ఆడియో ఆవిష్కరణ వేడుకలో చేతి వాటం | Handed launch Audio ceremony | Sakshi
Sakshi News home page

ఆడియో ఆవిష్కరణ వేడుకలో చేతి వాటం

Published Mon, Jun 30 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

ఆడియో ఆవిష్కరణ వేడుకలో చేతి వాటం

ఆడియో ఆవిష్కరణ వేడుకలో చేతి వాటం

బళ్లారి అర్బన్ : బళ్లారిలో  శనివారం రాత్రి  పునీత్ రాజ్‌కుమార్, త్రిష నటించిన పవర్ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకకు ప్రముఖ తెలుగు సినీ నటుడు మహేష్‌బాబు హాజరు కావడంతో మున్సిపల్ మైదానం జనసందోహంతో కిటకిటలాడింది. దీన్ని దొంగలు అదునుగా తీసుకుని రూ. 43వేల నగదు, 20 మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. స్థానిక కప్పగల్ రోడ్ బీచీ నగర్‌లో నివాసముండే ఆలూరు వీరాస్వామి (43) కర్నూలు జిల్లా చింతకుంట గ్రామ సొసైటీ బ్యాంక్ సెక్రెటరీగా పని చేస్తున్నాడు.

అతడు విధులు ముగించుకుని ఓ జేబులో రూ.43 వేలు, మరో జేబులో రూ.10 వేల నగదు పెట్టుకుని సాయంత్రం ఆడియో ఫంక్షన్‌కు వచ్చాడు. ఆడియో ఆవిష్కరణలో స్టేజ్ మీదకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా దొంగలు బ్లేడ్‌తో జేబులు కట్‌చేసి ఓ జేబులోని రూ.43 వేలు చోరీ చేశారు.

ఈ ఘటనపై బాధితుడు గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ తోపులాటలో సుమారు 20కిపైగా మొబైల్ ఫోన్లు,   రూ.43 వేల నగదు చోరీ గురైనట్లు చెప్పారు. బంగారం గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement