సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. వివాహితను హత్య చేసిన అత్త, మామ, భర్త ఆత్మహత్యగా చిత్రీకరించారు. అత్త,మామ, భర్త, వేధింపులు భరించలేక మృతురాలు పద్మిని.. బంధువులకు ఆడియో రికార్డ్ చేసి పంపించింది. నోటిలో పురుగులు మందు బలవంతంగా పోసి భార్యను భర్త సోమేశ్వరరావు హత్య చేశాడు. ఈ నెల ఒకటో తేదీన ఘటన చోటు చేసుకోగా, కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. భర్త, అత్త మామలను గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు.
వరకట్నపు వేధిపులు కేసు ఆడియో ‘సాక్షి’కి చిక్కింది. మృతురాలు పద్మిని తన మావయ్యకి ఆడియో పంపింది. పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకొని రావాలని భర్త వేధింపులకు గురిచేశాడు. పురుగులు మందు నీటిలో పోసి.. భర్త సోమేశ్వరరావు చేతిని అడ్డు పెట్టాడు. 25 సార్లు వాంతులు చేసుకున్న పద్మిని ఆడియో కన్నీరు తెప్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment