![Trivikram Approached Trisha For Movie With Mahesh Babu - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/26/trisha.jpg.webp?itok=liUGqRiP)
‘అతడు’(2005), ‘సైనికుడు’ (2006) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, హీరోయిన్ త్రిష మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే హాట్ టాపిక్ ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్రకు ఇప్పటివరకు పూజాహెగ్డే, జాన్వీ కపూర్, నివేదా థామస్, కియారా అద్వానీ పేర్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ త్రిష పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుందని, వీరిలో త్రిష ఓ హీరోయిన్‌గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది.
శాండల్‌వుడ్‌లోనూ...
కన్నడ పరిశ్రమలో త్రిష హీరోయిన్‌గా చేసిన ఏకైక సినిమా ‘పవర్’ (2014). ఇందులో పునీత్ రాజ్‌కుమార్ హీరో. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత పునీత్, త్రిషలు వెండితెరపై మళ్లీ జంటగా కనిపించనున్నారని తెలిసింది. హిట్ ఫిల్మ్ ‘యు టర్న్’ ఫేమ్ పవన్‌కుమార్ దర్శకత్వంలో పునీత్ హీరోగా ‘దిత్వ’ అనే చిత్రం రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో ఆరంభించాలనుకుంటున్నారు. ఇందులోని హీరోయిన్ పాత్రకు త్రిషను సంప్రదించగా ఆమె ఓకే అన్నారని శాండిల్‌వుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment