
అమెరికాలో బఫెలో మంచు తపాను బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పైగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం డ్యూటీ ముగించికుని ఇంటికి వస్తున్న 22 ఏళ్ల టేలర్ అనే మహిళ న్యూయార్క్‌లోని బఫెలో తుపానులో చిక్కుకుపోయింది. దీంతో ఆమె తుపాను తగ్గాక వెళ్దామని నిర్ణయించుకుంది. ఎంతకీ మంచు తుపాను తగ్గక పోవడంతో కారులో అలానే ఏకంగా 18 గంటల పాటు ఉండిపోయింది.
పాపం తన అవస్థను ఓ వీడియో సందేశం ద్వారా తన స్నేహితులకు తెలియజేసింది కూడా. అయితే ఆ తర్వాత ఆమె కారులో శవమై కనిపించింది. ఆ వీడియో ఆధారంగా ఆమెను కాపాడేందుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ కూడా మంచు తుపానులో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఆఖరికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా చిక్కుకుపోయారు. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం ఆమె మృతదేహం లభించిందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా అంతటా ఈ మంచు తుపాను కారణంగా సుమారు 60 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.
(చదవండి: అమెరికాను ముంచేసిన మంచు.. 60 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment