మంచి ఆత్మలకు నిలయాలు జంతువులే.. | Animals are good for the soul: Judi Dench | Sakshi
Sakshi News home page

మంచి ఆత్మలకు నిలయాలు జంతువులే..

Published Fri, Feb 27 2015 8:32 AM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

Animals are good for the soul: Judi Dench

మూగజీవాలే మంచి ఆత్మలకు నిలయాలని హాలీవుడ్ నటి జూడీ డెంచ్ అన్నారు. అవంటే తనకు చాలా ఇష్టమని, వాటినే తాను నిజంగా నమ్ముతానని చెప్పారు. ప్రస్తుతం నాలుగు పిల్లులను, రెండు గినియా పిగ్స్, 12 వాటర్ వోల్స్, రెండు చేపలతోపాటు కొన్ని ఎలుకలను కూడా పెంచి పోషిస్తున్న ఆమె తనకు వాటితో చాలా చక్కటి అనుభందం ఉందని పేర్కొంది.

 

క్రిస్‌మస్ కు కొద్ది రోజుల ముందు తాను ఎంతో ముద్దుగా పెంచుకున్న ఓ పిల్లి కనిపించకుండా పోయిందట. అయితే, అది ఎలాగైనా తిరగొస్తుందని, ప్రస్తుతం తన వద్ద ఉన్న మిగతా పెంపుడు జంతువులను చూసి ఆనందపడుతూ ఆ బాధను పోగొట్టుకుంటున్నట్లు పేర్కొంది. తాను ఎక్కడకు వెళ్లినా వాటికి ఇష్టమైన ఆహారం మాత్రం తీసుకురాకుండా మర్చిపోనని జంతు ప్రేమ చూపిస్తోంది ఈ అమ్మడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement