కాలిఫోర్నియా: ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో క్లబ్ హౌజ్ యాప్ సృస్టిస్తున్న సంచలనంతో ఫేస్‌బుక్ మేల్కొంది. ఆలస్యం చేస్తే ఆపద తప్పదని గ్రహించింది. దీంతో క్లబ్‌హౌజ్‌కి పోటీగా ఆడియో రూమ్స్ పేరుతో మాటలు, ముచ్చట్లు, లెక్చర్లు ప్రధానంగా మరో ఫీచర్ అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ ఆడియో రూమ్‌కి నేరుగా వచ్చారు.
మాటల ముచ్చట్లు
ఫోటోలు, వీడియోలు, రైటింగ్ కంటెంట్‌తో ఇప్పటి వరకు అలరిస్తూ వస్తోన్న ఫేస్‌బుక్ మరో అడుగు ముందుకు వేయనుంది. ఫేస్‌బుక్ వేదికగా ముచ్చట్టు పెట్టుకునేందుకు వీలుగా త్వరలో ఆడియోరూమ్స్ ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది. ఆడియోరూమ్స్ పనితీరు పరిశీలించేందుకు స్వయంగా మార్క్‌జుకర్‌బర్గ్ ఈ రోజు ఇతర టెక్నోక్రాట్స్‌తో ముచ్చట్లు పెట్టారు.
ఆడియో రూమ్స్
టెక్నాలజీ వరల్డ్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ఆడియో ఆథారిత పోడ్‌కాస్ట్‌కి మంచి ఫ్యూచర్ ఉందని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. మరోవైపు వర్చువల్ ముచ్చట్లే లక్ష్యంగా వచ్చిన క్లబ్‌హౌజ్ అప్లికేషన్ మార్కెట్‌లో దూసుకుపోతుంది. దీంతొ క్లబ్‌హౌజ్ లాంటి ఫీచర్‌ని ఫేస్‌బుక్ యూజర్లు అందించే లక్ష్యంతో ఆడియో రూమ్స్ సర్వీస్‌ని త్వరలో అందుబాటులోకి తేనుంది ఫేస్‌బుక్. ఇప్పటికే ఈ ఫీచర్‌కి సంబంధించి పలు టెస్టింగ్స్‌ని తైవాన్‌లో విజయవంతంగా నిర్వహించారు.
నేరుగా వచ్చిన మార్క్
ఫేస్‌బుక్ ఆడియో రూమ్స్ లాంఛింగ్‌కి ముందు ముచ్చట్లు పెట్టందుకు నేరుగా మార్క్ జూకర్‌బర్గ్ లైన్లోకి వచ్చారు. ఫేస్‌బుక్ రియాల్టీ ల్యాబ్స్ హెడ్ బెజ్ బోస్‌వర్త్‌తో పాటు పలువురు ఈ ఆడియో రూమ్ ముచ్చట్లలో పాల్గొన్నారు. ఆనాటి సంగతులు మాట్లాడుకున్నారు.
చదవండి : FaceBook : జుకర్‌బర్గ్‌కి ఎసరు పెట్టిన ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment