soul
-
ఆత్మావలోకనం
మానవ అస్తిత్వాన్ని గురించిన చర్చ ప్రపంచంలో చిరకాలంగా ఉంది. మానవ దేహం సజీవంగా ఉన్నంత వరకు అందులో చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్నే ప్రాణం అంటున్నాం. శరీరాన్ని విడిచి ప్రాణం పోవడమే మరణం. మరణించిన తర్వాత శరీరాన్ని దహనం చేయడమో, పూడ్చిపెట్టడమో చేస్తారు. మరణం తర్వాత ప్రాణం ఏమవుతుందనే దానిపై రకరకాల ఊహలు ఉన్నాయి; దీనిపై రకరకాల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఉన్నాయి; రకరకాల మత విశ్వాసాలు ఉన్నాయి. శరీరాన్ని సజీవంగా నిలిపి ఉంచే చైతన్యాన్నే ఆధ్యాత్మికవేత్తలు ఆత్మ అంటారు. ‘నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః/ న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః’ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఆత్మను ఆయుధాలు ఖండించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. గీతాసారం ప్రకారం ఆత్మ సమస్త ప్రకృతి శక్తుల ప్రభావానికీ అతీతమైనది. జీర్ణవస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని తొడుక్కున్నట్లే, జీర్ణశరీరాన్ని విడిచిన ఆత్మ తిరిగి కొత్త శరీరాన్ని వెతుక్కుని వెళుతుందనే నమ్మకం కూడా ఉంది. ‘పునరపి జననం పునరపి మరణం/ పునరపి జననీ జఠరే శయనం’ అని ఆదిశంకరుడు చెప్పాడు. శరీరం మరణించినా, ఆత్మకు మాత్రం జనన మరణ పరిభ్రమణం తప్పదని ఆయన సారాంశం. ఆత్మకు మరణం లేదనే నమ్మకం ప్రపంచంలోని చాలా మతాల్లో ఉంది. ఆత్మ మరణం లేనిదే కాదు, ఆద్యంత రహితమైనది కూడానని జైనుల సిద్ధాంతం. సమస్త సృష్టిలోని సూక్షా్మతి సూక్ష్మ క్రిమి కీటకాలు మొదలుకొని మనుషులు సహా భారీ జంతువుల వరకు సమస్త జీవుల్లోనూ ఆత్మ ఉంటుందని జైనుల విశ్వాసం.చైనాకు చెందిన తావో మతమైతే– ప్రతి వ్యక్తిలోనూ ‘హున్’, ‘పో’ అనే రెండు రకాల ఆత్మ ఉంటుందని, ఈ రెండు రకాలు ‘యాంగ్’, ‘యిన్’ అనే సానుకూల, ప్రతికూల శక్తులతో నిండి ఉంటుందని చెబుతుంది. తావో మతం కూడా పునర్జన్మలను నమ్ముతుంది. ఆధునికుల్లో చాలా మంది మతాలకు అతీతంగా ఆత్మ అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి, దానిని నిర్వచించడానికి ప్రయత్నించారు. ‘నేను’ అనే స్పృహ ఆత్మకు మూలమని, అలాగని ఆత్మ అస్తిత్వాన్ని నిరూపించడం గాని, ఖండించడం గాని సాధ్యం కాదని జర్మన్ తత్త్వవేత్త ఇమ్మాన్యుయేల్ కాంట్ చెప్పాడు.ఆత్మ అస్తిత్వాన్ని గురించి ఎన్నో సిద్ధాంతాలు, కల్పనలు, విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ పదార్థమా, కాదా అనే సంగతి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. ఒకవేళ పదార్థమే అయితే, అది ఏ స్థితిలో ఉంటుందో కూడా చెప్పలేదు. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త డంకన్ మెక్‌డూగల్ ఆత్మకు బరువు ఉంటుందని, ఆ బరువు ఇరవై ఒక్క గ్రాములని ఒక ప్రయోగం చేసి మరీ చెప్పాడు. ఆ తర్వాతి కాలంలో రాబర్ట్ ఎల్ పార్క్, బ్రూస్ హుడ్ వంటి శాస్త్రవేత్తలు మెక్‌డూగల్ ప్రయోగంలో శాస్త్రీయత లేదంటూ కొట్టి పారేశారు. మరణానంతరం ఆత్మ ఏమవుతుందనే దానిపై మత సిద్ధాంతాలు ఎలా ఉన్నా, దీనిపై చాలామందికి తీరని సందేహాలు ఉన్నాయి. మరణంతోనే ఒక జీవి చరిత్ర పరిసమాప్తమైపోతుందని, ఆత్మ అనేది ఏదీ ఉండదని హేతువాదులు అంటారు. ఆధ్యాత్మికవేత్తల్లోనే కాదు, సాహితీవేత్తల్లోనూ ఆత్మ అస్తిత్వానికి సంబంధించిన పరిపరి విధాల అభిప్రాయాలు ఉన్నాయి. ‘మరుజన్మ ఉన్నదో లేదో/ ఈ మమతలప్పుడేమవుతాయో’ అన్నారు ఆత్రేయ. ‘చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో/ ఏమి యగునో ఎవరికెరుగ రాదు/ ఎరుకలేని వారలేమేమొ చెప్పగా/ విని తపించువారు వేన వేలు’ అన్నారు అబ్బూరి రామకృష్ణారావు. ఆయన తన జీవిత చరమాంకంలో చెప్పిన పద్యమిది. ఆత్మ గురించి, ‘ఆత్మజ్ఞానం’ గురించి వివిధ మతాల్లో అనేకానేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆత్మ అస్తిత్వంపై అనేక విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ ఉందనేందుకు శాస్త్ర సాంకేతిక నిరూపణలు లేకున్నా, ఆత్మ అనే భావన సహస్రాబ్దాలుగా మానవాళిపై ప్రభావం చూపుతోంది. ఆత్మ భావన ప్రభావం మత సిద్ధాంతాలతో పాటు తత్త్వశాస్త్రంలోను, సాహిత్యంలోను, ఇతర సృజనాత్మక కళలలోను కనిపిస్తుంది. ‘ఆత్మ’ భావన చాలావరకు ఆస్తికుల ప్రవర్తనను నియంత్రిస్తూ వస్తోంది. కర్మ సిద్ధాంతానికి, పాప పుణ్యాల విచక్షణకు, పాపభీతికి మూలం ‘ఆత్మ’ భావనే! ఆత్మ అస్తిత్వాన్నే గుర్తించనివారు ప్రపంచ జనాభాలో అతి తక్కువమంది మాత్రమే ఉంటారు. కృత్రిమ మేధ మనుషుల రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తున్న వర్తమాన కాలంలో కూడా ఆత్మ అస్తిత్వాన్ని నమ్మేవాళ్లే ఎక్కువ.ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసి ఆధునిక శాస్త్రవేత్తలెవరూ ఆత్మ అస్తిత్వాన్ని గురించి పెద్దగా పరిశోధనలు సాగించలేదు. అయితే, అమెరికా రక్షణశాఖ ప్రధాన కేంద్రం ‘పెంటగాన్’ ఈ అంశంపై 1983లోనే పరిశోధన చేసింది. మనిషి మరణించినా ఆత్మ మరణించదంటూ లెఫ్టినెంట్ కల్నల్ వేయన్ మెక్‌డోనల్ తన పరిశోధన పత్రంలో రాశారు. అమెరికా గూఢచర్య సంస్థ ‘సీఐఏ’ 2003లో బహిర్గతపరచిన రహస్య పత్రాల్లో ఇది కూడా ఉంది. అయితే, ఇటీవలే ఇది వెలుగులోకి రావడంతో పాశ్చాత్య పత్రికలు, ప్రసార సాధనాల్లో పలు వ్యాఖ్యానాలతో కూడిన కథనాలు వెలువడ్డాయి. ధ్యానస్థితిలో సూక్ష్మశరీరయానం అనుభవాల గురించి ఆధ్యాత్మికవేత్తలు, యోగసాధకులు చెబుతుంటారు. దీనినే ‘ఔటాఫ్ బాడీ ఎక్స్పీరియెన్సెస్’ అంటున్నారు. గూఢచర్యంలో ఇలాంటి అనుభవాలను ఉపయోగించుకోవడం ఎలా అనేదానిపైనే మెక్‌డోనల్ పరిశోధన చేశారు. దీనిపై శాస్త్రవేత్తలు ఏమేరకు ఆత్మావలోకనం చేసుకుంటారో చూడాలి. -
దక్షిణ కొరియాలో మంచు తుఫాను.. మూసుకుపోయిన రహదారులు
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కురుస్తున్న భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. భారీ మంచు తుఫాను కారణంగా వందలాది విమానాలు రద్దు అయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఈ మంచు తుఫాను గత 50 ఏళ్లలో సంభవించిన అత్యంత భారీ విపత్తుగా చెబుతున్నారు. సియోల్ పరిసర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల మేర మంచు కురిసిందని దక్షిణ కొరియా వాతావరణశాఖ తెలిపింది. 1972, నవంబర్ 28న సియోల్‌లో 12 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. ఈ మంచు తుఫాను ప్రభావం దేశంలోని పలు ప్రాంతాలలో కనిపించింది. 눈 대박이다... 버스 40분 남아서 역까지 걸어오고 전철도 지연되서 기다리는중.. 차들이 오르막길 못 올라가 버스도 사고나서 승객들 다.내림... pic.twitter.com/jZ1OnGVsYz— 🇰🇷숼🇰🇷 (@sowol_sy) November 27, 2024దేశంలోని మధ్య, తూర్పు, నైరుతి ప్రాంతాలలో దాదాపు 10 నుండి 23 సెం.మీ. మేరకు హిమపాతం కురిసింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో 220 విమానాలు రద్దు కాగా, 90 బోట్లను ఓడరేవులోనే ఉంచాలని అధికారులు ఆదేశించారు. సియోల్‌లోని రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ట్రాఫిక్ స్థంభించింది. రోడ్లపై కూలిపోయిన చెట్లను తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు -
ఓం బన్నా బుల్లెట్ బాబా
అది 1988 డిసెంబర్ 2, రాత్రి పది దాటింది. రాజస్థాన్ లోని పాలీ–జోధ్‌పూర్ హైవే రూట్లో ‘350cc రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ RNJ7773’ బండి హుందాగా, వేగంగా పరుగులు తీస్తోంది. ఎందుకో ఆ బండి అకస్మాత్తుగా స్కిడ్ అయింది. క్షణాల్లోనే భళ్లుమనే పెద్ద శబ్దం.. ఏకంగా మరణ శాసనాన్నే లిఖించింది. చెట్టును ఢీ కొట్టిన ఆ బండి హెడ్‌లైట్.. మిణుకు మిణుకుమని ఒక్కసారిగా ఆరిపోయింది. మరునాడు ఆ చెట్టు ముందు పడి ఉన్న బుల్లెట్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు విచారణకు సిద్ధమయ్యారు. ఆ బుల్లెట్.. పాలీ జిల్లాలోని ‘చోటిలా’ అనే గ్రామానికి చెందిన జమీందారు జోగ్ సింగ్ కుమారుడు.. ‘ఓం సింగ్ రాథోడ్’ అనే 23 ఏళ్ల యువకుడిదని నిర్ధారించుకున్నారు. ప్రమాదంలో అతను చనిపోయాడని, అతనితో పాటు ప్రమాదానికి గురైన అతని ప్రాణ స్నేహితుడు ట్రీట్మెంట్ పొందుతున్నాడని తెలుసుకున్నారు. వెంటనే బుల్లెట్‌ని.. తమ సీజ్డ్ వెహికల్ యార్డ్‌కి తరలించారు. నరేష్ భట్టి అనే స్థానిక డ్రైవర్.. మరునాడు ఉదయాన్నే పోలీస్ స్టేషన్‌కి వచ్చి..‘నిన్న మీరు స్వాధీనం చేసుకున్న రాథోడ్ గారి బుల్లెట్‌ని.. మళ్లీ యాక్సిడెంట్ జరిగిన చోటే ఎందుకు వదిలేశారు?’ అని ప్రశ్నించాడు. అతని ప్రశ్న పూర్తికాకుండానే.. అక్కడున్న ఓ కానిస్టేబుల్ పరుగున వెళ్లి.. తమ సీజ్డ్ వెహికల్ యార్డ్‌ని పరిశీలించాడు. అంతే వేగంగా తిరిగి వచ్చి ‘యార్డ్‌లో ఆ బుల్లెట్ లేదు సార్’ అని ఆయాసపడుతూ చెప్పాడు. అది ఆకతాయిల పని కావచ్చు అనుకున్న పై అధికారులు.. వెంటనే మళ్లీ సంఘటన స్థలానికి వెళ్లి ఆ బండిని తీసుకొచ్చి.. ఈసారి గొలుసుతో లాక్ చేశారు. తెల్లవారేసరికి యార్డ్‌లో.. గొలుసు మాత్రమే ఉంది. బుల్లెట్ లేదు. అది మళ్లీ యాక్సిడెంట్ జరిగిన చోటుకే వెళ్లిపోయింది. ఇక లాభం లేదని బుల్లెట్ టైర్లలో గాలి తీసి ఓ రోజు.. పెట్రోల్ తీసి మరో రోజు.. బుల్లెట్‌ని యార్డ్‌లో ఉంచడానికి ప్రయత్నించారు. కానీ మళ్లీ బుల్లెట్టే గెలిచింది. పోలీసులు విఫలమయ్యారు. దాంతో అసలు ఆ బుల్లెట్ యాక్సిడెంట్ జరిగిన చోటుకు దానంతట అదే ఎలా వెళ్తోంది? ఎందుకు వెళ్తోంది? ఎవరు తీసుకెళ్తున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు హడలెత్తించే కథనాలను సృష్టించడం మొదలెట్టాయి. రాథోడ్ ఆత్మ బుల్లెట్ బండిలో చేరిందని.. అదే బండిని అక్కడికి తీసుకెళ్తోందని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే.. రాథోడ్ కలలోకి వచ్చి.. తనకు గుడి కట్టించమని కోరాడంటూ అతడి అమ్మమ్మ ప్రకటించింది. దాంతో భయపడేవారంతా భక్తి బాటపట్టారు. యాక్సిడెంట్ జరిగిన చోటే స్థలాన్ని సేకరించి.. ఆ చెట్టు దగ్గరే గుడి కూడా కట్టేశారు. భక్తుల దర్శనార్థం ఆ బుల్లెట్నీ అక్కడే ప్రత్యేకంగా ఉంచి.. పవిత్రంగా పూజించడం మొదలుపెట్టారు.రాజస్థాన్ రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన యువకులను ‘బన్నా’ అని పిలుస్తుంటారు. అందుకే రాథోడ్‌ని కూడా ‘ఓం బన్నా’ అని భక్తితో పిలవడం మొదలుపెట్టారు. అతని ఫొటో పెట్టి.. అతని విగ్రహం కట్టి.. మొక్కులు మొక్కడం ప్రారంభించారు. ప్రయాణాల్లో ప్రమాదాలు జరగొద్దంటే బుల్లెట్ బాబా ఆశీర్వాదం తప్పనిసరి అనేది ఆనవాయితీగా మారింది. జోగ్ సింగ్‌కి ఒక్కగానొక్క కొడుకు రాథోడ్. అతడికి బుల్లెట్ బండి అంటే ప్రాణం. చాలా ఆశపడి కొనుక్కున్న ఆ బండిని.. చాలా ఇష్టంగా చూసుకునేవాడు. పెళ్లి అయిన కొన్ని నెలలకే అలా ప్రమాదంలో చనిపోయాడు. తీరని విషాదంతో ఉన్న జోగ్ సింగ్ కుటుంబానికి.. ఈ ‘ఓం బన్నా టెంపుల్’ ఊరటగా నిలిచింది. ఇక్కడ నేటికీ పెద్ద పెద్ద జాతర్లు జరుగుతుంటాయి. పిల్లలు, పెద్దలు ఏ శుభకార్యం తలపెట్టినా ముందు ఈ గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. గాజులు, ఎర్ర జాకెట్ ముక్కలను ముడుపులుగా కడుతుంటారు. అలాగే మద్యాన్ని బుల్లెట్ బాబాకు నైవేద్యంగా పెడుతుంటారు.అయితే రాథోడ్ మరణించిన దారి గుండా.. ప్రయాణం చేసేవారికి ఓం బన్నా ఆత్మ పలు రూపాల్లో కనిపించి.. హారన్ కొట్టమని, జాగ్రత్తగా వెళ్లమని చెప్పినట్లు చాలామంది సాక్ష్యమిస్తుంటారు. ఈ గుడికి వచ్చే భక్తులు.. తమని ఎల్లవేళలా కాపాడమంటూ అర్జీ పెట్టినట్లుగా.. తమ వాహనాల హారన్స్ కొడుతూ ఉంటారు. తమను రక్షించడానికే రాథోడ్ ఆత్మ ఆ గుడి ప్రాంగణంలోని ఆ బుల్లెట్లో ఉందని స్థానికులంతా బలంగా నమ్ముతుంటారు. ఏదేమైనా ఆనాడు బుల్లెట్ స్టేషన్ నుంచి ఎలా ఆ ప్రమాదఘటనా స్థలానికి వెళ్లింది? రాథోడ్ అమ్మమ్మ కల నిజమేనా? ఆ గుడిలో ఆత్మ ఉందా? అది దైవత్వాన్ని ఆపాదించుకుని భక్తుల్ని రక్షిస్తోందా? అనే ప్రశ్నలు సమాధానాల్లేని మిస్టరీనే! - సంహిత నిమ్మన -
గెలుపు.. గమనం.. మలుపు
గెలవాలి అని మనం దృఢంగా నిర్ణయించుకోవాలి; మనం మనస్పూర్తిగా గెలుపును కోరుకోవాలి; మనం గెలిచేందుకు త్రికరణ శుద్ధిగా పూనుకోవాలి; మనం గెలవాలి. మనకు మనుగడ ఉంది అని అంటే అది గెలుస్తూ ఉండేందుకే అని తెలుసుకోవాలి. ఎన్ని అవరోధాలు ఉన్నా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంత వ్యతిరేకత పైనపడినా మనం గెలవాలి అని నిలవాలి; మనం గెలుస్తూ మెరుస్తూ ఉండాలి. ‘యమే వైష వృణుతే తేన లభ్యస్తైష ఆత్మా వివృణుతే తనూమ్ స్వామ్’ అని కఠోపనిషత్ చెబుతోంది. అంటే అతడి చేత ఏదైతే కోరుకోబడి అడగబడిందో దానివల్ల అతడు పొందబడతాడు; అతడికి ఆ ఆత్మ తన సహజ ప్రకృతిని తెరుస్తుంది అని అర్థం. ఈ సత్యాన్నే తెలియజేస్తూ ‘అడుగుడీ మీకియ్యబడును; వెదకుడీ మీకు దొరకును; తట్టుడీ మీకు తియ్యబడును’ అని చెప్పింది మత్తయి సువార్త. మనం గెలుపును కోరుకుని ప్రయత్నిస్తే మనకు గెలుపు తన తలుపును తెరుస్తుంది. మనం గెలుపును పొందాలనుకుని ఉద్యుక్తులం ఐతే మనం గెలుపు చేత పొందబడతాం. మనం ఉన్న ఈ ప్రపంచం ఒక పద్మవ్యూహం. కానీ మనలో ఎవరూ అభిమన్యుడు కారాదు. ప్రతివ్యక్తీ అర్జునుడే అవాలి; అర్జునుడి తీరే మనకు ఆదర్శం కావాలి; మనకు మార్గదర్శకం కావాలి. తాను ఏ స్థితిలో ఉన్నా, శాపవశాత్తు తన స్థితే మారి తాను పేడిగా మారిపోయినా అర్జునుడు గెలుపునే కోరుకుని, గెలిచేందుకు పూనుకుని గెలుపు తలుపును తట్టాడు. గెలుపు తలుపు తెరుచుకోబడి ఆ గెలుపుచేత పొందబడ్డాడు; అర్జునుడు విజయుడుగా పేరుపొందాడు. గెలుపు అనేది లక్ష్యమా? కాదు, కాదు. గెలుపు లక్ష్యంగా కాదు మనకు లక్షణంగా ఉండాలి. మనుగడ ఉన్నంతవరకూ మనం గెలుపు కోసమే, గెలుపుతోనే రోజుల్ని గడుపుతూ ఉండాలి. రోజు అనేది రావడమే ఒక గెలుపు. అదిగో ఆ రోజు రావడమే మనకు ప్రేరణ. రోజులాగా మనుగడ ఆసాంతమూ మనకు గెలుపు అనేది వస్తూనే ఉండాలి. రోజు ఒకసారి మాత్రమే వచ్చేదే ఐతే కాల గమనమూ, ప్రపంచ గమనమూ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. అలా జరిగితే కాలానికి, ప్రపంచానికి గమనమే ఉండదు కదా? రోజు అనేది వస్తూ ఉండడమే గమనం జరుగుతోంది అన్నదానికి ఋజువు. మనకు గెలుపు వస్తూ ఉండడమే మనుగడ గమనాన్ని నిర్ధారణ చేస్తుంది. పొందే ప్రతి గెలుపు మనిషికి ఒక మలుపు. మలుపులు తిరుగుతూ పయనం సాగాలి. గెలుపులతో సాగడమే మనుగడకు సార్థకత. మనుగడ అన్నది ఒక సాగే తీగ అయితే ఆ తీగకు గెలుపుల పూలు పూస్తూ ఉండాలి. మనుగడ గెలుపుల పూలు పూచే ఒక వల్లరి కావాలి లేదా మనుగడ గెలుపుల పుష్పగుచ్ఛం కావాలి. గెలుపుల పూల పరిమళానికి ఆకృతిగా మనిషి మంచి మాటకెక్కాలి. ‘గెలుపును పొందాలని తలపోద్దాం; గెలుపును పొందుదాం. గెలుస్తూ ఉన్నవాళ్లమై తల ఎత్తుకుని మనుగడ చేద్దాం; మన తలలకు విలువను పొదువుకుందాం. గెలుపు మనకు అభిరుచి కావాలి; గెలుపును మనం చవి చూస్తూ ఉండాలి; మనం మనుగడకు చవిని చేకూర్చుకోవాలి‘. 100% – నేను గెలిచాను. 90% – నేను గెలుస్తాను. 80% – నేను గెలవగలను. 70% – నేను గెలవగలను అని అనుకుంటున్నాను. 60% – నేను గెలవగలనేమో. 50% – నేను గెలవచ్చేమో అని అనుకుంటున్నాను. 40% – ఏది గెలుపు? 30% – నాకు గెలవాలని ఉంది. 20% – ఎలా గెలవాలో నాకు తెలియదు. 10% – నేను గెలవలేను. 0% – నేను గెలవను. ఇది గెలుపునకు నిచ్చెన. మనిషి ఈ నిచ్చెనను ఎక్కాలి; తప్పకుండా ఈ నిచ్చెనను ఎక్కి తనను తాను మనిషిని అని నిరూపించుకోవాలి. – రోచిష్మాన్ -
ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు వినూత్న పూజలు
తమిళనాడు: తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని సొరకాల్‌నత్తం గ్రామానికి చెందిన కేశవన్ ఇతని భార్య వాసంతి. వీరికి ఎయిల్ అరసన్, ఉదయ్‌వసంత్(20) పిల్లలున్నారు. ఎయిల్ అరసన్ సొరకాల నత్తం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా ఉంటున్నాడు. ఉదయ్‌వసంత్ రెండు నెలల క్రితం అదే గ్రామంలో బైకులో వెళుతున్న సమయంలో లారీ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులు అదే గ్రామంలోని శ్మశానంలో దహన క్రియలు చేశారు. చెరువు గట్టు వద్ద ఆత్మగా తిరుగుతున్న ఉదయ్‌వసంత్ ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం మృతిచెందిన ఉదయ్‌వసంత్ ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు చెరువు గట్టు వద్ద కుటుంబ సభ్యులు పూజలు చేశారు. అక్కడ పూలకరగం పెట్టి నేలపై పసుపు, పుష్పాలు పెట్టి మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయ్‌వసంత్ చిత్రపటంతో పాటు కరగను చెరువు గట్టు నుంచి ఇంటికి మేళ తాళాల నడుమ తీసుకొచ్చారు. ఆ సమయంలో ఒకటిన్నర కిలో మీటరు దూరం పసుపు నీల్లు, పుష్పాలు చల్లి ఊరేగింపుగా వచ్చారు. అనంతరం ఉదయ్‌వసంత్ చిత్ర పటాన్ని ఇంట్లో పెట్టి పూల మాల వేసి పూజలు చేశారు. మృతి చెందిన కుమారుడి ఆత్మ ఇంటికి రావాలని కుటుంబసభ్యులు పూజలు చేసిన సంఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది. -
మంచి మాట.. నేను ఎవరు?
ప్రతి ఒక్కరూ నేను నేను అంటుంటారు. అసలు ఈ నేను ఎవరు? నేనులు ఎన్ని ఉన్నాయి. ఈ నేను లు అన్నీ ఒకటేనా? ఇల్లు నాది అన్నాం.. నేను ఇల్లా..? కాదు గదా..! నా వాహనం, నా భూమి, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య అన్నాం.. మరి ఇవన్నీ నేను కాదు గదా..! అలాగే నా శరీరం అన్నప్పుడు శరీరం నేనెలా అవుతాను..? నా మనస్సు అన్నప్పుడు నేను మనస్సునెలా అవుతాను.. శరీరం కన్నా, మనస్సు కన్నా నేను వేరుగా ఉండి ఉండాలి గదా..! ఎవరా నేను..? నిజానికి అన్ని నేనులు కలిసి నేనైన నేనే నేను. అదే ఆత్మ... అంటే నేను ఆత్మను అని తెలుసుకోవాలి. ఈ హోదాలు వారి వత్తిని చూపిస్తాయి. అది అంతవరకే ఉండాలి. ‘అహంభావము’ ‘అహంకారం’ అని రెండు రకాల పదాలు సాధారణంగా వాడుతూ వుంటాము. ఈ రెండూ ఒకే అర్థం కలిగినవి కావు. నేను కాని దాన్ని నేననుకోవడం అహంకారం.. ఇది నాది అనుకుంటే హక్కు ఉనట్టు, నాకు మటుకే సొంతం అనుకుంటే స్వార్ధం ఉన్నట్టు, నేను చేయగలను అనుకుంటే ఆత్మ విశ్వాసం, నేనే చేస్తున్నాను నేను మటుకే చేయగలను అనుకుంటే అహంకారం, ఈ నేను అనేది దైవం చేతనే నడిచేది నడిపించేది కూడా ఆ శక్తే, అయితే ఆలోచనాశక్తి ని బుద్దిని మానవునికే అప్పగించింది దైవం. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే నీ స్థాయిని ఇహపర లోకాలలో నిర్ణయిస్తుంది.. నీ ఆలోచనా విధానంలో సత్యం న్యాయం ధర్మం ఉంటే నీ బుద్ధికి తగట్టు ఆ దైవం నీకు తోడు గా నడుస్తుంది, అదే బుద్ధి అహంకారంతో నిండిపోయి నేను రాక్షసుడిగా జీవిస్తానా, లేక మానవుని గానా లేక దేవుని గా జీవిస్తానా అనేది ఈ నేను అనే నేను నిర్ణయించుకోవాలి. రాక్షసుడు, దేవుడు అనే వారు ఎక్కడో లేరు మన జీవన విధానం లోనే ఉన్నారు. మానవుడు తన స్థాయి తగ్గించుకుని జీవిస్తే అదే రాక్షసుడు. మానవుడు తన కంటే ఉన్నతమైన లక్ష్యాలతో జీవిస్తే అతనే భగవంతుడు. చివరికి మానవుడు మన జీవన విధానంలోనే ఉన్న దేవుని వదిలి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు ఈ జీవితం ఎన్నో జన్మల పుణ్యం జీవితం అంటే జీవించడానికే. జీవించడమే గొప్ప సాధన. సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది. జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. ఆటుపోట్లతో, హెచ్చు తగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా తలవంచుకుని అనుభవించాలి. నేల విడిచి సాము చేసినట్లు జీవితాన్ని గాలికి వదిలెయ్యకూడదు. జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే. ‘ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో కాంతిని నింపాలి. అంతకంటే మనిషికి సార్థకత లేదు’ ఈ సత్యం తెలుసుకున్న మానవుడు చివరికి ఇలాంటి పనులకే పూనుకొంటాడు.. పూనుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికి సాధనలమయం అనే భావన ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు మంచి పనులే సాధన. ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన. లేకపోతే బతుకే అయోమయం. జంతువు, పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ స్వార్థం లేక జీవిస్తున్నాయి. మరి మనమెందుకిలా? నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం..? బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం, శాపం కూడా. చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న నేను అర్జునుడు. పెద్ద నేను శ్రీ కష్ణుడు. అతి పెద్ద జీవనం కురుక్షేత్ర యుద్ధం. ఇది అర్థమైతే అదే అత్యంత అద్భుతమైన సాధన. శ్రీరాముడు మనిషిగా జీవించి తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు. జీవితం అవకాశం ఇస్తుంది. దాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. కారణజన్ముడికైనా, సాదారణ జన్ముడికైనా బాధలు, కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి జీవితమే భయపడుతుంది. మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది. అసలు ఈ శరీరం నాదని, మనస్సు నాదని, బుద్ధి నాదని, ఎలా తెలుసుకుంటున్నాం? ఆత్మవల్లనే తెలుసుకుంటున్నాం. నాది అనే వస్తువుకు, నాకు మధ్య సంబంధం ఏమిటి? హక్కుదారుకు, వస్తువుకు మధ్య ఉండే సంబంధం. ఇది నా ఇల్లు అంటే నేను ఇల్లు కాదు. ఇంటి హక్కుదారును. నావి అంటే అవన్నీ నేను కాదు. వాటి హక్కుదారును మాత్రమే. మరి హక్కుదారైన నేనెవరిని..? ఈ నేను కాస్త నాది, నాకు అనే స్వార్థంతో ఉంది. హోదాలతో కూడిన పేర్లన్నీ అహంకారంతో కూడుకున్నవే. – భువనగిరి కిషన్ యోగి -
కియా నుంచి ఎలక్ట్రిక్ కారు ?
వెబ్‌డెస్క్: అతి తక్కువ కాలంలోనే ఇండియా కార్ల మార్కెట్లో తనదైన ముద్ర వేసిన కియా సంస్థ నుంచి మరో కొత్త కారు మార్కెట్లోకి రాబోతుంది. ముఖ్యంగా ఫ్యూచర్ కార్లుగా చెప్పుకుంటున్న ఎలక్ట్రిక్ కారును తెచ్చేందుకు కియా సన్నాహాలు చేస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు కియా తన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మోడల్ సోల్ లేబుల్‌ని ఇండియాలో రిజిస్ట్రర్ చేసింది. సోల్ వస్తుందా ? కియా కంపెనీలో ఈవీ వెర్షన్లో సక్సెస్ ఫుల్ మోడల్‌గా సోల్‌కి పేరుంది. ఇప్పటికే రెండు మోడల్స్ విదేశీ మార్కెట్లో విడుదల అయ్యాయి. థర్డ్ జనరేషన్ మోడల్ విదేశాల్లో లాంఛింగ్‌కి సిద్ధంగా ఉంది. ఈ థర్డ్ మోడల్ పెట్రోల్, ఈవీ వెర్షన్లలో లభ్యం అవుతుందని ఇప్పటికే కియా ప్రకటించింది. ఈ క్రమంలో ఇండియాలో సైతం సోల్ పేరుతో కియా లేబుల్ రిజిస్ట్రర్ చేసింది. దీంతో సోల్ మోడల్ని ఇండియాలో కూడా లాంఛ్ చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ కొత్త మోడల్ ఎంట్రీపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. లాంగ్రేంజ్. కియా సోల్ థర్డ్ జనరేషన్ ఈవీ మోడల్లో బ్యాటరీలకు సంబంధించి లాంగ్ రేంజ్, స్టాండర్డ్ రేంజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో లాంగ్రేంజ్లో 64కిలోవాట్ బ్యాటరీతో 452 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుండగా... స్టాండర్డ్ రేంజ్లో 39.2 కిలోవాట్ బ్యాటరీతో 277 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కోనాకు పోటీగా ఇండియా కార్ల మార్కెట్లో 10 శాతానికి పైగా వాటా దక్కించుకుంది కియా. సెల్టోస్, సోనెట్ మోడళ్ల అమ్మకాలు జోరు మీదున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఇప్పటికే హుందాయ్ నుంచి కోనా మోడల్ అందుబాటులో ఉంది. దీనికి పోటీగా కియా సంస్థ సోల్‌ను మార్కెట్లోకి తెవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫ్యూచర్ కార్స్ రాబోయే రోజుల్లో ఆటోమోబైల్ రంగంలో పెట్రోల్, డీజీల్ వాహనాల మార్కెట్‌కి ఎలక్ట్రిక్ వాహనాల నుంచి గట్టిపోటీ ఎదురు కానుంది. పర్యావరణ కాలుష్యం దృష్ట్యా భవిష్యత్తులో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టాలనే డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. దీంతో అనేక కంపెనీలు క్రమంగా ఎలక్ట్రిక్ మోడల్‌లు తెచ్చేందుకు ఆర్ అండ్ డీ సెంటర్లలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. చదవండి : మహీంద్ర బంపర్ ఆఫర్ -
ఆత్మజ్ఞానంతోనే పరిణామ దశ
ఆ అనంతశక్తి కాలాతీతమైనది. కాలం అనేది సూర్యుని వల్ల ఏర్పడే దివారాత్రుల వలన కలిగే ఒక భావన. సూర్యమండలంలోని ఒక్కో గ్రహానికి ఒక్కో కాలం ఉంటుంది. కాలం అనేది జనన మరణాలు కల పదార్థాలకు మాత్రమే ఉంటుంది. జననమరణాలు లేని అనంతశక్తికి ఉండదు. అట్టిదానికి కాలాన్ని ఆపాదించనూలేము. కాలాన్ని చెప్పగలిగే లేదా చూపగలిగే పదార్థం అనంతశక్తి ఆవల పుట్టలేదు. కారణం, ఆ అనంతశక్తి అలాంటి స్థానమే లేకుండా ఆవరించి ఉండడమే. అంతేకాకుండా, పుట్టే పదార్థానికి ఇదే శక్తి కావాలి. కాబట్టి, కాలం అనే భావనకు కారణమైన అన్ని నక్షత్ర, గ్రహాలను కన్నది ఈ అనంతశక్తే కాబట్టి, అది కాలాతీతమైనది. సనాతనమైన ఆత్మ తన ఉనికిని, నూతనత్వాన్ని చాటుకోవడానికి పరిణామాన్ని ఆశ్రయించిందని తెలుసుకున్నాం. అయితే, ఆత్మకు జన్మ అనేదిలేదు. అలాగే, ఈ పరిణామ ప్రక్రియ ప్రారంభమూ చెప్పలేము. అయితే, పరిణామం అనేది అనంతశక్తికి తప్పనిసరైన విధి. గమ్మత్తేమిటంటే, ప్రతి పదార్థరీత్యా ఆ పదార్థమే తొలిసారిగా ఉద్భవించినట్టు తోస్తుంది. ఎందుకంటే, పరిశోధన భూకేంద్రంగా చేసుకుని సాగడమే. అంతటి విచిత్రమైన అనంతశక్తిలో సృష్టిలయలు కలిగి ఉన్న పదార్థాలు అనగా గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఎన్నని ఎంచగలం, ఎక్కడని చెప్పగలం? పార్సెక్ లాంటి ఖగోళ కొలతలకు అందని దూరాలలో ఒక పదార్థాన్ని చూసే శక్తి సముపార్జించే లోపల మరో పదార్థం పురుడు పోసుకుంటుంది. ఈ పదార్థమే తర్వాత అనంతశక్తిగా రూపొందుతుంది. ఈ పరిణామం నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం మన నివసిస్తున్న భూమండలం, మన సౌరకుటుంబం ఆ అనంతశక్తి లో ఏ భాగమో, ఏ దిశలో ఉందో, ఎంతటి భాగాన్ని ఆక్రమించి ఉందో ఏ విధంగా చెప్పగలం? ఈ విధంగా అనంతశక్తికి వైజ్ఞానికపరంగా చూసినా, ఉపనిషత్తుల పరంగా చూసినా పరిణామం చెందడమే ప్రధాన లక్షణమని అర్థమౌతుంది. ఇదే విషయాన్ని శ్వేతాశ్వతర ఉపనిషత్తు నిర్ధారిస్తోంది. అనంతశక్తిని ‘పరిణామశీల అయిన అంతర్యామి’గా పేర్కొంటూ, పరిణామాన్ని నిత్య లక్షణంగా అలవాటు చేసుకున్న ఆ శక్తి అన్ని ప్రాణులలోను, వాటి అవయవాలలోనూ, నిర్జీవులలోనూ దాగుకొని అందంగా ఉందని పేర్కొంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సాధకుడు, ఈ శరీరంలో స్వయంప్రకాశక ఆత్మతత్వం ద్వారా, తనలోనూ, తన చుట్టూతా నిశ్చలమై ఉన్న బ్రహ్మ తత్వాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు మాత్రమే జన్మరాహిత్యాన్ని, శాశ్వతత్వాన్ని అవగాహనలోకి తెచ్చుకుని జాతి, కుల, మత, లింగ, భాష, వయో ఆధారిత సకల బంధాల నుండి విముక్తుడై, మోక్షజీవితాన్ని ఆనందంగా జీవిస్తాడు. జ్ఞానం వలన సాధకుడు విశ్వనరుడై ఉదారజీవితాన్ని గడిపి, మరణభయం లేకుండా, శరీరాన్ని వదిలి మరో పరిణామ దశలోకి ప్రవేశిస్తాడు. – గిరిధర్ రావుల -
‘అతని ఆత్మ నన్ను పిలుస్తుంది.. అందుకే’
ముంబై : నిన్ననే మన దగ్గర ఆత్మలకు సంబంధించి ఓ వార్త బాగా ప్రాచుర్యం చెందింది. కొన్ని రోజుల క్రితం మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ ఆత్మ తమకు కనిపిస్తుందని.. విగ్రహం కట్టమని అడుగుతుందంటూ ఓ జంట ప్రణయ్ భార్య అమృతను కలిసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఓ కుర్రాడి ఆత్మ తనను పిలుస్తుందని చెప్పి పద్దేనిమిదేళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. నాగ్‌పూర్‌కు చెందిన సౌరభ్(18) ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఓ రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఆ ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు. ఆ రోజు నుంచి సౌరభ్ ఆ బాలుని ఆత్మను తనకు కనిపిస్తుందని.. అది తనను రమ్మని పిలుస్తుందని భావించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పాడు. కానీ సౌరభ్ చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు మైనర్లు చనిపోయారు. దీనికి కూడా సదరు బాలుని ఆత్మనే కారణమని భావించాడు సౌరభ్. తనను తీసుకెళ్లడానికే ఆ బాలుని ఆత్మ ప్రయత్నిస్తుందని.. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు మైనర్లు చనిపోయారని భావించాడు. దాంతో తాను చనిపోకపోతే ఆ బాలుని ఆత్మ మరింత మందిని చంపుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ‘రెండు నెలల క్రితం నా కళ్ల ముందే రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు. అతని ఆత్మ నన్ను పిలుస్తోంది. నేను రాకపోవడంతో ఇద్దరు చనిపోయారు. నేను వెళ్లకపోతే మరింత మంది చనిపోతారు. అందుకే నేను చనిపోతున్నానం’టూ సౌరభ్ సూసైడ్ నోట్లో రాశాడు. ఈ విషయం గురించి పోలీసు అధికారి ‘సౌరభ్ చాలా తెలివిగల విద్యార్థి. చదువులో ఎప్పుడు ముందుండేవాడని తెలిసింది. కానీ రోడ్డు ప్రమాదంలో తన కళ్ల ముందే ఓ వ్యక్తి చని పోవడం అతన్ని ఎంతో బాధించింది. ఈ విషయం గురించి ఇంట్లో వారికి కూడా చెప్పాడు. కానీ అతను చెప్పిన విషయాల గురించి కుటుంబ సభ్యులు సీరియస్‌గా తీసుకోలేదు. బాలుని ఆత్మ పిలుస్తుందనే భయం వల్లే సౌరభ్ ఆత్మహత్య చేసుకున్నాడ’ని పోలీస్ అధికారులు వివరించారు. -
ఆత్మదర్శనమంటే అదే!
ఆత్మను అనుభవించటం ఇంద్రియాలకు సాధ్యం కాదని మనం చెప్పుకున్నాం. మరి దేనికి సాధ్యమంటే జ్ఞానమనే పునాది మీద నిలబడిన మనసుకి మాత్రమే అది సాధ్యం. జ్ఞానం అనేది హేతువును తెలియజేస్తుంది. దృశ్యమాన ప్రపంచం ఏ విధంగా ఉనికిలోకి వచ్చిందో అర్థం చేయిస్తుంది. ఆ శక్తి ఏవిధంగా పరివ్యాప్తమై ఉండి, సకల చరాచర సృష్టికి ఆధారమై, నిత్యమై, నిశ్చలమై సర్వత్రా ఏ విధంగా నిబిడీకృతమైనదనే విషయాన్ని తెలియజేస్తుంది. అట్టి జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడమే మేథకు గొప్ప పని. ఆ మేథను మనసు ఆకళింపు చేసుకోవడం ఓ అంతర్గత సంఘర్షణ. ఆ సంఘర్షణలో అరిషడ్వర్గాల పతనం ప్రారంభమౌతుంది. నిజమేది? నిత్యమేది? జీవమేది? మరణమేది మొదలైన ప్రశ్నలు భౌతిక జీవితాన్ని గడపాల్సి రావడం వలన ఉత్పన్నమౌతాయి. గమ్యమదే ఐనపుడు కర్మసన్యాసం సుఖవంతమనే బలహీనత మనసును తొలుస్తుంది. గీతాపాఠాలు స్ఫురణకు వస్తాయి. ఈ విధమైన మానసిక సంఘర్షణలో నుండే జ్ఞానం ప్రకాశించి, ఆత్మ సందర్శనకు కారణమౌతుంది. జ్ఞానయోగి, కర్మయోగిగా పరిణమిస్తాడు. ప్రతికర్మలోనూ భగవచ్ఛక్తితో రమిస్తాడు. బ్రహ్మజ్ఞానియై బ్రహ్మానందంలో ఓలలాడతాడు. మనసు చేసే నిరంతర చింతన వలన ఆత్మను అనుభవిస్తాడు. ఆ అనుభవమే ఆత్మదర్శనం లేక భగవద్దర్శనం. ‘సమస్తమై విరాజిల్లుతున్న ఆత్మను దర్శిస్తే మానసిక గందరగోళాలు నశిస్తాయి. అన్ని సందేహాలు సమసిపోతాయి. ప్రారబ్ధ కర్మలతో సంబంధం తెగిపోతుంది. ప్రాకృతిక సుఖ సంతోషాల స్థానే నిరంతర ఆత్మానందం ఉదయిస్తుంది. దుఃఖ ద్వేషాదులస్థానే ప్రేమ ఆప్యాయతలు వికసిస్తాయి. శత్రు భయం, కష్టాలు తొలగి విశ్వనరులమై వెలుగొందగలుగుతాం.. ఆత్మప్రకాశం ద్వారానే ఆత్మను చూడగలుగుతామంటుంది ముండకోపనిషత్తు. అక్కడ సూర్య చంద్రాదులు ప్రకాశించడం లేదు, మెరుపులు మెరవడం లేదు, అలాంటప్పుడు ప్రకాశం అంటే ఏంటి? మన మనసులో మనం ఊహించుకునే వెలుతురు కాదు. అది ఒక యోచన. అది ఒక దివ్యానుభూతి. దానివలన మనసులో ఉండే చీకటి సహిత మాలిన్యాలు నశించిపోతాయి. కాబట్టి, ప్రకాశంగా చెప్పబడింది. ‘పెట్రోమాక్సు దీపం నుండి వచ్చే ప్రకాశం లాంటిది కాదు ఆత్మప్రకాశం. అన్నింటినీ మనం తెలుసుకుంటున్నది ఆత్మప్రకాశం చేతనే! అందువల్లనే అది ప్రకాశమని చెప్పబడిందంటారు శ్రీరమణమహర్షి. ఆ ప్రకాశం వైపుగా మనం పయనిద్దాం. మన మేథలో హేతువు మథించి, మనసులో ఆత్మతో రమిద్దాం. ఆత్మ ప్రకాశంలో అద్వైతస్థితిని చేరుకుందాం. అరిషడ్వర్గాలను అణచి, కుల, మత భేదాలకు అతీతులమై ఆనందిద్దాం. మానవ జీవితాన్ని ఆస్వాదించుదాం. – రావుల గిరిధర్ -
అహం బ్రహ్మాస్మి అంటే అదే!
ఆత్మ సర్వాంతర్యామి అన్న విషయం ఎరిగినవారు, ఆత్మ రూపంలో భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని అంగీకరించినవారు, ఆత్మానందాన్ని అనుభవించడానికి మాత్రం మానసికంగా చాలా కృషి చేయాల్సి ఉంటుంది. కనిపించేవన్నీ ఆ ఆత్మ లేక అనంతశక్తిలోనుండే పరిణమిస్తూ ఉద్భవించాయని ఎరిగినవారు నిజజీవితంలో అద్వైత ఆనందాన్ని పొందడం అంత సులభమేమీ కాదు. ఈశావాస్యోపనిషత్తు లో సర్వ భూతాలలో అంతర్యామిని దర్శించిన వారికి మానసిక వైకల్యాలు కలగవు అనడం సులభంగా అనిపించినా, అది నిరంతర చింతన వలననే సాధ్యం. ఆది శంకరులు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన అనంతరకాలంలో, గంగా స్నానమాచరించి విశ్వనాథుని దర్శనం కోసం కదులుతూ ఉంటే, ఒక కాటికాపరి ఎదురైనప్పుడు ’పక్కకు తప్పుకో’ అని అనడం విచిత్రం. అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు, అత్యంత మేథాశక్తి గల మహిమాన్వితుడు, వేదవేదాంతాలను ఔపోసనపట్టిన బ్రహ్మజ్ఞాని ఆచరణ విషయం వచ్చేసరికి భంగపడ్డాడంటే ఎంత ఆశ్చర్యకరమో ఆలోచించండి. సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు, ఆత్మస్వరూపుడై ఉన్నవాడని తెలిసినా, అంగీకరించినా, అనుభవించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. ఆ అనుభవంతోనే ఆదిశంకరులవారు అప్పటికప్పుడు ‘మనీషాపంచకం’ ప్రవచించి, బ్రహ్మజ్ఞాని ఎవరైననేమి, అతడు నా గురువంటూ నిశ్చయించుకొన్నాడు. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే చాలు కదా, ఎందుకు అనుభవించడం? అనే ప్రశ్న ఉదయించవచ్చు. అరిషడ్వర్గరూపంలో ఉన్న మనో మాలిన్యాలు తొలగేందుకు, శ్రీ కృష్ణుని నిష్కామకర్మ సాధించేందుకు, సనాతన ధర్మజీవితం జీవించేందుకు, సుఖదుఃఖాలను నిర్మూలించేందుకు, ముఖ్యంగా మృత్యుంజయ మోక్షస్థితిని జీవితంలో అనుభవించేందుకు, ఆత్మానందంలో రమించేందుకు అద్వైతాన్ని అనుభవించాలి. అదే కదా ‘అహం బ్రహ్మాస్మి’కి నిజమైన తార్కాణం. అన్నమయ్య కలగన్న శ్రీవేంకటేశ్వరుడు ఆయనకు చివరిదశలో ‘అంతర్యామి’గా ద్యోతకమయ్యాడు. భౌతిక దృక్పథం నుండి ఆత్మ దృక్పథంలోకి మారడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందో చూడవచ్చు. అందుకే, ఆత్మజ్ఞాన జిజ్ఞాసులు తొలుత ఆత్మను, జడమును అర్థం చేసుకోవాలి. తద్వారా మాత్రమే ఆత్మను, జడమును వేరుగా చూడటాన్ని మన తలపులలోంచి తీసివేయగలం. ‘మహోపనిషత్’ భేద దృష్టియే అవిద్య అని చెప్పింది. దానిని విసర్జించమని ఆదేశించింది. సర్వమూ బ్రహ్మమేనన్న విషయం తెలుసుకోవడమే విద్య అని, దానిని అనుభవించడమే అక్షయమని తేల్చిచెప్పింది. దీనికి చిన్న ఉదాహరణగా సైన్స్ చెప్పే విషయాన్ని తీసుకోవచ్చు. భూమిమీద, భూమిని మించిన బరువు ఉన్న జీవులు జన్మిస్తే భూమి తన భ్రమణ, పరిభ్రమణ గతులను తప్పుతుందా అనేది ప్రశ్న. సమాధానం ‘గతి తప్పదు’. ఎందుకు గతి తప్పదు? ఎందుకంటే ఆ జీవులన్నీ భూమండలంలోనుండే ఉద్భవించినవి కాబట్టి. ఇదే గమ్మత్తు. ఆశ్చర్యదాయకం. ఇదే చిన్న ఉదాహరణను ఆ సర్వాంతర్యామిలో పుట్టి, గిట్టే ఖగోళ పదార్థాలన్నింటి విషయంలోనూ అన్వయించుకోవచ్చు. ఈ విధంగా అంతర్యామిని దర్శించుకోవచ్చు. ఈ దర్శనం నిరంతర మానసిక చింతనతోనే ఆచరణసాధ్యం. జిజ్ఞాసులకు మనసు అత్యంత కీలక సాధనం. అది మాత్రమే అవిద్యను తొలగించివేసే విద్యకు ఆధారమౌతుంది. ఆ మనసు స్థిరంగా, బలంగా ఆత్మతో మమేకమైతేనే ఆచరణ సాధ్యమౌతుంది. అప్పుడే నిష్కామకర్మ చేస్తూ మోక్ష స్థితిని అనుభవించగలం. తద్వారా, మనచుట్టూ ఉన్న సమాజంలో, ప్రకృతిలో మనల్ని మనమే చూసుకోగలం. అంతటా ప్రేమను నింపగలం. ఆ స్థితియే ‘అహం బ్రహ్మాస్మి’ అప్పుడే భేదభావం వలన ఉత్పన్నమయ్యే అరిషడ్వర్గాలు నశించి, ఆనందమయ జగత్తు సాక్షాత్కారమౌతుంది. – రావుల గిరిధర్ -
చింతన చేసి చూడవే ఓ మనసా!
మనలో, మన చుట్టూ ఆత్మ లేక అనంతశక్తి అంతటా వ్యాపించి ఉంది. కాని, మనలో చైతన్యం ఆత్మ కాదు. ఆత్మ వలన జనించిన ప్రాణమది. ఈ ప్రాణానికి శరీరం ఆధారం.ఈ ప్రాణం లేక చైతన్యం మన శరీరంలో ఆహారం వలన నిలబెట్టబడుతుంది. మనలో ఈ చైతన్యాన్ని నిలిపే ఏదేని ప్రధాన అవయవం నశిస్తే మనలో ప్రాణం లేక చైతన్యం నిలిచిపోతుంది. అదే ప్రాణం పోవడం. అంతేగాని, మనకో ప్రత్యేక ఆత్మ అనేది లేదు, ఉండదు. ఆత్మ మరో జన్మకోసం విశ్వంలో తిరగడమంటూ ఉండదు. ఆ అనంతమైన ఆత్మ తనలోనే, తనకు తానుగనే బహురూపాలలో తిరిగి తిరిగి పుడుతోంది, కాని ఫలానా ఆత్మ అంటూ ప్రత్యేకంగా ఒకటుండదు. పంచభూతాలలో నుండి వచ్చిన శరీరం విఘటనం చెంది పంచభూతాలలోకే ప్రయాణం సాగిస్తుంది. ఈ పంచభూతాలు ఎక్కడివో కావు, అనంతశక్తిలో నుండే ఉద్భవించిన అంశాలే. ఈ విషయాన్ని గుర్తెరిగి, సర్వత్రా వ్యాపించి ఉన్నది ఒకే ఒక ఆత్మ అనే సత్యం మన ఆలోచనల్లో నిండిపోతే, మన మనసుల్లో అరిషడ్వర్గాలకు స్థానం ఉండదు. భేదభావాలకు అతీతంగా మన ఆలోచనలు, కర్మలు శాంతి దిశగా సాగుతాయి. కులమతాలు, లింగభేదాలు మనలను ఆవహించవు. విశ్వనరులమై, ప్రకృతితో మమేకమై శాంతియుతంగా ఆనందకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం తద్వారా గీతలో చెప్పబడినట్లుగా కర్మయోగులమై విశిష్ట ఉన్నతిని పొందగలుగుతాం. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తు ఎంత సుళువుగా చెప్పిందో చూడండి. వాయురనిలమమృతమథేదం భస్మాన్తగ్‌ం శరీరమ్! ఓం క్రతో స్మర కృతగ్‌ం స్మర క్రతో స్మర కృతగ్‌ం స్మర!! ఈ శరీరం కాలి బూడిదైపోతుంది. ఇందులోని ప్రాణం మరణం లేని ప్రాణం(అనంతశక్తి)లో కలిసిపోతుంది. ఓ మనసా! చేసిన వాటిని చింతన చేసి చూడు..... మానవ వికాస తొలినాళ్లలో ఎంత అద్భుత ఆలోచన! నేటి సైంటిస్టులూ తేల్చుకోలేని విషయాన్ని రెండుపాదాల శ్లోకంలో గుదిగుచ్చడమెంత విచిత్రం! మనమూ అజ్ఞానంతో పునర్జన్మ, గతజన్మ అంటూ ఊహించుకోవడమెంత గమ్మత్తు! ధర్మబద్ధకర్మ మన కర్తవ్యం. ఆ ధర్మబద్ధ కర్తవ్యం మనమే చేసినా, దాని పలితం మనమే అనుభవించినా దానిని అంటుకోని నిష్కామ స్థితే మోక్షస్థితి. అష్టావక్ర, శివగీతల్లో చిత్జడ గ్రంథి నశించడమే మోక్షం అని చెప్పడమైంది. అంటే ఏదేని విషయవాసన లేని మానసిక స్థితే మోక్షం. ఈ మోక్షస్థితి లోనే ఎనలేని ఆనందం అనుభవించగలుగుతాం. ఏ కర్మైనా మనకు సమానమే. ఏ ఫలితమైనా తృణప్రాయమే. – రావుల గిరిధర్ -
అర్ధసత్యాలను నమ్మొద్దు!
దశోపనిషత్తుల్లో రెండవది కేనోపనిషత్తు. ఈ కేనోపనిషత్తు ఆత్మ అంటే ఏమిటో, బ్రహ్మమంటే ఏమిటో వివరిస్తుంది. ఆత్మ శక్తితోనే చెవి వినగలుగుతోంది. మనస్సు గ్రహిస్తోంది. వాక్కు పలుకుతోంది. ప్రాణం ఉంటోంది. కన్ను చూస్తోంది. ఈ సత్యాన్ని, ఆత్మ తత్వాన్ని తెలుసుకున్నవారు అమృతత్వాన్ని పొందుతారు. ఈ ఆత్మను... అనగా బ్రహ్మపదార్థాన్ని ఎలా చూడాలి? ఎలా చెప్పాలి... అంటే, దానిని కళ్లతో చూడలేము. వాక్కుతో చెప్పలేము. మనసుతో తెలుసుకోలేము. అది మనకు తెలిసిన వాటన్నింటికీ వేరైనది. తెలియని వాటికి పైన ఉంటుంది. అయితే, తెలియనిదానిని గురించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఊహించి అదే సత్యం అనుకుంటారు. నలుగురు గుడ్డివాళ్లు ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు. ఒకడు తొండం పట్టుకుని తొండమే ఏనుగు అన్నాడు. మరొకడు తోక పట్టుకొని తోకే ఏనుగు అన్నాడు. ఇంకొకడు కాలు, మరొకడు దంతాన్ని పట్టుకుని అనే ఏనుగు అనుకున్నారు. వారికి తెలిసిన పాక్షిక సత్యాన్ని అజ్ఞానంతో అహంకారంతో సంపూర్ణ సత్యంగా ప్రకటిస్తున్నారు. పాక్షిక సత్యాన్ని విని మోసపోవద్దని చెప్పడం కేనోపనిషత్తు విశిష్టత. దేనిని మాటలతో చెప్పలేమో, దేనితో మాటలు ఏర్పడ్డాయో అదే అసలైన బ్రహ్మపదార్థం. భ్రమతో అనుకునేది నిజమైనది కాదు. ఏది మనస్సుకు తెలియదో, దేనివల్ల మనస్సు అన్నిటినీ తెలుసుకోగలుగుతోందో అనే అసలైన బ్రహ్మం. దేనిని కళ్లతో చూడలేమో, దేనివల్ల కళ్లు చూడగలుగుతున్నాయో అదే బ్రహ్మం. దేనిని చెవితో వినలేమో, దేనివల్ల చెవి వినగలుగుతోందో అదే బ్రహ్మం. దేనిని ప్రాణం బతికించలేదో ప్రాణం దేనివల్ల ఉంటున్నదో అదే బ్రహ్మం అని తెలుసుకోవాలి. అంతేకానీ, పాక్షిక సత్యాలను తాత్కాలిక ఫలితాలను నమ్మి మోసపోవద్దని కేనోపనిషత్తు చెబుతోంది. మాటలతో, మనసుతో, చూపుతో, వినికిడితో, ప్రాణంతో పరబ్రహ్మజ్ఞానం కలిగినట్లు భావించరాదు. అంతరిక్షంలోకి పోయే వాహనంలో కొన్ని భాగాలు ఎక్కడికక్కడ విడిపోయి పడిపోతూ ఉంటాయి. అసలైన ఉపగ్రహాన్ని పైకి చేర్చటమే వాటి పని. అంతేకాని అవి ఉపగ్రహం కావు. వాక్కు, మనస్సు, కన్ను, చెవి, ప్రాణం అలాంటివి. సగుణపాసన అలాంటిదే అని కేనోపనిషత్తు స్పష్టంగా చెబుతోంది. -
మహాజ్ఞానిని కూడా అనుసరించరాదు
శాస్త్ర సారాన్ని ఒక్క వాక్యంలో ఆవిష్కరిస్తాడు గురువు. కాబట్టి ఆచార్యః. ఆచరించి చూపువాడు. ఆచరణలేని విద్య ఎవరికి పనికొస్తుంది? ఆయన ఫలానా పనిచేయడు, కానీ చేయాల్సిందిగా అందరికీ చెబుతుంటాడు. ఆయనే చెయ్యనప్పుడు ఇంకెవరు చేస్తారు. మరొకాయన పరమనిష్ఠాపరుడు. ప్రాణం పోయినా అది చేయకుండా ఉండడు. ఆ మంచిపని ఒక్కటి చాలు పదిమందికి మార్గదర్శకత్వం వహించడానికి. ఇక్కడ ఒక చిన్న మర్మం ఉంది. జాగ్రత్తగా గమనించాలి. ఆచరణ చేసే గురువుంటాడు, చెయ్యని గురువుకూడా ఉంటాడు. ఇద్దరూ గురువులే. ఒక గురువుకు ఆచరణ ఉండదు. ఆచరణ లేదు కాబట్టి గురువుకాడని అనలేం. ‘నేను ఆత్మ’ అని 24 గంటలు ఆత్మగానే నిలబడిపోయే స్థాయికి వెళ్ళిన వాళ్ళుంటారు. భగవాన్ రమణులలాంటివారు. ఆయనకు ఒంటిమీద బట్టకూడా అక్కర్లేదు. ‘అయ్యా, మీకయితే సర్వం బ్రహ్మం. కానీ మాకు మాత్రం తేడాలున్నాయి. ఓ గోచీ అయినా పెట్టుకోండి’ అని శిష్యులంటే పెట్టుకున్నారాయన. ఆయనకు – శరీరంవేరు, ‘నేను’ వేరు. ఇది తెలుసుకున్న ఆయన మహాజ్ఞాని. ఆయన ఫలానా పనులేవీ చేయడు కదండీ, నేను కూడా మానేస్తానంటే కుదరదు. ఎప్పుడూ జీవితంలో ఇద్దరిని అనుకరించరాదు. మహాజ్ఞానిని, అజ్ఞానిని. ఇది బాగా గుర్తుంచుకోండి. మహాజ్ఞానిని అనుకరించకూడదు. రామకృష్ణ పరమహంసకు కంఠంలో రాచపుండు పుట్టింది. అన్నం మింగలేకపోతున్నారు. ఒకసారి వివేకానందుడు ఆయనతో ‘మీతో కాళికాదేవి మాట్లాడుతుంది కదా, ‘‘అమ్మా ! అన్నం తినలేకపోతున్నా’’ అని చెప్పుకో కూడదా? తినే అవకాశం కల్పిస్తుంది కదా !’ అని సూచించాడు. ‘సరే, అయితే అడుగుతా నుండు. అని లోపలికి వెళ్ళివచ్చారు. ‘‘ఏమంది అమ్మ?’’ అని అడిగారు వివేకానందుడు. ‘ఇన్ని కంఠాలతో తింటున్నది నీవు కాదా!’ అన్నదని చెప్పారు. అంతటా ఉన్నది ఒక్క ఆత్మ. అలా మనం ఉండగలమా? ఆయనలా నీవు ఉండగలిగితే నీవు కూడా ఆయనను అనుకరించవచ్చు. గోచీపెట్టుకోంగానే రమణ మహర్షికాలేం కదా ! మహాజ్ఞాని ఆత్మగా నిలబడిపోయి ఉంటాడు. రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది. శస్త్రచికిత్స చేసారు. ఆ పుండు కోసి కట్టుకట్టినప్పుడు వేడి తగలకూడదట. వేడి తగిలితే శరీరం బద్దలై రక్తం చుక్కలు చుక్కలుగా కింద పడిపోతుందట. అది తెలియక ఆయన అనుచరగణం అది చలికాలం కావడంతో మంచం కింద హీటరు పెట్టారు. శరీరమంతా బద్దలైపోయి ఆయన నెత్తురు చుక్కలుగా కారి తట్టు కట్టింది. డాక్టర్లు వచ్చి ‘ఎవరు పెట్టారు హీటరిక్కడ’ అని అడిగితే ‘చలిగా ఉందని పెట్టామండీ, ఇంత అనర్థం అవుతుందని తెలియదే’ అన్నారు ‘ఇంత నెత్తురు కారిపోతుంటే మమ్మల్ని పిలవొచ్చుగా లేదా మీరే దాన్ని తీసేయచ్చుగా అన్నారు డాక్టర్లు. రమణులన్నారు తాపీగా..’’దీనికి (శరీరానికి) బాగుంటుందని వారు (హీటర్) పెట్టారు, బాగుండదని మీరంటున్నారు. ఇది బాగాలేదని అదేమో బద్దలయిపోయింది. ఈ మూడూ చూస్తున్నా.’’ అన్నారు..! అందుకే మహాజ్ఞానిని అనుకరించరాదు. ఇక అజ్ఞాని–వాడికేం తెలియదు. ఏదయినా పద్ధతి చెబితే చెయ్యనంటాడు. ఆయన చెయ్యడం లేదు కాబట్టి నేను కూడా చెయ్యను అనకూడదు. అలా అజ్ఞానిని అనుకరించరాదు. మరెవరిని అనుకరించాలి? శాస్త్రమెరిగి పాటించే వారిని అనుసరించాలి. అలా శాస్త్రం తెలుసుకుని పాటించేవాడు ఆచార్యుడు. ఆయనను అనుసరించాలి. ఎప్పటివరకు? నీవు పండేవరకు. -
నయనా.. నిన్నొదల!
ఆ కారులో ఓ ఆత్మ ఉంది. అది నయనతారను వెతుక్కుంటూ వచ్చింది. వచ్చిన పని ముగించేంత వరకూ వదల నయనా... నిన్నొదల అంటుంది. ఆత్మ ఏ పని మీద వచ్చింది? నయనతారనే ఎందుకు వెంటాడుతుంది? తెలియా లంటే సినిమా విడుదలయ్యే వరకూ వెయిట్ చేయమంటున్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. నయనతార ముఖ్యతారగా దాస్ రామసామి దర్శక త్వంలో రూపొందిన తెలుగు, తమిళ హారర్ థ్రిల్లర్ ‘డోర’. మల్కాపురం శివకుమార్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. త్వరలో టీజర్, ఈ నెలలో ఆడియో రిలీజ్ చేస్తామని ఆయన తెలిపారు. -
కన్నీటితో సమాధుల పండుగ
కర్నూలు సీక్యాంప్: చనిపోయిన తమ కుటుంబీకుల ఆత్మలకు శాంతి కలగాలని జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు సమస్త పరిశుద్ధ ఆత్మల పండుగ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. సమాధుల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేయడం ద్వారా చనిపోయిన తమ వారికి ఆత్మలకు శాంతి కలుగుతుందని క్రైస్తవుల నమ్మకం. ప్రపంచ వ్యాప్తంగా కాథలిక్లు ఈ సమాధుల పండుగను జరుపుకుంటారు. కర్నూలు, నంద్యాలలో తమ పూర్వీకుల సమాధులపై కొవ్వొత్తులు వెలిగించి సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బిషప్ పూల ఆంథోని, రెవరెండ్ అనిల్ కుమార్, రెవరెండ్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జీవితమంతా రంధ్రాన్వేషణమే!
నరుడి శరీరానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఈశ్వరుడు తనకి ఏ విభూతినిచ్చాడో దాన్ని మాత్రమే కాక, ప్రపంచం మొత్తం మీద ఏ ప్రాణిలో ఏ గొప్ప విభూతి ఉన్నా దానిని తనదిగా వాడుకోగలిగిన శక్తి ఒక్క నరుడికే ఉంటుంది. మరే ఇతర ప్రాణికీ ఉండదు. వేగంగా పరిగెత్తగల, పర్వతాలు ఎక్కగల గుర్రాన్ని మచ్చిక చేసుకుని తాను కూడా అదేవేగంతో వెళ్లగలడు, పర్వతాలు సునాయాసంగా ఎక్కగలడు. నీళ్ళలో ఈదగలిగిన చేపను చూసి తానూ నేర్చుకోవడమేగాక, ఓడలు చేసుకుని సముద్రాలు దాటి వెళ్ళగలడు. ఎగరగలిగిన శక్తిని ఆ పరమేశ్వరుడు ఒక్క పక్షికే ఇచ్చాడు. దాని గమనాన్ని ఆకళింపుచేసుకున్న మనుష్యుడు విమానాలు ఎక్కి ఎగురుకుంటూ వెళ్ళగలుగుతున్నాడు. మొక్కలోని ఓషధీ శక్తిని తీసుకుని తన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి వినియోగించుకుంటున్నాడు. ఈశ్వరుని సృష్టిలోని సమస్త ప్రాణుల ైవభవాన్ని తన అభ్యున్నతికి వాడుకోగల శక్తి ఒక్క నరుడికే ఉంది. ఆ బుద్ధి ఒక విస్ఫోటనా శక్తి. ఆ శక్తిని మనుష్యునిలో ఉంచిన పరమేశ్వరుడు దానికి తోడుగా ఐదు ఇంద్రియాలు ఇచ్చాడు. వీటితో మనుష్యజన్మకున్న పరమ ప్రమాదకరమైన లక్షణం కానీ, తననితాను ఉద్ధరించుకోగలిగిన శక్తికానీ నిలబడతాయి. అపారమైన తెలివితేటలకు పక్కన ఐదు ఇంద్రియాలను అనుభవించడానికి కొన్ని కోట్ల భోగాలను కూడా పెట్టాడు. ప్రధానంగా శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములని ఐదు భోగములను మనుష్యుడు అనుభవిస్తాడు. శబ్దమంటే చెవితో వినడం. చెవితో విని అనుభవించేవి ఎన్నో ఉంటాయి. ఓ వీణానాదం, ఓ ఉపన్యాసం, పక్షుల కలకూజితాలు... తెల్లవారిలేస్తే ఎన్నో శబ్దాలు విని పరవశించ గల శక్తి మనుష్యునికి ఉంది. ఇది మిగిలిన ప్రాణులకు లేదు. వాటికి చెవి ఉపయోగం ఎంతవరకు అంటే... కొన్ని కొన్ని శబ్దాల చేత అవి ప్రీతి పొందుతాయి. ఇవి మనకు హాని చేయవన్న నమ్మకం పొందుతాయి. మరికొన్ని శబ్దాలను ప్రమాదకరమని గుర్తిస్తాయి. అంతవరకే వాటి ప్రయోజనం. అంతకుమించి దానికి మరే ఉపయోగం ఉండదు. మిగిలిన ప్రాణులు పొందలేని ఇటువంటి సుఖాలు మనుష్యుడు పొందుతున్నాడు. అన్నిటికంటే పెద్ద సుఖం ఏమిటంటే... ఈ చెవులగుండా విని కొన్ని కోట్ల జన్మలనుండి తరుముకొస్తున్న వాసనా బలాన్ని వదలిపెట్టేస్తాడు. ఇది మనుష్యజన్మకున్న ప్రత్యేకమైన గొప్పతనం. వాసనాబలం అని ఒకటుంటుంది. అది శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు జీవుడు పైకి వెళ్ళి పోతున్నప్పుడు ఇక్కడ అన్నీ చక్కబెట్టుకుని వెళ్ళిపోతాడు. మృత్యుకాలం ఆసన్నమయిందను కోండి. సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఐదు జ్ఞానేంద్రియాల శక్తులను తీసి మూటకట్టుకుంటుంది. కంటిలోంచి చూసే శక్తిని, చెవినుంచి వినికిడి శక్తిని, నాలుకకు రుచి చెప్పే శక్తిని, చర్మానికి స్పర్శశక్తిని, ముక్కుకి ఉన్న వాసనా శక్తిని తీసి మూటకడుతుంది. ఇప్పుడు ఎటునుంచి బయటికి వెళ్ళాలా అన్ని ప్రయత్నిస్తుంది.దానికి ఒక తీర్పు ఏర్పాటు చేసాడు పరమేశ్వరుడు. జీవించి ఉన్నంతకాలం తొమ్మిది రంధ్రాలు పనిచేయాలి. పుట్టేవరకు ఒక రంధ్రం, వెళ్ళిపోయేటప్పుడు మరొక రంధ్రం పనిచేయాలి. పదకొండు రంధ్రాల మీద ఉంటుంది. మనకు తత్త్వంలో ఒకమాట అంటుంటారు.’వాడికి రంధ్రాన్వేషణ’ అలవాటురా !’ అని. అసలు జీవితంలో వేదాంత తత్త్వమంతా ఆ ఒక్కమాటలోనే ఉంది. వాస్తవంగా కూడా వాడి జీవితమంతా రంధ్రాన్వేషణమే. అమ్మకడుపులో చీకట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి రంధ్రాన్ని వెతుక్కుంటాడు. బయటికి వచ్చాక పసితనంలో ఎక్కడ ఉన్నాడో అక్కడే మలమూత్ర విసర్జన చేస్తాడు. కొంచెం పెద్దయిన తర్వాత సైగలతో చెప్తే అమ్మ వాడిని మరుగుదొడ్డికి తీసుకుని వెళ్ళి వస్త్రం విప్పేయగానే విసర్జన ఎక్కడెక్కడినుంచి అవుతున్నదో తెలుసుకుంటాడు. ఆ తరువాత వాటిని తన నియంత్రణలో ఉంచుకుంటాడు. యవ్వనం వచ్చిన తరువాత రంధ్రాన్వేషణమే మనిషి ప్రవృత్తి. ఆ తరువాత ఉద్యోగంలో డబ్బు ఎందుకిస్తారంటే రంధ్రాన్వేషణకే. తప్పులు వెతికి పట్టుకున్నందుకే. ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన చేయాలి కదా.. అంటే రంధ్రం వేయాలి. చిట్టచివరివరకు ఎవరియందు రంధ్రాన్వేషణమనే బుద్ధి నిలబడుతుందో వాడు తరించి పోయాడని గుర్తు. రెండుకళ్ళు, రెండు ముక్కులు, రెండు చెవులు, నోరు, మలమూత్ర ద్వారాలు. ఈ తొమ్మిది రంధ్రాల్లోంచి శరీరంలోనుంచి ఎప్పుడు ఏది ఎక్కడ బయటికి వెళ్ళాలో, బయటినుంచి ఏది లోపలకు వెళ్ళాలో ఈ జీవుడు వాటిని చక్కగా వినియోగించుకుని, 10 రకాల వాయువులను- ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, క్రికర, కూర్మ, ధనంజయ, దేవదత్తములనే వాటిని లోపల కుంభించగల శక్తితో ఉంటే... వాడు ఉన్నాడని గుర్తు. ఒకసారి పీలిస్తే అది పది వాయువులవుతుందని శాస్త్రం చెపుతుంది. అవి లోపల ఈ తోలుతిత్తిలో నిలబడాలి. ఈ తిత్తికి తొమ్మిది కన్నాలు. ఇవి చిట్టచివర మూటగట్టుకుని ఏ రంధ్రంలోంచి బయటికి వెళ్ళాలా... అని రంధ్రాన్వేషణ చేసే సమయంలోనే... అక్కడ మనుష్య జన్మను ఎవడు ఎలా వాడుకున్నాడన్న విషయాన్ని పరమేశ్వరుడు పరీక్షగా చూస్తాడు. ఈశ్వరుడు ఎప్పుడూ మనిషి పునర్జన్మలో వేలు పెట్టడు. మనిషి తన కర్మలచేత తానే తన పునర్జన్మను నిర్ణయించుకుంటాడు. నేను నిర్ణయించుకోనిది పరమేశ్వరుడు ఇవ్వడు. ఎందుకో తెలుసా? అక్కడే వాసన అన్న మాట వస్తుంది. వాడు శాస్త్రాన్ని, గురువుగారి పాదాలను, భగవంతుని బాగా పట్టుకున్నవాడయితే వాడు ఊర్ధ్వలోక చలనం చేస్తాడు. మాడు దగ్గర బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. దానిని మూతవేసి ఉంచుతాడు పరమేశ్వరుడు. అలా ఆ సమయానికి శరీరంలోని వాయువులను పైకి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రాన్ని బద్దలు కొట్టుకుని ఎవరు అక్కడినుంచి నిర్గమిస్తారో వారు మళ్ళీ ఇక ఈ శరీరంలోకి రారు. వివేకానందుడి వంటి మహాత్ములు వారి నిష్ర్కమణ ముహూర్తాన్ని వారే పెట్టుకున్నారు. అలా వెళ్లలేని వాడు... దొంగదారుల్లో వెడతాడు. అంటే అధోముఖంగా వెడతాడని గుర్తు. -
పదహారు కళల పురుషుడు!
ప్రశ్నోపనిషత్ పిప్పలాద మహర్షికి శుశ్రూష చేసి ఆయన అనుగ్రహంతో బ్రహ్మజ్ఞానాన్ని క్రమంగా, సమగ్రంగా, త్రికరణ శుద్ధితో తెలుసుకోవాలని భక్తిశ్రద్ధలతో వచ్చిన ఆరుగురు ఋషులలో చివరివాడు భరద్వాజ గోత్రుడైన సుకేశుడు అడగబోయే ప్రశ్న వింతగా, విచిత్రంగా కనిపిస్తుంది. కాని మొదటి ప్రశ్న నుండి ఆరవ ప్రశ్నలో ఒక క్రమవికాసం గోచరిస్తుంది. ప్రాణిపుట్టుక ఎలా జరిగింది? జీవులను ఎందరు దేవతలు పోషిస్తున్నారు? శరీరంలోకి ప్రాణం ఎలా వస్తోంది? ఎలా పోతోంది? మెలకువ, నిద్ర, కలలు, గాఢనిద్ర ఇవన్నీ అనుభవించేది ఎవరు? ఓంకార ధ్యానక్రమం, ప్రయోజనాలు..? పదహారు అంగాలతో ఉండే పురుషుడు ఎవరు? అనే ప్రశ్నల సమాధానాలలో నిరాకార పరబ్రహ్మం సాకారత ఎనభై నాలుగు లక్షల జీవరాశిగా గోచరించటం, బ్రహ్మపదార్థపు రాకపోకలు, నిద్ర, స్వప్నాది అవస్థలను అనుకరిస్తూ ధ్యానమార్గంలో తానే నిరాకార పరబ్రహ్మమనే జ్ఞానాన్ని, అద్వైత స్థితిని పొందటంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. భరద్వాజ గోత్రుడైన సుకేశుడు పిప్పలాద మహర్షికి నమస్కరించాడు. దేవర్షీ! ఒకప్పుడు కోసలదేశపు యువరాజు హిర ణ్యనాభుడు నా దగ్గరకు వచ్చాడు. సుకేశా! పదహారు కళలతో ఉండే పురుషుడు ఎవరో నీకు తెలుసా? అని అడిగాడు. యువరాజా! అతను ఎవరో నాకు తెలియదు. తెలిస్తే ఎందుకు చెప్పను? తెలియకుండా అబద్ధం చెప్పేవాడు సమూలంగా నశించిపోతాడు. కనుక నేను అబద్ధం చెప్పను అన్నాను. యువరాజు మౌనంగా రథమెక్కి వెళ్లిపోయాడు. ఆ ప్రశ్న ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పదహారు కళలతో ఉన్న పురుషుడు ఎవరు? అప్పుడు పిప్పలాద మహర్షి ఇలా అన్నాడు. సుకేశా! నీవడిగిన మహాపురుషుడు ఎవరో కాదు. ఆత్మయే. ఆత్మ మన శరీరంలోనే ఉంటుంది. దానిలోనుంచే పదహారు కళలు, అంగాలు ఆవిర్భవించాయి. ఒకప్పుడు ఆత్మ ‘ఎవరు బైటికి వెళితే నేను బైటికి వెళ్లినవాణ్ణి అవుతాను? ఎవరు లోపల ఉంటే నేను లోపల ఉండగలుగుతాను?’ అని తనలో తాను ప్రశ్నించుకుంది. భరద్వాజా! ఆత్మయే ప్రాణాన్ని సృష్టించింది. ఆ ప్రాణం నుంచి శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇంద్రియాలు, మనస్సు, అన్నం, అన్నం నుంచి వీర్యం, తపస్సు, మంత్రాలు, కర్మలోకాలు, అలోకాలు అన్నీ ఏర్పడ్డాయి. కర్మలను బట్టి ఆయా లోకాలకు పేర్లు ఏర్పడ్డాయి. వీటిని అన్నిటినీ లెక్కిస్తే పదహారు కళలు అవుతాయి. కనుక పదహారు కళలు లేదా అంగాలు కల పురుషుడు ఆత్మయే. నదులన్నీ సముద్రం వైపు ప్రవహిస్తాయి. సముద్రాయణంలో వేర్వేరు పేర్లు కలిగిన నదులు సముద్రంలోకి చేరగానే భిన్నభిన్న నామరూపాలను కోల్పోతున్నాయి. అన్నిటినీ కలిసి సముద్రం అని పిలుస్తున్నాం. అదేవిధంగా వేర్వేరుగా కనపడుతున్న పంచభూతాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు అన్నీ ఆత్మ సృష్టించిన ప్రాణంలో నుంచి ఏర్పడినవే. ఈ పదహారు ఆత్మ వైపు ప్రయాణం చేసి ఆత్మలో కలిసిపోతాయి. ఇదే పురుషాయణం. ఆత్మ పురుషునిలో లీనం కాగానే వీటి పేర్లు, రూపాలు అన్నీ పోతున్నాయి. మొత్తానికి ‘పురుషుడు’ అనే ఒక్క పేరు మిగులుతోంది. ఈ పురుష శబ్దం స్త్రీ పురుష లింగభేదాల్లోనిది కాదు. రూపరహితం, నామ రహితం, లింగరహితమూ అయిన ఆత్మను పురుష శబ్దంతో వేదం పేర్కొంటోంది. పురుష సూక్తం ఈ ఆత్మస్వరూపాన్ని విశ్వాత్మ సమగ్ర దర్శనాన్ని చెబుతోంది. పురుష శబ్దంతో చెప్పబడే ఆత్మకు ఎటువంటి కళలు, అంగాలు, చావు పుట్టుకలు, మార్పులు, చేర్పులు ఏవీ ఉండవు. అది అమరం. అది శాశ్వతం. ఆ ఆత్మ బహిర్ముఖం అయినప్పుడు పదహారు కళలతో ఉంటోంది. కనుక పదహారు కళలు గల పురుషుడు ఆత్మయే. ‘అరా ఇవ రథనాభౌ కలా యస్మిన్ ప్రతిష్ఠితాః తం వేద్యం పురుషం వేద యథా మా వో మృత్యుః పరివ్యథా ఇతి’ నాయనా! రథచక్రంలోని ఆకులు (చువ్వలు)లాగా పదహారు కళలు ఎవరిలోనుండి వెలుపలికి వస్తూ ఎవరిలో లీనమైపోతున్నాయో ఆ పురుషుణ్ణి గురించి తెలుసుకోండి. అనగా పరమాత్మను గురించి తెలుసుకోండి. అప్పుడు మృత్యువు ఇక మిమ్మల్ని బాధపెట్టదు. మీ ఆరుగురు నా దగ్గర తెలుసుకోవడానికి వచ్చిన బ్రహ్మజ్ఞానంలో నాకు తెలిసింది ఇంతే. ఇది తెలిస్తే అంతా తెలిసినట్టే అని ఆశీర్వదించాడు. వారంతా ఎంతో ఆనందంతో ‘‘మహర్షీ! అజ్ఞాన సాగరాన్ని దాటించి అవతల తీరానికి చేర్చిన మీరే మాకు తండ్రి. మీకు శత సహస్ర వందనాలు’’ అంటూ పాదాభివందనం చేశారు. మూలాధారం నుంచి సహస్రారానికి చేరుకునే కుండలినీ శక్తికి, ఆరుచక్రాల ప్రయాణంలాగా సాగిన ప్రశ్నోపనిషత్తుకు అభివందనం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
ఆత్మ నుంచి ప్రాణం పుడుతుంది
ప్రశ్నోపనిషత్ పిప్పలాద మహర్షి దగ్గరకు వెళ్లిన ఆరుగురు ఋషులలో మొదటివాడు కబంధి ‘మానవులంతా ఎక్కడి నుంచి పుడుతున్నారు?’ అనే ప్రశ్న అడిగాడు. సమాధానం తెలుసుకున్నాడు. రెండోవాడు భార్గవుడు ‘ఒక ప్రాణిని ఎంతమంది దేవతలు పోషిస్తున్నారు’ అని అడిగితే ప్రాణశక్తియే అన్నిటికీ మూలం అని సమాధానం వచ్చింది. వెంటనే కోసల దేశానికి చెందిన అశ్వలాయనుడు ‘గురుదేవా! ప్రాణం ఎక్కడ నుండి పుడుతోంది? అది శరీరంలోకి ఎలా వస్తోంది? శరీరంలో తనకు తాను అయిదు భాగాలుగా విభజించుకుని ఎలా ఉంటోంది? ఎలా శరీరంలో నుంచి వెళ్లిపోతోంది? ప్రాణశక్తి వెలుపలి ప్రపంచాన్ని, లోపలి ప్రపంచాన్ని ఎలా కాపాడుతోంది? అని వరుసగా అయిదు ఉపప్రశ్నలు ప్రాణశక్తి ఉత్పత్తి, వికాసం, నిష్ర్కమణల గురించి చకచకా అడిగాడు. ఆశ్వలాయనుడి ఉత్కంఠ, హడావిడి చూసి పిప్పలాద మహర్షి చిరునవ్వుతో ‘ఓ కౌసల్యా! నువ్వు చాలా కఠినమైన ప్రశ్నలు అడిగావు. నువ్వు బ్రహ్మిష్ఠుడివై బ్రహ్మజ్ఞానాన్ని జిజ్ఞాసతో అడిగావు కనుక నీకు సమాధానం చెబుతాను. శ్రద్ధగా విను. అర్థం చేసుకో’ అని చెప్పడం ప్రారంభించాడు. ‘నాయనా! ఆత్మ నుంచి ప్రాణం పుడుతుంది. ప్రతి జీవినీ తన నీడ తనను అనుసరించినట్లు ఆత్మ వెంట ప్రాణం ఉంటుంది. మనస్సు ప్రమేయంతో ప్రాణం శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక చక్రవర్తి ఆయా ప్రాంతాలను పరిపాలించడానికి అధికారులను నియమించినట్టు మహాప్రాణశక్తి తనలో నుండి అయిదు విభాగాలను వేరువేరు పనులకు నియమిస్తుంది. కొన్ని బాధ్యతలు తానే స్వయంగా నిర్వహిస్తుంది. మలమూత్ర విసర్జన అవయవాల బాధ్యతను ‘అపానవాయువు’ చూసుకుంటుంది. కన్ను, చెవి, ముక్కు, నోరు జ్ఞానేంద్రియాల బాధ్యతను తానే స్వయంగా నిర్వహిస్తుంది. దీనినే ‘ప్రాణవాయువు’ అంటాం. శరీరం మధ్య భాగంలో ఆహార స్వీకరణ, వినియోగం, శరీరం మొత్తానికి సమానంగా చేర్చడం బాధ్యతగా చూసుకోవడానికి నియమింపబడిన దాని పేరు ‘సమాన వాయువు’ ఈ సమాన వాయువు నుండి ఏడు రకాల జ్వాలలతో అగ్ని ఏర్పడుతుంది. దీనినే ‘జఠరాగ్ని’ అంటారు. నాయనా! ‘ఆత్మ’ దేహంలోని హృదయంలో ఉంటుంది. ఆ హృదయం నుంచి నూటొక్క నాడులు శరీరం అంతా వ్యాపిస్తాయి. ఒక్కొక్క నాడికి వంద ఉపనాడులు ఉంటాయి. ఒక్కొక్క ఉపనాడికి డెబ్బయి రెండు వేల శాఖలు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన అన్ని నాడుల్లోనూ సంచరించే ప్రాణశక్తిని ‘వ్యానవాయువు’ అంటారు. ఈ నాడుల్లో ఒక నాడి ఊర్ధ్వముఖంగా పైకి ప్రయాణిస్తుంది. అది ప్రాణులను పైకి తీసుకువెళుతుంది. అందులో సంచరించే ప్రాణశక్తిని ‘ఉదాన వాయువు’ అంటారు. ఇది పుణ్యం చేసిన వారిని పుణ్యలోకాలకు, పాపం చేసినవారిని పాప లోకాలకు తీసుకుపోతుంది. పాపపుణ్యాలు రెండూ చేసిన వారిని మనుష్య లోకానికి చేరుస్తుంది. కౌసల్యా! మన కంటికి కనపడే సూర్యుడే బాహ్య ప్రాణశక్తి. ఆయన జీవుల కళ్లల్లో కాంతిరూపంలో ఉంటాడు. అదే జీవశక్తి. భూమిపై ఉన్న దైవశక్తి ప్రాణులలో ఉన్న ‘అపానశక్తి’ని అదుపులో పెడుతూ ఉంటుంది. ఆకాశం ‘సమాన వాయువు’ను నడిపిస్తూ ఉంటుంది. సర్వత్రా వ్యాపించిన ప్రాణశక్తి ‘వ్యానవాయువును’ నియంత్రిస్తూ ఉంటుంది. ‘ఉదానవాయువు’ను అగ్ని గమనిస్తూ ఉంటుంది. ఈవిధంగా పంచభూతాలు ప్రాణశక్తి బాహ్యరూపాలుగా బాధ్యతలు వహిస్తాయి. ఉదాన వాయవును చూసే అగ్ని ఏ ప్రాణిలో నశించిపోతుందో ఆ జీవి ఇంద్రియాలు వెంటనే మనస్సులో కలిసిపోతాయి. అతడు మళ్లీ జన్మించే ప్రక్రియ మొదలవుతుంది. జీవి తాను మరణించేటపుడు తన మనసులో ఉన్న ఆలోచనతో తిరిగి అవయవాలుగా విడిపోయి కొత్త శరీరంలో ప్రాణం పోసుకుంటాడు. ‘ఉదాన ప్రాణశక్తి’ జీవుణ్ణి అతడు సంకల్పించిన చోటుకు తీసుకువెళుతుంది. నాయనా! నేను చెప్పిన క్రమంలో ప్రాణశక్తి ఉత్పత్తి వికాసాలను తెలుసుకున్న వారి వంశం పరంపరగా వర్ధిల్లుతుంది. నశించకుండా శాశ్వతమై కొనసాగుతుంది. దాన్ని గురించి చెప్పే శ్లోకం విను - ఉత్పత్తి మాయతిం స్థానం, విభుత్వం చైవ పంచధా, ప్రాణస్య విజ్ఞాయామృత మశ్నుతే, విజ్ఞాయామృత మశ్నుత ఇతి. ప్రాణశక్తి ఉత్పత్తిని, వికాసాన్ని, స్థానాలను, ప్రాధాన్యాన్ని, కార్యకలాపాలను తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని తప్పక పొందుతాడు. ముమ్మాటికీ ఇది సత్యం. తెలుసుకో’’ అని పిప్పలాద మహర్షి చెప్పిన ప్రాణశక్తి విశేషాలను అందరూ శ్రద్ధగా విన్నారు. నాలుగవవాడు గార్గ్యఋషి మనిషిలోని జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలను గురించి అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం వస్తుందో వచ్చేవారం చూద్దాం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
పులికి భయపడి వచ్చేశా!
టీనగర్: షూటింగ్ సమయంలో పులిని చూసి భయపడి హీరోయిన్ అంజనారాజ్ అదృశ్యమైనట్లు దర్శకుడు పావన్నన్ తెలిపారు. ఆయన కథ, దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం ‘సొల్’. ఆయన మాట్లాడుతూ స్త్రీ, పురుషుడు స్నేహంగా మెలిగితే ప్రేమ ఏర్పడుతుందనే విషయం ఇంతవరకు సినిమాలో చెప్పబడిందని, అయితే ఇరువురూ కలిసి తిరిగితే ప్రేమ రాదనేది ఈ కథ ముఖ్యాంశమన్నారు. కడలూరు అటవీ ప్రాంతంలో చిత్రం షూటింగ్ జరిగిందని, ఇందులో హీరోయిన్గా అంజనారాజ్ నటించారన్నారు. షూటింగ్ సమయంలో పులి చంపడంతో ఒక మహిళ మృతిచెందిందనే వార్త తెలిసిందని, అయినప్పటికీ షూటింగ్ జరిపేందుకు సిద్ధమయ్యామన్నారు. ఈ లోపున హీరోయిన్ కోసం వెదికి చూడగా ఆమె కనిపించలేదని, దీంతో ఎంతో భీతి చెందామన్నారు. ఆమె ఇంటికి ఫోన్ చేయగా ఆమె ఇంట్లో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆమె పులి గురించిన సమాచారం వినగానే ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిందని, ఈ చిత్రం ముగించేలోపున తాను పలువురి వద్ద మాటలు పడ్డానని, దీంతో ఈ చిత్రానికి సొల్ (మాట) అనే పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి మోహనరామన్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారని, విజయా సమర్పణలో చరణ్కృష్ణ పిక్చర్స్ సహనిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. చిత్రానికి గజేంద్రన్ సంగీతం సమకూరుస్తున్నట్లు తెలిపారు. -
బాకాసురులు
సోల్ / స్వోత్కర్ష ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయించే అంతర్ముఖులు పెద్దగా స్వోత్కర్షకు పాల్పడరు గానీ, ఇంటా బయటా వాగుడుకాయలుగా పేరుమోసిన బహిర్ముఖులు మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా ఎంతో కొంత స్వోత్కర్షకు పాల్పడుతూనే ఉంటారు. కొందరిలో ఈ లక్షణం కాస్త అతిగా ఉంటుంది. నలుగురూ పోగైన చోట అలాంటి వాళ్లను కాస్త కదిపితే చాలు.. తేనెతుట్టెను కదిలించినట్లే! ఇక మొదలెడతారు సొంతడబ్బా మోత.. అలసట చెందే వరకు లేదా అంతరాయం కలిగే వరకు వాళ్లు ఆ మోతను మోగిస్తూనే ఉంటారు. ఆ మోత ధాటికి వినేవాళ్ల చెవులు దిబ్బెళ్లెక్కడమే కాదు, మైండ్ బ్లాకవుతుంది కూడా. ఇలాంటి వాళ్లే డబ్బారాయుళ్లుగా పేరుమోస్తారు. డబ్బారాయుళ్లకు సమయ సందర్భాలతో నిమిత్తం ఉండదు. తమ మాటలు వినే బకరాలు దొరికితే చాలు, వాళ్లకు పూట గడిచిపోతుంది. స్వోత్కర్షను పెద్దలు అవలక్షణంగా పరిగణిస్తారు గానీ దీనిని అంత తేలికగా తీసిపారేయలేం. మోతతోనే మేత చాలామందికి ఈ లక్షణమే జీవనోపాధి. కొన్ని వృత్తులకు ఈ లక్షణం తప్పనిసరి కూడా. పోటీ యుగంలో వ్యాపారాలు నిలదొక్కుకోవాలంటే, సొంతడబ్బా మోతకు మించిన మార్గమే లేదు. ఇదేదో డబ్బా మోతే కదా అని చిత్తమొచ్చిన రీతిలో మోగిస్తే కుదరదు. పైగా, అలాంటి మోత వికటించే ప్రమాదాలూ లేకపోలేదు. అందువల్ల ఆచి తూచి జనాల మెదళ్లలో కదలిక తెచ్చేస్థాయిలో కొంచెం లయబద్ధంగా, ఇంచుక శ్రావ్యంగా మోగించాలి. ఇదొక కళ. దీనికే అడ్వర్టైజ్మెంట్... ప్రాపగాండా... అని రకరకాల మోడర్న్ పేర్లు ఉన్నాయి. ఎంత మోతకు అంత మేత. కళాత్మకంగా సొంత డబ్బాను ప్రచారం చేసుకోగలిగే వారికి బువ్వకు లోటుండదు. జీవితం నల్లేరు మీద బండి నడకలా సాఫీగా సాగిపోతుంది. సొంతడబ్బాకు లౌక్యమూ, చాకచక్యమూ తోడైతేనా... ఇక తిరుగే ఉండదు. అలాంటి శాల్తీలు అనతికాలంలోనే ఏకంగా దేశనాయకులుగా అవతరిస్తారు. అలాంటి వారి డబ్బా మోతకు పత్రికలు, టీవీ చానళ్లు లౌడ్స్పీకర్లలా ఉపయోగపడుతుంటాయి. రాచరిక కాలంలో మహా మహారాజులకు, చక్రవర్తులకు సొంతడబ్బా మోగించుకునే లక్షణం ఎంతో కొంత ఉన్నా, పాపం వారికి ఆ అవకాశం ఎక్కువగా ఉండేది కాదు. రాజాధి రాజులు, చక్రవర్తుల డబ్బా మోగించడానికి వారి చుట్టూ వందిమాగధులు మందలాదిగా ఉండేవారు. ఇది ప్రజాస్వామిక యుగం. పల్లకిమోసే బోయీలు కనుమరుగైపోయిన కానికాలం ఇది. నాయకమ్మన్యుల ఘనతను వేనోళ్ల పొగుడుతూ స్తోత్రపాఠాలు చదివే వందిమాగధులు అంతరించిపోయిన శకం ఇది. ఇలాంటి యుగంలో ప్రతిఫలం లేకుండా మన ఘనతను చాటేవారు ఎవరూ ఉండరు. అయితేనేం? మన ఘనతను ఎవరూ చాటకుంటే, మనమే చాటుకుందాం అన్నదే నేటి సిద్ధాంతం. ‘కన్యాశుల్కం’ కథానాయకుడు గిరీశం ప్రవచించిన సిద్ధాంతం ఇదే. పార్టీలకు అతీతంగా ఇప్పటి మన రాజకీయ నాయకులు అనుసరిస్తున్నదీ ఇదే. అందుకే, ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలన్నీ వాటి సొంతడబ్బాలే. ఎవరి డబ్బా బాగా మోగితే, వారిదే గెలుపు, వారిదే అధికారం. సోది పురాణం స్వోత్కర్ష ఆధునిక లక్షణమేమీ కాదు. మానవజాతిలో ఆది నుంచి ఉన్న లక్షణమే. పురాణ పురుషులందరూ ఇలాంటి అవలక్షణం లేని సత్తెకాలపు అమాయకులే అనుకుంటే తప్పులో కాలేసినట్లే! పురాణ పురుషులను పొగడటానికి వారి వారి వందిమాగధ గణాలు ఉండేవి. తమను తాము పొగుడుకునే అవసరం పెద్దగా ఉండేది కాదు. అయినా, వందిమాగధుల పొగడ్తల డోసు చాలదనిపించినప్పుడు కొందరు విజృంభించి మరీ స్వోత్కర్షను వినిపించేవారు. తమ ఘనతను చాటుకొనేందుకు పద్యగద్యాలతో సొంత డబ్బాను మోగించుకునేవారు. పలు పురాణాలలో ఇలాంటి ఉదాహరణలు కొల్లలుగా దొరుకుతాయి. రామాయణంలోని ఒక ఉదాహరణను చెప్పుకుందాం. విశ్వామిత్రుడి వెంట జనస్థానానికి వెడలిన రామలక్ష్మణులు అక్కడ అరాచకం సృష్టిస్తున్న రాక్షసులను మట్టుబెట్టారు. రామలక్ష్మణుల చేతిలో ఖరదూషణులు మరణించడంతో, అకంపనుడు ప్రాణభీతితో లంకకు చేరుకుని, రావణుడికి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు చూడాలి రావణుడి ఆగ్రహం. ఆ ఆగ్రహంలోనే లంకాధీశుడు సొంతడబ్బా మోతకు లంకించుకున్నాడు. ‘నా పేరు చెబితేనే మూడు లోకాలూ గజగజ వణికిపోతాయే! ఈ సాహసానికి ఒడిగట్టిందెవరు? నేను సూర్యుడిని, అగ్నిహోత్రుడిని కూడా కాల్చేస్తానే! అలాంటి నాకు ఆగ్రహం తెప్పించిందెవరు? చెప్పు..’ అంటూ అకంపనుడి మీద విరుచుకుపడ్డాడు. రామాయణ కాలంలో సొంత డబ్బా పాపం ఈ స్థాయిలోనే ఉండేది. అల్ట్రామోడర్న్ కాలంలో సొంతడబ్బా హైటెక్కుటమారాలను సంతరించుకుని, ఆ విధంగా ముందుకుపోతోంది. సుత్తి లయలు సొంత డబ్బా కొట్టుకోవడాన్నే, సొంత బాకా మోగించుకోవడం అని కూడా అంటారు. డబ్బా మోతలో లయ ఉంటుంది. బాకా మోతలో శ్రుతి ఉంటుంది. జనాల కర్మకాలి రెండూ ఏకకాలంలో మోగితే, కర్ణభీకర సంగీతం పుడుతుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఇలాంటి సంగీతమే జనాలను ఓలలాడిస్తూ ఉంటుంది. పత్రికల ద్వారా, టీవీ చానళ్ల ద్వారా, వెబ్సైట్ల ద్వారా ఈ సంగీతమే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది కూడా. సొంతబాకాను దిక్కులు పిక్కటిల్లేలా వినిపించేవాళ్లనే బాకాసురులనవచ్చు. సత్తెకాలపు పెద్దలు స్వోత్కర్షను అవలక్షణంగా ఎంచారు గానీ, నిజానికి దీనిని లలితకళగా పరిగణించాలి. స్వోత్కర్ష చేతగాని వాళ్లను ఆధునిక సమాజం దద్దమ్మలుగానే పరిగణిస్తుందనేది తిరుగులేని బహిరంగ రహస్యం. డబ్బా లయను, బాకా శ్రుతిని చిన్ననాటి నుంచే వంటబట్టించుకోవడం ఈ మాయలోకంలో మనుగడ సాగించడానికి అత్యవసరం. స్వోత్కర్షను పాఠశాల స్థాయి నుంచే సిలబస్‌లో చేరిస్తే, భావిపౌరులు బాగుపడగలరని, ఆ విధంగా వారి భవిష్యత్తుకు బంగారు బాట ఏర్పడగలదని నిక్కచ్చిగా చెప్పవచ్చు. అందువల్ల మన శాసనకర్తలెవరైనా ఈ దిశగా కృషిచేస్తే, మన దేశం అభివృద్ధి పథంలో ఎక్కడికో వెళ్లిపోగలదని కూడా నిర్మొహమాటంగా చెప్పవచ్చు. -
పెనుభూతం
సోల్/అనుమానం అనుమానం పెనుభూతం అంటారు. ఔను! ఇది నిజంగా పెనుభూతమే. ఎలాంటి భూతం పట్టినా వదిలించవచ్చు గానీ, అనుమానం పట్టుకుంటే మాత్రం వదిలించడం దాదాపు అసాధ్యం. అనుమానం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినడమే కాదు, మనశ్శాంతి కూడా కరువవుతుంది. మారుతున్న కాలంలో అనుమానం కొంతవరకు అవసరమే. అన్నింటినీ గుడ్డిగా నమ్మి, అలా నమ్మడం వల్ల మోసపోయి, తర్వాత తాపీగా విచారించే కంటే కొన్ని లావాదేవీల్లో ముందుకు పోవాలనుకున్నప్పుడు కొంచెం అనుమానించి, ఆపై ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుని నిర్ణయం తీసుకోవడం మేలు. తగు మోతాదుగా ‘అణు’మాత్రం అనుమానం ఉంటే ఫర్వాలేదు. పాపిష్టి లోకంలో సురక్షితంగా మనుగడ సాగించడానికి అది ఎంతైనా అవసరం కూడా. కాకపోతే, ఆ అనుమానం అణువంత కాకుండా, పెనుభూతంగా ఎదిగి పట్టి పీడిస్తేనే తంటా. అన్నింటినీ గుడ్డిగా నమ్మడం ఎలా క్షేమం కాదో, అన్నింటినీ అతిగా అనుమానించడమూ శ్రేయస్కరం కాదు. అను‘మాన’ధనులు అభిమానధనులను లోకం నెత్తికెత్తుకుంటుంది. వారిపై లోకులకు ఉండే అభిమానం అలాంటిది మరి! అయితే, ప్రపంచంలో అభిమానధనులు అరుదుగా ఉంటారు. స్వాభిమానాన్ని కాపాడుకుంటూనే జనాల అభిమానాన్నీ పొందగలరు వాళ్లు. అలాంటి వాళ్లే లోకానికి ఆదర్శప్రాయులుగా మన్ననలు అందుకుంటారు. కానీ, లోకుల్లో కొందరు ఉంటారు... ఉత్త అను‘మాన’ధనులు. నిష్కారణంగా భార్యలను అనుమానించే భర్తలు, భర్తలను అనుమానించే భార్యలు, తోబుట్టువులను, తోటి స్నేహితులను అనుమానించేవారు, సహోద్యోగులను అనుమానించేవారు ఇలాంటి వాళ్లే. తీరికగా ఉన్నప్పుడు కాలక్షేపానికి ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే, తమ గురించే మాట్లాడుకుంటున్నారని అనుమానిస్తారు. నేరకపోయి ఎవరైనా స్వచ్ఛందంగా సాయం చేయడానికి ముందుకొచ్చినా, ఏదో ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారేమోనని అనుమానిస్తారు. ఎవరైనా తమను పొగిడినా, ఆ పొగడ్తలను మనస్ఫూర్తిగా స్వీకరించలేరు సరికదా, పొగడ్తల వెనుక ఏదైనా వ్యంగ్యం ఉందేమోనని శంకిస్తారు. లేకుంటే కాకా పట్టేందుకే ఎదుటి వారు పొగుడుతున్నారని అనుమానిస్తారు. ఇలాంటి శాల్తీలనే నిత్యశంకితులని కూడా అంటారు. నిత్యశంకితుల వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకపోగా, అపకారమే ఎక్కువగా జరుగుతుంది. అందుకే, భర్తృహరి నిత్యశంకితులను కూడా కాపురుషుల జాబితాలో చేర్చాడు. అపనమ్మకమే మూలం అనుమానానికి అపనమ్మకమే మూలం. అనుమానవంతులు లోకంలో దేనినీ నమ్మరు. తల్లిదండ్రులను, తోబుట్టువులను, భార్యాబిడ్డలను కూడా నమ్మరు. ఇలాంటి వాళ్లు అందరితో పాటే గుళ్లకు గోపురాలకు తిరుగుతూ ఉంటారు గానీ, దేవుణ్ణి కూడా నమ్మరు. అన్నిటినీ అనుమానిస్తూ, అందరినీ అనుమానిస్తూ జీవితంలో ఆత్మీయులనే వాళ్లే లేని పరిస్థితిని తెచ్చిపెట్టుకుంటారు. చివరకు తమ నీడను తామే నమ్మలేని స్థితికి చేరుకుని, మానసిక రోగులుగా మిగులుతారు. ఇలాంటి నిత్యశంకితులు సమాజంలో ఇమడలేరు. అలాగని ఒంటరిగానూ బతకలేరు. తమకు తాముగా శాంతంగా ఉండలేరు. చుట్టుపక్కల ఉన్నవాళ్లనూ శాంతంగా ఉండనివ్వరు. శాంతంగా ఉండలేరు కాబట్టి, వీళ్లకు జీవితంలో సుఖశాంతులనేవే ఉండవు. సంకుచితుల నేస్తం ‘సంకుచిత మనస్తత్వం గలవాళ్లకు అనుమానమే నేస్తం’ అని బ్రిటిష్-అమెరికన్ తత్వవేత్త శతాబ్దాల కిందటే చెప్పాడు. లోకంపై, లోకులపై కాస్తంత విశాల దృక్పథం ఉన్నవాళ్లు అనవసరమైన అనుమానాలతో మనసు పాడుచేసుకోరు. విశాల దృక్పథం, ఔదార్యం వంటి సానుకూల లక్షణాలేవీ లేని సంకుచితులే అయినదానికీ, కానిదానికీ అన్నింటినీ అనుమానిస్తూ నిత్యశంకితులుగా మారుతారు. అనుమానం ఉన్నచోట మైత్రి మనుగడ సాగించలేదు. అనుమానంతో సతమతమయ్యే వారికి స్నేహితులు కరువవుతారు. లేనిపోని అనుమానాల వల్ల మనుషుల మధ్య సహజంగా ఉండాల్సిన ప్రేమాభిమానాలు నశించి, పగ, ద్వేషం వంటి ప్రతికూల భావనలు పెచ్చరిల్లుతాయి. ప్రతికూల భావనలు ముప్పిరిగొన్నప్పుడు సంకుచితత్వాన్ని విడనాడి వీలైనంత త్వరగా వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు చేయడం మంచిది. అలాంటి ప్రయత్నాలేవీ చేయకుండా, ఇంకా సంకుచితంగానే వ్యవహరిస్తుంటే, అలాంటి వాళ్లకు బంధుమిత్రులందరూ దూరమై, అనుమానమే నేస్తంగా మిగులుతుంది. అంతర్జాతీయ అవలక్షణం అనుమానం ఒక అంతర్జాతీయ అవలక్షణం. ఇది ఏదో ఒక జాతికో, ఒక ప్రాంతానికో పరిమితమైనది కాదు. ప్రపం చం నలుమూలలా మనుషుల్లో అనుమానించే లక్షణం కనిపిస్తూనే ఉంటుంది. అనుమానించే లక్షణం పట్ల మనుషులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, అనుమానం పెనుభూతమై మనసంతటినీ ఆక్రమిస్తుందని ఇంగ్లిష్ తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ చెప్పాడు. ఒకవేళ పాలకులకే ఈ లక్షణం ఉంటే, వాళ్లు నియంతలుగా పరిణమించి ప్రజలను పీడించుకు తింటారని కూడా ఆయన హెచ్చరించాడు. చరిత్రలో ఇలాంటి నిత్యశంకితులైన నియంతలు ఎందరో కనిపిస్తారు. హిట్లర్, ముసోలినీ, ఇడీ అమీన్ వంటి వాళ్లు సొంత నీడనైనా నమ్మని రకాలు. వాళ్ల కారణంగా మానవాళికి వాటిల్లిన కష్టనష్టాలు అందరూ ఎరిగినవే. అపరాధ భావనతో నిండిన మనస్సును అనుమానం వేధిస్తుందని షేక్స్పియర్ చెప్పా డు. అపరాధాలకు పాల్పడని వాళ్లు, తమ పట్ల ఇతరులు చేసిన అపరాధాలను క్షమించగలిగిన వాళ్లు ఇతరులను అనవసరంగా అనుమానించరు. మరో ఇంగ్లిష్ రచయిత శామ్యూల్ జాన్సన్ అయితే, అనుమానాన్ని ‘అనవసర వేదన’గా అభివర్ణించాడు. అంతేకాదు, అనుమానం ఒక అనవసర మానసిక భారం. స్కాటిష్ కవి రాబర్ట్ బర్న్స్ అనుమానాన్ని ‘భారకవచం’గా అభివర్ణించాడు. మనిషికి రక్షణ ఇవ్వడానికి కవచం అవసరమే. అయితే, కవచమే మోయలేని భారంగా మారితే, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అనుమానం పెనుభూతంగా పరిణమిస్తే, మనసుకు మోయలేని భారంగా మారి, మనిషిని నిలువెల్లా కుంగదీస్తుంది. అందువల్ల కనికల్ల నిజము తెలుసుకుని, అనుమానాలను ఎప్పటికప్పుడు పటాపంచలు చేసుకోవడమే విజ్ఞుల లక్షణం. -
మంచి ఆత్మలకు నిలయాలు జంతువులే..
మూగజీవాలే మంచి ఆత్మలకు నిలయాలని హాలీవుడ్ నటి జూడీ డెంచ్ అన్నారు. అవంటే తనకు చాలా ఇష్టమని, వాటినే తాను నిజంగా నమ్ముతానని చెప్పారు. ప్రస్తుతం నాలుగు పిల్లులను, రెండు గినియా పిగ్స్, 12 వాటర్ వోల్స్, రెండు చేపలతోపాటు కొన్ని ఎలుకలను కూడా పెంచి పోషిస్తున్న ఆమె తనకు వాటితో చాలా చక్కటి అనుభందం ఉందని పేర్కొంది. క్రిస్మస్ కు కొద్ది రోజుల ముందు తాను ఎంతో ముద్దుగా పెంచుకున్న ఓ పిల్లి కనిపించకుండా పోయిందట. అయితే, అది ఎలాగైనా తిరగొస్తుందని, ప్రస్తుతం తన వద్ద ఉన్న మిగతా పెంపుడు జంతువులను చూసి ఆనందపడుతూ ఆ బాధను పోగొట్టుకుంటున్నట్లు పేర్కొంది. తాను ఎక్కడకు వెళ్లినా వాటికి ఇష్టమైన ఆహారం మాత్రం తీసుకురాకుండా మర్చిపోనని జంతు ప్రేమ చూపిస్తోంది ఈ అమ్మడు. -
ఆత్మసాక్షాత్కారం
జ్యోతిర్మయం ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః అహంకార మమకారాలన్న సంకెళ్లలో మనిషిని బంధించాలన్నా, వాటి నుండి విముక్తి కలిగించాలన్నా, మనసే కారణం’ అంటోంది అమృత బిందూపనిషత్తు. మనిషి ఈ జీవితంలో ఏ కార్యకలాపాల్ని కొన సాగించాలన్నా, ఏ వ్యవహారాల్ని నిర్వహించాలన్నా, ఆతనికి ఉన్న సాధనాలు రెండే రెండు. పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రి యాలతో కూడిన శరీరం అందులో మొదటి బహిరంగ సాధనం. రెండవది అంతరంగం అనబడే సాధనం. ఈ అంతరంగం వాస్తవంగా ఒకటే అయినా, వృత్తి భేదాన్ని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని పిలుస్తుంటారు. ఒకే వ్యక్తి ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి అనీ, ఇంటికి వచ్చినప్పుడు భార్యకు భర్త అనీ, పుత్రునికి తండ్రి అనీ, సహచరునకు మిత్రుడనీ, వ్యవహారాన్ని బట్టి వివిధంగా ఎలా పిలవబడతాడో, అలాగే అంత రంగమే డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు, ఈ పని చేయాలా ఆ పని చేయాలా, అసలు ఏ పనీ చేయకుండా ఉండాలా అని ఆలోచించేటప్పుడు మనస్సు అనీ, ఈ పనినే చేద్దాం అని నిశ్చయించుకున్నప్పుడు బుద్ధి అనీ, ఆ చేసిన పనిని గుర్తు ఉంచుకునేటప్పుడు చిత్తమనీ, ఆ పని ఫలితాన్ని అనుభ వించేటప్పుడు అహంకారమనీ పిలుస్తారు. ఈ అంతరంగం అధీ నంలోనే, బహిరంగ సాధనమైన శరీరం స్పందిస్తుంది. కనుక మన కున్న రెండు సాధనాల్లో అంతరంగమే ప్రధానం. శరీరం గౌణం. మనిషి జీవన యాత్రలో విజయాల్ని సాధించాలన్నా, పరాజ యాల్ని చవిచూడాలన్నా, రాజ్యాలేలాలన్నా, అంతరిక్షంలోకి ఎగ రాలన్నా, కావ్యాల్ని అల్లాలన్నా, వైజ్ఞానికంగా అభివృద్ధి చెందా లన్నా, ఇలా లౌకికంగా ఏ వ్యవహారాన్ని చేయాలన్నా, ఈ అంత రంగమే ప్రధాన సాధనం. ఇంక అలౌకిక మార్గంలో జపతపాల్ని చేయాలన్నా, పూజాదికాల్ని నిర్వహించాలన్నా, యజ్ఞయాగాదుల్ని నిర్వర్తించాలన్నా, వ్రతాదుల్ని అనుష్టించాలన్నా, పారాయణల్ని చేయాలన్నా, మహాత్ముల ప్రవచనాల్ని వినాలన్నా, పుణ్యక్షేత్రాల్ని దర్శించాలన్నా, శాస్త్రాల్ని అధ్యయనం చేయాలన్నా, ఈ అంత రంగమే ప్రధాన సాధనం. ఇంక ఆధ్యాత్మికంగా నేనెవర్ని, ఈ జగత్తేమిటి, పరమేశ్వరు డెవ్వడు అన్న విచారణ చేయాలన్నా, వేదాంత వాక్యాల్ని శ్రవణం చేయాలన్నా, మననం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, ఈ అంతరంగమే ప్రధాన సాధనం. ఆధ్యాత్మిక మూలాల్ని తరచి చూస్తే, అమనస్క స్థితియే అంటే మనసు లేని స్థితియే బంధ విముక్తి అనీ ముక్తి అనీ వేదాంతం ఘోషిస్తోంది. సూటిగా చెప్పా లంటే ముక్తిని సాధించాలంటే మనిషి, తనకున్న ఏకైక ప్రధాన సాధనమైన అంతరంగాన్ని కోల్పోవాలి. ఈ అమనస్క స్థితికి చేరాలన్నా, మనిషి మనస్సునే ఆశ్రయించాలి. అంటే మనస్సుతోనే మనస్సును నిర్వీర్యం చేయాలి. ఇది ఎలా సాధ్యం? మన నిత్యజీవితంలో మనకు తారసపడే అవస్థలు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు. జాగ్రత్ స్వప్నాలు మనసును ఆశ్రయించినవే. మనసులేని స్థితి సుషుప్తియే కదా! జీవన్ముక్తి పొందాలంటే మనసు అధీనంలో ఉన్న జాగ్రత్ దశలో ఉంటూనే, మనసు లేని సుషుప్తిని పొందగలగాలి. అంటే కర్మ చేస్త్తూనే కర్తృత్వ భోక్తృత్వాల్ని పరిత్య జింపగలగాలి. నేను కర్తను భోక్తను కాను, సర్వ వ్యవహారాలకు ఆధారమైన చైతన్యాన్నే నేను, అన్న నిష్ఠ కలిగి ఉండాలి. అదే ఆధ్యా త్మికం. నిన్ను నీవు చైతన్య స్వరూపంగా ధ్యానిస్తూ, ప్రాణులందరినీ చైతన్య స్వరూపాలుగా భావించాలి. ప్రపంచాన్నే ఒక చైతన్య స్రవం తిగా దర్శించాలి. అదే ఆత్మ సాక్షాత్కారం. ఆ స్థితిలో తరతమ భేదాలుండవు. జయాపజయాలుండవు. సుఖదుఃఖాలుండవు. అప్పుడు కర్మల్ని మనం మరింత ఉత్తేజంగా చేయగలుగుతాం. ప్రపంచాన్ని ప్రేమించగలుగుతాం. లోకహితాన్ని కోరగలుగుతాం. ఇహపరాల్ని సాధించగలుగుతాం. పరమాత్ముని -
ఆత్మలు కలుసుకునే రోజు
నేడు.. ఆల్ సోల్స్ డే! ఆత్మలు కలుసుకునే రోజు.. పోయినోళ్లందరూ మంచోళ్లే అని కీర్తించుకునే రోజు! క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే దేశాల్లో ఓ వేడుకగా జరుగుతుంది ఈ పర్వం.. ఈ సంప్రదాయం జంటనగరాలకూ చేరింది! నారాయణగూడ, బోయిగూడ, మెట్టుగూడలోని గ్రేవియార్డ్స్ పూలతేరులై క్యాండిలైట్ కాంతుల్లో ఆత్మలను ఆహ్వానిస్తాయి! మెక్సికోలో మొదలైన ఆల్స్ సోల్స్ డేను ఇప్పుడు ప్రపంచంలోని క్రైస్తవ దేశాలు, క్రైస్తవులు ఎక్కువగా ఉండే రాజ్యాలూ జరుపుకుంటున్నాయి. మన దగ్గర పెద్దల పండుగ, పితృ అమావాస్య లాంటిదన్నమాట. ఈ ఆల్ సోల్స్ డే ఇక్కడా అంతటా జరుపుకున్నా నారాయణగూడ, బోయిగూడ, మెట్టుగూడల్లోని క్రైస్తవ శ్మశానవాటికల్లో ఓ వేడుకలా కనిపిస్తుంది. పూలు.. కొవ్వొత్తికాంతులు ఒకరోజు ముందు నుంచి దీనికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతుంటాయి. పాలరాతి సమాధులనైతే కడిగి శుభ్రం చేస్తారు. రాతి సమాధుల రంగులు వెలసిపోతే వాటికి రంగులు వేస్తారు. తెల్లవారి అంటే ఆల్ సోల్స్ డే నాడు ఉదయమే చనిపోయిన తమ ఆప్తుల ఇష్టమైన వంటకాలు వండి వాటిని సమాధి దగ్గరకు తీసుకెళ్తారు. ప్రార్థన చేసి సమాధి ముందు ఆ వంటకాలను పెట్టి ఇళ్లకు వెళ్లిపోతారు. సాయంత్రం ఏడు తర్వాత అసలు పర్వం మొదలవుతుంది. బంతిపూలు, గులాబీలతో సమాధులను చక్కగా అలంకరిస్తారు. ఆయా సమాధుల ముందు వాళ్ల వాళ్ల ఫొటోలను అమరుస్తారు. శ్మశానం గేటు దగ్గర్నుంచి సమాధి వరకు పూలతో దారి చేస్తారు. తమ ఆప్తుల ఆత్మలు ఆ పూల దారిలో నడిచి వస్తాయని ఈ ఆత్మీయుల నమ్మకం. ఆనక కొవ్వొత్తులను వెలిగించి మళ్లీ ప్రార్థిస్తారు. పెద్దల సమాధుల దగ్గర సందడి నెలకొంటే చిన్నవయసులో చనిపోయినవారి సమాధుల దగ్గర విషాదం ఆవహించి ఉంటుంది. శ్మశానం బయట... లోపల ఓ వాతావరణం ఉంటే బయట జాతరను తలపించే వాతావరణం ఉంటుంది. పూలు అమ్మే బళ్లు... బెలూన్లు అమ్మే అబ్బీలు... కొవ్వొత్తులు పెట్టుక్కూర్చున్న వాళ్లు... ఇంకా తినుబండారాలు అమ్మేవాళ్లు ఇలా రకరకాల బళ్లతో శ్మశానం గేటు ఎన్నడూ లేని జీవకళను కంటది. మెక్సికో గ్రేవియార్డ్స్లోనూ ఇలాంటి సందడే ఉన్నా అక్కడ పుర్రె ఆకారంలో పళ్లతో, చక్కెరతో చేసిన స్వీట్స్‌ను సమాధుల దగ్గర పెడ్తారు. శ్మశాన వాటికను ఓ పూల రథంలా అలంకరిస్తారు. ఇదీ ఆల్ సోల్స్ డే కథ. - భరత్ భూషణ్, ఫొటో జర్నలిస్ట్