![Whatsapp New Update: Share Voice Notes Come New Feature Report - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/14/Untitled-4_0.jpg.webp?itok=7wAwuPnZ)
ప్రస్తుత రోజుల్లో చాటింగ్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు వాట్సప్. యువతను అంతలా ఆకట్టుకుంది. అందుకే వాట్సప్ యాజమాన్యం కూడా మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు ఇందులో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకర్షించేలా అప్‌డేట్స్‌ని ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలోనే వాయిస్ మెసేజ్ ఎడిట్, మీడియా ఫైల్ ఎడిటింగ్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్ వంటివాటిని తీసుకొచ్చింది. తాజాగా వాట్సప్ స్టేటస్ అప్‌డేట్‌లో మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది.
వావ్ అనేలా కొత్త అప్‌డేట్
వాట్సప్ స్టేటస్‌లో ఇప్పటివరకు వీడియోలు, ఫోటోలు లేదా మనకి నచ్చని టెక్ట్స్.. వీటి వరకు స్టేటస్‌గా పెట్టుకుంటున్నాం. అయితే వాట్సప్ డెవలప్‌మెంటీ టీం ఈ ఆప్షన్‌కి అదనపు ఫీచర్‌ను జత చేయనున్నారు. త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ ఫీచరుతో తాము స్వయంగా రికార్డు చేసిన ఆడియో క్లిప్స్, ఏదైనా వాయిస్ నోట్స్‌ను కూడా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం వాట్సప్‌లో స్టేటస్ బార్‌ని క్లిక్ చేస్తే కెమెరా, టెక్స్ట్ ఫీచర్లు కనిపిస్తాయి. అయితే త్వరలో ఈ ఆప్షన్లకి అదనంగా ఆడియో స్టేటస్ పెట్టుకునేందుకు వీలుగా మైక్ సింబల్ రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. ఈ మేరకు వాట్సప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.
చదవండి: డోలో-650 తయారీ సంస్థ అక్రమాలు.. బయటపడ్డ సంచలన విషయాలు!
Comments
Please login to add a commentAdd a comment