అందరికీ ఇష్టుడు ఆర్య | అందరికీ ఇష్టుడు ఆర్య | Sakshi
Sakshi News home page

అందరికీ ఇష్టుడు ఆర్య

Published Sun, Jun 29 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

అందరికీ ఇష్టుడు ఆర్య

అందరికీ ఇష్టుడు ఆర్య

 నటుడు ఆర్య అందరూ హీరోయిన్ల ఇష్టుడు. ఈ మాట అన్నది ఎవరో కాదు. సంచలన తార నయనతార. ఆర్య హీరోయిన్లను బిరియానితో మచ్చిక చేసుకుంటారంటారు. ప్రతి హీరోయిన్ ఆయన్ని ఇష్టపడుతుందంటారు. అనుష్క నుం చి నయనతార వరకు పలువురు హీరోయిన్లతో ఆర్యను కలుపుతూ పలు రకాల వదంతులు ప్రచారం అవుతుంటాయి. ఈ విషయంలో ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఇందుకు కారణం ఆర్యతో వాళ్లకున్న అనుబం దం కావచ్చు.
 
 నయనతార తాను కలిసి నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ విషయమై ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి కూడా. అలాంటిది నటుడు ఆర్య నిర్మించిన చిత్రం అమరకావ్యం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేయడం అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. అంతేకాదు ఇప్పటి ప్రియ నేస్తం ఒకప్పటి బద్ధశత్రువు అయిన నటి త్రిషతో కలిసి నయనతార ఈ వేడుకలో పాల్గొనడం పలువురిని విస్మయపరిచింది. ఆర్య తమ్ముడు సత్య హీరోగా మలయాళీ బ్యూటీ మియ హీరోయిన్‌గా నటించిన అమరకావ్యం చిత్రానికి నాన్ ఫేమ్ జీవా శంకర్ దర్శకత్వం వహించారు.
 
 యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం చెన్నై సత్యం థియేటర్‌లో వేడుకగా జరిగింది. సాధారణంగా చాలా ఆడియో ఆవి ష్కరణ కార్యక్రమాలు హీరోయిన్లు లేకుండానే జరుగుతుంటాయి. అలాంటిది ఈ అమరకావ్యం ఆడియో విడుదల వేదిక నయనతార, త్రిష, పూజ, లేఖా వాషింగ్‌టన్, రూపామంజరి చిత్ర హీరోయిన్ మియాలతో కలర్‌ఫుల్‌గా మారింది.
 
 ప్రత్యేకమైన రోజే
 ఈ శనివారాన్ని నిజంగా కోలీవుడ్‌లో ప్రత్యేకమైన రోజుగా పేర్కొనవచ్చు. నయనతారను, త్రిషను ఒకే వేదిక పైకి తీసుకొచ్చిన ఘనత ఆర్యకే దక్కుతుందని ఈ కార్యక్రమంలో పాలొ ్గన్న వక్తలు పేర్కొన్నారు. అందరూ హీరోయిన్లు ఆర్యను ఎంతగా ఇష్టపడతారో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి అర్థం అయ్యిందన్నారు.
 
 సత్యకు హీరోయిన్లు దొరకడం కష్టం
 ఆర్య తమ్ముడు సత్యకు మంచి నిర్మాత లభించవచ్చు. మంచి దర్శకుడు లభించవచ్చు. హీరోయిన్లు దొరకడం కష్టం అని నటుడు పార్తీబన్ వ్యాఖ్యానించారు. సత్య నటించిన ఈ అమరకావ్యం గురించి చెప్పగలం కానీ ఆర్య ప్రేమ కా వ్యం గురించి చెప్పడం అంత సులభం కాదన్నారు.
 
 ఆర్య కోసమే వచ్చాం
 అమరకావ్యం చిత్ర ఆడియోను దర్శకుడు బాలా ఆధ్వర్యంలో నయనతార ఆవిష్కరించగా తొలి ప్రతిని నటి త్రిష అందుకున్నారు. త్రిష మాట్లాడుతూ ఆర్య ఫోన్ చేసి అమరకావ్యం చిత్ర ఆడియోకు నయనతారతో పాటు పలువురు నటీనటులు వస్తున్నారు. మీరు రావాలని కోరారన్నారు. అప్పుడు నయతార వస్తున్నారా? అని ఆశ్చర్యంగా అడిగానన్నారు. ఆర్య తనకు మంచి ఫ్రెండ్ అని త్రిష పేర్కొన్నారు. నయనతార మాట్లాడుతూ ఆర్య అందరూ హీరోయిన్ల పైన ప్రేమాభిమానాలు కురిపిస్తారన్నారు. ఆర్య కోసమే తానీ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్లు అందరూ ఆర్యను ముద్దులతో, కౌగిలింతలతో ముంచెత్తడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement