కన్నీటితో సమాధుల పండుగ
కన్నీటితో సమాధుల పండుగ
Published Wed, Nov 2 2016 10:07 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
కర్నూలు సీక్యాంప్: చనిపోయిన తమ కుటుంబీకుల ఆత్మలకు శాంతి కలగాలని జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు సమస్త పరిశుద్ధ ఆత్మల పండుగ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. సమాధుల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేయడం ద్వారా చనిపోయిన తమ వారికి ఆత్మలకు శాంతి కలుగుతుందని క్రైస్తవుల నమ్మకం. ప్రపంచ వ్యాప్తంగా కాథలిక్‌లు ఈ సమాధుల పండుగను జరుపుకుంటారు. కర్నూలు, నంద్యాలలో తమ పూర్వీకుల సమాధులపై కొవ్వొత్తులు వెలిగించి సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బిషప్ పూల ఆంథోని, రెవరెండ్ అనిల్ కుమార్, రెవరెండ్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement