ఓటుకు కోట్లు కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆడియో, వీడియో టేపులు తమకు ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం చేసిన విన్నపాన్ని ఏసీబీ కోర్టు అంగీకరించింది. ఎన్నికల సంఘానికి ఆడియో, వీడియో టేపులను అందజేసింది.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాన్ని వీడియోలో రికార్డు చేశారు. ఇదే కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడినపుడు రికార్డు చేసిన సంభాషణలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆడియో, వీడియో టేపులు తమకు ఇవ్వాలని గతంలో ఈసీ కోర్టులో పిటిషన్ వేసింది.