అమరం.. అఖిలం.. సీతారాముల ప్రియనామం | Ram Siya Ram audio teaser from Adipurush | Sakshi
Sakshi News home page

అమరం.. అఖిలం.. సీతారాముల ప్రియనామం

Published Sun, Apr 30 2023 3:55 AM | Last Updated on Sun, Apr 30 2023 3:55 AM

Ram Siya Ram audio teaser from Adipurush - Sakshi

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ డైరెక్షన్‌లో రూపొందిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్‌’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. శనివారం ‘సీతా నవమి’ సందర్భంగా ఈ చిత్రంలోని ‘రామ్‌ సియా రామ్‌’ ఆడియో టీజర్‌ను విడుదల చేశారు.

ఈ గీతాన్ని సచేత్‌ పరంపర స్వరపరిచారు. కాగా ఈ పాటలోని కృతీ సనన్‌ లుక్‌ని విడుదల చేశారు. ‘‘అమరం, అఖిలం, ఈ నామం.. సీతారాముల ప్రియ నామం’ అంటూ చిత్రదర్శకుడు ఓం రౌత్‌ ఈ పాటను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. భూషణ్‌కుమార్, క్రిషణ్‌కుమార్, ప్రసాద్‌ సుతార్, ఓం రౌత్, రాజేష్‌ నాయర్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 16న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement