హైదరాబాద్: నాని హీరోనా... విలనా...? అంటూ ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానున్న నేచురల్ స్టార్ నాని జెంటిల్ మన్ చిత్రం పాటలు త్వరలో విడుదల కానున్నాయి. మే 22న ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అయితే ఈ జెంటిల్‌మన్ పాత్ర ఎలా ఉంటుందనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెల 12న టీజర్‌ను, 22న పాటలను విడుదల చేయనున్నాం. అందమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం' అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ డేవిడ్ నాథన్ అందించగా సంగీతం: మణిశర్మ, కెమెరా మ్యాన్ గా పీజీ విందా పనిచేశారు.
22న నాని కొత్త సినిమా పాటలు
Published Mon, May 9 2016 11:58 AM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM
Advertisement
Advertisement