సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కురుస్తున్న భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. భారీ మంచు తుఫాను కారణంగా వందలాది విమానాలు రద్దు అయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ మంచు తుఫాను గత 50 ఏళ్లలో సంభవించిన అత్యంత భారీ విపత్తుగా చెబుతున్నారు. సియోల్ పరిసర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల మేర మంచు కురిసిందని దక్షిణ కొరియా వాతావరణశాఖ తెలిపింది. 1972, నవంబర్ 28న సియోల్‌లో 12 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. ఈ మంచు తుఫాను ప్రభావం దేశంలోని పలు ప్రాంతాలలో కనిపించింది.
눈 대박이다... 버스 40분 남아서 역까지 걸어오고 전철도 지연되서 기다리는중.. 차들이 오르막길 못 올라가 버스도 사고나서 승객들 다.내림... pic.twitter.com/jZ1OnGVsYz
— 🇰🇷숼🇰🇷 (@sowol_sy) November 27, 2024
దేశంలోని మధ్య, తూర్పు, నైరుతి ప్రాంతాలలో దాదాపు 10 నుండి 23 సెం.మీ. మేరకు హిమపాతం కురిసింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో 220 విమానాలు రద్దు కాగా, 90 బోట్లను ఓడరేవులోనే ఉంచాలని అధికారులు ఆదేశించారు. సియోల్‌లోని రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ట్రాఫిక్ స్థంభించింది. రోడ్లపై కూలిపోయిన చెట్లను తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: నేటి పార్లమెంట్‌లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు
Comments
Please login to add a commentAdd a comment