
వెండితెరపైనా తళుక్కుమని మెరిసి బుల్లితెర యాంకర్లు ఎంతోమంది.

ఝాన్సీ, అనసూయ, శ్రీముఖి.. ఇలా అందరూ సిల్వర్ స్క్రీన్‌పైనా కనిపించారు.

అయితే కాలక్రమేణా సుమ, శ్రీముఖి బుల్లితెరపైనే ఎక్కువ ఫోకస్ చేయగా ఝాన్సీ, అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమాల్లో బిజీ అయ్యారు.

ఇప్పుడీ జాబితాలో టాప్ యాంకర్ ఉదయభాను చేరింది.

ఎర్రసైన్యం సినిమాతో ఉదయభాను వెండితెరకు నటిగా పరిచయమైంది.

కొండవీటి సింహాసనం, ఖైదీ బ్రదర్స్, శ్రావణమాసం వంటి చిత్రాల్లో నటించింది.

తర్వాత సడన్‌గా సినిమాల్ని పక్కనపెట్టేసింది.

బుల్లితెరకు కూడా దూరంగా ఉండిపోయింది.

ఆ మధ్య లీడర్, జులాయి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కనిపించి అలరించింది.

తాజాగా తనలో మరో యాంగిల్ చూపించేందుకు రెడీ అయింది.

బార్బరిక్ చిత్రంలో ఉదయభాను విలనిజం చూపించబోతుంది.

ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సత్య రాజ్, సత్యం రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని మోహన్ శ్రీవాత్సవ డైరెక్ట్ చేస్తున్నాడు.

తాజాగా రిలీజ్ చేసిన బార్బరిక్ టీజర్‌లో ఉదయభాను లుక్ చూసిన ఫ్యాన్స్ అనసూయకు గట్టిపోటీనిచ్చేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.


