట కోసం ప్రయత్నించాను. పిల్లలకు ఇస్తే ఎలా రాస్తారో చూద్దామని యూకేలో శచి అనే అమ్మాయికిచ్చాను. తాను రామాయణం కథను ఒక్క వాక్యంలో ‘వారధి నిర్మాణం సీత మీద రాముడికి ఉన్న ప్రేమకు ప్రతిబింబింబం’ అనే భావంతో రాసింది. అలాగే భారతీయ మూలాలు ఏ మాత్రం లేని ‘ఎవీ సిమన్స్’ అనే అమ్మాయి ‘లైట్ ద ల్యాంప్స్’ పేరుతో సీతారాములు విజేతలుగా అయోధ్యకు వచ్చి దీపావళి వేడుక చేసుకోవడాన్ని రాసింది. మంథర విషపూరిత వచనాలు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో వివరించింది.క్రియేటివ్‌గా సైన్స్ పాఠాలు బాల్యంలో మేము బాలానందం వినేవాళ్లం. సరళంగా సాగే కథనాలు పిల్లల్ని అలరించేవి. నా ఆడియోబుక్స్ కూడా సులువుగా ఉంటాయి. ఇవన్నీ ‘స్టోరీ అవర్ డాట్ కో డాట్ యూకే’ వెబ్సైట్లో ఉచితంగా ఉన్నాయి. భాష శుద్ధంగా ఉంటే ఆలోచనలు కూడా అంతే శుద్ధంగా ఉంటాయని నా అభి్రపాయం. మంచి భాష మాట్లాడితే వ్యక్తి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాల కోసం ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సరే... మంచి భాష ద్వారా చక్కటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మంచి ఉచ్చారణ వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది. అందుకే సైన్స్ సబ్జెక్ట్‌ని కూడా ఈ క్రియేటివ్ మీడియం ద్వారా వివరించాలనేది నా ఆకాంక్ష’’ అని తన ప్రయత్నం వెనుక ఉన్న పరమార్థాన్ని వివరించారు నీలిమ పెనుమర్తి. సమయం లేని తల్లిదండ్రుల కోసం...ఇప్పుడు ఉద్యోగాలు దాదాపుగా అందరి జీవితాలనూ సంక్లిష్టంగా మార్చేస్తున్నాయి. ఇలాంటప్పుడు పిల్లలకు కథ చె΄్పాలని ఉన్నప్పటికీ కొంతమందికి అందుకోసం ఓ గంట సమయం కేటాయించలేని పరిస్థితి ఉంటోంది. వాళ్లకు ఉపయోగపడేటట్లు కథలకు ఆడియో బుక్ రూపమిచ్చాను. దానిని ఇంగ్లిష్, హిందీ, తెలుగులో తెచ్చాను. మా పిల్లలు శ్రేయాస్, ఆయుర్ ఇద్దరూ హిస్టరీ చదివారు. అక్కడ హిస్టరీ అంటే రష్యన్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, ప్రపంచ యుద్ధాలు ప్రధానంగా ఉంటాయి.మా పిల్లలు అలాగే యూకేలో ఉన్న భారతీయమూలాలున్న పిల్లలకు మన చరిత్ర తెలియచేయాలనే ఉద్దేశంతో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద మొఘల్స్ టు ద మహాత్మా’ పేరుతో మరో ఆడియో బుక్ చేశాను. ఆ స్టోరీ ఈస్ట్ ఇండియా కంపెనీ మనదేశంలో అడుగు పెట్టడం నుంచి మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సముపార్జన వరకు సాగింది. అలాగే మన సామెతలను పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నమే ‘తాతమ్మ కథలు’. మా అమ్మ, నాన్న, అత్త, మామగారితో ఒక్కో సామెతకు ఒక్కో కథ రాయించి వాటిని ఐదు నిమిషాలకు మించకుండా ఎడిట్ చేసి రికార్డ్ చేశాను. మొత్తం పన్నెండు కథలు, గంట ఆడియో.ఈ కథలకు నాకు మాల్గుడి డేస్ స్ఫూర్తి. యూకేలోని తెలుగు కుటుంబాల పిల్లలు ఈ కథలను వినడం మొదలు పెట్టిన తర్వాత తొలి రోజుకి పన్నెండవ రోజుకీ వారి ఉచ్చారణ మారి΄ోయింది. కథకు అంతటి శక్తి ఉంటుందనే నా నమ్మకం నిజమేనని నిరూపితమైంది. తోలుబొమ్మలతో చేసిన ప్రయోగానికి చాలా ఖర్చయింది, కానీ అది కూడా సంతృప్తినిచ్చింది. ఆరు పాత్రలతో కథను అల్లుకుంటూ రాసుకున్నాం. ఆడియో బుక్ అనువాదాలకు హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయ (ఉప్పల్) విద్యార్థులు, బేగంపేటలోని దేవనార్ (అంధ విద్యార్థుల పాఠశాల) స్కూల్ విద్యార్థులు గళమిచ్చారు.– నీలిమ పెనుమర్తి, స్టోరీ అవర్ రూపకర్త– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
ఈలేస్తే.. క్లోజ్! .. గంట వ్యవధిలోనే ఘటనాస్థలికి ఫ్లయింగ్ స్క్వాడ్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో రాజకీయ పార్టీల హోర్డింగులు సోమవారం ఉదయం వరకూ ఉన్నాయి. వీటిని సీ–విజిల్ ద్వారా ఫొటోలు తీసి ఎవరో అప్లోడ్ చేశారు. అంతే.. నిమిషాల వ్యవధిలో అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన హోర్డింగులను తొలగించింది. ఈ యాప్ ఎంత వేగంగా పని చేస్తుందనేందుకు ఈ చర్యలే సాక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వ సన్నద్ధమయింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు.. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పార్టీల ప్రలోభాలు, కోడ్ ఉల్లంఘనలపైనా దృష్టి సారించింది. ఉల్లంఘనులపై చర్యలకు ‘సీ విజిల్’ యాప్‌ను సిద్ధం చేసింది. – ప్రత్తిపాడు ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తే చాలు.. సాధారణ ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని (ఎన్నికలకోడ్) ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, మద్యం, డబ్బు, వస్తు సామగ్రి పంపిణీ వంటి వాటికి పాల్పడినా, అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఓటర్లకు కానుకలు అందజేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే నేరుగా ఎన్నికల సంఘానికి చేరిపోతాయి. కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలనూ ఆడియో ద్వారా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. అత్యంత వేగంగా స్పందన సీ విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందన ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా సంబంధిత ప్రదేశం నుంచే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన గంటలోపు అక్కడకు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంటుంది. ఘటనపై 90 నిమిషాల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. ఎన్నికల కమిషన్ అందుబాటులోనికి తీసుకువచి్చన ఈ యాప్‌ను ఓటర్లు వినియోగించుకోవాలి. – ఎం.పద్మజ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రత్తిపాడు గంట వ్యవధిలోనే.. ► ఎవరైనా, ఎక్కడి నుంచైనా యాప్‌లో అప్లోడ్ చేసిన ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. ఆయన దీని పరిశీలనకు ఫీల్డ్‌లో ఉన్న టీముకు పంపిస్తారు. ►15 నిమిషాల్లో ఫీల్డ్‌లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుతుంది. ► 30 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చర్యలు మొదలుపెట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతుంది. ►యాభై నిమిషాల్లో రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేస్తారు. ►ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. ►యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ఇన్స్టాల్ చేసుకునే సమయంలో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ► ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్న సమయంలో మొబైల్లోని జీపీఎస్ ఆన్‌లో ఉంచాలి. దాని ఆధారంగానే అధికారులు సంబంధిత ప్రాంతానికి నేరుగా చేరుకోగలుగుతారు. ► యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో వచ్చిన ఓటీపీ ద్వారా యాప్ యాక్టివేట్ అవుతుంది. ► ఆ తర్వాత వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేసి నేరుగా యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపవచ్చు. -
‘ఎక్స్’లో ఇక ఆడియో, వీడియో కాల్స్.. ఎలా ఆక్టివేట్ చేయాలంటే..
టెక్నాలజీ కంపెనీల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ కొన్నేళ్లుగా ఆడియో, వీడియోకాల్ సదుపాయాన్ని కల్పిస్తుంది. అదే తరహాలో ఇపుడు మరో టెక్ దిగ్గజమైన ఎక్స్(ట్విటర్) ఆడియో, వీడియోకాల్ సౌకర్యాన్ని తన వినియోగదారులకు అందించనుంది. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఎలాన్‌మస్క్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే Settings->Privacy & Safety->Direct Messages-> Enable Audio & Video Calling ఫీచర్‌ని ఎనేబల్ చేసుకోవాలి. (ఇదీ చదవండి: ప్రపంచంలోనే మేటి ఇండియన్ బీస్కూళ్లు..) ఎవరికీ ఫోన్ నంబరు ఇవ్వకుండానే కాల్స్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ని ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్లను తీసుకురానున్నట్లు గతంలో మస్క్ ప్రకటించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీల్లో ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. Early version of video & audio calling on 𝕏 https://t.co/aFI3VujLMh — Elon Musk (@elonmusk) October 25, 2023 -
నల్లగొండలో విషాదం
-
‘ఎక్స్’లో ఆడియో, వీడియో కాల్స్
వాషింగ్టన్: మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గత ఏడాది కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులో ఎన్నో మార్పులు చేస్తున్నారు. ట్విట్టర్ పేరును ‘ఎక్స్’గా మార్చారు. పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను పొందుపర్చారు. ఆదాయం పెంపే లక్ష్యంగా మరో నిర్ణయం తీసుకున్నారు. ‘ఎక్స్’లో ఇకపై ఆడియో, వీడియో కాల్స్ సదుపాయం కలి్పంచనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఫోన్ నంబర్ అవసరం లేకుండానే యూజర్లతో కాల్స్‌ను కనెక్ట్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్‌్కటాప్ సహా వినియోగదారులంతా ఈ సదుపాయం పొందవచ్చని సూచించారు. ప్రభావవంతమైన ప్రపంచ ఆడ్రస్ బుక్కు ‘ఎక్స్’ వేదిక కానుందని, ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉంటాయని వివరించారు. ‘ఎక్స్’లో ప్రస్తుతం ట్వీట్ డెక్ సరీ్వసులు ఉచితంగా అందిస్తున్నారు. వాటిని పెయిడ్ సరీ్వసులుగా మారుస్తున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. -
ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఎక్స్(ట్విటర్)లో కూడా - ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ ట్విటర్ కంపెనీ కొనుగోలు చేసిన తరువాత అనేక మార్పులు చేసిన విషయం తెలిసింది. ఉద్యోగుల తొలగింపు, బ్రాండ్ లోగోలో మార్పు వంటి వాటితో పాటు, ఇటీవల ట్విటర్‌కి 'ఎక్స్' అని నామకరణం చేసాడు. కాగా ఇప్పుడు ఆడియో అండ్ వీడియో కాల్స్‌కి సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల 'ఎక్స్'గా పేరు మార్చుకున్న ట్విటర్లో త్వరలో ఆడియో అండ్ వీడియో కాల్స్ సదుపాయం లభిస్తుందని కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. దీనిని వినియోగదారులు ఫోన్ అవసరం లేకుండా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్, మాక్, పీసీలో వినియోగించుకోవచ్చు. అయితే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: 64 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.. కారణం ఏంటంటే? Video & audio calls coming to X: - Works on iOS, Android, Mac & PC - No phone number needed - X is the effective global address book That set of factors is unique. — Elon Musk (@elonmusk) August 31, 2023 -
అడ్డంగా బుక్కయిన చంద్రబాబు!
చిత్తూరు అర్బన్/బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద ముందస్తు ప్రణాళికలో భాగంగానే టీడీపీ శ్రేణులను బహిరంగంగా రెచ్చగొట్టి దాడులు చేయించిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. విధ్వంసానికి దిగాలని చంద్రబాబు బహిరంగంగానే పిలుపునివ్వగా.. పార్టీ శ్రేణులు, కిరాయి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ‘పచ్చ మీడియా’ సహా అన్ని చానళ్లలోనూ ప్రసారమయ్యాయి. వాస్తవానికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన లేకపోయినా.. ముందురోజు సాయంత్రం పర్యటనలో మార్పు చేయడం.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో లేకున్నా ములకలచెరువు, బురకాయలకోట, అంగళ్లు గ్రామాల పర్యటనకు వెళ్లడం వంటి అంశాలు చంద్రబాబు ఈ కుట్రకు ఏవిధంగా తెర తీశారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. ఆ ఆడియో టేపులోని మాటలు తనవి కాదని బొంకారు. కానీ.. తాజా కేసులో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టిన వీడియో సాక్ష్యాలు ఉండటంతో ఈ కేసులో అడ్డంగా దొరికిపోయారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు తాను రెచ్చగొట్టలేదని మాట మారిస్తే.. పోలీసుల వద్ద ఉన్న, ఎల్లో మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి.. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏ1గా కేసు నమోదైంది. అంతా వ్యూహం ప్రకారమే.. ఈ నెల 4న ఉదయం 10:30 గంటలకు నాయన చెరువుపల్లెలో పనుల పరిశీలనకు రావాల్సిన చంద్రబాబు 12 గంటలు దాటాక చేరుకున్నారు. నేరుగా పనుల పరిశీలనకు వెళ్లకుండా షెడ్యూల్‌ను పక్కనపెట్టి ములకలచెరువులో ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అక్కడినుంచి నాయన చెరువుపల్లెకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బురకాయలకోటలో కారు ఫుట్ బోర్డుపైకి ఎక్కి రోడ్‌షో నిర్వహించారు. బి.కొత్తకోట మండలంలో హంద్రీ–నీవా కాలువను కొద్దిసేపు పరిశీలించారు. అంగళ్లులో చంద్రబాబు రోడ్‌షో, ప్రసంగం లేదు. కానీ.. మసీదు వద్దకు రాగానే చంద్రబాబు తాను ప్రయాణించే కారుపై రోడ్‌షో నిర్వహించారు. నాయన చెరువుపల్లె, హంద్రీ–నీవా కాలువ పనుల పరిశీలన మినహా షెడ్యూల్ మేరకు మిగతా ఏ కార్యక్రమం లేదు. కానీ.. ఆద్యంతం షెడ్యూల్‌కు భిన్నంగానే చంద్రబాబు పర్యటన కొనసాగించారు. ప్రాజెక్టుల సందర్శన పేరిట చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు విధ్వంసక వ్యూహం ప్రకారమే వచ్చినట్లు అర్థమవుతోంది. వాస్తవానికి హంద్రీ–నీవా కాలువ వద్ద రైతులతో చంద్రబాబు సమావేశం కావాల్సి ఉంది. దానిని రద్దు చేసుకుని మరీ అంగళ్లు గ్రామానికి చేరుకున్న చంద్రబాబు మసీదు వద్దకు రాగానే కారుపై నిలబడి రోడ్‌షో ప్రారంభించారు. అంగళ్లులో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. పిచ్చలవాండ్లపల్లె రిజర్వాయర్‌పై చంద్రబాబు కోర్టులో కేసు వేయించి పనులు అడ్డుకున్నందుకు నల్లకండువాలతో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు ‘తరమండిరా.. కొట్టండిరా నా కొడుకులను..’ అంటూ గొడవకు ఉసిగొల్పారు. అంతటితో ఆగక ‘పుంగనూరులో ఆ పుడింగి సంగతి తేలుద్దాం.. పదండి’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో అప్పటికే ముందస్తు వ్యూహం ప్రకారం పుంగనూరు వద్ద వేచి ఉన్న టీడీపీ మూక, అల్లరి మూక విధ్వంసకాండకు దిగారు. అంగళ్లులో చెలరేగిన టీడీపీ నేతల రౌడీయిజంలో వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసులు గాయపడ్డారు. పుంగనూరు వద్ద మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలతో చేసిన దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ రణ«దీర్ ఒక కంటి చూపును శాశ్వతంగా కోల్పోయారు. డీఎస్పీ బాబుప్రసాద్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మహిళా ఎస్ఐ కరీమున్నీసా నడవలేని పరిస్థితి. -
నేస్తమా పుస్తకం విందామా!
పుస్తకం హస్తభూషణం అన్నారు.చేతిలో ఉండాల్సిన పుస్తకం ‘ఆడియో బుక్స్’ రూపంలో చెవికి చేరువవుతోంది.వ్యక్తిత్వ వికాసం నుంచి కాల్పనిక సాహిత్యం వరకు పుస్తకాలను ‘ఆడియో బుక్స్’ రూపంలో వినడానికి యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న బెంగళూరుకు చెందిన విరజ, పుస్తకాల విలువ గురించి తెలుసుకొని వాటిపై ప్రేమ పెంచుకున్న భోపాల్‌కు చెందిన చైత్రకు పుస్తకాలకు చేరువ కావడానికి ఒకప్పుడు టైమ్ దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం వీరిద్దరికి మాత్రమే కాదు యువతరంలోని ఎంతోమందికి పుస్తకాలు దగ్గర కావడానికి ‘టైమ్’ అనేది సమస్య కావడం లేదు. దీనికి కారణం... ఆడియో బుక్స్.మిలీనియల్స్, జెన్‌జెడ్ జెనరేషన్‌కు ‘ఆడియో బుక్స్’ హాట్ ఫేవరెట్‌గా మారాయి.‘ఒక పుస్తకం చదవడానికి రకరకాల కారణాల వల్ల నెల రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆడియో బుక్స్ వారానికి ఒకటి వినగలుగుతున్నాను. వినడం పూర్తయిన వెంటనే ఆ పుస్తకానికి సంబంధించిన నోట్స్ రాసుకుంటాను’ అంటుంది విరజ.గూగుల్ ప్లేలో ఆడియో బుక్స్ సెక్షన్ ప్రారంభమైన కొత్తలో యువత అంత దగ్గర కాలేదు. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. వారి ప్రధానమైన ఆసక్తులలో ‘గూగుల్ ఆడియో బుక్స్’ కూడా ఒకటి.గూగుల్ ప్లేలో డబ్బు చెల్లించే ఆడియో బుక్స్‌తో పాటు చెల్లించనవసరం లేనివి కూడా ఉన్నాయి.‘ఓకే గూగుల్, హూ ఈజ్ అథర్?’ ‘ఓకే గూగుల్, స్టాప్ ప్లేయింగ్ ఇన్ 20 మినిట్స్’...ఇలాంటి కమాండ్స్ గూగుల్ అసిస్టెంట్‌కు ఇవ్వవచ్చు. గ్లోబల్ ఆడియో బుక్స్ మార్కెట్ లీడర్‌గా ఉన్న ‘ఆడిబుల్’ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత ఆడియో బుక్స్‌కు ఊపు వచ్చింది. రకరకాల వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని ‘ఆడిబుల్ ఇండియా’లో వేలాది ఆడియో బుక్స్‌ను రొమాన్స్, థ్రిల్లర్, ఆధ్మాత్మికం, హారర్, డ్రామా జానర్లలో తీసుకువచ్చారు.ఇంగ్లిష్తో సహా హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ... మొదలైన భాషలలో ఆడియో బుక్స్ ఉన్నాయి.‘ఆడియో బుక్స్ సక్సెస్ కావడానికి కారణం మన మూలాల్లోనే ఉంది. చిన్నప్పుడు కథలను వినేవాళ్లం’ అంటుంది ముంబైకి చెందిన స్మిత. ఒక పుస్తకం విజయాన్ని అంచనా వేసే ప్రమాణాలలో ఆడియో బుక్స్ కూడా చేరాయి. మాతృభాషలో పుస్తకాలు చదవడానికి ఇబ్బంది పడే యువతరానికి ఆడియో బుక్స్ ఆత్మీయనేస్తాలయ్యాయి.‘పాడ్‌కాస్ట్‌తో పాటు ఆడియో బుక్స్‌కు ఆదరణ పెరిగింది’ అంటున్నాడు ‘వన్ బై టు’ మీడియా కో–ఫౌండర్ రాజేష్ తాహిల్.ఫిక్షన్, రొమాన్స్ జానర్స్ కోసం యాపిల్ బుక్ ‘మాడిసన్’ ‘జాక్సన్’ ‘హెలెన్’ అనే డిజిటల్ నేరేటర్లను క్రియేట్ చేసింది.యూఎస్, యూరోపియన్ దేశాలలో పబ్లిషర్స్‌కు ఆడియో కంటెంట్ క్రియేట్ చేయడానికి సొంతంగా స్టూడియోలు ఉన్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి వచ్చినట్లు లేదు. ఒక ఆడియో బుక్కు కనీసం లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.‘స్పాటిఫై’ అనగానే గుర్తుకు వచ్చేది సంగీతం. ఆడియో బుక్స్ ఆదరణను పసిగట్టిన ఈ డిజిటల్ మ్యూజిక్ సర్వీస్ యూఎస్‌తో పాటు నాలుగు దేశాల్లో ఆడియో బుక్ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. మూడు లక్షల ఆడియో బుక్స్‌ను తీసుకువచ్చిన ‘స్పాటిఫై’ యూజర్ల కోసం ‘ఆడియో కామెంట్’ తీసుకురానుంది.ఆడియో బుక్ ఇండస్ట్రీ ఊపందుకోవడాన్ని గమనించిన పబ్లిషర్లు రానున్న రోజుల్లో ఆడియో బుక్స్ స్పేస్‌ను పెంచాలనుకుంటున్నారు. క్లాసిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.‘గతంతో పోల్చితే ఆడియో బుక్స్ వినడానికి వెచ్చిస్తున్న టైమ్ పెరిగింది’ అంటున్నాడు ‘స్టోరీ టెల్ ఇండియా’ కంట్రీ మేనేజర్ యోగేష్ దశరథ్.ఆడియో బుక్స్ యూత్‌ను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ప్రయాణాలలో, బారెడు క్యూలలో నిలబడిన సందర్భాలలో కూడా వాటిని వినే అవకాశం ఉండడం. కొందరైతే వ్యాయామాలు చేస్తూ కూడా ఆడియో బుక్స్ వింటున్నారు.‘ఆడియో బుక్స్ వల్ల పుస్తకం చదివే దృశ్యం అదృశ్యం కానుందా?’ అనే ప్రశ్నకు ఇంజనీరింగ్ స్టూడెంట్ సౌమ్య మాటల్లో జవాబు దొరుకుతుంది.‘పుస్తకం చదవడం అంటేనే నాకు ఇష్టం. అంతమాత్రాన ఆడియో బుక్స్‌కు దూరం కాలేదు. సమయ సందర్భాలను బట్టి చదవాలా, వినాలా అనేదాన్ని ఎంచుకుంటాను’ అంటుంది సౌమ్య. ఆడియో బుక్ రీడ్ బై సెలబ్రిటీ ఆడియో బుక్స్ విజయంలో పుస్తకంలోని కంటెంట్‌తో పాటు నేరేటర్ ప్రతిభ కూడా ఆధారపడి ఉంటుంది. వినే కొద్దీ వినాలనుకునే గొంతులు ఆడియో బుక్స్ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.‘ఆడియో బుక్ రీడ్బై సెలబ్రిటీస్’ ధోరణి మన దేశంలోనూ పెరగనుంది. ఆడియో బుక్ రీడింగ్‌లో బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మంచి పేరు తెచ్చుకుంది. వుడీ ఎలెన్ ‘కౌంట్ డ్రాకులా’తో పాటు ఎన్నో పుస్తకాలు ఆమె స్వరంలో యువత మంత్రముగ్ధులై విన్నారు. -
గొంతును ఏమార్చారు, ఒరిజినల్‌గా నమ్మించారు
బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ అతని భార్య మేఘన్ మార్కెల్లు ప్రముఖ పాడ్‌కాస్ట్ సంస్థ స్పాటిఫై నుంచి వైదొలగిన విషయం విదితమే. అయితే, ఆ తదనంతరం వారు ప్రారంభించిన ‘ఆర్కిటైప్స్’ పాడ్‌కాస్ట్ కోసం మేఘన్ చేసినట్టు చెబుతున్న ఇంటర్వ్యూలు ఆమె చేసినవి కాదని ఒక రిపోర్టులో వెల్లడయ్యింది. షోలోని కొన్ని ఇంటర్వ్యూలను డచెస్ సిబ్బంది చేశారని పాడ్న్యూస్ తెలిపింది. ప్రశ్నలు అడుగుతున్న ఆమె వాయిస్ ఆడియోను ఇంటర్య్యూ మధ్యలో క్లిప్ చేశారని ఆరోపించారు. కాగా స్పాటిఫై, ఆర్కివెల్ పరస్పరం విడిపోవడానికి అంగీకరించాక వారు కలిసి చేసిన సిరీస్ గురించి గర్వపడుతున్నామని ఆ సంస్థలు సంయుక్త ప్రకటన చేసిన కొద్దిసేపటికే మేఘన్‌పై ఆరోపణలతో కూడిన ఈ వార్త వెలువడింది. హ్యారీ, మేఘన్ ప్రారంభించిన ఆర్కివెల్ మీడియా సంస్థ 2020లో $20 మిలియన్ల డీల్‌కు సంబంధించిన పూర్తి చెల్లింపును అందుకునేందుకు తగినంత కంటెంట్‌ను ఉత్పత్తి చేయలేదని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే మేఘన్ మరొక ప్లాట్‌ఫారమ్‌లో ‘ఆర్కిటైప్స్’ ప్రేక్షకుల కోసం మరింత కంటెంట్‌ను అందిస్తున్నారని ఆర్కివెల్ ప్రొడక్షన్స్ ప్రతినిధి వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు. ఈ విషయంలో స్పోర్ట్స్ రైటర్, పాడ్‌కాస్టర్ బిల్ సిమన్స్ ఈ జంటపై విరుచుకుపడ్డాడు. తాను ఒకసారి హ్యారీని పాడ్‌కాస్ట్ విషయమై కలిశానని తెలిపాడు. ఈ పాడ్‌కాస్ట్ ఆడియోలో డచెస్ ఆఫ్ సస్సెక్స్ నుండి వచ్చిన వ్యాఖ్యల మధ్య యారో వివరణలు, వ్యాఖ్యలు జతచేశారు. అవి అల్లినవి, డైలీ మెయిల్ నవంబర్‌లో నివేదించినవని తేలింది. రాజ దంపతులు రెండు సంవత్సరాల క్రితం స్పాటిఫైతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత బయటకు వచ్చేశారు. అప్పటికి కేవలం 12 ఎపిసోడ్లు మాత్రమే రూపొందాయి. జమీలా జమీల్, సెరెనా విలియమ్స్, ప్యారిస్ హిల్టన్, మిండీ కాలింగ్‌తో సహా పలువురు అతిథులతో సంభాషణలతో పాటు నిర్దిష్ట అంశాల గురించి మాట్లాడే నిపుణులు, విద్యావేత్తలు, రచయితల క్లిప్‌లు ఉన్నాయి. నిపుణుల ఆడియో క్లిప్‌లు మేఘన్ ఆడియో మధ్య జత చేసి ఉన్నాయి. దీంతో ఆమె స్వయంగా కొందరితోనైనా మాట్లాడారా? లేదా అందరితో మాట్లాడారా అనేది స్పష్టంగా వెల్లడికాలేదు. ఇది కూడా చదవండి: లాలాజలంతో ఇక ప్రెగ్నెన్సీ టెస్ట్ -
అప్సర కేసులో సంచలనం రేపుతున్న కార్తీక్ రాజా తల్లి ఆడియో
-
మామన్నన్ ఆడియో లాంఛ్‌లో కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
అమరం.. అఖిలం.. సీతారాముల ప్రియనామం
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్లో రూపొందిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. శనివారం ‘సీతా నవమి’ సందర్భంగా ఈ చిత్రంలోని ‘రామ్ సియా రామ్’ ఆడియో టీజర్‌ను విడుదల చేశారు. ఈ గీతాన్ని సచేత్ పరంపర స్వరపరిచారు. కాగా ఈ పాటలోని కృతీ సనన్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘అమరం, అఖిలం, ఈ నామం.. సీతారాముల ప్రియ నామం’ అంటూ చిత్రదర్శకుడు ఓం రౌత్ ఈ పాటను ఉద్దేశించి ట్వీట్ చేశారు. భూషణ్‌కుమార్, క్రిషణ్‌కుమార్, ప్రసాద్ సుతార్, ఓం రౌత్, రాజేష్ నాయర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. -
జన్నారంలో చెరువు భూముల ఆక్రమణలపై స్పందించిన ఎమ్మెల్యే రేఖ నాయక్
-
తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో కాల్ కలకలం
-
అది బాబుమోహన్ వాయిసేనా? బండి మీద అంత కోపమెందుకు?
తాజాగా సోషల్ మీడియాలో బాబుమోహన్ పేరిట ఒక ఆడియో టేప్ వైరల్ అవుతోంది. అది బాబుమోహన్ వాయిస్ అవునా? కాదా? అనేది పక్కన పెడితే అందులో మొత్తం బూతు పురాణమే వినిపిస్తోంది. బండి సంజయ్ ఎవడు? అనే ప్రస్తావన కూడా రావడంతో ఆ ఆడియో వైరల్‌గా మారింది. అది నిజంగానే బాబుమోహన్ వాయిస్ అయితే బండి సంజయ్ మీద అంత కోపం ఎందుకు అనే చర్చ కూడా నెట్టింట్లో మొదలైంది. -
జర్నలిస్టులపై బ్యాన్,ట్విటర్ స్పేసెస్‌కు బ్రేక్..బైడెన్‌పై సెటైర్లు
న్యూఢిల్లీ: ట్విటర్లో ఆడియో లైవ్ సర్వీస్ స్పేసెస్ పనిచేయక పోడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. గురువారం అర్థరాత్రి నుంచి స్పేసెస్ పనిచేయడం మానేసింది. దీంతో ట్విటర్ ద్వారా ఏమైంది స్పేసెస్‌కు అంటూ వాకబు చేయడం మొదలుపెట్టారు. దీంతో ట్విటర్ బాస్, ఎలాన్ మస్క్ స్పందించారు.లండన్‌లోని సోహోలో తన మొదటి ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఇటీవల ఏదీ కూడా ఉచిత ఉత్పత్తులను అందించలేదు. Good fun while it lasted. Great knowing everyone on Twitter Spaces. Bear market feels. pic.twitter.com/APzBPyoa4T — Shash (@shashxg) December 16, 2022 కొంతమంది జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేసిన తర్వాత ట్విటర్ స్పేసెస్ నిలిచిపోవడం చర్చకు దారి తీసింది. సస్పెండ్ అయిన పలువురు జర్నలిస్టులు ఇప్పటికీ అందులో పాల్గొనవచ్చనే అనుమానంతో మస్క్ అలా చేశారంటైటూ విమర్శలు చెలరేగాయి. దీంతో ట్వీపుల్ ట్వీట్లకు స్పందించిన ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ట్విటర్ ద్వారానే వివరణ ఇచ్చారు.ఇందులోని లెగసీ బగ్ (పాతబగ్)ను పరిష్కరిస్తున్నాం అని బహుశా రేపటికి పని చేస్తుందంటూ వివరణ ఇచ్చారు. #TwitterSpaces Will Be working Tomorrow ✌🏻 pic.twitter.com/nwqRdaFGai — Ayyappan (@Ayyappan_1504) December 16, 2022 Holy Shit. Elon Musk just popped into a Twitter Spaces chat with a bunch of journalists. He was called out by journalist Drew Harrell, who he banned, for lying about posting links to his private information, then leaves almost immediately after being pressed. Here is the exchange pic.twitter.com/wVA9Gb5MVJ — Bradley Eversley (@ForeverEversley) December 16, 2022 కాగా సీఎన్ఎన్ నెట్వర్క్, న్యూయార్క్ టైమ్స్ ,వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన డ్రూ హార్వెల్ , Mat Binder Mashable సహా పలువురు జర్నలిస్టుల ఖాతాలను ట్విటర్ గురువారం సస్పెండ్ చేసింది. తన ప్రైవేట్ జెట్ విషయాలను బహిర్గంతం చేసినందుకు ఏడు రోజుల సస్పెన్షన్‌లో పెట్టినట్టు మస్క్ ప్రకటించారు. డాక్సింగ్ నియమాలు అందరితోపాటు జర్నలిస్టులకు కూడా వర్తిస్తాయనీ తనను నిరంతరం విమర్శించడం తప్పు కాదు. కానీ తన రియల్ టైం వ్యక్తిగత సమాచారాన్ని భాగస్వామ్యం చేయడం ట్విటర్ నిబంధనలకు విరుద్ధమని, తన ఫ్యామిలీకి ఉనికికి ప్రమాదమని పేర్కొన్నారు. If anyone posted real-time locations & addresses of NYT reporters, FBI would be investigating, there’d be hearings on Capitol Hill & Biden would give speeches about end of democracy! — Elon Musk (@elonmusk) December 16, 2022 అంతేకాదు సదరు జర్నలిస్టుల రియల్ లొకేషన్, చిరునామా లాంటివి రివీల్ చేస్తే ఎఫ్‌బీఐ విచారణ చేస్తుంది.. ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ బైడెన్ స్పీచ్ లిస్తారు అంటూ అమెరికా అధ్యక్షుడి పైనే సెటైర్లు వేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వేద నిలయం విక్రయించే ప్రసక్తే లేదు.. త్వరలోనే..
సాక్షి, చెన్నై: పోయేస్ గార్డెన్‌లోని వేద నిలయంలోకి మరికొద్ది రోజుల్లో గృహప్రవేశం చేయనున్నట్లు దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప తెలిపారు. ఆ భవనాన్ని తాము విక్రయించే ప్రసక్తే లేదని, ఇది తమ పూర్వీకుల ఆస్తి, వారి జ్ఞాపకం అని స్పష్టం చేశారు. దివంగత సీఎం జయలలితకు పోయేస్‌గార్డెన్‌లో వేద నిలయం పేరిట భవనం ఉ న్న విషయం తెలిసిందే. ఆమె మరణించే వరకు అదే భవనంలోనే జీవించారు. ఈ భవనాన్ని గత అన్నా డీఎంకే ప్రభుత్వం స్మారక మందిరంగా మార్చే ప్రయత్నం చేసి భంగ పడింది. కోర్టులో న్యాయ పో రాటం ద్వారా ఆ భవనాన్ని జయలలిత మేన కోడ లు దీప, మేనల్లుడు దీపక్ సొంతం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ భవనం పర్యవేక్షణ, తదితర వ్యవ హారాలు దీప, దీపక్‌కు భారమైనట్టు ప్రచారం జోరందుకుంది. అలాగే ఆ భవనాన్ని విక్రయించేందుకు చాప కింద నీరులా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో దీప మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ ఆడియోను విడుదల చేశారు. ఎన్నో మధుర జ్ఞాపకాలు... పోయేస్ గార్డెన్ నివాసం తమ పూర్వీకుల ఆస్తి అని, ఈ ఇంట్లోనే చిన్నప్పుడు తాను, దీపక్ పెరిగినట్టు దీప గుర్తు చేశారు. మేనత్త జయలలిత, తన తండ్రి జయకుమార్ ఆ ఇంట్లోనే ఎక్కువ కాలం ఉన్నారని, తాను జన్మించింది కూడా ఇదే భవనంలో అని వివరించారు. అభిప్రా య భేదాలతో తన తండ్రి ఆ ఇంట్లో నుంచి టీ నగర్‌లోని మరో పూర్వీకుల ఇంటికి వచ్చేశారని, అయినా, అత్త పిలిచినప్పుడల్లా పోయేస్గార్డెన్కు వెళ్లి వచ్చేవారిమని తెలిపా రు. పూర్తిగా ఆమె రాజకీయాల్లోకి వెళ్లడంతో తాము బయటకు వచ్చేశామని, అయితే, ఇది తమ ఆస్తి కావడంతోనే కోర్టులో న్యాయం దక్కిందని పేర్కొన్నారు. జయలలిత సీఎంగా ఉన్నంత కాలం, ఆమె వెన్నంటి నడిచిన వాళ్లు, పయనించిన వాళ్లు ఎందరో ఉన్నారని, వారందరూ రక్త సంబంధీకులు కాలేరని వ్యాఖ్యలు చేశారు. ఇది చిన్నమ్మ శశికళ కుటుంబానికి సైతం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ భవనం తమ కుటుంబ ఆస్తి అని, దీనిని విక్రయింబోమని స్పష్టం చేశారు. ఈ ఇంటిని అమ్మేస్తామని తాము ఎవ్వరికీ చెప్పలేదని, ఎవరిని సంప్రదించ లేదని తేల్చి చెప్పా రు. వదంతులను నమ్మ వద్దని, వేద నిలయాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తనతో పాటుగా దీపక్‌పై ఉందన్నారు. మరికొద్ది రోజుల్లో ఆ ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నట్లు వెల్లడించారు. -
త్వరలో వాట్సప్‌లోకి కొత్త అప్డేట్.. చూస్తే వావ్ అంటారండోయ్!
ప్రస్తుత రోజుల్లో చాటింగ్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు వాట్సప్. యువతను అంతలా ఆకట్టుకుంది. అందుకే వాట్సప్ యాజమాన్యం కూడా మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు ఇందులో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకర్షించేలా అప్డేట్స్ని ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలోనే వాయిస్ మెసేజ్ ఎడిట్, మీడియా ఫైల్ ఎడిటింగ్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్ వంటివాటిని తీసుకొచ్చింది. తాజాగా వాట్సప్ స్టేటస్ అప్డేట్లో మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. వావ్ అనేలా కొత్త అప్డేట్ వాట్సప్ స్టేటస్‌లో ఇప్పటివరకు వీడియోలు, ఫోటోలు లేదా మనకి నచ్చని టెక్ట్స్.. వీటి వరకు స్టేటస్‌గా పెట్టుకుంటున్నాం. అయితే వాట్సప్ డెవలప్మెంటీ టీం ఈ ఆప్షన్‌కి అదనపు ఫీచర్‌ను జత చేయనున్నారు. త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ ఫీచరుతో తాము స్వయంగా రికార్డు చేసిన ఆడియో క్లిప్స్, ఏదైనా వాయిస్ నోట్స్‌ను కూడా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం వాట్సప్‌లో స్టేటస్ బార్ని క్లిక్ చేస్తే కెమెరా, టెక్స్ట్ ఫీచర్లు కనిపిస్తాయి. అయితే త్వరలో ఈ ఆప్షన్లకి అదనంగా ఆడియో స్టేటస్ పెట్టుకునేందుకు వీలుగా మైక్ సింబల్ రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. ఈ మేరకు వాట్సప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. చదవండి: డోలో-650 తయారీ సంస్థ అక్రమాలు.. బయటపడ్డ సంచలన విషయాలు! -
పోలీస్స్టేషన్ల సీసీటీవీల్లో ఆడియో ఫుటేజీ తప్పనిసరి
న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్లలోని సీసీటీవీల్లో వీడియోతో పాటు ఆడియో రికార్డింగ్ సదుపాయం కూడా తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘లాకప్‌లు, కారిడార్లు, లాబీలు, రిసెప్షన్ ప్రాంతం, వరండాలు, ఔట్హౌస్లు, ఇన్స్పెక్టర్ చాంబర్ వంటి అన్నిచోట్లా నైట్ కాప్చరింగ్ సదుపాయంతో కూడిన వీడియోతో పాటు ఆడియో రికార్డింగ్ తప్పనిసరని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ మేరకు అన్ని పోలీస్స్టేషన్లలోనూ సీసీటీవీ వ్యవస్థలను ఆధునీకరించాలని స్పష్టంగా చెప్పింది’’ అని గుర్తు చేసింది. ఢిల్లీలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఆడియో రికార్డింగ్ వ్యవస్థ లేకపోవడాన్ని తప్పుబడుతూ కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. -
కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలాంటి విద్యార్థినితో..
సాక్షి, బొమ్మనహాళ్ (అనంతపురం): అనామకుడు కాదు.. చదువు సంధ్య లేని వాడు అంతకంటే కాదు. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపుతో ఉత్తముడిలా చలామణి అవుతున్న వ్యక్తి. అయితే కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలాంటి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వ్యాయామ విద్యతో విద్యార్థుల శారీరక దృఢత్వానికి బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడే వక్ర బుద్ధిని చూపించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా.. బొమ్మనహాళ్ మండలం శ్రీధరఘట్టలోని జెడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రెండు రోజుల క్రితం పదో తరగతి విద్యార్థిని ఇంటిలో ఉన్న సెల్‌ఫోన్‌కు కాల్ చేశాడు. చదవండి: (దారుణం: భార్య గొంతునులిమి.. పసికందు ముక్కు మూసి) అతని మాట తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పరిశీలించడంతో అసలు విషయం వెలుగు చూసింది. వాట్సాప్‌లో ఆడియో చాటింగ్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడి మాటలు ఉన్నాయి. తన భార్యకు ఏడాదిగా ఆరోగ్యం సరిగా లేదని, పాఠశాలలోని తన గదిలోకి ఒంటరిగా వచ్చి తన కోరిక తీరిస్తే ఏమి కావాలన్నా తాను చూసుకుంటాననే ఉపాధ్యాయుడి మాటలు విన్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చదవండి: (పుస్తకాలు బస్టాప్‌లో.. స్రవంతి హెచ్చెల్సీలో దూకి..) ఈ విషయం తెలుసుకున్న వెంటనే వ్యాయామ ఉపాధ్యాయుడు అత్యవసరంగా సెలవు పెట్టి మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. ప్రధానోపాధ్యాయుడి దృష్టికి కామాంధుడి వైఖరిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమ బాట పడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. -
ఏకీకృత లైసెన్స్ పరిధిలోకి ఆడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇక నుంచి ఆడియో కాన్ఫరెన్సింగ్, ఆడియోటెక్స్, వాయిస్ మెయిల్ సర్వీసుల లైసెన్సింగ్ విధానం.. ’ఏకీకృత లైసెన్స్’ పరిధిలోనే ఉండనున్నట్లు టెలికం విభాగం (డాట్) వెల్లడించింది. ప్రస్తుతం ఆడియోటెక్స్, వాయిస్ మెయిల్ సర్వీసులకు స్టాండెలోన్ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటోంది. తాజా మార్పుల ప్రకారం ప్రస్తుతం వీఎంఎస్ / ఆడియోటెక్స్ / యూఎంఎస్ లైసెన్సులు ఉన్న సంస్థలు ఏకీకృత లైసెన్సుకు మారడమనేది ఐచ్ఛికంగానే ఉంటుందని డాట్ తెలిపింది. కొత్త నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ‘2001 జులై 16న ఇచ్చిన వీఎంఎస్, ఆడియోటెక్స్, యూఎంఎస్ లైసెన్సులను పునరుద్ధరించడం లేదా కొత్తగా స్టాండెలోన్ లైసెన్సులను జారీ చేయబోము‘ అని డాట్ ఒక ప్రకటనలో తెలిపింది. టెలికం రంగంలో విధానపరమైన సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. -
‘శ్రవణ’ మేఘాలు
చదవడం ఏకాంత అనుభవం. వినడం సామూహిక అనుభవం. పాతకాలంలో ఏ గ్రామపెద్దో మర్రిచెట్టు నీడన ప్రపంచ ధోరణిని వైనవైనాలుగా వివరించే వాడు. ఏ పెద్దతాతో చలిమంట కాచుకుంటూ జీవిత అనుభవసారాన్ని పంచేవాడు. వెన్నెల వాకిళ్లలో నులకమంచాల మీద మేను వాల్చిన నాన్నమ్మలు పిల్లలకు కథల మీద కథలు చెప్పేవారు. పూర్వీకులు తాము తెచ్చిన వేటను విందుకు సిద్ధం చేస్తూ, తమ ప్రాచీనుల వీరోచిత గాథలను ఆ మాంసంతో పాటు నంజుకునేవారు. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యానికి ఈ వినడం అనే సంబం«ధం ఒక కందెనగా పనికొచ్చేది. ఇవే కథలు, గాథలు రకరకాల కళారూపాలుగా మారి, వాటిని ప్రత్యేకించి చక్కటి గొంతుతో, ఆకట్టుకునే హావభావాలతో ప్రదర్శించే కళాకారులు వచ్చారు. దాంతో వినడం ఒక పరిమిత సమూహ అనుభవ పరిధిని దాటింది. కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అక్షరం పుస్తకాల దొంతరలుగా ఆకాశం ఎత్తు పెరిగింది. ఒక మనిషి గొంతును సజీవంగా ఒక యంత్రంలో బంధించడాన్ని లోకం చెవులొగ్గి విన్నది. పదిహేనో శతాబ్దంలో జర్మనీకి చెందిన జాన్ గూటెన్‌బెర్గ్ అచ్చుయంత్రాన్ని రూపొందించాడు. పంతొమ్మిదో శతాబ్దపు చివరలో ఇటలీకి చెందిన మార్కోనీ రేడియోకు తుదిరూప మిచ్చాడు. మనిషి అంతటితో ఆగలేదు. వినడం పోయింది. చూడటం వచ్చింది. అమెరికాలో టీవీ వచ్చిన కొత్తలో ఈ సుఖకరంగా వినే అవకాశమున్న రేడియోను కాదని, దానికే ముఖం అప్పగించాల్సిన టీవీని ఎవరు చూస్తారని విసుక్కున్నారట అప్పటి పెద్దవాళ్లు. అయినా అది రావడమే కాదు, ప్రపంచమంతటా అలవాటైపోయింది. అక్షరాన్ని, వినడాన్ని మింగేసింది. పెరిగిన సాంకేతికత ఒక్కోసారి ముందుకు వెళ్లడం కోసం, వెనక్కి కూడా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో దృశ్యం పనికి రాదు. వంట చేస్తూ గరిట తిప్పుతున్నప్పుడు చూపు ఒక్కచోటే నిలపమంటే కుదరదు. ఒంటరిగా నడుస్తున్నప్పుడు తోడు కాగలిగేది అజ్ఞాత గొంతుకే. కళ్లు మూసుకుని, మగతగా ఒక అనుభవంలోకి, ఒక అనుభూతిలోకి మేలుకోవాలంటే దృశ్యం పనికిరాదు; శ్రవణమే కావాలి. అంధులకు ఏ ఇబ్బందీ కలగకుండా ఉండేందుకుగానూ వాళ్లకోసం మాట్లాడే పుస్తకాలను(ఫోనోగ్రాఫిక్ బుక్స్) సంకల్పించాడు థామస్ ఆల్వా ఎడిసన్ 1877లో. కానీ 1952లో న్యూయార్క్ కేంద్రంగా గల క్యాడ్‌మాన్ రికార్డ్స్ వాళ్లు కవి డైలాన్ థామస్ కవితలను ఆయన గొంతులోనే చదివించి అమ్మకాలను చేపట్టడంతో ‘ఆడియో బుక్స్’ అనే భావనకు బీజం పడింది. దీంతో చదవడం అనే ప్రక్రియ, వినడం అనే కొత్త రూపంలో జరగడం ప్రారంభమైంది. చెట్టుమీది కాయను, సముద్రంలోని ఉప్పును ఎట్లా కలిపింది సృష్టి! అక్షరాన్నీ, శ్రవణాన్నీ ఎలా ముడివేసింది సాంకేతిక పరిజ్ఞానం! మరి ఆ మేఘాలు అంతటికీ వ్యాపించకుండా ఉంటాయా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆడియో బుక్ మార్కెట్ పరిధిని 2019లో 2.67 బిలియన్ డాలర్లుగా అంచనావేశారు. ఇది ప్రతి సంవత్సరం రెండంకెల వృద్ధిని సాధిస్తోందని తేల్చారు. మన తెలుగు వరకే తీసుకుంటే– శ్రీశ్రీ గొంతులోనే తన కవితలను చదివించిన గూటాల కృష్ణమూర్తి ప్రయత్నం; తన కథలను నేరుగా ఆడియో రూపంలోనే విడుదల చేసిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఉత్సాహం; తమ రచనలను యూట్యూబ్‌లో వినిపిస్తున్న కొందరి ఆరాటం లాంటివి విడివిడి సంఘటనలు. కానీ ఐదేళ్ల క్రితం విశ్రాంత ప్రభుత్వోద్యోగి కొండూరు తులసీదాస్ సరదాగా చదువుతూ రికార్డు చేస్తూ పోయిన ‘దాసుభాషితం’ ఇప్పుడు వందలాది టైటిళ్లు, వెయ్యికి పైగా గంటల నిడివి కలిగివుంది. పుస్తకాన్ని చదవమని చేతికిస్తే– చదివే తీరిక లేని కొడుకు తనకోసం చదివి వినిపించమన్నందుకు మొదలైన ఈ తండ్రి ప్రయత్నం ‘తెలుగు సంగీత, సాహిత్య, కళల శ్రవణ భాండాగారం’గా రూపుదిద్దుకుంది. అయితే స్వీడన్‌కు చెందిన ఆడియో స్ట్రీమింగ్ కంపెనీ ‘స్టోరీటెల్’ నాలుగేళ్లుగా భారతదేశంలో మౌఖిక సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిషు, మరాఠీ, హిందీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, గుజరాతీ, తమిళం, మలయాళంతో పాటు ఇప్పుడు తెలుగు పుస్తకాలు కూడా ఇందులో ఆడియోలుగా రికార్డు అవుతున్నాయి. పాపులర్ సాహిత్యం నుంచి ప్రజా సాహిత్యం దాకా; ఏనుగుల వీరాస్వామయ్య నుంచి ఏకాంత ద్వీపంగా బతికే రచయిత దాకా; స్వయంగా రాసేవారి గొంతుల్లోనూ, గొంతే పెట్టుబడిగా కలిగిన కళాకారుల ద్వారానూ రికార్డ్ అవుతున్నాయి. కనీసం ఐదు లక్షల టైటిల్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ దిగ్గజం అమెజాన్ కూడా ‘ఆడిబుల్’ పేరుతో ఈ ఆడియో బుక్స్ రంగంలోకి వచ్చినా ప్రస్తుతం ఇంగ్లి్లష్, హిందీకే పరిమితమైంది. చదవలేకపోవడం ఒక సమస్య అయితే, రకరకాల కారణాల వల్ల చదవడం అనే ప్రక్రియ మీద ఆసక్తి కోల్పోవడం ఇంకో సమస్య. ఈ రెండు కోవల మనుషులకూ ఈ కొత్త విప్లవం గొప్ప తోడు. చదవడంలో ఉత్సాహం పోతే గనక వినడం ద్వారా దాన్ని తిరిగి ఉత్సవం చేసుకోవచ్చు. అన్ని లైట్లూ ఆపేసుకుని, ఆ గొంతును అనుసరించడంలో ఏర్పడే దృశ్యాలను ఆ చీకట్లో సృజించుకోవడం ఒక పద్ధతి; ఇంటిల్లిపాదీ దగ్గరగా కూర్చుని వింటూ, ఒకే అనుభూతి మిగిలినవాళ్ల ముఖాల్లో ఎలా ప్రతిఫలిస్తున్నదో చూస్తూ ఆనందించడం రెండో పద్ధతి. అటు ఏకాంత అనుభవంగానూ, ఇటు సమూహ అనుభవంగానూ ఆనందించగల అవకాశం మనకు ఇప్పుడు ఉన్నది. -
కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి ఆడియో క్లిప్ వైరల్
-
ClubHouse Vs FaceBook : ఎవరి మాట నెగ్గేను ?
కాలిఫోర్నియా: ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో క్లబ్ హౌజ్ యాప్ సృస్టిస్తున్న సంచలనంతో ఫేస్బుక్ మేల్కొంది. ఆలస్యం చేస్తే ఆపద తప్పదని గ్రహించింది. దీంతో క్లబ్హౌజ్కి పోటీగా ఆడియో రూమ్స్ పేరుతో మాటలు, ముచ్చట్లు, లెక్చర్లు ప్రధానంగా మరో ఫీచర్ అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ ఆడియో రూమ్‌కి నేరుగా వచ్చారు. మాటల ముచ్చట్లు ఫోటోలు, వీడియోలు, రైటింగ్ కంటెంట్‌తో ఇప్పటి వరకు అలరిస్తూ వస్తోన్న ఫేస్బుక్ మరో అడుగు ముందుకు వేయనుంది. ఫేస్బుక్ వేదికగా ముచ్చట్టు పెట్టుకునేందుకు వీలుగా త్వరలో ఆడియోరూమ్స్ ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది. ఆడియోరూమ్స్ పనితీరు పరిశీలించేందుకు స్వయంగా మార్క్‌జుకర్‌బర్గ్ ఈ రోజు ఇతర టెక్నోక్రాట్స్‌తో ముచ్చట్లు పెట్టారు. ఆడియో రూమ్స్ టెక్నాలజీ వరల్డ్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ఆడియో ఆథారిత పోడ్‌కాస్ట్‌కి మంచి ఫ్యూచర్ ఉందని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. మరోవైపు వర్చువల్ ముచ్చట్లే లక్ష్యంగా వచ్చిన క్లబ్‌హౌజ్ అప్లికేషన్ మార్కెట్లో దూసుకుపోతుంది. దీంతొ క్లబ్‌హౌజ్ లాంటి ఫీచర్‌ని ఫేస్బుక్ యూజర్లు అందించే లక్ష్యంతో ఆడియో రూమ్స్ సర్వీస్‌ని త్వరలో అందుబాటులోకి తేనుంది ఫేస్బుక్. ఇప్పటికే ఈ ఫీచర్‌కి సంబంధించి పలు టెస్టింగ్స్ని తైవాన్‌లో విజయవంతంగా నిర్వహించారు. నేరుగా వచ్చిన మార్క్ ఫేస్బుక్ ఆడియో రూమ్స్ లాంఛింగ్‌కి ముందు ముచ్చట్లు పెట్టందుకు నేరుగా మార్క్ జూకర్బర్గ్ లైన్లోకి వచ్చారు. ఫేస్బుక్ రియాల్టీ ల్యాబ్స్ హెడ్ బెజ్ బోస్వర్త్తో పాటు పలువురు ఈ ఆడియో రూమ్ ముచ్చట్లలో పాల్గొన్నారు. ఆనాటి సంగతులు మాట్లాడుకున్నారు. చదవండి : FaceBook : జుకర్‌బర్గ్‌కి ఎసరు పెట్టిన ట్రంప్ -
'మా ఊరి ప్రేమ కథ' వచ్చేది అప్పుడే
‘‘ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి.. వస్తున్నాయి. అన్ని ప్రేమకథలు ఒక్కటే.. కానీ కొత్తగా చూపిస్తే కచ్చితంగా హిట్ అవుతాయి. ‘మా ఊరి ప్రేమకథ’ ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత కేయల్ దామోదర ప్రసాద్ అన్నారు. మంజునాథ్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మా ఊరి ప్రేమకథ’. తనిష్క్ హీరోయిన్. శ్రీ మల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్, ఆడియోను విడుదల చేశారు. మంజునాథ్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగే యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది. రియలిస్టిక్ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా విషయంలో నాకు సహకరిస్తున్న రామసత్యనారాయణ, సంధ్య స్టూడియో రవి గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. సహనిర్మాత మహేంద్రనాథ్, సంగీత దర్శకుడు జయసూర్య, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తనయుడు రవితేజ, ‘కీ’ మ్యూజిక్ అధినేత రవి కనగాల, ‘తొలిముద్దు’ సినిమా నిర్మాత ఆర్కే రెడ్డి పాల్గొన్నారు. -
కళా వెంకట్రావు ఓ డిక్టేటర్.. ఆడియో హల్చల్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘‘వారి బంధువులకు ఓ న్యాయం. మిగతా కార్యకర్తలకు ఔటర్ కులాల వారికి ఓ న్యాయం అన్నమాట. అంటే వారి చేతిలో ఉన్న చెంచాగాళ్లందరికీ ఓ రూల్ అన్నమాట. మిగతా వారందరికీ, అదర్ కమ్యూనిటీలు ఏమైనా ఉంటే అదో రూల్. ఇది ఓ డిక్టేటర్షిప్ రూలింగ్‌లో ఉందన్నమాట ఇక్కడ. కిందన కూర్చోవాల, చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల, ఉంగరాలు ఉండకూడదు, బుర్ర దువ్వుకోకూడదు ఇలాంటి రూల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నాయకత్వంలో.. ఎచ్చెర్లకు సంబంధించి రూల్స్ అన్నీ ఇక్కడ పనిచేయవు. పూర్వం బ్రిటీష్ వారి పరిపాలనలా ఉండాలన్నమాటిక్కడ. చూస్తే స్థానికులు కాదు. పోనీ స్థానికులైనా ఫరవాలేకపోను. మాకు ఎక్కడినుంచో వస్తారు నాయకులు, ఇక్కడ మమ్మల్ని బ్రిటీష్ వాళ్లు ఏలినట్లు ఏలుతారన్నమాట’’ ఇదీ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావునుద్దేశించి జి.సిగడాం మండలం సంతవురిటికి చెందిన బాలగుమ్మ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలతో కూడిన ఆడియో ప్రస్తుతం టీడీపీ సర్కిల్లోనూ, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ►కళా వెంకటరావుపై ఎచ్చెర్ల నేతలు ఒక్కొక్కరిగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటికే చౌదరి బాబ్జీ, కలిశెట్టి అప్పలనాయుడు తదితర నేతలు గుర్రుగా ఉన్నారు. చాపకింద నీరులా మిగతా కేడర్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ►మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో జి.సిగడాం మండలం సంతవురిటిలో టీడీపీ మద్దతుదారుని బరిలోకి దించలేదని, ఆయన మరోపక్షంతో కుమ్మక్కయ్యారన్న కారణం చూపి ఆ గ్రామ, మండల నేతైన బాలగుమ్మ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయించారు. దీని వెనుక కళాకు వ్యతిరేక స్వరమే కారణమైనప్పటికీ అవకాశం వచ్చిందని సర్పంచ్ ఎన్నికల ముసుగులో వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారన్న వాదనలు ఉన్నాయి. ►1982 నుంచి ఆస్తులు అమ్ముకుని అటు మండలం, ఇటు గ్రామంలోనూ తన తండ్రి దగ్గరి నుంచి టీడీపీ కాపాడుకుంటూ వస్తున్న తమకు సస్పెన్షన్ బహుమతి ఇచ్చారని వెంకటేశ్వరరావు రగలిపోతున్నారు. కళా వెంకటరావు సొంత మండలమైన రేగిడిలో అనేక పంచాయతీల్లో అభ్యర్థులను నిలబెట్టలేకపోయారని, రేగిడి, వంగర మండలాల్లో ఏకంగా ఎంపీటీసీలే ఏకగ్రీవమైపోయి మండల పరిషత్ పీఠాలు వైఎస్సార్సీపీ పరమయ్యాయని, దానికి కళా బాధ్యులు కాదా? తనను సస్పెండ్ చేసినప్పుడు...ఆ రూల్ కళాకు వర్తించదా? అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అసలు సస్పెండ్ చేయడానికి కళా వెంకటరావు ఎవరని నేరుగా ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సస్పెండ్ చేయాలే తప్ప ఈయనెవరని ధిక్కార స్వరం వినిపించారు. నేరుగా తన వాయిస్‌ను రికార్డు చేసి వాట్సాప్ గ్రూపుల్లో వదిలారు. ఇప్పుడీ ఆడియో టీడీపీ సర్కిల్లోనూ, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. చదవండి: అంతా పబ్లిగ్గానే.. ‘కూన’ ఇలా చేశాడేంటి..! పవన్‌కల్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు -
వైరల్‌గా మారిన బోదన్ ఎమ్మెల్యే షకీల్ బూతు పూరాణం
-
మానవ బాంబు ఆడియోలు అమ్మేస్తున్నాడు..
న్యూయార్క్ : మానవ బాంబు(అపాన వాయువు) శబ్ధాలను అమ్మకానికి పెట్టి, సొమ్ము చేసుకుంటున్నాడో వ్యక్తి. ఒక్కో అపాన వాయువు శబ్ధాన్ని వేల రూపాయలకు అమ్ముతున్నాడు. వివరాలు.. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన అలెక్స్ రెమిరెజ్ అనే వ్యక్తి మార్చి 2020లో క్వారెంటైన్లో ఉండగా అపానవాయువు శబ్ధాలను రికార్డు చేయటం మొదలుపెట్టాడు. అతడి మిత్రులు కూడా అపాన వాయువు శబ్ధాలను రికార్డు చేసి తమ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసుకోసాగారు. ఈ మార్చి 2021కి వారు అపాన వాయువులను రికార్డు చేయబట్టి సంవత్సరం పూర్తయింది. ఈ నేపథ్యంలో రికార్డు చేసిన ఆడియోలను కలిపి ఓ పెద్ద ఫైల్‌గా తయారు చేశారు. అది 52 నిమిషాల నిడివి కలిగిన ఆడియో ఫైల్‌గా తయారయింది. అనంతరం ఈ ఫైల్స్‌ను విడివిడిగా అమ్మటం మొదలుపెట్టాడు అలెక్స్. ఒక్కో ఆడియో ఫైల్ రూ.6,600కు అమ్ముతున్నాడు. కొన్ని సార్లు ఈ ధర రూ.13,257 చేరుతోంది. దీనిపై అలెక్స్ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు తమ డిజిటల్ ఆర్ట్స్‌ను, జిప్స్‌ను అమ్ముతున్నారు. అపాన వాయువులను ఎందుకు అమ్మకూడదు. ఒక వేళ అపాన వాయువుల ధర పెరిగితే మన చేతుల్లో చాలా విలువైన అపాన వాయువులు ఉన్నట్టే. మేము దీన్ని ఓ ఆదాయం మార్గంగా భావించటం లేదు. నాన్ ఫంజిబుల్ టోకెన్స్‌కు క్రేజ్ పెరుగుతున్న తరుణంలో మా ఆడియో రికార్డింగ్స్‌కు ప్రాచూర్యం అభిస్తుంది. ఈ ఎన్ఎఫ్టీ ఆడియోలు ప్రజల్ని నవ్విస్తాయి.. మమ్మల్ని ధనవంతుల్ని చేస్తాయి’’ అని పేర్కొన్నాడు. చదవండి : హఠాత్తుగా అమ్మాయి 50 ఏళ్ల మగాడిగా మారింది! వెంటాడిన జనం: చావు భయంతో ఏనుగు పరుగులు -
తెరపైకి వర్చువల్ ఆడియో సినిమాలు
సాక్షి, హైదరాబాద్: అందరికీ వినోదం పంచే ‘సినిమా’ కాలానుగుణంగా తన రూపాన్ని మార్చుకుంటూనే ఉంది. నాటి బ్లాక్ అండ్ వైట్, మూకీ సినిమాలు మొదలు ప్రస్తుత త్రీడీ, యానిమేటెడ్ మూవీస్ వరకు కొత్తదనాన్ని, నూతన సాంకేతికతను తనలో కలుపుకుంటూనే ఉంది. సినిమాని కేరీర్‌గా ఎంచుకునే యువతరం పెరగడంతో షార్ట్‌ఫిల్మ్ హవా కూడా పెరిగింది. పొట్టి ఫ్లాట్‌ఫార్మ్‌పై తమదైన ముద్ర వేయాలనే తపనతో యువత కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అదే క్రమంలో వినూత్న వర్చువల్ ఆడియో ఫిల్మ్ తెరపైకి వచ్చింది. ప్రయోగాలకు వెనుకంజ వేయని నగర యువతను తన వైపు ఆకర్షిస్తోంది.. ఈ తరహా ఫిల్మ్‌లపై దృష్టి పెట్టేందుకు లాక్డౌన్ టైమ్ వారికి ఉపయోగపడింది. వర్చువల్ ఆడియో ఫిల్మ్ అంటే.. వినడానికి కొత్తగా ఉన్న వర్చువల్ ఆడియో ఫిల్మ్ నిజానికి వినడం మాత్రమే చేయగలం. ఈ చిత్రం.. చూసేందుకు మాత్రం వినూత్నంగా ఉంటుంది. అందరికీ తెలిసిన షార్ట్ ఫిల్మŠస్ అంటే ఆర్టిస్ట్‌లు, క్యాస్టూమ్స్, లొకేషన్స్, పాటలు, ఫైట్లు..! ఇవి లేకుండా ఏ సినిమానీ ఊహించుకోలేరు. కానీ వర్చువల్ ఆడియో ఫిల్మ్‌లో ఇవేవి కనపడవు. కానీ వినపడతాయి. ఈ షార్ట్ ఫిల్మ్‌లో ప్రత్యేకతే అది. ఒక సన్నివేశాన్ని, సందర్భాన్ని తెరపైన కనపడకుండా కేవలం మాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్తోనే కళ్లకు కట్టినట్టు కథ చూపించడం, వినిపించడం దీనిలో విశేషం. ఫిల్మ్ ఫెస్టివల్‌కి ‘డార్క్’ మూవీ.. ‘ఎ డేట్ ఇన్ ద డార్క్’ పేరుతో నగరవాసి సింగార మోహన్ ఒక వర్చువల్ ఆడియో ఫిల్మ్‌ని రూపొందించారు. ఆద్యంతం చీకటిలోనే నడిచే సున్నితమైన ప్రేమకథ ఇది. సినిమా దర్శకుడిగా మారాలనే ఆశయంతో వచ్చిన మోహన్ మొదటి ప్రయత్నంగా ఈ షార్ట్ మూవీని రూపొందించాడు. దర్శకుడిగా నిరూపించుకోవాలంటే విభిన్నమైన సినిమాని చేయాలన్న ఆలోచనతో ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమాకి సోషల్ మీడియాలో మంచి ఆదరణ అభించింది. ఇప్పటి వరకు 6 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి ఎంపిక కాగా అందులో రెండింటిలో ఫైనల్ లిస్ట్‌లో కొనసాగుతుంది. తక్కువ ఖర్చుతో ప్రయోగం.. కనపడకుండా కేవలం వినపడటం ద్వారా ఓ చిత్రాన్ని పొయెటిక్‌గా రూపొందించడం. అంత సులభం కానప్పటికీ హత్తుకునే కథా, కథనం సన్నివేశాన్ని మాటలతోనే ఆసక్తి రేకించే పనితనం అన్నింటికీ మించి మానసిక స్పందనలను ప్రభావితం చేయగల నేర్పరితనంఉంటే ఈ చిత్రం ‘చెవుల్ని’ కట్టి పడేస్తుంది. ఈ మూవీలో నటీనటుల మాటలు, వారి చుట్టూ ఉన్న పరిసరాల్లోని సౌండ్స్ మాత్రమే ఉంటాయి. వీటి ద్వారానే జరుగుతున్న సన్నివేశాన్ని కనపడకుండా చూపించగలగాలి. ఒక సీన్ నుంచి ప్రేక్షకుడి ధ్యాస మరల్చకుండా తీయగలగాలి. అతితక్కువ ఖర్చుతో ఈ సినిమా తీసే అవకాశం ఉంది. మేకప్,కాస్టూమ్స్, ట్రావెలింగ్ తదితర ఖర్చులేమి ఉండవు. ఈ విధమైన సినిమాలు ఇంతకు ముందు తీసిన సందర్భాలు చాలా అరుదు. సినిమాలో కొత్తదనం కోరుకునే కొందరు దర్శకులు మాత్రం వీటికి సై అంటున్నారు. రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు.. ఈ షార్ట్‌ఫిల్మ్ గురుంచి మోహన్ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ లవ్ స్టోరీస్ తీయాలని ఇష్టం. అందుకే స్వచ్ఛమైన ప్రేమ కథతో ఈ సినిమా తీశాను. కంటికి కనపడకుండా ఒక అనుభూతిని ప్రేక్షకుడికి అందించాలంటే స్క్రిప్ట్ ఎంతో ముఖ్యం. దాన్ని అనుకున్నట్టుగా తీయడం చాలా కష్టం. మన దగ్గర అతి తక్కువ మంది ఈ విధమైన సినిమాలు తీశారు. వర్చువల్ ఆడియో ద్వారా దేశంలోనే మొదటి సారిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన ‘డైలాగ్ ఇన్ ద డార్క్’ నా సినిమాకు ప్రేరణ. 11 నిమిషాల సినిమా నిర్మించడానికి దాదాపు 40 రోజులు శ్రమించామన్నారు. పాటకు డిజిటిల్ ప్లాట్‌ఫామ్ సాక్షి, హైదరాబాద్: మనమంతా.. మనసంతా.. ఆన్‌లైన్‌పైనే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పండుగైనా, పబ్బమైనా, ఆటలైనా, పోటీలైనా.. ఆన్‌లైన్‌ను ఆశ్రయించాల్సిందే. కరోనా తనతో పాటు డిజిటల్ వాడకాన్ని కూడా బాగా వ్యాప్తిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే క్రమంలో పాటల పోటీలను కూడా డిజిటల్ పంథాలో తొలిసారిగా తెలుగు డిజిటల్ ఐడల్ పోటీలను నిర్వహిస్తోంది సిటీకి చెందిన టెంపుల్ బెల్ ఈవెంట్స్. ఈ పోటీ నిర్వాహకులు కౌశిక్ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. దివంగత గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం టీవీ తెర వేదికగా ఎందరో గాయనీ గాయకులను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం మనకు తెలియంది కాదు. ఆయన స్ఫూర్తితో ఎన్నో పాటల పోటీలకు బీజం పడింది. ఓ ఏడెనిమిది నెలల క్రితం వరకూ మనకు టీవీ షోల రూపంలోగానీ, బయట గానీ అనునిత్యం ఎక్కడో ఒకచోట పాటల పోటీలు జరుగుతూనే ఉండేవి. అయితే కరోనా కారణంగా అన్నింటితో పాటు అవీ అరకొరగానే మారిపోయాయి. ఆన్లైన్ కార్యకలపాలు తప్పనిసరిగా మారిన ప్రస్తుత పరిస్థితి వల్ల డిజిటల్ వేదికను ఉపయోగించుకుని పాటల పోటీ నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నచ్చిన తానా అధ్యక్షులు జె.తళ్లూరి కూడా నిర్వహణలో చేయి కలిపారు. సాంగు భళా.. పోటీ ఇలా.. ఈ పోటీల పోస్టర్‌ను ఆగస్టు 11న సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా పోటీదారుల రిజిస్టర్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 550 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి దేశాల నుంచి కూడా పోటీదారులు ఉన్నారు. వీరి నుంచి వడపోత అనంతరం 30 మందిని ఎంపిక చేశాం. తొలి రౌండ్లో ఈ 30 మంది పాల్గొంటారు. అదేవిధంగా 9 మంది క్వార్టర్ ఫైనల్స్‌కి, ఐదుగురు సెమీఫైనల్స్‌కి సెలక్టవుతారు. తుది పోటీకి ముగ్గురు మాత్రమే అర్హత పొందుతారు. ఈ పోటీలో ప్రతి దశా పూర్తిగా వర్చువల్‌గానే జరుగుతుంది. సాంగు భళా.. పోటీ ఇలా.. ఈ పోటీల పోస్టర్‌ను ఆగస్టు 11న సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా పోటీదారుల రిజిస్టర్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 550 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి దేశాల నుంచి కూడా పోటీదారులు ఉన్నారు. వీరి నుంచి వడపోత అనంతరం 30 మందిని ఎంపిక చేశాం. తొలి రౌండ్లో ఈ 30 మంది పాల్గొంటారు. అదేవిధంగా 9 మంది క్వార్టర్ ఫైనల్స్‌కి, ఐదుగురు సెమీఫైనల్స్‌కి సెలక్టవుతారు. తుది పోటీకి ముగ్గురు మాత్రమే అర్హత పొందుతారు. ఈ పోటీలో ప్రతి దశా పూర్తిగా వర్చువల్‌గానే జరుగుతుంది. -
ఇంతకు ‘పాడ్‌క్యాస్ట్’ అంటే ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : నేటి ఆధునిక సాంకేతిక రంగంలో వీడియో, ఆడియోలు విజ్ఞానంతోపాటు వినోదం ఇచ్చే అద్భుత అంశాలుగా మారిన విషయం తెల్సిందే. అందుకే ఈ రెండింటిని తోబుట్టువులుగా అభివర్ణిస్తారు. ముందుండి వీడియో రంగం దారి చూపుతుంటే వెనకాల వెన్నంటి ఆడియో రంగం అనుసరిస్తోంది. ఇంటర్నెట్ మందగమనం వల్ల కూడా అప్పుడప్పుడు ఆడియోకు అదృష్టం కలిసొస్తోంది. ఆడియో సంగీతం అలా అభివృద్ధిలోకి వచ్చిన విషయం తెల్సిందే. స్టాక్‌హోమ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఓ కంపెనీ సంగీతం అందించేందుకు ‘స్పాటిఫై’ యాప్‌ను గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టగా, దానికి పోటీగా మూడు వారాల్లోనే ‘యూట్యూబ్ మ్యూజిక్’ భారత్‌లో ప్రవేశించింది. అప్పటికే రంగప్రవేశం చేసిన ఆపిల్, అమెజాన్ మ్యూజిక్, గానా, జియోసావన్, హంగామా యాప్‌ల మధ్య పోటీ తీవ్రమైంది. సరిగ్గా ఈ సమయంలోనే ‘పాడ్‌క్యాస్ట్’ ఆడియో విభాగానికి ఆదరణ పెరిగుతూ వచ్చింది. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉండగా, కేవలం నాలుగు కోట్లమందే పాడ్‌క్యాస్ట్ శ్రోతలు ఉన్నారు. అయినా ఇది మంచి పెరుగుదలగానే చెప్పవచ్చు. ఒక్క 2018లోనే ఈ రంగం 60 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇంతకు ‘పాడ్‌క్యాస్ట్’ అంటే ఏమిటీ? ఐప్యాడ్ ప్లస్ బ్రాడ్‌క్యాస్ట్ కలిపి ‘పాడ్‌క్యాస్ట్’ను సృష్టించారు. ఐప్యాడ్లను రూపొందించిన ఆపిల్ కంపెనీ దీనిపై పేటెంట్‌ను కోరకపోవడంతో పలు కంపెనీలు, వ్యక్తులు ‘పాడ్‌క్యాస్ట్’ పదాన్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఐప్యాడ్‌ను గుర్తుచేయడం ఇష్టంలేని వారు మాత్రం వీటిని ‘నెట్క్యాస్ట్’ అని వ్యవహరిస్తున్నారు. తొలుత డిజిటల్ ఆడియో ఫైల్స్‌తో మాత్రమే ఇవి మార్కెట్లోకి వచ్చాయి. కంపెనీల నుంచే కాకుండా ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తి లేదా యూజర్ ‘పాడ్‌క్యాస్ట్’ ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకొనే అదనపు సౌకర్యం ఉంది. సైన్స్, సాంకేతిక రంగాలతోపాటు రాజకీయాల నుంచి సాంస్కృతిక, కళారంగాల వరకు, విజ్ఞానం నుంచి వినోదం వరకు సకల రంగాలకు చెందిన సమాచారాన్ని ‘పాడ్‌క్యాస్ట్’ ద్వారా గ్రహించవచ్చు. అంటే ఆయా రంగాలకు చెందిన సమాచారాన్ని ఇంతకు ముందు వ్యక్తులు, ఇప్పుడు వ్యక్తుల బృందం అందజేస్తోంది. వీటిని ప్రసారం చేయడానికి ‘యాంకర్’పాటు పలు యాప్‌లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్, యాపిల్ కంపెనీలు రూపొందిస్తున్న ‘పాడ్‌క్యాస్ట్’లను యాంకర్ యాప్ ద్వారానే ప్రసారం అవుతున్నాయి. 2004 సంవత్సరం నాటికి ఇంగ్లీషులో కొన్ని పాడ్క్యాస్ట్లే ఇంటర్నెట్లో అందుబాటులోకి రాగా, నేడు లక్షా యాభై వేల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇతర భాషలకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. ఇప్పుడు వీడియో పాడ్‌క్యాస్ట్‌లను ‘యూప్ట్యూబ్’ ప్రసారం చేస్తోంది. వీటిని నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో ఇష్టం ఉన్నప్పుడు చూసే అవకాశం కూడా ఉంది. నచ్చే పాడ్‌క్యాస్ట్‌లను ముందుగానే ఎంపిక చేసుకుంటే ఆటోమేటిక్‌గా కూడా డౌన్లోడ్ అవుతాయి. డబ్బులు కూడా వస్తాయి ? మనుషుల అభిరుచులకు తగ్గట్టుగా విజ్ఞానం, వినోదాన్ని పంచడంతోపాటు వివిధ భాషలు, సంగీతాన్ని నేర్పే ‘పాడ్‌క్యాస్ట్’లు కూడా నేడు అందుబాటులోకి వచ్చాయి. కమేడియన్లకు కూడా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రైవేటు రేడియో కంపెనీలు కూడా ఇప్పుడు ఈ రంగంలో పోటీ పడుతున్నాయి. వీటికి శ్రోతలు లేదా వీక్షకులు సబ్‌స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్లనుబట్టి పాడ్‌క్యాస్ట్ నిర్మాతలకు యాడ్స్ రూపంలో డబ్బులు వస్తాయి. వాటిల్లో 30 శాతం రెవెన్యూను నేడు వాటి ‘ప్రసార మాద్యమాలే’ లాగేసుకుంటున్నాయి. పాడ్‌క్యాస్ట్‌ల ద్వారా యాంకర్లు కూడా సెలబ్రిటీలుగా మారుతున్నారు. సంగీతాన్ని అందించే ‘స్పాటిఫై’ ఈ రంగంలోకి ప్రవేశించి ‘లవ్ ఆజ్ కల్’ పాడ్‌క్యాస్ట్‌ను ప్రసారం చేయడంతో దాని యాంకర్లయిన ఆస్థా, అంకిత్‌లు సెలబ్రిటీలుగా మారిపోయారు. వారికి సోషల్ మీడియాలో ఫ్యాన్‌ఫాలోయింగ్ కూడా పెరిగింది. ‘ఓయో గదుల్లో సెక్స్ సురక్షితమా, కాదా ?’ లాంటి ప్రశ్నలే ఎక్కువగా వారికి వస్తుంటాయి. అది వేరే విషయం. కరన్ జోహర్, కరీనాకపూర్ అతిథేయులుగా విడుదల చేసిన పాడ్‌క్యాస్ట్‌లకు మంచి ఆదరణ ఉంది. కంపెనీల పరంగా ఆపిల్ కంపెనీ విడుదల చేస్తోన్న పాడ్‌క్యాస్ట్‌లకు 30 నుంచి 35 శాతం ఆదరణ ఉండగా, క్యాస్ట్బాక్స్ కంపెనీకి పది నుంచి పన్నెండు శాతం ప్రజాదరణ ఉంది. వీటిని వింటున్న, వీక్షిస్తున్న వారంతా 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులే. వీటిద్వారా వ్యక్తిగత టాలెంట్లు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ రంగంలో ముందుండాల్సిన మీడియానే వెనకబడింది. -
అమ్మాయి స్వార్థం
ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ తనయుడు శంతన్ భాగ్యరాజ్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘ముప్పరిమానమ్’. సృష్టి డాంగే కథానాయిక. ఆది రూపన్ దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని భువన్ కుమార్ అల్లం ‘లవ్ గేమ్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆడియో, ట్రైలర్‌ని విడుదల చేశారు. భువన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘గతంలో ‘సారథి’ అనే స్ట్రయిట్ సినిమా నిర్మించాను. ప్రస్తుత ట్రెండ్‌కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘లవ్ గేమ్’. ఒక అమ్మాయి తన స్వార్థం కోసం ఇద్దరి అబ్బాయిలతో ఎలా గేమ్ ఆడిందనేది కథ. ‘వెన్నెలకంటి’ గారు మంచి సంభాషణలు అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. -
ప్రతీకార హత్యలకు తావియ్యొద్దు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్, రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని అత్తాపూర్‌లో బుధవారం చోటు చేసుకున్న దారుణ హత్యను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. నగరంలో ఇలాంటి ఉదంతాలకు తావు లేకుండా చూడాలని, ఇందుకోసం బాడీలీ అఫెన్సులుగా పిలిచే హత్య, హత్యాయత్నం, దాడి తదితర కేసులపై ఇన్స్పెక్టర్లు నిత్యం సమీక్షిస్తూ నిందితులను అరెస్టు చేయాలని సూచించారు. బెయిల్‌పై వచ్చిన వారి కదలికలను ఓ కంట కనిపెట్టాలని సూచించారు. ఈ మేరకు గురువారం సిబ్బందిని ఉద్దేశించి ఓ వాయిస్ మెసేజ్‌ను విడుదల చేశారు. ఇటీవల పదోన్నతులు, బదిలీల నేపథ్యంలో పలువురు ఇన్స్పెక్టర్లు కొత్తగా వచ్చిన నేపథ్యంలోనే కొత్వాల్ తన వాయిస్ మెసేజ్‌లో వారికి దిశా నిర్దేశం చేశారు. ఆయన సందేశంలోని మాటలివి... ‘సిటీ పోలీస్‌లోకి అనేక మంది ఇన్స్పెక్టర్లు కొత్తగా వచ్చారు. వారందరికీ సుస్వాగతం. హైదరాబాద్ పోలీసు అనేది దేశంలోనే ఉత్తమమైన విభాగం. ఇక్కడ పని చేయడం అరుదైన అవకాశం. ఇందులోనే ఓ బాధ్యత కూడా నిమిడి ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వర్తించడం మినహా మరో ప్రత్యామ్నాయం ఇక్కడ లేదు. పోలీసు అధికారుల ప్రవర్తన పారదర్శకంగా, వివాదాలకు దూరంగా ఉండాలి. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. కేవలం మీరు మాత్రమే కాదు.. మీ కింద పని చేసే వారూ అవినీతికి దూరంగా ఉండేలా, నిస్ఫాక్షికంగా పని చేసేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీదే. నిర్దేశించుకున్న విధి విధానాలు, నిబంధనలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాల్సిందే. విధులకు హాజరయ్యే పోలీసులు వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడంతో పాటు విధుల్లో బయట ఉంటే టోపీ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ప్రజలతో అత్యంత మర్యాదపూర్వకంగా మెలగాలి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్ రానున్న రెండు రోజుల్లో పంజగుట్ట ఠాణాను సందర్శించండి. అక్కడ కనీసం రెండుమూడు గంటల గడిపి అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయండి. దేశంలోనే రెండో ఉత్తమ ఠాణాగా గుర్తింపు పొందడం వెనుక ఉన్న కృషిని తెలుసుకోండి. రానున్న 20 రోజుల్లో అన్ని ఠాణాలను సందర్శిస్తా. పంజగుట్టలో పరిశీలించిన అంశాలు ఏ మేరకు అమలు చేస్తున్నారో పరీక్షిస్తా. రెండు వారాల్లో ఏసీపీలు, డీసీపీలు సైతం ఠాణాల సందర్శన చేయాలి. దర్యాప్తు చేసే ప్రతి కేసుకూ ఓ స్పష్టమైన, అనుమతి పొందిన యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఠాణా సందర్శనకు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ నెంబర్ అడిగితే దాని యాక్షన్ ప్లాన్ చెప్పగలిగేలా పట్టు సంపాదించాలి. దర్యాప్తులో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేసి చార్జ్షీట్లు దాఖలు చేయడం. ఈ కేసులతో పాటు పెండింగ్‌లో ఉన్న నాన్–బెయిలబుల్ వారెంట్ల సంఖ్య ప్రతి వారం తగ్గాలి. అమలులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ అప్లికేషన్లు విస్తృతంగా వినియోగించుకోండి. ప్రతి శనివారం ఇన్స్పెక్టర్లు కోర్టు ఆఫీసర్లతో విస్తృత సమీక్ష నిర్వహించడం ద్వారా శిక్షల శాతం పెరిగేలా చర్యలు తీసుకోండి. దీనిపై ప్రతి నెలా నాకు నివేదిక పంపాలి. ఏదైనా కేసులో శిక్ష పడినట్లైతే ఆ విషయాన్ని వాట్సాప్ ద్వారా నేరుగా నాకే తెలియజేయండి. ట్యాబ్ వినియోగం అనేది శరీరంలో భాగంగా మారిపోవాలి. ప్రతి ఒక్కరూ టీఎస్ కాప్ యాప్ వినియోగంలో నిష్ణాతులు కావాలి. ఎప్పటికప్పుడు కొత్తగా పీడీ యాక్ట్‌లు తెరవాల్సిన ప్రతిపాదనల్ని పంపండి. ‘నేను సైతం’ ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తూ వారం వారం పురోగతి ఉండేలా చూడాలి. డీసీపీల నేతృత్వంలో నిర్విరామంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టడానికి వీలుగా అవసరమైన క్రైమ్ ప్రోన్ ఏరియాలను గుర్తించండి. ఎవరికైనా ఏదైనా అంశంపై అదనపు శిక్షణ కావాలంటే సీపీ కార్యాలయం ద్వారా ఇప్పించడానికి సిద్ధం. ఆ వివరాలు నాకు చెప్పండి. హైదరాబాద్ సిటీ దేశంలోనే బెస్ట్. మనంతో పాటు మన వారందరూ ఇక్కడే ఉంటున్నారు. దీన్ని మరింత భద్రతమైన నగరంగా మారుద్దాం. ఖాకీ దుస్తుల్లో ఉన్న వ్యక్తిని ఎవరైనా చూస్తే ప్రేమ, అభిమానం, ఆప్యాయతలతో కూడిన చిరునవ్వు వారి ముఖంలో కనిపించాలి. ఆ స్థాయికి చేరాలన్నది నా కల...అదే నా ప్రాధాన్యం... లక్ష్యం’. విత్ బెస్ట్ విషెస్ అంజనీ కుమార్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ జైహింద్... -
సంచలనం రేపుతున్న నారాయణ సంస్థల ఆడియో
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వివాదస్పదమైన నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన ఓ ఆడియో ప్రస్తుతం సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో ఆ సంస్థలకు చెందిన ఆడియో టేప్ వైరల్‌గా మారింది. నారాయణ సంస్థల్లో జరుగుతున్న అనైతికక కార్యక్రమాలు ఆ ఆడియో ద్వారా బయటకు వెల్లడి కావడం మరోసారి చర్చనీయాంశమైంది. నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన ఇద్దరు ఉద్యోగుల సంభాషణ... ఇప్పుడు సోషల్‌మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్ రామాంతపూర్‌లోని నారాయణ స్కూల్‌కు చెందిన వైస్ ప్రిన్సిపల్ నవీన్ .. అదే బ్రాంచ్‌కు చెందిన ప్రిన్సిపాల్ సరితా అగర్వాల్‌తో మాట్లాడిన సంభాషణలు బయటపడ్డాయి. డీమానిటైజేషన్ సమయంలో బ్లాక్‌మనీని నారాయణ యాజమాన్యం వైట్‌మనీగా ఎలా మార్చిందో వీరిద్దరూ ఆ వీడియోలో చర్చించుకున్నారు. అలాగే యాజమాన్యంలోని కీలక వ్యక్తికి ...మహిళలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆ సంభాషణల్లో వెల్లడి అయింది. హయత్‌నగర్ నారాయణ బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి శ్రీలత ఆత్మహత్యకు కారణం ఏంటో కూడా....ఈ ఆడియోలో చెప్పడం సంచలనంగా మారుతోంది. వనస్థలీపురంలో ఉన్న నారాయణ విద్యాసంస్థల గెస్ట్‌హౌస్ అరాచకాలకు అడ్డాగా మారిందని...ఈ ఆడియో ద్వారా తెలుస్తోంది. నారాయణ సంస్థలకు సంబంధించిన కీలకమైన విషయాలపై చర్చ జరిగిన ఈ ఆడియో టేపు.....ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ ఆడియో వ్యవహారంపై నారాయణ యాజమాన్యం ఇప్పటివరకూ స్పందించలేదు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడియో కలకలం రేపుతోంది. అలాగే ఆడియో టేపులను బహిర్గతం చేశాడన్న అనుమానంతో వైస్ ప్రిన్సిపల్ నవీన్‌పై నారాయణ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు నవీన్ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. బయటపడ్డ ఆ ఆడియోతో తనకెలాంటి సంబంధం లేదని తెలిపాడు. అయినా తనపై అకారణంగా దాడి చేశారని, తనకేమీ జరిగినా నారాయణదే బాధ్యత అని నవీన్ అన్నారు. నారాయణ నుంచి తనకు ప్రాణహానీ ఉందని, తన అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. కాగా నారాయణ ఉద్యోగుల ఆడియో సంభాషణ రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిలిస్తోంది. నారాయణలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై.....విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. నారాయణగూడలోని నారాయణ కాలేజీపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నీచర్ అంతా ధ్వంసం చేశారు. అడ్డగోలుగా చెలామణి అవుతోన్న నారాయణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ -
అతీత శక్తులు ఉన్నాయా...?
వాషింగ్టన్ : ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే విషయాన్ని నాసా ప్రకటించింది. విశాల చీకటి అంతరిక్షంలో మనషికి తెలియని అతీత శక్తులు.. వాటి ధ్వనులను గుర్తించినట్టు వెల్లడించింది. శాటిలైట్ల ప్రయాణంలో రికార్డు చేయబడిన ధ్వనులను నాసా తాజాగా విడుదల చేసింది. నాసా విడుదల చేసిన ఆడియో టేపుల్లో అతీతశక్తుల ధ్వనులను స్పష్టంగా వినవచ్చును. అంతరిక్షంలోని అతీంద్రియం లోకం నుంచి విచిత్ర ధ్వనులు, సంకేతాలు అందుతున్నట్లు నాసా తెలిపింది. ఈ ధ్వని తరంగాల్లో రేడియో, ప్లాస్మా, మ్యాగ్నటిక్ వేవ్స్‌ను ఆడియో టేపుల్లోకి నాసా అధికారులు మార్చారు. ఆడియోటేపుల్లో కొన్ని శబ్దాలు అత్యంత భయానకంగా ఉంటే మరికొన్ని ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. భూమికి ఆవల రికార్డు చేసిన 22 ఆడియో టేపులను నాసా విడుదల చేసింది. -
అతీత శక్తులు ఉన్నాయా...?
-
జూలై 31న 'జయ జానకి నాయక' ఆడియో
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'జయ జానకి నాయక'. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్లాస్ మాస్ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకొనే విధంగా దేవి తనదైన మార్క్ తో రెడీ చేసిన జయ జానకి నాయక ఆడియోను జూలై 31న ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. 'ఏ విషయంలోనూ రాజీపడకుండా జయ జానకి నాయక చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్, గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి. ఇటీవల విడుదల చేసిన 'నువ్వేలే నువ్వేలే' పాటకి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. దేవి మళ్ళీ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నాడు. జూలై 31న ఆడియో విడుదల వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం. ఆడియో విడుదల తర్వాత సినిమా మీద ఉన్న క్రేజ్ మరింత పెరుగుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్, పోస్టర్స్ ని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకొంటుండడం చాలా సంతోషంగా ఉంది' అన్నారు. -
ఆడియో హిట్‌తో అంచనాలు పెరిగాయి
ఆకలి పోరాటం చిత్ర నిర్మాత పీవీ రాఘవులు రాజమహేంద్రవరం కల్చరల్ : రామ్‌సాయి గోకులం క్రియేషన్స్‌పై నిర్మించిన ‘ఆకలిపోరాటం’ సినిమాలోని ఆరు పాటలు హిట్ కావడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయని నిర్మాత పీవీ.రాఘవులు(రవి) తెలిపారు. ఈ నెల 25న రాజమహేంద్రవరంలో విడుదల చేసిన ఆకలి పోరాటం ఆడియో విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్ శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలను తెలిపారు. ఈ సందర్బంగా హీరో గంగాధర్ మాట్లాడుతూ ఎంత పెద్ద సినిమాలో అయినా ఏవో కొన్ని పాటలు హిట్ అవుతాయని, అయితే చిన్న సినిమా అయిన తాను నటించిన ఆకలి పోరాటంలో ఆరు పాటలు ప్రజాదరణ పొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయం తమది మాత్రమే కాదని, గోదావరి ప్రాంత సెంటిమెంట్, ఇక్కడి ప్రజల ఆదరణే ఈ విజయానికి కారణమన్నారు. చిత్ర నిర్వాహకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సినిమాలో ఆరు పాటలు మంచి హిట్ అయ్యాయని, ఈ విజయం గోదావరి ప్రాంత వాసులదేనన్నారు. సినిమా విడుదలకు సిద్ధమౌతున్నామని, పాటలను విజయవంతం చేసిన మాదిరిగానే సినిమాను హిట్ చేయాలని ఆక్షాంక్షించారు. కొల్లపురెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యతో తెరకెక్కిన ఈ సినిమాను అందరూ ఆదరించాలని, ప్రస్తుతం యువత పడుతున్న కష్టాలను ఆకలి పోరాటం ద్వారా చూపామన్నారు. -
నేడు ఆకలిపోరాటం ఆడియో విడుదల
రాజమహేంద్రవరం కల్చరల్: రామ్‌సాయి గోకులం బ్యానర్‌పై నిర్మించిన ‘ఆకలిపోరాటం’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జరుగుతుందని చిత్ర రచయిత, దర్శకుడు ఆనందసాగర్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో ఆ విశేషాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నానికి చెందిన స్వప్న యాంకర్‌గా వ్యవహరిస్తారన్నారు. మెయిన్ హీరో ‘సాక్షి విలేకరి’ గంగాధర్ కాగా మరో ముగ్గురు సహాయ హీరోలుగా నటించారన్నారు. చిత్రం షూటింగ్ మూడువంతులు ఉభయ గోదావరి జిల్లాలలోను, మిగిలిన భాగం హైదరాబాద్‌లో చేశామన్నారు. ఇంజినీరింగ్ చదివిన యువకులు ఉద్యోగాన్వేషణలో ఎదుర్కొనే సమస్యలు హాస్యాత్మకంగా తీశామన్నారు. జూలై 10–20 తేదీల మధ్యలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. హీరో గంగాధధర్ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ఆశీస్సులను కోరుకుంటున్నానన్నారు. నిర్మాత రాఘవులు పాల్గొన్నారు. -
'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల
రాం కార్తీక్, భాను త్రిపాఠి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో నటించిన 'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఆడియోను విడుదల చేశారు. ఎస్.ఆర్.పి విజువల్ పతాకంపై సాయితేజ పాటిల్ సమర్పణలో శివరాజ్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని ఆచార్య ఈ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆడియో విడుదల కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు, జీవిత, ఎన్.శంకర్, మల్కాపురం శివకుమార్, సినిమా యూనిట్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న శివరాజ్ పాటిల్.. సినీరంగంలో కూడా రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చిత్ర నిర్మాత శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ.. సినిమా ఆడియోని ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి హరీష్‌రావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యూత్‌ని ఆట్టుకునే అన్ని కమర్షియల్ హంగులతో, ఒక చక్కని మెసేజ్‌ను మిళితం చేసి దర్శకుడు నాని ఆచార్య చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. ఘంటాడి కృష్ణ అందించిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయని చెప్పారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లు వెల్లడించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ.. తనకు ఇది 50వ చిత్రమని చెప్పారు. సంగీత దర్శకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ తనకు ఈ చిత్రంతో ఆరంభం అవుతోందని, ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
డిజిటల్ ఫార్మెట్లో డోరా గీతాలు
డోరా చిత్ర గీతాలను డిజిట ల్ ఫార్మెట్లో విడుదల కానున్నారుు.లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రాల్లో డోరా ఒకటి. వి.హిందేశ్ జపక్ సమర్పణలో నెమిచంద్ జపక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దాస్ రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో తంబిరామయ్య, హరీష్‌ఉత్తమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సర్గుణం సినిమాస్ సంస్థ నెమిచంద్ జపక్కు ఫస్ట్‌కాపీ బెస్లో నిర్మిస్తోంది.ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ల ద్వయం సంగీతాన్ని, దినేశ్కృష్ణన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ డోరా చిత్ర టాకీ పార్టు పూర్తి అరుు్యందన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న డోరా చిత్ర ఆడియోను సింగిల్ ట్రాక్‌ను సోనీ మ్యూజిక్ సంస్థ డిజిటల్ విధానంలో వరుసగా ఒక్కో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని చెప్పారు. నయన ఇప్పటి వరకూ నటించనటువంటి పాత్రను ఇందులో చేస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా మంచి అటెన్సన్ను క్రియేట్ చేసిందని, చిత్రం కచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేస్తున్నారు. -
సెన్సార్‌కు భయపడకూడదు
తమిళసినిమా: చిత్ర నిర్మాతలు సెన్సార్ బోర్డుకు భయపడకూడదని సీనియర్ నటుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు ఎస్వీ.శేఖర్ వ్యాఖ్యానించారు. కే 3 క్రియేషన్స పతాకంపై ప్రతాప్ మురళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం తిట్టివాసల్. ప్రముఖ నటుడు నాజర్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో మహేంద్రన్, తనూశెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. చిత్ర ఆడియో, ట్రైలర్లను నటుడు, నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్ ఆవిష్కరించగా తొలి ప్రతులను ఎస్వీ.శేఖర్, యూటీవీ ధనుంజయన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వీ.శేఖర్ మాట్లాడుతూ ఖర్చు చేసే ప్రతి రూపాయి చిత్రంలో తెలియాలన్నారు. అది ఈ చిత్రంలో స్పష్టంగా తెలుస్తోందని అందుకు చిత్ర నిర్మాతను అభినందిస్తున్నానని అన్నారు.అయితే ఒక సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఒక సూచన చేయాలనుకుంటున్నానన్నారు. దయ చేసి చిత్ర విడుదల తేదీని నిర్ణయించి సెన్సార్‌కు వెళ్లకండని అన్నారు. అలా వెళితే తగిన సమయం లేకపోవడంతో సెన్సార్ వారు షరతులకు తలవంచాల్సి వస్తుందన్నారు. నిర్మాతలకు ధైర్యం చాలా అవసరం అన్నారు.చిత్రాలు మీవని, మీరు చట్టబద్ధంగానే చిత్రాలు చేస్తున్నారని, అందువల్ల సెన్సార్ వారి చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. విడుదలకు సమయం ఉంటే సెన్సార్ వారి నిబంధనలకు తలవంచాల్సిన అవసరం మీకుండదని ఎస్వీ.శేఖర్ అన్నారు. -
యాక్కై గీతాలావిష్కరణ
నటుడిగా కృష్ణ ఎదుగుదల ఎనలేని సంతోషాన్నిస్తోందని ఆయన సోదరుడు, ప్రముఖ దర్శకుడు విష్ణువర్ధన్ పేర్కొన్నారు. యువ నటుడు కృష్ణ నటిస్తున్న తాజా చిత్రం యాక్కై. నటి స్వాతి కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రేమ్ పిక్చర్స్ పతాకంపై నవ నిర్మాత ముత్తుకుమారన్ నిర్మిస్తున్నారు. కుళందై వేలప్పన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి రిథమిక్ మాస్టర్ యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నైలోని సత్యం సినీ థియేటర్లో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు విష్ణువర్ధన్ ఆవిష్కరించగా మరో దర్శకుడు కరు పళనీయప్పన్ తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా కరు పళనీయప్పన్ మాట్లాడుతూ చక్కని అర్థవంతమైన చిత్రాలు తమిళంలో తక్కువగానే వస్తున్నాయన్నారు.మంచి కథ,కథనాలతో కూడిన అలాంటి చిత్రాలు విజయం సాధిస్తున్నాయని పేర్కొన్నారు.అలాంటి చిత్రాల వరుసలో ఈ యాక్కై చిత్రం చేరుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. దర్శకుడు విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఒక్కో చిత్రంతో తన నటనను మెరుగుపరచుకుంటూ మంచి నటుడిగా ఎదుగుతున్న కృష్ణను చూస్తే ఎనలేని సంతోషం కలుగుతోందన్నారు. ఆ యాక్కై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలందిస్తున్నట్లు పేర్కొన్నారు. తన మనసుకు హత్తుకున్న చిత్రాల్లో యాక్కై ఒకటని సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా అన్నారు. తాను యూ 1 రికార్డ్స్ సంస్థను నెలకొల్పిన తరువాత సంగీతాన్ని అందించిన తొలి చిత్రం యాక్కై కావడం విశేషం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడు పీఎల్.తేనప్పన్, పట్టియల్ శేఖర్, నటుడు కృష్ణ,నటి స్వాతి, నటుడు శరవణన్ పాల్గొన్నారు. -
ఇజం ఆడియో హైలైట్స్
-
కెమెరా, ఆడియోజాక్ లపై టేప్ అంటించిన జుకర్ బర్గ్..
లక్షలమంది వినియోగదారులు ఉపయోగిస్తున్న ఫేస్ బుక్ కు చెందిన ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఓ హాస్యాస్పద ఫోటోను పోస్ట్ చేశారు. ఆ చిత్రంలో ఆయన మ్యాక్ బుక్ పై కెమెరా, ఆడియో జాక్ లను టేప్ తో కవర్ చేయడం కనిపించింది. తన సామాజిక ఖాతాల పాస్వర్డ్ లు హ్యాక్ అయిన తర్వాత ఆయన మ్యాక్ బుక్ కెమెరా, ఆడియో జాక్ లపై టేప్ అటించినట్లు కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా సైట్లతోపాటు, నెట్ బ్యాంకింగ్ ఖాతాలు ఇటీవల హ్యాకర్ల చేతుల్లోకి వెడుతున్నాయని సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అటువంటి బాధితుల జాబితాలో సామాన్యులే కాక, ఏకంగా ప్రపంచ దిగ్గజాలు కూడ ఉంటున్నారు. అదే విషయంలో సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకర్ బర్గ కూడ నిర్లక్ష్యం వహించి తన ట్విట్టర్, పింటరెస్ట్ ఖాతాలకు ఒకేరకమైన పాస్వర్డ్ పెట్టడంతో ఆయన ఖాతాలుసైతం హ్యాక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇన్ స్టాగ్రామ్ నెలవారీ వినియోగదారులు 500 మిలియన్లు దాటిన సంతోషకర సందర్భంలో జుకర్ బర్గ్ ఓ హాస్యాస్పద చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ చిత్రంలో జుకర్ బర్గ్ చేతిలో ఓ చెక్క ఫ్రేమ్ పట్టుకొని ఉండగా, ఆయన వెనుక ఆయన ల్యాప్ ట్యాప్ కనిపిస్తుంది. ఆ సన్నివేశం చూస్తే ఆయనేదో సందేశం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాగా ఆ ఫోటోను పరీక్షగా చూసిన ట్విట్టర్ వినియోగదారుడు క్రిస్ ఓల్సెన్.. జుకర్ బర్గ్ ల్యాప్ టాప్ కెమెరాను, టేప్ ప్ తో కవర్ చేశారంటూ కామెంట్ చేశాడు. అధునాతన హ్యాకర్లు కెమెరాద్వారా ల్యాప్ టాప్ ను నియంత్రిస్తారు. అందుకే జుకర్ బర్గ్ ఆయన మ్యాక్ బుక్ కెమెరా, ఆడియోజాక్ లను టేప్ తో చుట్టేశారంటూ మరో వినియోగదారుడు గిజ్మోడో తన కామెంట్లో జుకర్ బర్గ్ పై ఛలోక్తి విసిరాడు. ముఖ్యంగా వినియోగదారుల ప్రైవేట్ సంభాషణలు, ప్రైవసీని కాపాడే బాధ్యత తీసుకోవాల్సిన ఫేస్ బుక్ సీఈవో.. ఇలా తన ప్రైవసీని కాపాడుకోవడానికి పడుతున్నతాపత్రయం అందరికీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. జుకర్ బర్గ్ తన వెబ్ క్యామ్ కు కూడ టేప్ వేసి ఉంచినట్లు తాను ఇదివరకే ఓ సందర్శంలో గమనించాని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ చెప్తుండగా...కొన్నేళ్ళ క్రితంనుంచే ఆమెరికా ప్రభుత్వం సీక్రెట్ గా తమ పౌరులను వెబ్ క్యామ్ ల ద్వారా పరిశీలిస్తోందని క్వాంటికోలోని ఎఫ్ బీ ఐ ఆపరేషనల్ టెక్నాలజీ డివిజన్ లో మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మార్కస్ థామస్ చెప్తున్నారు. సో... తనదాకా వస్తే కానీ అన్న సామెత ఇక్కడ జుకర్ బర్గ్ కు కూడ వర్తింస్తోందన్న మాట. -
జూన్ 11న కబాలీ ఆడియో
సూపర్ స్టార్ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. లింగా లాంటి డిజాస్టర్ తరువాత రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కబాలీ. తొలి టీజర్‌తోనే అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన కబాలీ, ఆడియో కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్‌గా జూలై 1న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంతకు ముందు ఆడియో రిలీజ్‌ను కూడా రజనీ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ముందుగా జూన్ 9న ఆడియో రిలీజ్ చేయాలని భావించినా, ప్రస్తుతం అమెరికాలో ఉన్న రజనీ ఆ సమయానికి అందుబాటులో ఉండడన్న ఉద్దేశంతో, జూన్ 11న ఆడియో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. చెన్నైలోని వైయంసీఏ గ్రౌండ్లో అభిమానుల మధ్య ఆడియో రిలీజ్ వేడుకను భారీగా ప్లాన్ చేస్తున్నారు. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. తమిళ్, తెలుగుతో పాటు మలేషియాలో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కబాలీ టీజర్ ఆన్ లైన్లో 2 కోట్లకు పైగా వ్యూస్‌తో సంఛలనం సృష్టిస్తుండగా ఆడియో రిలీజ్ అయితే మరిన్ని రికార్డ్‌లు కాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
22న నాని కొత్త సినిమా పాటలు
హైదరాబాద్: నాని హీరోనా... విలనా...? అంటూ ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానున్న నేచురల్ స్టార్ నాని జెంటిల్ మన్ చిత్రం పాటలు త్వరలో విడుదల కానున్నాయి. మే 22న ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అయితే ఈ జెంటిల్మన్ పాత్ర ఎలా ఉంటుందనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెల 12న టీజర్‌ను, 22న పాటలను విడుదల చేయనున్నాం. అందమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం' అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ డేవిడ్ నాథన్ అందించగా సంగీతం: మణిశర్మ, కెమెరా మ్యాన్ గా పీజీ విందా పనిచేశారు. -
మనసి చిత్ర గీతాలావిష్కరణ
మానసి చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఎంఎం థియేటర్లో జరిగింది. మూవీ మోషన్స్, ఎంజే.ఫిలింస్ అధినేతలు ఏ.పాహిమ్ ముహ్మదు, మాథ్యూజోసెఫ్లు నిర్మిస్తున్న చిత్రం మనసి. నవ జంట నరేశ్‌కుమార్, హారిస హీరోహీరోయిన్లుగా నటిస్తునారు. నటి హారిస ఇప్పటికే మలయాళంలో రెండు మూడు చిత్రాలలో నటించింది. తమిళంలో ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతోంది. ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో తవసి, లనూప్సతీషన్, సల్మాన్, పృథ్వీ, కేశవ్, ఆశిక్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ దర్శకులు కమల్, ఫాజిల్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన నవాజ్సులేమాన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శివరామ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది ఒక గొర్రెల కాపరి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. ఆ యువకుడు గొర్రెలను తన ఆత్మబంధువులుగా భావిస్తాడన్నారు. ఎవరికీ చెడు తలపెట్టని మూగ జీవులంటే అతనికి అంత ప్రేమ అన్నారు. అలాంటిది అందులో ఒక గొర్రె కనిపించకుండా పోయి ఆ యువకుడిని బాధకు గురి చేస్తుందన్నారు. అసలు ఆ గొర్రె ఏమయ్యింది, మళ్లీ తిరిగి వచ్చిందా? అన్న అంశాలను కమర్షియల్ రీతిలో చిత్రంగా మలచినట్లు తెలిపారు. చిత్రాన్ని తేని, కంభం, ఉత్తమపాళైయం, బోడి, ఉత్తుక్కాడు, కొంభై తదితర ప్రాంతాలలో చిత్రీకరించినట్లు దర్శకుడు వెల్లడించారు. -
వినబడని ఆడియోలకు లిప్ రీడింగ్ టెక్నాలజీ..
లండన్: ఇక వీడియోలో మాటలు వినిపించకపోయినా నష్టం లేదని, లిప్ రీడింగ్ టెక్నాలజీతో తెలుసుకోవచ్చని అంటున్నారు ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం అధ్యయనకారులు. వినికిడి లోపం ఉన్నవారికి విషయాలను కమ్యూనికేట్ చేయడంతోపాటు , నేర పరిశోధనకు ఈ కొత్త టెక్నాలజీ మరింత ప్రయోజనకరంగా ఉండేట్టుగా అభివృద్ధి చేసినట్లు చెప్తున్నారు. ధ్వని సరిగా వినిపించని సమయంలో సదరు వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు విజువల్ స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీ ని ఉపయోగించి మాటలను గుర్తించేందుకు ఈ కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచినట్లు ప్రొఫెసర్ రిచర్డ్ హార్వే, డాక్టర్ హెలెన్ ఎల్ బీర్ లు చెప్తున్నారు. రికార్డు చేసిన ఆడియోలు, ధ్వని, మాటలు, సీసీ టీవీ ఫుటేజ్ లోని ఆధారాలు... సంభాషణలు సరిగా అర్థంకాని సమయంలో ఈ టెక్నాలజీ వినియోగించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. లిప్ రీడింగ్ టెక్నాలజీని మరింత అభివృద్ధి పరచి, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు దృశ్య సంభాషణ శాస్త్రంలో తాము మరింత పరశోధన జరుపుతున్నామని సైంటిస్టులు చెప్తున్నారు. శిక్షణా పద్ధతి ద్వారా మునుపటి లిప్ రీడింగ్ పద్ధతులను మెరుగు పరిచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని డాక్టర్ బేర్ వివరించారు. సమర్థవంతంగా పెదాల కదలికలను చదివే వ్యవస్థ (లిప్ రీడింగ్) ను నేర పరిశోధన నుంచీ ఎంటర్ టైన్ మెంట్ వరకు ప్రతి విషయానికీ వినియోగించవచ్చని పరిశోధకులు తెలిపారు. పిచ్ లో ఉన్నపుడు ఫుడ్ బాల్ క్రీడాకారుల అరుపులు, సంభాషణ తదితర ధ్వనులను సులభంగా గుర్తించేందుకు ఇప్పటికే లిప్ రీడింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే కార్లు, ఎయిర్ క్రాఫ్ట్ కాక్ పిట్లు వంటి శబ్దాల స్థాయి ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో ఈ కొత్త టెక్నాలజీ అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. వినికిడి శక్తి లేనివారు వినియోగించే స్పీచ్ ఇంపెయిర్మెంట్స్ కు ప్రత్యామ్నాయంగా ఈ లిప్ రీడింగ్ టెక్నాలజీతో అత్యధిక ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ బేర్ చెప్తున్నారు. పెదవుల కదలికల ద్వారా రూపాన్ని, ఆకారాన్ని గుర్తించడం అనేది పెద్ద సమస్యగా కనిపించినా ఓ క్రమ పద్ధతిలో ఈ మెషీన్ల కు పెదాల కదలికలు, ఆకారాన్ని బట్టి శిక్షణ ఇవ్వడం ద్వారా అది సాధ్యమౌతుందని హార్వే అన్నారు. ధ్వనిశాస్థ్రం, స్పీచ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ పై షాంఘై లో జరిగే అంతర్జాతీయ సదస్సులో తమ పరిశీలనలను సమర్పించనున్నారు. ఐఈఈఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అకౌస్టిక్స్ - స్పీచ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ 2016 జర్నల్ ప్రొసీడింగ్స్ లో పరిశోధనా వివరాలను ప్రచురించారు. -
అసలు నాకే స్పష్టత లేదు: పవన్ కల్యాణ్
హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా.. సినిమాలో రాజకీయాలో తనకే ఇంకా స్పష్టత లేదన్నారు. ఇప్పుడు మాత్రం సినిమాలతో అలసిపోయానని, కొంత విరామం కావాలని వెల్లడించారు. సినిమాల్లో నటించకపోతే కథలు రాస్తానన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో అన్నయ్య చిరంజీవి వీణ స్టెప్‌ను ట్రై చేసినట్లు తెలిపిన పవన్ కల్యాణ్.. అన్నయ్యతో కలిసి సినిమా చేసే అవకాశాలున్నాయన్నారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు కేవలం పాస్‌లు ఉన్నవారు మాత్రమే రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆడియో రిలీజ్ మెగాస్టార్ చేతుల మీదుగా జరుగుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. -
నేడు తిరుపతికి ‘మామ మంచు అల్లుడు కంచు’ యూనిట్
తిరుపతి కల్చరల్: ఇటీవల విడుదలై విశేషాదరణ పొందిన ‘మామ మంచు అల్లుడు కంచు’ సక్సెస్ మీట్‌ను శనివారం తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మోహన్‌బాబు యువసేన రాష్ట్ర నేత ఎం.సునీల్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరంలో స్విమ్స్‌కు ఎదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు సక్సెట్ మీట్ వేడుకలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హీరో మోహన్‌బాబు, అల్లరి నరేష్, హీరోయిన్ పూర్ణ, రమ్యకృష్ణ, మీనా, ఆలీ, బ్రహ్మానందం, నిర్మాత మంచు విష్ణు, చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రత్యేక అతిథులుగా మంచు లక్ష్మీ, మంచు మనోజ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని అభిమానులు, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
ఈ మద్య తెగ కనిపిస్తున్నా!!
-
'చనిపోలేదు.. త్వరలోనే ఆడియో వినిపిస్తాం'
ఇస్లామాబాద్: తమ చీఫ్ ముల్లా అఖ్తర్ మన్సూర్ చనిపోయాడని వస్తున్న వార్తలు అవాస్తవాలని అఫ్గనిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటించింది. త్వరలోనే ఆయన ఆడియోను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అసలు ఆయనపై ఎలాంటికాల్పులు జరగలేదని, ఆయనకు ఎలాంటి గాయాలు అవలేదని ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుందని తాలిబన్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. 'మా చీఫ్ ముల్లా అఖ్తర్ సందేశం మాకు అందించింది. దానిని త్వరలోనే మేం మీకు విడుదల చేస్తాం. శత్రువులు మానసికంగా దెబ్బకొట్టేందుకు మా నేత చనిపోయాడని ప్రకటించారు. అతడు చనిపోయాడా బతికున్నాడా అనేది త్వరలోనే మీకు తెలుస్తుంది' అంటూ తాలిబన్ అధికార ప్రతినిథి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. పాకిస్థాన్‌లో చోటుచేసుకున్న గన్ ఫైట్‌లో అఖ్తర్ చనిపోయినట్లు అప్గనిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని నాడే తాలిబన్లు కొట్టిపారేశారు. -
‘మామ మంచు - అల్లుడు కంచు’ పాటల వేడుక
-
అంతరిక్షంలో ఆడియో రిలీజ్
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణమే కాదు, సినిమా ప్రమోషన్ కూడా తలకు మించిన భారంగా మారింది. అందుకే సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి రిలీజ్ డేట్ వరకు వీలైనన్ని కొత్త మార్గాల్లో సినిమాను ఆడియన్స్‌కు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇదే బాటలో సరికొత్త ఆలోచన చేశారు మళయాళ చిత్రం 'లార్డ్ లివింగ్‌స్టోన్ 7000 కాండీ' యూనిట్. గతంలో ఏ సినిమాకు చేయని విధంగా అంతరిక్షంలో ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేశారు. అయితే ఈ ఆడియో రిలీజ్లో యూనిట్ సభ్యులు ఎవరూ పాల్గొనే అవకాశం లేదు. వెదర్ బెలూన్ సాయంతో ట్రైలర్ లాంచింగ్ డివైజ్‌ను మాత్రం అంతరిక్షంలోకి పంపారు. దీంతో పాటు అక్కడి విశేషాలను భూమికి చేరవేసేలా గోప్రో కెమెరాను బెలూన్‌కి అమర్చారు. CUSAT విద్యార్ధుల సాయంతో ఈ ప్రయోగం చేసిన్నట్టుగా ప్రకటించారు. వెదర్ బెలూన్ను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టేందుకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు తీసుకున్న చిత్రయూనిట్ గురువారం ఉదయం వెదర్ బెలూన్ను స్పేస్‌లోకి పంపింది. దీంతో అంతరిక్షంలో ఆడియో రిలీజ్ జరుపుకుంటున్న తొలి చిత్రంగా 'లార్డ్ లివింగ్‌స్టోన్ 7000 కాండీ' చరిత్ర సృష్టించింది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే అడ్వంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిల్ రాధకృష్ణన్ మీనన్ దర్శకుడు. బాహుబలి మళయాళ డిస్ట్రిబ్యూటర్స్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ యునైటెడ్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
‘కంచె' ఆడియో విడుదల
-
ఈసీ చేతికి ఓటుకు కోట్లు ఆడియో, వీడియో
ప్రత్యేక కోర్టు నుంచి రికార్డులు తీసుకున్న ఈసీ సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో భాగంగా ఏసీబీ రికార్డు చేసిన ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ల నకలు కాపీలు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులకు అందాయి. తమకు ఈ ఆడియో, వీడియో రికార్డులను ఇవ్వాలని కోరుతూ ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి లక్ష్మీపతి ఈ మేరకు వారికి హార్డ్‌డిస్క్‌లు ఇచ్చేందుకు అనుమతించారు. కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు నిందితులుగా ఉండడంతోతోపాటు, పలువురు ప్రజాప్రతినిధులకు సంబంధాలున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను పరిశీలించాలని ఈసీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటు కోసం రూ.5 కోట్లు ఇస్తామంటూ రేవంత్‌రెడ్డి ప్రలోభపెట్టడం, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలు ఇవ్వడంతోపాటు ఇవన్నీ మా పార్టీ అధినేత ఆదేశాల మేరకే చేస్తున్నట్లు చెప్పడం తదితర అంశాలను ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే కోర్టు నుంచి తీసుకోగా...తాజా ఆడియో, వీడియో రికార్డులను కూడా తీసుకున్నారు. అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నిందితులుగా ఉన్న ఎమ్మెల్యేలు, సంబంధం ఉన్న ఇతర చట్టసభల ప్రతినిధులపై ఎన్నికల చట్టాల కింద ఎన్నికల సంఘం క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం
-
ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆడియో, వీడియో టేపులు తమకు ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం చేసిన విన్నపాన్ని ఏసీబీ కోర్టు అంగీకరించింది. ఎన్నికల సంఘానికి ఆడియో, వీడియో టేపులను అందజేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాన్ని వీడియోలో రికార్డు చేశారు. ఇదే కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడినపుడు రికార్డు చేసిన సంభాషణలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆడియో, వీడియో టేపులు తమకు ఇవ్వాలని గతంలో ఈసీ కోర్టులో పిటిషన్ వేసింది. -
మరో వివాదంలో ములాయం
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ములాయం తనను బెదిరిస్తున్నారని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆరోపిస్తున్నారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ములాయం తనను బెదిరిస్తున్నారని ఐజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులను ఆయన శనివారం విడుదల చేశారు. దీంతో ఎస్పీ సుప్రీం వివాదంలో ఇరుక్కున్నారు. మరోవైపు ఐపీఎస్ అధికారి ఆరోపణలను ఆపార్టీ సీనియర్ నాయకుడు డీసీ రాయ్ ఖండించారు. ములాయం లాంటి సీనియర్ నాయకులపై ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదని అన్నారు. ములాయం తన గత 30 ఏళ్ల రాజకీయ చర్రితలో ఎవరినీ బెదిరించిన దాఖలాలు లేవనీ, ఈ ఆరోపణలు అవాస్తవం కావచ్చని అన్నారు. -
శారీలో శ్రావ్యం..
తరాలు మారినా చీరకట్టుకు ఆదరణ తగ్గదని, చీరకట్టుతో వచ్చే అందం మరే వస్త్ర సౌందర్యంలో రాదని ‘కాయ్ రాజా కాయ్’ కథానాయిక శ్రావ్య అన్నారు. శుక్రవారం ఆమె బషీర్‌బాగ్‌లో అవంతి స్కిల్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె షోరూంలోని వస్త్ర అందాలను తిలకించారు. భారతీయ సంస్కృతిలో చీర కట్టుకు విడదీయరాని బంధమని, తాను ఎక్కువగా చీరలనే ఇష్టపడతానని పేర్కొన్నారు. అనంతరం అవంతి స్కిల్స్ నిర్వహకులు మహేష్ అవస్తి, మాట్లాడుతూ హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తి, హోల్ సెల్ రంగంలో 20 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఈ షోరూంను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన కళాంకారి, హ్యాండ్ పెయింటింగ్, బాతిక్, బనారస్, మహేశ్వరి వంటి రకాలు అందుబాటులో ఉంటాయన్నారు. -హిమాయత్‌నగర్ -
బహబలి ఆడియో రైట్స్ 3కోట్లు?
-
ఓ కాదల్ కన్మణి ఆడియో వచ్చేస్తోంది..
చెన్నై: ఎపుడెపుడా అని సంగీతాభిమానులు ఎదురు చూస్తున్న ఓకే కన్మణి అదేనండీ...ఓ కాదల్ కన్మణి తమిళ మూవీ ఆడియో ఏప్రిల్ 4న వస్తోంది. ఈ శనివారమే ఆడియోను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం, డబుల్ ఆస్కార్ విన్నర్ ఎఆర్ రెహమాన్ ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పాటలను ముందు బుధవారం రిలీజ్ చేయాలని అనుకున్నా అది వారాంతానికి వాయిదా పడింది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్, నిత్యమీనన్, జంటగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన సఖి మాదిరిగా రొమాంటిక్ లవ్‌స్టోరీతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. దాదాపు పది సంవత్సరాల తరువాత మంచి ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని టాక్. అంతేకాదు చాలా సంవత్సరాల తరువాత పీసీ శ్రీరాం, మణిరత్న కలసి పనిచేయడం మరో ప్రత్యేకత. రెండు ఆస్కార్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న రెహమాన్ స్వరపర్చిన పాటలకోసం జనం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఏప్రిల్ 24 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోను ఏకకాలంలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమాకు తెలుగులో 'ఓకే బంగారం' అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. -
అమెరికాలో ఉత్తమ విలన్ ఆడియో ఆవిష్కరణ
ఉత్తమ విలన్ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. విశ్వనాయకుడు కమలహాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఉత్తమ విలన్. ఈ చిత్రంతో పాటు కమల్ విశ్వరూపం-2, పాపనాశం చిత్రాల్లోనూ నటించారు. ఈ రెండు చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కాగా ఉత్తమ విలన్ చిత్రం మాత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకునే దశలో ఉంది. ఆండ్రియా, పూజాకుమార్, పార్వతీమీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ నటిస్తున్న మూడు చిత్రాలలో ఉత్తమ విలన్ ముందుగా తెరపైకి రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉత్తమ విలన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆ చిత్ర నిర్మాత తిరుపతి బ్రదర్స్ సంస్థ అధినేతలలో ఒకరైన సుభాష్ చంద్రబోస్‌ను అడగ్గా ఉత్తమవిలన్ చిత్ర ఆడియో ఆవిష్కరణను ఎక్కడ నిర్వహించాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం కమలహాసన్ ఈ చిత్ర సౌండ్ మిక్సింగ్ కార్యక్రమం కోసం అమెరికాలో ఉన్నారని తెలిపారు. ఆయన చెన్నై తిరిగి రాగానే చిత్ర ఆడియో ఆవిష్కరణను ఎక్కడ నిర్వహించాలన్న విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే చిత్ర ఆడియోను జనవరి రెండో వారంలోనూ చిత్రాన్ని ఫిబ్రవరిలోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. -
యోగా విత్ లైవ్ మ్యూజిక్
ఆడియో మోగుతుంటే ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయుడం మామూలే. సజీవ సంగీతం వింటూ యోగసాధన చేయుడం మాత్రం కచ్చితంగా ఒక కొత్త అనుభవం. ఇలాంటి అనుభవాన్ని నగర వాసులకు అందించేందుకు తొలిసారిగా ‘యోగా విత్ లైవ్ మ్యూజిక్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ యోగా శిక్షకురాలు మానసీ గులాటీ. హోటల్ మారియట్‌లో నవంబర్ 9న సాయుంత్రం 4.00 నుంచి 6.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. యోగాసనాలు కండరాలకు, కీళ్లకు వ్యాయామం కల్పిస్తే, సంగీతం మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని, సంగీతం వింటూ యోగసాధన చేస్తే, ఏకకాలంలో మనశ్శరీరాలు రిలాక్స్ అవుతాయని గులాటీ చెబుతున్నారు. అలాగే, దేశంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమంలో ‘ఫేస్ యోగా’ను పరిచయం చేయనున్నారు. ‘ఫేస్ యోగా’తో ముదిమిని దూరం చేయవచ్చని, ముఖసౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోవచ్చని చెబుతున్నారు. -
‘గాయకుడు’ ఆడియో ఆవిష్కరణ
-
‘దిక్కులు చూడకు రామయ్య’ ఆడియో
-
రాజమౌళిని ఒరే పొట్టోడా...
ప్రముఖ దర్శకుడు రాజమౌళిని పొట్టోడా అని పిలిచే గట్స్ ఎవరికైనా ఉన్నాయా?... అవును ఉన్నాయట... అయితే అది ఒకప్పుటి మాట. ఇప్పుడు మాత్రం మౌళి గారూ అంటూ గౌరవంగా పిలుస్తాడు. ఈ విషయాన్ని రాజమౌళే స్వయంగా 'దిక్కులు చూడకు రామయ్య' ఆడియో వేడుకలో చెప్పారు. ఆ చిత్ర దర్శకుడు త్రికోటి గురించి రాజమౌళి డిటైల్డ్‌గా వివరించారు. దర్శకుడు క్రాంతికుమార్ దగ్గర తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేవాడినని, అక్కడ కోటి తనకన్నాసీనియర్ అని చెప్పారు. కోటి సినిమా పిచ్చోడని... సాధారణంగా కాస్త ఎక్కువ సినిమాలు చూసేవాడినే సినిమా పిచ్చోడు అంటాం గానీ, కోటి లాంటి సినిమా పిచ్చోడిని తన జీవితంలో చూడలేదని చెప్పారు. చేతిలో డబ్బులున్నా లేకపోయినా... తినడానికి తిండి లేకున్నా కోటి సినిమా చూడాల్సిందే. పది రూపాయలు చేతిలో ఉంటే మనం ఆకలిగా ఉంటే ఏదైనా తింటామని, అయితే కోటి మాత్రం ఎంత దూరమైనా నడిచి వెళ్లి ప్రతిరోజూ సెకండ్ షో చూస్తాడన్నారు. హైదారాబాద్‌లో షూటింగ్ అయిపోయిన తర్వాత... అమీర్‌పేటలోని శేష్‌మహల్ థియేటర్లో పాత సినిమాలకు ఇద్దరం వెళ్లేవాళ్లమని చెప్పారు. సినిమా చూసి తిరిగి వస్తూ ఒరే పొట్టోడా ఆ సినిమాలో.... ఆ సీను... అనేవాడని... తాను హైట్‌గా ఉన్నా పొట్టోడా అని ఎందుకు పిలుస్తున్నారని అడిగితే... పొట్టోడా అంటే చిన్నోడురా... అని కోటి చెప్పారట. తనకు సీనియర్‌గా ఉన్నప్పుడు ఏరా, ఒరే, పొట్టోడా అని పిలిచినా, తన దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసేందుకు వస్తానన్నప్పుడు... ఏ మౌళీ... ఏ మౌళీ అని పిలిచేవాడని... సీన్ కట్ చేస్తే ఇప్పుడు సార్ అని పిలుస్తున్నాడని రాజమౌళి చెప్పాడు. కోటి సీనియర్, తాను జూనియర్ని అంటూ జక్కన్న తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పారు. త్రికోటికి ఐదుసార్లు దర్శకుడిగా చేసే అవకాశం వచ్చి చివరి నిమిషంలో చేజారిపోయినా నిరుత్సాహపడలేదని.... ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఉన్నాడని రాజమౌళి తెలిపారు. కోటి పెద్ద దర్శకుడు కావాలని, దిక్కులు చూడకు రామయ్యా చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. -
ఆడియో ఆవిష్కరణ వేడుకలో చేతి వాటం
బళ్లారి అర్బన్ : బళ్లారిలో శనివారం రాత్రి పునీత్ రాజ్‌కుమార్, త్రిష నటించిన పవర్ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకకు ప్రముఖ తెలుగు సినీ నటుడు మహేష్‌బాబు హాజరు కావడంతో మున్సిపల్ మైదానం జనసందోహంతో కిటకిటలాడింది. దీన్ని దొంగలు అదునుగా తీసుకుని రూ. 43వేల నగదు, 20 మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. స్థానిక కప్పగల్ రోడ్ బీచీ నగర్లో నివాసముండే ఆలూరు వీరాస్వామి (43) కర్నూలు జిల్లా చింతకుంట గ్రామ సొసైటీ బ్యాంక్ సెక్రెటరీగా పని చేస్తున్నాడు. అతడు విధులు ముగించుకుని ఓ జేబులో రూ.43 వేలు, మరో జేబులో రూ.10 వేల నగదు పెట్టుకుని సాయంత్రం ఆడియో ఫంక్షన్‌కు వచ్చాడు. ఆడియో ఆవిష్కరణలో స్టేజ్ మీదకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా దొంగలు బ్లేడ్‌తో జేబులు కట్‌చేసి ఓ జేబులోని రూ.43 వేలు చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడు గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ తోపులాటలో సుమారు 20కిపైగా మొబైల్ ఫోన్లు, రూ.43 వేల నగదు చోరీ గురైనట్లు చెప్పారు. బంగారం గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. -
అంగరంగ వైభవంగా ‘పవర్’ ఆడియో విడుదల
-
అంగరంగ వైభవంగా ‘పవర్’ ఆడియో విడుదల
సీడీని విడుదల చేసిన మహేష్‌బాబు సాక్షి, బళ్లారి : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, హీరోయిన్ త్రిష నటించిన ‘పవర్’ సినిమా ఆడియో విడుదల శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. బళ్లారిలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో కళ్లు జిగేల్మనేలా ఏర్పాట్లు చేశారు. ఆడియో సీడీని తెలుగు ప్రముఖ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు చేతుల మీదుగా విడుదల చేయించారు. తెలుగులో ప్రభంజనం సృష్టించిన దూకుడు సినిమా రీమేక్‌గా పవర్ పేరుతో కన్నడంలో తీశారు. దీంతో మహేష్‌బాబు చేతుల మీదుగా సీడీని విడుదల చేయించారు. కన్నడ స్టార్ పునీత్, తెలుగు సినీ స్టార్ మహేష్‌బాబు హాజరు కావడంతో మున్సిపల్ హైస్కూల్ మైదానం భారీ జనసందోహంతో కిక్కిరిసిపోయింది. ఆడియో రిలీజ్ అనంతరం పాటలు, డ్యాన్స్‌లతో మున్సిపల్ స్టేడియం హోరెత్తింది. అంతకు ముందు పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ బళ్లారిలో పవర్ సినిమా ఆడియో రిలీజ్ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బళ్లారి కళలకు పుట్టినిల్లు అని అప్పాజీ ఎప్పుడూ చెప్పేవారని గుర్తు చేశారు. ఈ చిత్రాన్ని తాము రెండు వారాల పాటు బళ్లారి పరిసరాలలోనే చిత్రీకరించామని, ప్రప్రథమంగా తాను నటించిన 14 రీల్స్ సినిమా ఇది అన్నారు. ఆడియో రిలీజ్‌ను బళ్లారిలో అందులోను తెలుగు సూపర్‌స్టార్ మహేష్‌బాబు చేతుల మీదగా విడుదల చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉందన్నారు. హీరో మహేష్‌బాబు మాట్లాడుతూ దూకుడు సినిమా రీమేక్‌ను పవర్‌స్టార్ పునీత్ ద్వారా కన్నడంలో తీయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగులో దూకుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినట్లుగానే కన్నడంలో కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి చిత్రం హీరోయిన్ త్రిష హాజరు కాలేదు. -
అందరికీ ఇష్టుడు ఆర్య
నటుడు ఆర్య అందరూ హీరోయిన్ల ఇష్టుడు. ఈ మాట అన్నది ఎవరో కాదు. సంచలన తార నయనతార. ఆర్య హీరోయిన్లను బిరియానితో మచ్చిక చేసుకుంటారంటారు. ప్రతి హీరోయిన్ ఆయన్ని ఇష్టపడుతుందంటారు. అనుష్క నుం చి నయనతార వరకు పలువురు హీరోయిన్లతో ఆర్యను కలుపుతూ పలు రకాల వదంతులు ప్రచారం అవుతుంటాయి. ఈ విషయంలో ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఇందుకు కారణం ఆర్యతో వాళ్లకున్న అనుబం దం కావచ్చు. నయనతార తాను కలిసి నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ విషయమై ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి కూడా. అలాంటిది నటుడు ఆర్య నిర్మించిన చిత్రం అమరకావ్యం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేయడం అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. అంతేకాదు ఇప్పటి ప్రియ నేస్తం ఒకప్పటి బద్ధశత్రువు అయిన నటి త్రిషతో కలిసి నయనతార ఈ వేడుకలో పాల్గొనడం పలువురిని విస్మయపరిచింది. ఆర్య తమ్ముడు సత్య హీరోగా మలయాళీ బ్యూటీ మియ హీరోయిన్గా నటించిన అమరకావ్యం చిత్రానికి నాన్ ఫేమ్ జీవా శంకర్ దర్శకత్వం వహించారు. యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం చెన్నై సత్యం థియేటర్లో వేడుకగా జరిగింది. సాధారణంగా చాలా ఆడియో ఆవి ష్కరణ కార్యక్రమాలు హీరోయిన్లు లేకుండానే జరుగుతుంటాయి. అలాంటిది ఈ అమరకావ్యం ఆడియో విడుదల వేదిక నయనతార, త్రిష, పూజ, లేఖా వాషింగ్టన్, రూపామంజరి చిత్ర హీరోయిన్ మియాలతో కలర్ఫుల్గా మారింది. ప్రత్యేకమైన రోజే ఈ శనివారాన్ని నిజంగా కోలీవుడ్‌లో ప్రత్యేకమైన రోజుగా పేర్కొనవచ్చు. నయనతారను, త్రిషను ఒకే వేదిక పైకి తీసుకొచ్చిన ఘనత ఆర్యకే దక్కుతుందని ఈ కార్యక్రమంలో పాలొ ్గన్న వక్తలు పేర్కొన్నారు. అందరూ హీరోయిన్లు ఆర్యను ఎంతగా ఇష్టపడతారో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి అర్థం అయ్యిందన్నారు. సత్యకు హీరోయిన్లు దొరకడం కష్టం ఆర్య తమ్ముడు సత్యకు మంచి నిర్మాత లభించవచ్చు. మంచి దర్శకుడు లభించవచ్చు. హీరోయిన్లు దొరకడం కష్టం అని నటుడు పార్తీబన్ వ్యాఖ్యానించారు. సత్య నటించిన ఈ అమరకావ్యం గురించి చెప్పగలం కానీ ఆర్య ప్రేమ కా వ్యం గురించి చెప్పడం అంత సులభం కాదన్నారు. ఆర్య కోసమే వచ్చాం అమరకావ్యం చిత్ర ఆడియోను దర్శకుడు బాలా ఆధ్వర్యంలో నయనతార ఆవిష్కరించగా తొలి ప్రతిని నటి త్రిష అందుకున్నారు. త్రిష మాట్లాడుతూ ఆర్య ఫోన్ చేసి అమరకావ్యం చిత్ర ఆడియోకు నయనతారతో పాటు పలువురు నటీనటులు వస్తున్నారు. మీరు రావాలని కోరారన్నారు. అప్పుడు నయతార వస్తున్నారా? అని ఆశ్చర్యంగా అడిగానన్నారు. ఆర్య తనకు మంచి ఫ్రెండ్ అని త్రిష పేర్కొన్నారు. నయనతార మాట్లాడుతూ ఆర్య అందరూ హీరోయిన్ల పైన ప్రేమాభిమానాలు కురిపిస్తారన్నారు. ఆర్య కోసమే తానీ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్లు అందరూ ఆర్యను ముద్దులతో, కౌగిలింతలతో ముంచెత్తడం విశేషం. -
'లడ్డుబాబు' ఆడియో వేడుక
-
బుడుగుల అడుగులకుమడుగులొత్తే గ్యాడ్జెట్స్!
పసిపిల్లలు ఏడుస్తారు.. ఎందుకో అర్థం కాదు. ఎక్కడికో పాకుతూ పోతారు.. ఎక్కడున్నారో ఎంతకూ దొరకరు. శరీరం వేడిగా అనిపిస్తుంది.. ఆరోగ్యం ఎలా ఉందో తెలియదు. ఇంకా అనేక సందేహాలు, సమస్యలు.. కానీ పిల్లలపై పర్యవేక్షణ కోసం అనేక గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాటితో ఎక్కడున్నా పిల్లలను చక్కగా పర్యవేక్షించొచ్చు... చిన్నారి రోజుకు ఎన్ని గంటలునిద్రపోయింది? చివరిగా ఎప్పుడు ఆహారం తీసుకుంది? అన్నదీ తెలుసుకోవచ్చు. లైవ్ మానిటర్ మోడ్‌లో ఉంటే... పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారు? గదిలో ఉష్ణోగ్రత ఎలా ఉందో గుర్తించవచ్చు. టైమ్‌లైన్ మోడ్‌లో పెడితే.. 24 గంటల సమాచారమూ అందుతుంది. చిన్నారుల పర్యవేక్షణకు ఆడియో, వీడియో మానిటరింగ్ డివైస్‌లతోపాటు జీపీఎస్ ట్రాకింగ్, లొకేటర్ ఫైండింగ్ సౌకర్యాలున్న పరికరాలు మార్కెట్లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి, పర్యవేక్షించడానికి అనేక మొబైల్ అప్లికేషన్లు కూడా వచ్చాయి. వీటితో మనం ఎక్కడ ఉన్నా.. పిల్లలను పర్యవేక్షించేందుకు వీలవుతుంది. పిల్లల పర్యవేక్షణకు ఉపయోగపడే అలాంటి కొన్ని గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం.. శ్వాసలో మార్పును పసిగడుతుంది! బుజ్జాయిల గుండె కొట్టుకునే వేగంతోపాటు శరీర ఉష్ణోగ్రత, శ్వాస, నిద్రపోతున్న తీరు, కదలికలను పర్యవేక్షించేందుకు ఉపయోగపడే బేబీ మానిటర్ కజీఝౌ ఓజీఝౌౌట. కిమోనో (జపాన్ భాషలో ప్రత్యేక సంప్రదాయ వస్త్రం)లో అమర్చిన తాబేలు ఆకారంలోని సెన్సర్ చిన్నారుల కదలికలను గుర్తించి ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ ఆప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం పంపుతుంది. కిమోనోపై పట్టీల్లో ఉండే అదనపు సెన్సర్లు చిన్నారుల శ్వాస, ఉష్ణోగ్రతల్లో తేడాలను పసిగట్టి సమాచారం అందిస్తాయి. చిన్నారి రోజుకు ఎన్ని గంటలు నిద్రపోయింది? చివరిగా ఎప్పుడు ఆహారం తీసుకుంది? అన్నదీ తెలుసుకోవచ్చు. లైవ్ మానిటర్ మోడ్‌లో ఉంటే.. పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారు? గదిలో ఉష్ణోగ్రత ఎలా ఉందో గుర్తించవచ్చు. టైమ్‌లైన్ మోడ్‌లో పెడితే.. 24 గంటల సమాచారమూ అందుతుంది. లిజన్ మోడ్‌తో పిల్లలు చేసే శబ్దాలను, పరిసరాల్లోని శబ్దాలనూ వినొచ్చు. పిల్లలు నిద్రపోయే స్థితికి చేరుకుంటే కూడా ఇది తెలియజేస్తుంది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 12 నెలల్లోపు చిన్నారులందరికీ సరిపోయేలా మూడు సైజుల్లో దొరుకుతుంది. ఒక కిట్ ధర రూ. 12 వేలు. కిట్‌లో మూడు మైమో కిమోనోస్, ఒక బేస్ స్టేషన్, ఒక టర్టిల్ ఉంటాయి. ఈ ఫిబ్రవరిలో మార్కెట్లోకి విడుదల కానుంది. కావాలంటే.. http://mimobaby.com/లో ప్రయత్నించొచ్చు. డైపర్ మార్చాలని చెబుతుంది చిన్నారులు ఆనందంగా ఆడుకుంటున్నప్పుడు వారినలా వదిలేసి పనులు చేసుకుంటుంటాం. ఆ సమయంలో వారు పక్క తడిపినా.. ఎంతోసేపటికి గానీ గుర్తించలేం. అలాగే బయటికి వెళ్లినప్పుడు కూడా చిన్నారులు ‘తడిపిన’ సంగతి వెంటనే తెలియకపోతే కొంచెం ఇబ్బందే. అయితే Huggies TweetPee ఉంటే ఆ బెంగ అక్కర్లేదు. పిల్లలు ఇలా తడిపేయగానే అలా మెస్సేజ్ వచ్చేస్తుంది. వెంటనే డైపర్ మార్చేయొచ్చు. ఇందులో ఉండే ట్విట్టర్ బర్డ్ ఆకారంలోని సెన్సర్ తేమ తగలగానే గుర్తిస్తుంది. వెంటనే స్మార్ట్‌ఫోన్‌కు మెస్సేజ్ పంపుతుంది. అప్పటిదాకా ఎన్ని డైపర్లు మార్చారో కూడా ఇది చెబుతుంది. ఇది త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏడుపును అనువదిస్తుంది! పసివాళ్లు ఏడుస్తుంటే ఒక పక్క బాధగా ఉంటుంది. మరోపక్క వారు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక, ఏం చేయాలో తెలీక చిరాకూ వచ్చేస్తుంటుంది. అయితే పిల్లల ఏడుపును అనువదించి చెప్పే Cry Translator ఉంటే చిన్నారుల ఏడుపును ఇట్టే తెలుసుకోవచ్చు. ఒక చిన్న పరికరాన్ని పిల్లల దగ్గర ఉంచేస్తే చాలు.. దానిలోని మైక్రోఫోన్ ఏడుపును గ్రహిస్తుంది. ఓ బటన్‌ను నొక్కితే చాలు.. జస్ట్ మూడు సెకన్లలోనే పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో Cry Translator App ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు తెలియజేస్తుంది. ఈ పరికరం ద్వారా శబ్దాలు, లాలిపాటలు కూడా వినిపించి చిన్నారిని ఏడుపు మానిపించొచ్చు. పిల్లలకు ఆకలేస్తోందా? నిద్ర వస్తోందా? చికాకుగా లేదా బోర్‌గా ఫీలవుతున్నారా? వంటివీ తెలియజేస్తుంది. ధర రూ.5 వేలు. http://www.crytranslator.com/ లో ప్రయత్నించొచ్చు. క్రై ట్రాన్స్‌లేటర్ ఆప్‌ను మాత్రం రూ.3,00 చెల్లించి ఐట్యూన్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల ఏడుపును చాలావరకూ కచ్చితత్వంతో విశ్లేషించే 'W-hy Cry Baby Cry Analyzer' అనే మరో డివైస్‌ను కూడా http://www. mumznbabyz.com/ లో కొనుక్కోవచ్చు. ధర రూ.2,500. డే అండ్ నైట్ వీడియో మానిటర్ పిల్లలను 24 గంటలూ ఆడియో, వీడియో ద్వారా పర్యవేక్షించేందుకు ఉపయోగపడే డివైస్‌లు అనేకం ఉన్నాయి. వాటిలో Infant Optics DXR-5 2.4 GHz Digital Video Baby Monitor ఒకటి. 2.4 టీఎఫ్టీ స్క్రీన్, సమర్థమైన మైక్రోఫోన్ ఉన్న డే అండ్ నైట్ బేబీ వీడియో మానిటర్ ఇది. ఇళ్లలో 150 అడుగుల వరకూ, బహిరంగ ప్రదేశాల్లో 800 అడుగుల వరకూ పనిచేస్తుంది. ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ హోపింగ్ సిస్టమ్(ఎఫ్హెచ్ఎస్ఎస్) సాయంతో ఫ్రీక్వెన్సీని మార్చుకోగలదు. ఆటోమేటిక్‌గా నైట్ విజన్లోకి మారగలదు. ఆటోమేటిక్ పవర్సేవింగ్ మోడ్, వాయిస్ యాక్టివేషన్ చేసుకోగలదు. సెకనుకు 30 ఫ్రేములతో వీడియో తీస్తుంది. మూడు నిమిషాల వరకూ ఎలాంటి శబ్దాలూ రాకపోతే మానిటర్ యూనిట్ దానంతట అదే షట్‌డౌన్ అయిపోతుంది. మళ్లీ చిన్నపాటి అలికిడి అయినా వెంటనే యాక్టివేట్ అవుతుంది. ధర రూ.6,100. కావాలంటే http://www.amazon.com/ లోకి వెళ్లండి. దూరం వె ళ్లిపోతే హెచ్చరిస్తుంది! ఏదో పనిలో పడి బిజీగా ఉన్నప్పుడు పిల్లలు నెమ్మదిగా బయటికి పోతే..? ఏదైనా ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలు కొంత దూరం దాటి ముందుకు పోతే వెంటనే హెచ్చరించేందుకు ఉపయోగపడే చైల్డ్ ట్రాకింగ్ డివైస్‌లు కూడా అనేకం ఉన్నాయి. Guardian-Angel Tracker డివైస్ అలాంటిదే. పిల్లలకే కాకుండా.. పెంపుడు జంతువులు, సెల్ఫోన్లు, కారు తాళాలు, ఇతర విలువైన వస్తువులను కూడా ఈ డివైస్‌కు అనుసంధానించుకోవచ్చు. సెల్ఫోన్ల వంటివి దొంగతనం చేసినా కూడా గుర్తించొచ్చన్నమాట. 2.4 గిగాహెర్జ్ ఆర్ఎఫ్ టెక్నాలజీతో ఇండోర్‌లో, ఔట్‌డోర్‌లో కూడా పనిచేస్తుంది. ప్యాకేజీలో రెండు ట్యాగ్స్ ఉంటాయి. బేస్ స్టేషన్‌తో ఒకేసారి నాలుగు వస్తువులను ట్యాగ్ చేసుకోవచ్చు. ఎంత దూరం వెళితే అలారం లేదా వైబ్రేషన్‌తో హెచ్చరించాలన్నది ముందుగానే సెట్ చేసుకోవచ్చు. అత్యధికంగా 1,600 అడుగుల పరిధి వరకూ పనిచేస్తుంది. ధర రూ.3,700. కావాలంటే http://www. amazon.com/ లింకులో ప్రయత్నించొచ్చు. - హన్మిరెడ్డి యెద్దుల నోకియా నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లు?! ఇప్పటి వరకూ నోకియాస్మార్ట్ఫోన్లు అంటే అవి కేవలం విండోస్ ఓఎస్‌తో పనిచేసేవే. ఒకవైపు ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లు అదిరేటి ఫీచర్లతో యూజర్ల మదిని దోచుకొంటుంటే.. నోకియా మాత్రం విండోస్ ఓఎస్‌తో మాత్రమే ఫోన్లను తయారు చేస్తూ తన అభిమానులను నిరాశ పరుస్తూ వస్తోంది. నోకియా నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ వస్తే బాగుండు అని అనేక మంది కోరుకొంటున్నారు. మరి ఇలాంటి వారికి ఒక శుభవార్త. నోకియా త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లను విడుదల చేస్తుందని వార్తలు వస్తున్నాయి. వీటి గురించి నోకియా అధికారికంగా ధ్రువీకరణ లేదు కానీ పుకార్లైతే పుంజుకొన్నాయి. ‘నార్మాండీ’ పేరుతో నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ విడుదల చేస్తోందని అంటున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వెర్షన్‌పై వస్తుందని అంటున్నారు. మరి ఇది కార్యరూపం దాలిస్తే నోకియా, ఆండ్రాయిడ్ల ఫ్యాన్స్‌కు అంతకన్నా స్వీట్ న్యూస్ లేదు! అపరిచితుల నుంచి కూడా జీమెయిల్ వస్తుంది! గూగుల్ తన వినియోగదారులకు కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఇక నుంచి అపరిచితులకు కూడా మెయిల్స్ పంపవచ్చు, వారి నుంచి మీకు మెయిల్స్ రావొచ్చు! మామూలుగా మీ జీమెయిల్ ఐడీ తెలిసిన వారే మీకు మెయిల్స్ పంపగలరు. కానీ ఇకపై సోషల్నెట్వర్కింగ్ సైట్లలో మీకు ఫ్రెండ్స్‌గా ఉన్నవారు కూడా మెయిల్ అడ్రస్‌తో పనిలేకుండా మెయిల్ పంపడానికి అవకాశం ఉంటుందట. అంటే సోషల్నెట్వర్కింగ్ సైట్లలో కొన్నిసార్లు అపరిచితులతో కూడా స్నేహాలు చేస్తుండవచ్చు. జీమెయిల్ తీసుకొచ్చిన ఈ కొత్తఫీచర్ ద్వారా అలాంటి అపరిచితులు కూడా మీ జీ మెయిల్లోకి చొరబడటానికి వీలుంటుంది. ఈ ఫీచర్ వల్ల కమ్యూనికేషన్ మరింత సులభతరం అవుతుందని గూగుల్ అంటున్నప్పటికీ, దీనివల్ల జీమెయిల్లో కూడా ప్రైవసీ కోల్పోయే అవకాశాలు ఎక్కువవుతాయని చెప్పవచ్చు. ప్రధానంగా గూగుల్ ప్లస్ లో మీకు ఫ్రెండ్స్‌గా యాడ్అయిన వారు జీమెయిల్‌కు మెయిల్స్ పంపడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉండే లాభాలు, నష్టాల గురించి ఎవరికి వారు బేరీజు వేసుకోవాల్సిందే! ఇల్లు మరింత ‘స్మార్ట్’ అవుతుంది! ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరేటప్పుడు జస్ట్ స్మార్ట్‌ఫోన్‌లో ఓ ఆప్‌ను తెరిచి సెట్టింగ్స్ ఓకే చేస్తే చాలు.. ఇంటికెళ్లే సరికి అన్నం, కూరలు రెడీ! బియ్యం, కూరగాయలు, ఇతర పదార్థాలను ముందుగా సిద్ధం చేసి ఉంచితే సరిపోతుంది. ఫిలిప్స్ కంపెనీ రూపొందిస్తున్న ‘హోమ్కుకర్ నెక్ట్స్’తో ఇది సాధ్యం కానుంది. దీని ప్రాథమిక నమూనాను గత ఏడాదే బెర్లిన్ ‘ఐఎఫ్ఏ షో’లో ిఫిలిప్స్ ప్రదర్శించింది. అలాగే ఇంట్లో గాలిని శుభ్రం చేసే ిఫిలిప్స్ ఎయిర్-కాన్, బేబీ మానిటర్, కాఫీ మెషీన్, ఇంట్లో మనం ఉన్నప్పుడు, లేనప్పుడు ఉష్ణోగ్రతను నియంత్రించే ‘నెస్ట్’ థర్మోస్టాట్ వంటి పరికరాలూ ఆప్స్ సాయంతో ఇల్లును టెక్మయంగా మార్చనున్నాయి. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లే కాకుండా.. లాకిట్రాన్ వంటి ఆటోమేటిక్ డోర్‌లాక్‌లు, ఫ్రిజ్‌లు, ఇతర గృహోపకరణాలు, బైకులు, కార్ల వంటి వాహనాలు కూడా 2014లో మరింతగా నెట్వర్క్మయం అయిపోనున్నాయి. -
జెండాపై కపిరాజు ఆడియో హైలెట్స్
-
ఆడియో ఫంక్షన్లో హల్ చల్ చేసిన మహేష్
-
ఫుల్ ఎనర్జీతో...
వైవీఎస్ చౌదరి ‘రేయ్’ సినిమా తుది అంకానికి చేరుకుంది. పాటల వేడుకను భారీ ఎత్తున చేయడానికి చౌదరి ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ చిత్రం ద్వారా చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని సాయిధరమ్‌తేజ్ పాత్రను ఫుల్ ఎనర్జీతో చౌదరి తీర్చిదిద్దారు. ముఖ్యంగా పాటల విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చౌదరి పాటలు బాగా తీస్తారని, ఆయనకు మంచి మ్యూజిక్ సెన్స్ ఉందని ప్రతీతి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మ్యూజిక్ ఉంటుందంటున్నారు చౌదరి. ఆయన మరిన్ని వివరాలు చెబుతూ- ‘‘నా తొలి సినిమా ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ’ నుంచి ఇప్పటివరకూ నా సినిమాల్లో పాటలకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘రేయ్’ పాటలు కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటాయి. ఆడియో హక్కుల్ని ఓ పెద్ద కంపెనీ తీసుకోనుంది. డిసెంబర్ మొదటివారంలో పాటల వేడుకను విభిన్నంగా చేయబోతున్నాం. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఈ వేడుకలో పాల్గొంటారు’’ అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ‘రేయ్’ సంక్రాంతికి విడుదల కానుంది. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సాహిత్యం: చంద్రబోస్. -
సినిమాల్లో మాజీ కెప్టెన్