
నయనా.. నిన్నొదల!
ఆ కారులో ఓ ఆత్మ ఉంది. అది నయనతారను వెతుక్కుంటూ వచ్చింది. వచ్చిన పని ముగించేంత వరకూ వదల నయనా... నిన్నొదల అంటుంది. ఆత్మ ఏ పని మీద వచ్చింది? నయనతారనే ఎందుకు వెంటాడుతుంది? తెలియా లంటే సినిమా విడుదలయ్యే వరకూ వెయిట్ చేయమంటున్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్.
నయనతార ముఖ్యతారగా దాస్ రామసామి దర్శక త్వంలో రూపొందిన తెలుగు, తమిళ హారర్ థ్రిల్లర్ ‘డోర’. మల్కాపురం శివకుమార్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. త్వరలో టీజర్, ఈ నెలలో ఆడియో రిలీజ్ చేస్తామని ఆయన తెలిపారు.