snow storm
-
దక్షిణ కొరియాలో మంచు తుఫాను.. మూసుకుపోయిన రహదారులు
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కురుస్తున్న భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. భారీ మంచు తుఫాను కారణంగా వందలాది విమానాలు రద్దు అయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఈ మంచు తుఫాను గత 50 ఏళ్లలో సంభవించిన అత్యంత భారీ విపత్తుగా చెబుతున్నారు. సియోల్ పరిసర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల మేర మంచు కురిసిందని దక్షిణ కొరియా వాతావరణశాఖ తెలిపింది. 1972, నవంబర్ 28న సియోల్‌లో 12 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. ఈ మంచు తుఫాను ప్రభావం దేశంలోని పలు ప్రాంతాలలో కనిపించింది. 눈 대박이다... 버스 40분 남아서 역까지 걸어오고 전철도 지연되서 기다리는중.. 차들이 오르막길 못 올라가 버스도 사고나서 승객들 다.내림... pic.twitter.com/jZ1OnGVsYz— 🇰🇷숼🇰🇷 (@sowol_sy) November 27, 2024దేశంలోని మధ్య, తూర్పు, నైరుతి ప్రాంతాలలో దాదాపు 10 నుండి 23 సెం.మీ. మేరకు హిమపాతం కురిసింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో 220 విమానాలు రద్దు కాగా, 90 బోట్లను ఓడరేవులోనే ఉంచాలని అధికారులు ఆదేశించారు. సియోల్‌లోని రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ట్రాఫిక్ స్థంభించింది. రోడ్లపై కూలిపోయిన చెట్లను తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు -
USA: కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మంచు కారణంగా సియెర్రా నెవడాలోని ప్రధాన రహదారిని మూసివేశారు. రాబోయే రోజుల్లో మంచు తుపాను మరింత తీవ్రమవనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. A snow storm hinders traffic on one of the main roads in California.#snow #Snowfall #snowstorm #California #USA pic.twitter.com/Jc8nam9SO2 — Anil Kumar Verma (@AnilKumarVerma_) March 3, 2024 పలు ప్రధాన రోడ్లపై మంచు కుప్పులకుప్పలుగా పేరుకుపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఈ రోడ్లపై రాకపోకలు తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారో స్పష్టత లేకుండా పోయింది. మంచు కారణంగా కరెంటు ఇళ్లు, షాపులకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. స్కై రిసార్టులను మూసివేశారు. ⏰#Breaking:❄🇺🇸 - It has snowed just a little bit in 📌Truckee ⛳️ California: Snow reports of up to 5 feet around downtown with another 8-14 inches to come by Monday. Semi trucks abandoned and buried on I-80 EB east of Truckee. pic.twitter.com/X5XkxqbYdt — SHORT NEWS (@BuonJose11019) March 3, 2024 ఇదీ చదవండి.. పాక్‌లో భారీ వర్షాలు.. 37 మంది మృతి -
కాలిఫోర్నియాకు మంచు తుపాను, వరద ముప్పు
లాస్ఏంజెలెస్: అమెరికాను మంచుతుపాను అతలాకుతలం చేస్తోంది. కాలిఫోర్నియాను శనివారం మధ్యాహ్నానికి ఎన్నడూ లేనంతటి వరదలు, తీవ్ర మంచు తుపాను చుట్టుముట్టే ప్రమాదముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లాస్ఏంజెలెస్ కొండ ప్రాంతాల్లో 5 అడుగుల మేర మంచు కురియవచ్చని, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇళ్లకే పరిమితం కావాలని కోరింది. మంచు తుపాను ఈ వారమంతా కొనసాగుతుందని పేర్కొంది. ఒరెగాన్ నగరంలో చాలా భాగం అడుగు మేర మంచు కురిసింది. పోర్ట్‌లాండ్‌లో అకస్మాత్తుగా కురిసిన మంచుతో ట్రాఫిక్ జామైంది. కరెంటు లైన్లు తెగిపోవడంతో సరఫరా నిలిచింది. స్కూళ్లు మూత బడ్డాయి. 10 లక్షల నివాసాలు, వ్యాపార సంస్థలు చీకట్లో మగ్గాయి. మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియా, న్యూయార్క్, విస్కాన్సిన్‌ల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
అమెరికాలో భీకర మంచు తుపాను (ఫొటోలు)
-
అమెరికాలో భీకర మంచు తుపాను.. 1989 తర్వాత తొలిసారిగా బ్లిజ్జార్డ్ వార్నింగ్
పియెర్రె: అమెరికాను భీకర మంచు తుపాను వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి. వందలాది నివాసాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లు మూతబడ్డాయి. వాతావరణ విభాగం 1989 తర్వాత మొదటిసారిగా మంచు తుపాను (బ్లిజ్జార్డ్) హెచ్చరికలను జారీ చేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 4.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా సుమారు 24 రాష్ట్రాల్లోని 6.5 కోట్ల మంది ప్రజలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. వ్యోమింగ్, ఆరిజోనా, న్యూ మెక్సికో, పోర్ట్‌ల్యాండ్, ఓరెగాన్ పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్ప డింది. మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియా ల్లో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో జనం రాత్రిళ్లు చీకట్లోనే గడిపారు. మంచు, చలిగాలులతో కాలిఫోర్నియా, సియెర్రా నెవడాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సుమారు 1,800 విమాన సర్వీసులు రద్దు కాగా, మరో 6 వేలకు పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇలా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఇందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నాష్‌విల్లేలో బుధవారం అత్యధికంగా 26.67 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై 127 ఏళ్ల రికార్డు బద్దలైందని అధికారులు చెప్పారు. ఇండియానా పొలిస్, సిన్సినాటి, అట్లాంటా, లెక్జింగ్టన్, కెంటకీ, అలబామాల్లోనూ ఇదే స్థాయిలో ఎండలున్నాయి. -
స్వగ్రామానికి తెలుగు దంపతుల కుమార్తెలు
సాక్షి, ప్రత్తిపాడు: అమెరికాలో దుర్మరణం చెందిన తెలుగు దంపతుల కుమార్తెలు ఆదివారం స్వగ్రామానికి రానున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు ఉద్యోగ రీత్యా ఏడేళ్లుగా అమెరికాలోని అరిజోనాలో ఉంటున్నారు. ఈ నెల 26వ తేదీన పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లిన దంపతులు సరస్సులో గల్లంతై, మృత్యుఒడికి చేరిన విషయం తెలిసిందే. వారి ఇద్దరు కుమార్తెలు పూజిత, హర్షితలు ఒంటరిగా మిగిలిపోయారు. తానాతో పాటు నారాయణ పనిచేస్తున్న టీసీఎస్ కంపెనీ ప్రతినిధులు చొరవ తీసుకుని ఇద్దరు చిన్నారులను భారత్‌కు తీసుకువస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం చిన్నారులను తీసుకుని టీసీఎస్ ప్రతినిధులు అమెరికాలోని డల్లాస్ నుంచి భారతదేశానికి బయల్దేరారు. ఆదివారం ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా స్వగ్రామానికి తీసుకువచ్చి నాయనమ్మ వెంకటరత్నం, తాతయ్య సుబ్బారావుకు చిన్నారులను అప్పగిస్తారని బంధువులు చెప్పారు. నారాయణ, హరిత మృతదేహాలు ఇక్కడకు వచ్చేందుకు మరికొద్ది రోజులు పడుతుందని తెలిపారు. -
చిత్రకారుడు బాలి తనయుడు మంచు తుపానులో మృతి
సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత, చిత్రకారుడు, బొమ్మల శిల్పి బాలి కుమారుడు మేడిశెట్టి గోకుల్ (45) అమెరికాలో మంచు తుపానులో చిక్కుకుని మరణించాడు. అమెరికాలో గుంటూరుకు చెందిన దంపతులను రక్షించబోయి గోకుల్ ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు. ఆ సమయంలో గోకుల్ భార్య శ్రీదేవి, కూతురు మహతి ఒడ్డునే ఉన్నారు. వారి కళ్లెదుటే దుర్ఘటన జరగడంతో వారు కుప్పకూలిపోయారు. గోకుల్ కుటుంబం గత 15 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడింది. ఈయన అమెరికాలో ఓ ప్రముఖ బీమా కంపెనీలో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. గోకుల్ మరణ వార్త తెలియడంతో ఇక్కడ బాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. చదవండి: (సీపీ టు డీజీపీ.. 36 ఏళ్లలో పని చేసిన 21 మంది) -
Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాన్ 'బాంబ్ సైక్లోన్' విధ్వంసం సృష్టిస్తోంది. రక్తం గట్టకట్టే చలిలో ప్రజలు వణికిపోతున్నారు. వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ మంచు తుఫాన్ కారణంగా క్రిస్మస్ పండుగను కూడా సరిగా జరుపుకోలేకపోయారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా మంచు భారీగా కురవడంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు మంచు దిబ్బల్లా మారాయి. రోడ్లు, ఇళ్లు శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి ఈ మంచు కారణంగా అనేక ప్రమాదాలు కూడా జరిగాయి. A drone has captured incredible footage of entire houses encased in ice after a bomb cyclone hit the US and parts of Canada. Read more: https://t.co/jMSLhhH6kY pic.twitter.com/wdLzJUuUJA — Sky News (@SkyNews) December 28, 2022 #bombcyclone2022 #snowstorm #BombCyclone ravages East America,death toll rises to 60 The worst damage was in the #Buffalo area of #NewYork.Severe impact on electricity services. Due to the blizzard,nearly 200,000 residents eastern #USA haven't Electricity in the extreme cold pic.twitter.com/GFhGbitYGA — Kaustuva Ranjan Gupta (@GuptaKaustuva) December 28, 2022 మంచు తుఫాన్ వల్ల అమెరికాలో ఇప్పటివరకు 70 మందికిపైగా చనిపోయారు. కొందరు మంచులోనే గడ్డకట్టి కన్నుమూశారు. మరికొందరు వివిధ ప్రమాదాల్లో మరణించారు. That’s happened during a Historic Bomb Cyclone after a Decades. pic.twitter.com/uy10cJFfSM — Adeel Ali (@AdeelAl03137938) December 25, 2022 Bomb Cyclone Light house, Michigan City, 🇺🇸 pic.twitter.com/0BUQWIgMFR — Earth & beyond (@umadevipavuluri) December 26, 2022 పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. మరోవైపు దొంగలు రెచ్చిపోయారు. స్టోర్లలోకి వెళ్లి దొంగతనాలకు పాల్పడ్డారు. దొరికిన కాడికి నగదు, వస్తువులు దోచుకెళ్లారు. Bomb Cyclone Buffalo, NY, 🇺🇸 Many stores were under theft pic.twitter.com/rT0E0mGToJ — Earth & beyond (@umadevipavuluri) December 26, 2022 అమెరికాలో మంచు తుఫాన్‌కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రోడ్లపై కార్లు జారుకుంటూ వెళ్లడం, వేడి నీటిని గాల్లోకి విసిరితే మంచులా మారడం వంటి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. The view out my parents garage in Prince Edward County. The drift is up to their second story patio #ONstorm #BombCyclone pic.twitter.com/ocbD9KPuZF — Smith (@RileyZSmith) December 25, 2022 Shouldn't laugh but..........#ice #blizzard #WinterStorm #BombCyclone #Elliott #wind #snow #Ice #WeatherBomb video:@kayokayla pic.twitter.com/jJyswxJDkd — Volcaholic (@CarolynnePries1) December 24, 2022 Bomb Cyclone ! Ashtoshing Scenas, Drone Camera Work , Shows Hudge Snow Mountains in NY. Buffalo, NY, 🇺🇸 #BombCyclone #BombCylonebyDrone #BuffaloNY #BuffaloStorm2022 pic.twitter.com/LxKa0oKM5b — Top Viral Videos (@ManojKu40226010) December 26, 2022 Amid plunging temperatures, one person in Montana decided to throw some boiling water in the air and make more snow. The huge winter storm pummelling the US has intensified into a "bomb cyclone", with 60% of the population under a winter weather warning.https://t.co/4DalHHz9Lj pic.twitter.com/ADu80WBRKP — Sky News (@SkyNews) December 24, 2022 Snow plows at work as Mammoth winter storm unleashes chaos in #Vancouver Extremely Dangerous travel conditions, due to freezing rain @TranBC @MainroadLM#BritishColumbia #BCStorm #Canada #Elliott #ColdWave #BombCyclone #Weather #Climate #GlobalWarming #BCSnow #PortMannBridge pic.twitter.com/ZGyHRQejuP — Earth42morrow (@Earth42morrow) December 23, 2022 చదవండి: రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్16 ఆరోగ్యం విషమం -
అమెరికా మంచు తుపానులో గుంటూరు దంపతులు మృతి
పెదనందిపాడు(గుంటూరు జిల్లా): అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీలో నివాసముంటున్న గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు సరస్సు దాటుతున్న క్రమంలో గల్లంతయ్యారు. ఈ ఘటనలో భార్య హరిత మృతదేహం లభ్యమైంది. ఆమె భర్త నారాయణ, అతడి స్నేహితుడు ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తమ ఇద్దరు పిల్లలు, స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫీనిక్స్‌లో ఉన్న సరస్సు దాటే క్రమంలో మంచు ఫలకలు కుంగాయి. దీంతో నారాయణ, ఆయన భార్య హరిత, స్నేహితుడు సరస్సులో పడిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో హరిత మృతదేహం లభించింది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని అమెరికాలోని నారాయణ స్నేహితులు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా ఈ ఘటనలో చిన్నారులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదని తెలిపారు. పాలపర్రుకు చెందిన ముద్దన వెంకట సుబ్బారావు, వెంకటరత్నం దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో కుమారుడు నారాయణ పెద్దవాడు. కష్టపడి చదివి విదేశాల్లో స్థిరపడిన కుమారుడు కుటుంబానికి అసరాగా ఉంటున్న సమయంలో విధి ఇలా చేస్తుందని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు, తోబుట్టువులు రోదిస్తున్నారు. కనీసం కడసారి చూపులకైనా మృతదేహాలను స్వగ్రామానికి తరలించేలా ప్రభుత్వం కృషి చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విన్నవించారు. ఇదీ చదవండి: బయల్దేరే సమయానికి మంచు తుపాను...ఏకంగా 18 గంటల పాటు కారులో -
మంచు తుపానులో చిక్కుకున్న మహిళ..18 గంటల తర్వాత ఆమె..
అమెరికాలో బఫెలో మంచు తపాను బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పైగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం డ్యూటీ ముగించికుని ఇంటికి వస్తున్న 22 ఏళ్ల టేలర్ అనే మహిళ న్యూయార్క్‌లోని బఫెలో తుపానులో చిక్కుకుపోయింది. దీంతో ఆమె తుపాను తగ్గాక వెళ్దామని నిర్ణయించుకుంది. ఎంతకీ మంచు తుపాను తగ్గక పోవడంతో కారులో అలానే ఏకంగా 18 గంటల పాటు ఉండిపోయింది. పాపం తన అవస్థను ఓ వీడియో సందేశం ద్వారా తన స్నేహితులకు తెలియజేసింది కూడా. అయితే ఆ తర్వాత ఆమె కారులో శవమై కనిపించింది. ఆ వీడియో ఆధారంగా ఆమెను కాపాడేందుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ కూడా మంచు తుపానులో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఆఖరికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా చిక్కుకుపోయారు. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం ఆమె మృతదేహం లభించిందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా అంతటా ఈ మంచు తుపాను కారణంగా సుమారు 60 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. (చదవండి: అమెరికాను ముంచేసిన మంచు.. 60 మంది మృతి) -
విషాదం.. పుట్టినరోజు నాడే మృత్యు ఒడికి.. మంచులో గడ్డకట్టి..
వాషింగ్టన్: పుట్టినరోజు నాడే మృత్యు ఒడికి చేరాడు ఓ వ్యక్తి. మంచులో గడకట్టి ప్రాణాలు విడిచాడు. అతను కన్పించట్లేదని పోలీసులను ఆశ్రయించిన కుటుంబసభ్యులు.. ఆ తర్వాత కొన్ని గంటలకే విషాదంలో మునిగిపోయారు. మంచుదిబ్బలో అతని మృతదేహం దొరకడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా న్యూయార్క్ నగరంలోని బఫెలోలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు విలియం క్లే(56). డిసెంబర్ 24న అతని బర్త్‌డే. ఆ మరునాడే క్రిస్మక్ కూడా కావడంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం ఉంది. అయితే అమెరికాలో అప్పటికే మంచు తుఫాన్ బీభీత్సం సృష్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 24న ఇంటి దగ్గర ఉన్న ఓ దుకాణానికి వెళ్లాడు విలియం. చాలాసేపైనా తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే మంచులో ఓ శవం కన్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది విలియందేనని పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులు కూడా దీన్ని ధ్రవీకరించారు. పుట్టినరోజు నాడే తన తండ్రి చనిపోవడంతో విలియం కుమారుడు జూల్స్ క్లే కన్నీటి పర్యంతమయ్యాడు. ఒక్కరోజు ముందే తండ్రితో చాలాసేపు మాట్లాడానని, ప్రేమిస్తున్నాని చెప్పానని బోరున విలపించాడు. మరోవైపు విలియం సోదరి అతడు మరణించిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అతడి మృతదేహం వీడియోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. విలియంకు అంత్యక్రియలు నిర్వహించేందుకు విరాళాలు ఇవ్వాలని కోరింది. దాతలు వెంటనే స్పందించి 5,000 డాలర్లుకుపైగా(దాదాపు రూ.4లక్షలు) సమకూర్చారు. చదవండి: పండుగకు ఫ్యామిలీతో షాపింగ్ చేస్తుండగా కాల్పులు.. టిక్ టాక్ స్టార్ మృతి -
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. నాలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
అమెరికాలో మంచు తుపాను విలయంతో నాలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. తూర్పు కోస్తా రాష్ట్రాలైన న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా నగరాల్లోని రహాదారులపై రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. శీతలగాలుల తీవ్రతతో ఈ హిమపాతం మరో నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందని అమెరికా వాతావరణ విభాగం అంచనా వేసింది. తుపాను కారణంగా అత్యవసర సేవలు మినహా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మంచుతుపాను ధాటికి దేశవ్యాప్తంగా నాలుగు వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్, షికాగో, బోస్టన్ రాష్ట్రాల్లో విమానాశ్రయాలు పూర్తిగా మంచులో నిండిపోయాయి. రోడ్లపై రెండు అడుగులకు పైగా మంచు పేరుకు పోవడంతో అక్కడి రోడ్లన్ని ప్రమాదకరంగా మారాయి. మంచు కారణంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో ఇప్పటికే చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. -
ఒకదానికొకటి వంద కార్లు ఢీ
-
ఒకదానికొకటి వంద కార్లు ఢీ
టెక్సాస్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 100 వాహనాలు.. ఒకదానినొకటి ఢీకొని మైలున్నర మేర చిందరవందరగా పడిపోయాయి. దీంతో మైళ్ల కొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన మంచు తుపానుతో రహదారిపై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి కనీవినీ ఎరగని రీతిలో ఈ ప్రమాదానికి దారితీసింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్త్‌విత్ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అందులోని వారిని బయటకు తీసి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు. చాలా వరకు వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. జారుడుగా ఉన్న ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుందని యంత్రాంగం తెలిపింది. ఫెడ్ఎక్స్కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్‌ను ఢీకొని ఆగిపోయింది. వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో ఈ ప్రమాదాల పరంపర మొదలైనట్లు భావిస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంలో షిర్లీ మంచు తుపాను కారణంగా∙జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. తుపాను ప్రభావంతో కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోని సుమారు 1.25 లక్షల నివాసాలు, వాణిజ్యప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
అమెరికా @ 12" మంచు
షికాగో: భారీ మంచు తుపాను, చలిగాలుల కారణంగా అమెరికాలో ఏడుగురు మృతి చెందగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే 500 పైగా విమాన సర్వీసులు రద్దు కాగా 5,700 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంచు తుపాను కారణంగా చాలా చోట్ల 12 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. ఈ తీవ్రత రానున్న రోజుల్లో న్యూమెక్సికోతోపాటు దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణాది రాష్ట్రాల్లో చలితోపాటు భారీ వర్షాలతో పాటు వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. లూసియానా, కెన్సాస్, నార్త్ డకోటా, టెన్నిస్సీ, మిన్నెసొట్టా ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గురువారం కూడా దేశవ్యాప్తంగా 6,500 విమానాలు ఆలస్యంగా నడవగా మరో 800పైగా సర్వీసులు రద్దయినట్లు వివరించారు. మంచు కారణంగా చాలా చోట్ల రహదారులను కూడా మూసి వేశారు. మరికొద్ది రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వణికిపోతున్న అగ్రరాజ్యం
అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఉష్ట్రోగ్రతలు విపరీతంగా పడిపోవడం, తీవ్రంగా మంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా మంచు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. న్యూయార్క్‌లో 6 నుంచి 10 అంగుళాలు, న్యూజెర్సీ, కనెక్టికట్‌లలో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు తుపానుతో పాటు బలమైన గాలులు కూడా వీస్తుండటంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాలుల నేపథ్యంలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు లక్ష ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విమానాల రద్దు మంచు తుపాను కారణంగా విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే న్యూయార్క్, న్యూజెర్సీ ఎయిర్ పోర్టుల్లో వేల సంఖ్యలో విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దాదాపు 2600 విమానాలు రద్దు అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆయా ప్రయాణికులంతా ఎయిర్‌పోర్టుల్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల అవసరాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. -
అమెరికాను వణికిస్తున్న ‘రైలీ’ తుపాను
న్యూయార్క్: అమెరికాను రైలీ మంచుతుపాను వణికిస్తోంది. తీవ్ర గాలులకు తోడు భారీ వర్షాలు, దట్టంగా మంచు కురుస్తుండటంతో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. దీని ప్రభావంతో తూర్పుతీరంలో ఉండే ప్రభుత్వ కార్యాలయాలు మూతపడగా.. న్యూజెర్సీ నుంచి మసాచుసెట్స్ వరకూ ఉండే నగరాలను వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దాదాపు 3,000 జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. -
మంచు తుపాను కమ్మేసింది
18,500 అడుగుల ఎత్తుకు వెళ్లా.. - సామాన్యులెవరూ వెళ్లలేరు - మైనస్ డిగ్రీల్లోనే ఉష్ణోగ్రతలుంటాయి - లడఖ్ పర్యటనపై ఎస్పీ విశ్వజిత్ కంపాటి సిరిసిల్ల: ‘దేశ సరిహద్దుల్లో మన సైన్యం నిత్యం కంటికి రెప్పలా కాపలాకాసే విధానాన్ని కళ్లారా చూశా.. సముద్రమట్టానికి 18,500 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ లభించని మంచుకొండల్లో గస్తీ తిరిగే ఆర్మీ.. ఎవరికి ఏం జరిగినా జనావాసాలకు చేరాలంటే కనీసం 8 గంటలు ప్రయాణించాల్సిందే.. ఇలాంటి ప్రాంతంలో రేయింబవళ్లు మనవాళ్లు రక్షణగా ఉండడం నిజంగా గొప్ప విషయం’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి అన్నారు. 1959లో సీఆర్ïపీఎఫ్ గస్తీ బృందాన్ని చైనా బలగాలు దొంగదెబ్బ తీసి.. మెరుపు దాడి చేయడంతో 20 మంది జవాన్లు చనిపోయారు.. వారి త్యాగాన్ని స్మరిస్తూ ఏటా లడఖ్ ప్రాంతంలోని హాట్ స్ప్రింగ్‌లో నిర్మించిన అమరజవాన్ల స్థూపానికి నివాళులు అర్పిస్తుంటారు. ఇందుకోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది అధికారుల బృందం లడఖ్ వెళ్లింది. ఆ బృందంలో తెలంగాణ రాష్ట్రం నుంచి జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఒక్కరే వెళ్లారు. 2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విశ్వజిత్.. గత ఆగస్టు 21 నుంచి ఈనెల 10 వరకు 20 రోజుల పాటు దేశ సరిహద్దుల్లోకి వెళ్లి భారత వీరజవాన్లకు నివాళి అర్పించి వచ్చారు. ఈ సందర్భంగా తన పర్యటన అనుభవాలను మంగళవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... మంచుపర్వతాల మధ్య ప్రయాణం.. చండీగఢ్ నుంచి వాహనంలో మా ప్రయాణం మొదలైంది. 3 రాత్రులు, 4 రోజులపాటు మా ప్రయాణం సుమారు వెయ్యి కిలోమీటర్లు సాగింది. నిజానికి ఆ రోడ్లు అంతగా బాగుం డవు. గుట్టలు, మంచుపర్వతాలతో నిండి ఉంటుంది. అందుకే అంతసమయం పట్టింది. ఇద్దరు అధికారులు వెనక్కి వచ్చారు.. హాట్స్ప్రింగ్కు చేరడానికి శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. మానసికంగా దృఢత్వం కావాలి. ఎందుకంటే భూమికి 16,000 అడుగుల ఎత్తులో గాలిలో ఆక్సిజన్ ఉండదు. ఆస్తమా వంటి శ్వాసకోశవ్యాధులతో బాధపడే వారు రాకూడదు. నాతోపాటు వచ్చిన ఇద్దరు అధికారులు ముందుకు సాగలేక వెనక్కి వచ్చారు. నాకు ఐపీఎస్ ట్రెయినింగ్‌లో కశ్మీర్ లోని అనంతనాగ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. మా వెంట భారత ఆర్మీ జవాన్లు, ఐటీ బీపీ బలగాలు హాట్‌స్ప్రింగ్ వరకు వచ్చాయి. నివాళి అనిర్వచనీయమైన అనుభూతి చైనా సరిహద్దుల్లో ఎడారిని తలపించే మంచు గుట్టల మధ్య.. హాట్‌స్ప్రింగ్ వద్ద అమరులైన జవాన్లకు నివాళి అర్పించడం అనిర్వచనీ యమైన అనుభూతిని ఇచ్చింది. మరోసారి అవకాశం వస్తే.. మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. మంచుతుపాను కమ్మేసింది.. సాయుధ పోలీసుల మధ్య హాట్స్ప్రింగ్కి చేరుకున్నాం. అక్కడి ఆర్మీతో కలిసి నివాళి అర్పించిన తర్వాత ఒక్కడినే బైక్‌పై కొంత ముందుకు వెళ్లాను. నా సహచరులంతా వద్దని వారించారు. కానీ వెళ్లాను. ఎత్తయిన ప్రాంతం కావడంతో ఆక్సిజన్ కరువైంది. వెనక్కి వద్దామని నిర్ణయించుకునే లోగానే మంచుతుపాను కమ్మేసింది. కొంతసేపు ఆ తుపానును ఆస్వాదించి తిరిగి వెనక్కి వచ్చాను. అక్కడేం జరిగినా వైద్యం అందా లంటే 8 గంటలు ప్రయాణించాల్సిందే. ఫోన్లు పనిచేయవు. కనుచూపు మేరలో మంచు కనిపిస్తుంది. నేను వెళ్లి వచ్చిన తెల్లారే ఆ ప్రాంతంలో హెలిక్యాప్టర్ క్రాష్ అయింది. మన జవాన్ల సేవలకు సలాం.. అక్కడ ప్రతికూల పరిస్థితుల్లో చలిలో, మంచు తుపానుల్లో మన జవాన్లు సరిహ ద్దుల్లో గస్తీ తిరగడం కళ్లారా చూశాను. వాళ్ల కు సలాం చేయాలనిపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో కార్గి ల్, లడఖ్, లే సరిహద్దుల్లో మన ఆర్మీ గస్తీ సేవలు అద్భుతం. నేను చిన్నప్పుడు చదు వుకున్న స్కూల్లో స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలో జై జవాన్.. జై కిసాన్ అన్న నినాదాలు మళ్లీ స్ఫురణకు వచ్చాయి. అందుకే దేశానికి సరిహద్దుల్లో రక్షణగా ఉన్న జవాన్‌కు.. అన్నం పెట్టే రైతు కు మనం ఎప్పుడు రుణపడి ఉండడమే మన వారికి ఇచ్చే నిజమైన గౌరవం. -
అమెరికాను వణికిస్తున్న మంచుతుఫాను
⇒ పలు చోట్ల గాఢాంధకారం ⇒ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారుల సూచన ⇒ విమానాల రద్దు, స్కూళ్లకు మూత వాషింగ్టన్: అమెరికా తూర్పు తీరం చిగురుటాకులా వణికిపోతున్నది. మంచు తుఫాన్ తీవ్రమవడంతో మూడు కోట్ల మంది అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే 7,600 విమానాలు రద్దయ్యాయి. వేలాది స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వీక్షణస్థాయి సున్నా పడిపోనుండటంతో అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అమెరికాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ మంచు తుఫాన్ కారణంగా ప్రభావితమవుతున్నట్లు సీఎన్ఎన్ చానెల్ వెల్లడించింది. న్యూయార్క్, బోస్టన్‌లాంటి ప్రధాన నగరాలను మంచు దుప్పటి కప్పేస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు అడుగుల మేర భారీగా మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు మంగళవారం వాతావరణ నివేదికలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలోని అన్ని విమానాలను రద్దు చేశారు. న్యూయార్క్ నగరంలో 20 అంగుళాల మేర మంచు కురవనున్నట్లు అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమో అత్యవసర చర్యలకు ఆదేశించారు. ఇప్పటికే భారీగా బలగాలను నగరంలో మోహరించారు. ఫిలడెల్ఫియాలో 10 అంగుళాలు, మసూచుసెట్స్‌లో 24 అంగుళాల మేర మంచు కురవనుంది. మంగళవారం ఉదయం నుంచి కనెక్టికట్ రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణాలపై నిషేధం విధించారు. అటు వర్జీనియాలో పోర్ట్ ఆఫ్ వర్జీనియాను కోస్ట్ గార్డ్ మూసివేసింది. తూర్పు తీరంలో ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పటికే మంచు తుఫాన్ కారణంగా విస్కాన్సిన్లో ఇద్దరు చనిపోయారు. సేవా కార్యక్రమాలకు ట్రంప్ జీతం వివాదాలతో సహజీవనం చేసే అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మంచి నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తన జీతం మొత్తాన్ని విరాళంగా ఇస్తారని వైట్‌హౌస్ అధికారి సీన్ స్పైసర్ వెల్లడించారు.ట్రంప్ తన వార్షిక జీతం నాలుగు లక్షల డాలర్లను సేవాసంస్థకు ఇస్తారని వెల్లడించారు. ఏడాది చివరన తన జీతాన్ని విరాళంగా ఇవ్వాలనేది ట్రంప్ ఉద్దేశమని స్పైసర్ మీడియాకు వివరించారు. అంతేగాక, ఈ విషయమై ట్రంప్ ఇప్పటికే అమెరికా ప్రజలకు వాగ్దానం చేశారని ఆయన గుర్తు చేశారు. మా జోలికొస్తే ఊరుకోం: అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక సియోల్: తమ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య జరిగినా అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా మంగళవారం హెచ్చరించింది. వాయు, జల, భూమార్గాల ద్వారా నిర్దాక్షిణ్యంగా దాడులు చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని వెల్లడించింది. దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న డ్రిల్స్‌లో భాగంగా అమెరికా నేవీ ‘కార్ల్ విన్సన్’ అనే యుద్ధనౌకను మోహరిస్తున్న నేపథ్యంలో కొరియా ఈ హెచ్చరిక జారీ చేసింది. కార్ల్ విన్సన్‌ను మోహరించడం వెనుక తమ దేశంపై దాడి చేయాలనే కుట్ర దాగుందని ఆరోపించింది. ఈ నెల 11న సైతం శత్రువుల యుద్ధవిమానాలు తమ ప్రాదేశిక జలాల సమీపంలోకి వచ్చాయని ఉత్తరకొరియా ఆరోపించింది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో క్షిపణి విధ్వంసక వ్యవస్థను మోహరించడంపై చైనా అమెరికాను విమర్శించిన విషయం తెలిసిందే. -
నింద - నిజం
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 34 ఆఫీస్ సిబ్బంది అంతా దారిలో మంచు తుఫానులో చిక్కుకోకూడదని వెళ్లిపోయారు. హెరాల్డ్ మాత్రం పని ఒత్తిడి వల్ల వెళ్లలేదు. మంచు... కవులకి, ప్రేమ, పవిత్రత, ఆశలకి ప్రతీక. నిరాశావాదులకి మంచు, మరణం, విచారం, ట్రాజెడీలకి ప్రతీక. క్రీడాకారులకు అది ఆనందం. దాని మీద జారచ్చు. బద్ధకస్థులకి కూడా అది ఆనందమే. ఇంట్లో నిప్పు ముందు కాళ్లనిండా దుప్పటి కప్పుకుని వెచ్చగా కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రేమికులకీ ఆనందమే. మైథునానికి మంచు చక్కటి ప్రేరణని ఇస్తుంది. మంచు తుఫాను అకస్మాత్తుగా మధ్యాహ్నం మూడు నించి చెలరేగింది. న్యూయార్క్‌లోని పీటర్ కంపెనీలో పనిచేసే హెరాల్డ్ కిటికీలోంచి బయటికి చూశాడు. మూడు అంగుళాల మేర మంచు కురిసిందని రేడియోలో విన్నాడు. ఆ తర్వాత మరికొన్ని అంగుళాల మంచు కురిసి ఉండచ్చని భావించాడు. దాని గురించి తెలియగానే ఆఫీస్ సిబ్బంది అంతా దారిలో మంచు తుఫానులో చిక్కుకోకూడదని వెళ్లిపోయారు. హెరాల్డ్ మాత్రం పని ఒత్తిడి వల్ల వెళ్లలేదు. తను ఎక్కి వెళ్లాల్సిన లోకల్ ట్రైన్స్ రద్దవచ్చని తెలిసినా చాలా ముఖ్యమైన మూడు ఫైళ్లని అతను పరిశీలిస్తున్నాడు. తన భార్య క్లైడ్కి ఫోన్ చేసి తను ఆ రాత్రి ఇంటికి రాలేకపోవచ్చని చెప్పాడు. ‘‘ఈ మంచు తుఫాను నా మంచికే వచ్చినట్లుంది. మా ఆఫీసులో చాలా డబ్బు కొట్టేశారు. ఎవరో తెలుసుకోవాలి. దానికి సంబంధించిన ఫైళ్లని చదువు తున్నాను. రాత్రి ఆఫీస్‌లోనే ఉండి ఇది ఎవరి పనో రేపు ఉదయానికల్లా తెలుసుకుంటాను. మా కంపెనీ ఆడిటింగ్ ఫర్మ్‌కి వివరాలు ఇస్తాను. ఇక్కడ ఎవర్నీ నమ్మలేను. ఈ ఫైళ్లు చదువుతున్న కొద్దీ అందరూ దొంగలే అనిపిస్తోంది.’’ క్లైడ్ అణకువ గల భార్య. భర్త ఏ చర్యనీ ప్రశ్నించదు. తన భర్త చేసేదంతా సరైనదే అనే నిశ్చితాభిప్రాయంతో జీవించే అతి తక్కువ మంది భార్యల్లో ఆమె ఒకరు. ‘‘జాగ్రత్తండీ. తినడానికి ఆఫీస్‌లో ఏమైనా ఉందా?’’ అడిగింది. ‘‘లేదు. ఇందాకే ఫోన్ చేసి కనుక్కున్నాను. మా పక్క ఆఫీస్ బిల్డింగ్‌లోని కార్నర్ షాప్ రాత్రంతా తెరిచే ఉంచుతానని చెప్పాడు. అతను కూడా నాలాగే మంచు తుఫాను వల్ల షాపు మూసి ఇంటికి వెళ్లలేకపోతున్నాడు. చీజ్, తాజా బ్రెడ్, జింజర్ ఏల్, పళ్లు, బిస్కెట్ లాంటివి అక్కడ ఉంటాయి. వేడి కాఫీ కూడా దొరుకుతుంది.’’ ‘‘ఇంకేం? కానీ మంచులో నడిచేప్పుడు జాగ్రత్తండీ.’’ ‘‘తాజా మంచు ఇబ్బంది పెట్టదు. మంచు గడ్డ కట్టాకే జారే సమస్య.’’ మరి కాసేపు మాట్లాడాక రిసీవర్ పెట్టేసి హెరాల్డ్ దీక్షగా ఆ ఫైల్స్‌ని చదువుతూ ఓ ప్యాడ్‌లో పాయింట్స్‌ని రాసుకోసాగాడు. ఆఫీసులో డిస్టర్బ్ చేసేవారు ఎవరూ లేకపోవడంతో అతని పని సాఫీగా సాగింది. ఫైల్స్‌లోని బిల్స్, ఇన్వాయిస్లని తనిఖీ చేసి, బ్యాంక్ స్టేట్మెంట్స్ని పరిశీలించి తేడాల జాబితా రాసి కూడాడు. మూడు నెలల్లో డెబ్భై ఆరు వేల రెండు వందల పదిహేడు డాలర్ల ముప్ఫై ఏడు సెంట్లు తేడా వచ్చింది. ఆ డబ్బుని కొట్టేశారని గ్రహించాడు. అది ఎవరి పనో కూడా జాబితా పూర్తయ్యేసరికి హెరాల్డ్‌కి అర్థమయ్యింది. అతని పని పూర్తయ్యేసరికి ఒంటి గంటా పది నిముషాలు పూర్తయింది. గట్టిగా ఆవులించి లేచి బద్ధకంగా ఒళ్లు విరుచుకుని, ఆఫీస్ తలుపు తాళం చెవి తీసుకుని ఓవర్ కోట్ తొడుక్కుని బయటికి నడిచాడు. గాలి లేకపోవడంతో చలి తెలీడం లేదు. నెమ్మదిగా నిర్మానుష్యంగా ఉన్న కార్నర్ స్టోర్ వైపు నడిచాడు. కార్నర్ స్టోర్ యజమాని హెరాల్డ్‌ని ఆనందంగా ఆహ్వానించాడు. అతనితో పిచ్చాపాటి మాట్లాడుతూ కడుపు నిండా తిని, వేడి వేడి కాఫీ తాగి, డబ్బు చెల్లించి గుడ్ నైట్ చెప్పి బయటికి వచ్చాడు. కొద్దిసేపు నడవాలనిపించి నడవసాగాడు. అటు, ఇటు ఆగిన కార్ల మీద మంచు ఉంది. ఎక్కడ చూసినా తెల్లటి మంచు దూది పింజెల్లా కురుస్తోంది. కొద్ది దూరం వెళ్లి వెనక్కి తిరిగాడు. దారిలో ఓ చోట ఓ మంచు రాశి మీద కాలు వేయకుండా దాన్ని దూకాడు. అతని కాలు జారింది. కిందపడ్డాడు. తల ఓ ఇంటి మెట్టుని తాకడంతో స్పృహ తప్పింది. అరగంట తర్వాత రోడ్డు మీది మంచుని శుభ్రం చేసే వాహనం వచ్చింది. మీద మంచు కురిసిన హెరాల్డ్ అతనికి కనపడలేదు. హెరాల్డ్ మీదకి మూడు అడుగుల ఎత్తున మంచు కుమ్మరించబడింది. మర్నాడు సీటన్ కంపెనీ ఆఫీస్ తెరిచారు. మధ్యాహ్నానికి కాని హెరాల్డ్ భార్య ఆఫీస్‌కి ఫోన్ చేయలేదు. తన భర్త ఆఫీస్‌కి రాలేదని తెలిశాక, ఇంటికి కూడా రాకపోడంతో కంగారుపడి పోలీసులకి ఫిర్యాదు చేసింది. మరణించిన హెరాల్డ్ రెండు రోజుల తర్వాత మంచుని తొలగించే సిబ్బంది కంటపడ్డాడు. మరో రెండు రోజుల తర్వాత సీటన్ కంపెనీ వార్తల్లోకి ఎక్కింది. స్వర్గీయ హెరాల్డ్ సీటన్ కంపెనీ డబ్బుని దొంగిలించాడని పోలీసులకి ఆ కంపెనీ యజమాని ఫిర్యాదు చేశాడు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో అమ్మకాలు తగ్గడానికి కారణం హెరాల్డ్ జోక్యమే అని సేల్స్ మేనేజర్ ఆరోపించాడు. నాసి రకం ముడిసరుకుని కొనడానికి బాధ్యత హెరాల్డ్దే అని ఫ్యాక్టరీ మేనేజర్ చెప్పాడు. ఆఫీస్‌లో కొత్తగా పరిచిన కార్పెట్ నాసి రకంది. హెరాల్డ్ దాన్నే కొనమని తనని ఆజ్ఞాపించాడని పర్చేజ్ ఆఫీసర్ మెమోకి జవాబుగా రాశాడు. హెరాల్డ్ చాలా తప్పులకి బాధ్యుడయ్యాడు. ఆఖరికి పేపర్ జెమ్ క్లిప్స్ పని చేయకపోవడానికి కూడా హెరాల్డే బాధ్యుడయ్యాడు. హెరాల్డ్ భార్య కనెక్టికట్‌లోని తమ ఇంటిని అమ్మేసి, భర్త ఇన్సూరెన్స్ సొమ్ము తీసుకుని కాలిఫోర్నియాకి వెళ్లిపోయింది. హెరాల్డ్ పుట్టి పెరిగిన ఊళ్లోని అతని మిత్రులు హెరాల్డ్ పచ్చి దొంగ అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఐతే హెరాల్డ్ నిజాయితీపరుడు అని తెలిసింది ఒక్కరికే. అతని భార్యకి. తన భర్త నిజాయితీని అందరికీ చెప్పి ఒప్పించగల సమర్థత తనలో లేదని గుర్తించి ఆమె ఎప్పటికీ మంచు పడని కాలిఫోర్నియాకి వెళ్లిపోయింది. (ఎర్ల్ ఫుల్డ్జ్ కథకి స్వేచ్ఛానువాదం) -
ముంచుకొస్తున్న తుఫాన్: విమానాలు రద్దు
వాషిగ్టన్: అమెరికా తూర్పు తీర ప్రాంతాన్ని ముంచెత్తడానికి మంచు తుఫాను ముంచుకొస్తుంది. అక్కడి ఐదు రాష్ట్రాలు ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించి తుఫాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వేలాది విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్‌తో పాటు ఇతర తూర్పుతీర ప్రాంత నగరాల్లో మంచు తుఫాను మూలంగా భారీగా మంచు మేటలు పేరుకుపోనున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్, బాల్టీమోర్లలో అక్కడి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నానికి తుఫాను ప్రభావం చూపనుంది. న్యూయార్క్ ప్రాంతంలో శనివారం ఉదయానికి తుఫాను ప్రభావం ఉండోచ్చని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫానును ఎదుర్కోవడానికి 300 సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వర్జీనియా నేషనల్ గార్డ్ అధికారులు తెలిపారు. వాషింగ్టన్ డీసీలోని రద్దీగా ఉండే సబ్‌వేలను శుక్రవారం రాత్రి నుండి ఆదివారం వరకు మూసేస్తున్నట్లు మెట్రోపాలిటన్ అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావం ఉండే ప్రాంతాలలోని ప్రజలు ముందు జాగ్రత్తగా అహారం, ఇతర కనీస అవసరాలను సమకూర్చుకుంటున్నారు. -
గాలిలో షి‘కారు’ విమానం!
తక్కువ ఎత్తులో ఎగిరే చిన్నపాటి డ్రోన్ విమానాలు తెలుసుగా! మనుషులెవరూ లేకుండా, కేవలం యంత్రాల సాయంతో నడిచే ఆ డ్రోన్లను నిఘా కార్యకలాపాలకూ, సన్నివేశాల చిత్రీకరణకూ ఉపయోగించడం సర్వసాధారణం. కానీ, ఏకంగా ఒక మనిషినే గాలిలో మోసుకెళ్ళే కారు లాగా ఓ చిన్న విమానం చేస్తే? ఇప్పుడు అలాంటి డ్రోన్ వ్యవస్థను సింగపూర్ విద్యార్థులు డెవలప్ చేశారు. దాని పేరు - ‘స్నో స్టార్మ్’. అంటే మంచు తుపాను అన్న మాట. ఈ డ్రోన్ డిజైన్‌లో రోబో తరహా కాన్సెప్ట్‌ను వాడారు. అయితే, ఈ ఎలక్ట్రానిక్ విమానం సైజు మాత్రం ఒక మనిషిని గాలిలోకి తీసుకువెళ్ళేంత పెద్దదిగా ఉంటుంది. ‘నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్’కు చెందిన విద్యార్థుల బృందం తమ ఇంజనీరింగ్ ఎసైన్మెంట్లో భాగంగా దీన్ని డిజైన్ చేసింది. భవిష్యత్తు అంతా గాలిలో ఎగిరే కార్లదే అనుకుంటున్న టైమ్‌లో ఆ ఆలోచనను ఈ మనిషిని మోసే డ్రోన్ విమానం డిజైన్ నిజం చేసిందన్న మాట. ఈ కొత్త తరహా ఎలక్ట్రానిక్ విమానాన్ని కూడా రిమోట్‌తో నియంత్రిస్తారు. -
మంచు దెబ్బకు 2,600 విమాన సర్వీసులు రద్దు
తూర్పు అమెరికా దేశాలపై మంచు మహమ్మారి విరుచుకుపడింది. అక్కడి దేశాలు గజగజ వణికిపోతున్నాయి. నివాస ప్రాంతాలు, రహదారులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, పాఠశాల భవనాలు, వ్యాపార సముదాయాలు, చెట్లు ఇలా ఒక్కటేమిటి.. పలు ప్రదేశాలు మంచుదుప్పటి పరుచుకుని కనిపించకుండా పోయాయి. దీని ప్రభావంతో ఏకంగా వాషింగ్టన్‌లోని పలు కార్యాలయాలు మంగళవారం మూతపడ్డాయి. దాదాపు 2,600 అమెరికా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు రహదారులు మూసేసి సెలవులు ప్రకటించారు. ముస్సోరి, అర్కనాస్, ఇల్లినాయిస్, టెన్నెస్సీ, కెంటకీ, ఇండియానా, ఓహియో వంటి ప్రాంతాల్లో పెద్దమొత్తంలో మంచు కురుస్తుండటంతో పాటు, పెద్ద పెద్ద మంచుగడ్డలు పడుతున్నాయి. ఇది తూర్పు ప్రాంతాలతో పాటు దక్షిణ ప్రాంతాలను కూడా తుడిచిపెట్టేసేంత శక్తిమంతంగా ఉందని అధికారులు అంటున్నారు. గతంలో వచ్చిన మంచుతుఫాన్ల తీవ్రత రికార్డులను ఇది బ్రేక్ చేసినట్లు తెలిపారు. ఉత్తర కరోలినా, వర్జీనియా, మిస్సిసిప్పీ, జార్జియా, కెంటకీ అధికార యంత్రాంగాలు అత్యవసర పరిస్థితులను ప్రకటించాయి. పర్యాటక ప్రాంతాలన్నీ బోసిపోయాయి. ఎవ్వరూ ఇళ్లను వదిలి బయటకు రావొద్దని, పాఠశాలలను తెరవొద్దని ఆయా ప్రాంతాల గవర్నర్లు ప్రత్యేక ప్రకటనలు జారీ చేశారు. బుధవారం వరకు మంచు ఇలా పడుతూనే ఉంటుందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. రోడ్లన్నీ జారిపోతున్న కారణంగా సోమవారం ఓ వ్యాన్ - స్కూల్ బస్సు ఢీకొని 13 మంది విద్యార్థులు గాయపడినట్లు పెన్సిల్వానియా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం 25 సెంటీమీటర్ల మంచు తుఫాను కుండపోతగా పడుతున్నదన్నారు. దాదాపు 50 మిలియన్ల అమెరికా పౌరులు దీని బారిన పడినట్లు చెప్పారు. ప్రస్తుతం అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు తెలిసింది. వచ్చే గురువారం లేదా శుక్రవారంలో మరో మంచు మహమ్మారి విరుచుకు పడే అవకాశం ఉందని హర్లీ అనే అమెరికన్ అధికారి చెప్పారు. -
అమెరికాలో మంచు కష్టాలు
-
నేపాల్ లో మంచు తుపాను; 12 మంది మృతి
ఖాట్మండు: నేపాల్ లో ఒక్కసారిగా మంచు తుపాన్ సంభవించడంతో 12 మంది మృతి చెందారు. 85 మంది గల్లంతయ్యారు. మృతులందరూ పర్వతారోహకులే. మానంగ్ జిల్లాలోని తొరాంగ్ పాస్ వద్ద ఈ ఘటన జరిగింది. సముద్రమట్టానికి 5,146 అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. హదూద్ తుపాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో మంచు తుపాను సంభవించినట్టు చెబుతున్నారు. మృతుల్లో భారతీయుడు, నలుగురు కెనడా పౌరులు, ముగ్గురు నేపాలీలు ఉన్నారు. 18 మంది పర్వతారోహకులను నేపాల్ ఆర్మీ కాపాడింది. గాయపడిని 14 మందిని ఖాట్మండులో ఆస్పత్రికి తరలించారు. మంచుకింద చాలా మృతుదేహాలు చూశానని స్థానిక గైడ్ ఒకరు చెప్పడంతో గల్లైంతన వారు మరణించివుంటారని భావిస్తున్నారు. దౌలాగిరిలో మరో నలుగురు గల్లంతయ్యారు. వీరి కోసం నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లతో గాలింపు చేపట్టింది.