నేడు ఆకలిపోరాటం ఆడియో విడుదల
నేడు ఆకలిపోరాటం ఆడియో విడుదల
Published Sat, Jun 24 2017 11:15 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
రాజమహేంద్రవరం కల్చరల్: రామ్‌సాయి గోకులం బ్యానర్‌పై నిర్మించిన ‘ఆకలిపోరాటం’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జరుగుతుందని చిత్ర రచయిత, దర్శకుడు ఆనందసాగర్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో ఆ విశేషాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నానికి చెందిన స్వప్న యాంకర్‌గా వ్యవహరిస్తారన్నారు. మెయిన్ హీరో ‘సాక్షి విలేకరి’ గంగాధర్ కాగా మరో ముగ్గురు సహాయ హీరోలుగా నటించారన్నారు. చిత్రం షూటింగ్ మూడువంతులు ఉభయ గోదావరి జిల్లాలలోను, మిగిలిన భాగం హైదరాబాద్‌లో చేశామన్నారు. ఇంజినీరింగ్ చదివిన యువకులు ఉద్యోగాన్వేషణలో ఎదుర్కొనే సమస్యలు హాస్యాత్మకంగా తీశామన్నారు. జూలై 10–20 తేదీల మధ్యలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. హీరో గంగాధధర్ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ఆశీస్సులను కోరుకుంటున్నానన్నారు. నిర్మాత రాఘవులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement