అమెరికాలో ఉత్తమ విలన్ ఆడియో ఆవిష్కరణ | Is audio launch of Uthama Villain to take place in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఉత్తమ విలన్ ఆడియో ఆవిష్కరణ

Published Fri, Dec 26 2014 2:25 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాలో ఉత్తమ విలన్ ఆడియో ఆవిష్కరణ - Sakshi

అమెరికాలో ఉత్తమ విలన్ ఆడియో ఆవిష్కరణ

 ఉత్తమ విలన్ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. విశ్వనాయకుడు కమలహాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఉత్తమ విలన్. ఈ చిత్రంతో పాటు కమల్ విశ్వరూపం-2, పాపనాశం చిత్రాల్లోనూ నటించారు. ఈ రెండు చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కాగా ఉత్తమ విలన్ చిత్రం మాత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకునే దశలో ఉంది. ఆండ్రియా, పూజాకుమార్, పార్వతీమీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ నటిస్తున్న మూడు చిత్రాలలో ఉత్తమ విలన్ ముందుగా తెరపైకి రానున్నట్లు సమాచారం.
 
 ఇదిలా ఉండగా ఉత్తమ విలన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆ చిత్ర నిర్మాత తిరుపతి బ్రదర్స్ సంస్థ అధినేతలలో ఒకరైన సుభాష్ చంద్రబోస్‌ను అడగ్గా ఉత్తమవిలన్ చిత్ర ఆడియో ఆవిష్కరణను ఎక్కడ నిర్వహించాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం కమలహాసన్ ఈ చిత్ర సౌండ్ మిక్సింగ్ కార్యక్రమం కోసం అమెరికాలో ఉన్నారని తెలిపారు. ఆయన చెన్నై తిరిగి రాగానే చిత్ర ఆడియో ఆవిష్కరణను ఎక్కడ నిర్వహించాలన్న విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే చిత్ర ఆడియోను జనవరి రెండో వారంలోనూ చిత్రాన్ని ఫిబ్రవరిలోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement