డిజిటల్ ఫార్మెట్‌లో డోరా గీతాలు | Dora movie audio will release by sony music | Sakshi
Sakshi News home page

డిజిటల్ ఫార్మెట్‌లో డోరా గీతాలు

Published Sat, Dec 3 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

డిజిటల్ ఫార్మెట్‌లో డోరా గీతాలు

డిజిటల్ ఫార్మెట్‌లో డోరా గీతాలు

డోరా చిత్ర గీతాలను డిజిట ల్ ఫార్మెట్‌లో విడుదల కానున్నారుు.లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రాల్లో డోరా ఒకటి. వి.హిందేశ్ జపక్ సమర్పణలో నెమిచంద్ జపక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దాస్ రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో తంబిరామయ్య, హరీష్‌ఉత్తమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సర్గుణం సినిమాస్ సంస్థ నెమిచంద్ జపక్‌కు ఫస్ట్‌కాపీ బెస్‌లో నిర్మిస్తోంది.ఈ చిత్రానికి వివేక్-మెర్విన్‌ల ద్వయం సంగీతాన్ని, దినేశ్‌కృష్ణన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ డోరా చిత్ర టాకీ పార్టు పూర్తి అరుు్యందన్నారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న డోరా చిత్ర ఆడియోను సింగిల్ ట్రాక్‌ను సోనీ మ్యూజిక్ సంస్థ డిజిటల్ విధానంలో వరుసగా ఒక్కో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని చెప్పారు.  నయన ఇప్పటి వరకూ నటించనటువంటి పాత్రను ఇందులో చేస్తున్నారని చెప్పారు.  ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా మంచి అటెన్సన్‌ను క్రియేట్ చేసిందని, చిత్రం కచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement