udayabhanu
-
అప్పట్లో టాప్ యాంకర్.. ఇప్పుడు విలనిజం చూపిస్తానంటున్న ఉదయభాను (ఫోటోలు)
-
వాకిలి పద్మ
సత్యరాజ్, వశిష్ట ఎన్. సింహా, సాంచి రాయ్, ‘సత్యం’ రాజేష్, ఉదయ భాను నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. మారుతీ టీమ్ప్రోడక్ట్ సమర్పణలో వానర సెల్యూలాయిడ్‌పై విజయపాల్ రెడ్డి ఆదిదల నిర్మించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ నుంచి యాంకర్, నటి ఉదయ భాను పోషించిన వాకిలి పద్మ పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.‘భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడు బార్బరిక్ (బార్బరికుడు) పాత్రను ఆధారంగా తీసుకుని ‘త్రిబాణధారి బార్బరిక్’ రూపొందించాం. చాలా ఏళ్ల తర్వాత వాకిలి పద్మ అనే మంచి పాత్రలో ఉదయ భాను నటించారు. నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కుశేందర్ రమేష్ రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్. -
దాడులు ఆపకుంటే ప్రతి దాడులు తప్పవు
జగ్గయ్యపేట అర్బన్: ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి అరాచకం సృష్టిస్తూ రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్న టీడీపీ మూకలు తమ సహనాన్ని పరీక్షించవద్దని ప్రభుత్వ మాజీ విప్, వైఎస్సార్ సీపీ నేత సామినేని ఉదయభాను హెచ్చరించారు. హద్దులు దాటొద్దని, తమ సహనం నశిస్తే ప్రతిచర్యలు తప్పవని స్పష్టం చేశారు.వారం రోజులుగా విజయోత్సవాల పేరుతో దాడులకు తెగ బడి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హింసించడం, ఇళ్లలోకి చొరబడి విలువైన వస్తువులను ధ్వంసం చేసి పైశాచిక ఆనందాన్ని పొందటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది తాలిబాన్ల పాలనను తలపిస్తోందన్నారు. సోమవారం జగ్గయ్యపేటలో నేతలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని, జగ్గయ్యపేటలో గెలిచిన శ్రీరాం తాతయ్య నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలని తాము కోరుతున్నట్లు చెప్పారు. ఇందుకేనా గెలిపించింది? తాను ఐదు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేశానని, గెలిచిన పార్టీ ఇలా దౌర్జన్యాలకు పాల్పడటం ఎప్పడూ చూడలేదన్నారు. 2019లో 151 సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఎక్కడా దాడులకు దిగలేదన్నారు. కౌంటింగ్ జరుగుతుండగానే సచివాలయాల మీద టీడీపీ జెండాలు ఎగురవేయడం, విగ్రహాలను కూల్చడం, వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెలు, శిలాఫలకాలను ధ్వంసం చేయడం టీడీపీ గూండాయిజానికి నిదర్శనమని ఉదయభాను మండిపడ్డారు. ఇందుకేనా చంద్రబాబును గెలిపించింది? అని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. దాడులు.. ఇళ్ల లూటీ తొర్రగుంటపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త పాటి సాంబ ఇంటిపై అల్లరి మూకలు అర్ధరాత్రి దాడి చేసి విలువైన వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు బీరువాలోని నగదు, బంగారాన్ని దోచుకున్నాయని ఉదయభాను పేర్కొన్నారు. మైనార్టీ మహిళపై కారం చల్లడంతోపాటు గోపి అనే వ్యక్తిపై దాడి చేశారని చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్, తన్నీరు నాగేంద్ర, కొండ తదితరుల నివాసాలపై రాళ్లతో దాడి చేశారని ఫొటోలను ప్రదర్శించారు.13వ వార్డులో అభివృద్ధి శిలాఫలకాలు, జెండా దిమ్మెలను టీడీపీ మూకలు నేల కూల్చాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితులకు 41 ఏ నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిల్‌తో సరిపుచ్చడంతో తిరిగి దాడులకు తెగబడుతున్నట్లు చెప్పారు. పారీ్టకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలు ఎవరూ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దని సూచించారు. -
రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు
జగ్గయ్యపేట అర్బన్: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కాన్వాయ్‌కు దారి ఇవ్వకుండా కారు వెనుక అద్దాలను కొడుతూ కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. అసలేం జరిగిందంటే.. ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే ఉదయభాను బలుసుపాడు రోడ్డులోని టిడ్కో గృహాల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి జగ్గయ్యపేటకు తిరిగి వస్తుండగా పట్టణంలోని పెద్ద సెంటర్లో టీడీపీ కార్యకర్తలు దళిత ఆత్మీయ సమ్మేళనం పేరుతో ర్యాలీగా వస్తూ ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌కు దారి ఇవ్వకుండా టీడీపీ జెండాలు ఊపుతూ కవ్వింపు చర్యలకు దిగారు. ఎమ్మెల్యే కారు వెనుక అద్దాలను కొడుతూ టీడీపీ జిందాబాద్ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఉదయభాను వెంట సుమారు 15 మంది కార్యకర్తలు ఉండగా, టీడీపీ వారు వందలాది మంది ఉన్నారు. టీడీపీ కార్యకర్తల కవ్వింపు చర్యలకు ప్రతిగా ఓ వైఎస్సార్ సీపీ కార్యకర్త తమ జెండా ఊపడంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు అతనిపై దాడికి తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు రంగంలోకి దిగి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పాత మునిసిపల్ కార్యాలయం ఆవరణలో ఉంచి గేట్లు వేశారు. అయినా టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుతూ వీరంగం సృష్టించారు. కొన్ని రాళ్లు పోలీసులు, విలేకరులకు కూడా తగిలాయి. కనిపించిన చోటల్లా వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను నియంత్రించి పరిస్థితిని చక్కదిద్దారు. నందిగామ ఏసీపీ డాక్టర్ బి.రవికిరణ్ వచ్చి బందోబస్తును పర్యవేక్షించారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెట్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం వీధుల్లో కవాతు నిర్వహించారు. శాంతియుతంగా వస్తున్న తమ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారని, కొందరిని గాయపరిచారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ తెలిపారు. -
బిగ్‌బాస్‌లోకి అలనాటి స్టార్ యాంకర్! భారీ రెమ్యునరేషన్ ఆఫర్?
తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఇప్పటి వరకు ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో... సీజన్ సీజన్‌కి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇదే ఉత్సాహంతో ఓటీటీలోకి తీసుకొచ్చిన ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలో ఆ షో నడవలేదు. దీంతో త్వరలోనే ఆరో సీజన్‌ని ప్రారంభించి, ఆ లోటుని తీర్చుకోవాలని భావిస్తున్నారు బిగ్ నిర్వాహకులు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆరో సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హౌజ్ సందడి చేసే కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై చర్చ జరుగుతుంది. చదవండి: నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ సీజన్ సిక్స్‌లో పాల్గొనేది వీరేనంటూ కొంతమంది పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లోకి తాజాగా ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను పేరు వచ్చి చేరింది. ఒకప్పుడు బుల్తితెరపై ఉదయభాను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బుల్లితెర శ్రీదేవిగా పిలుపించుకున్న ఆమె తనదైన యాంకరింగ్, వాక్చాతుర్యం, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంకరింగ్‌లో కొత్త కోణం ఆవిష్కరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి అనంతరం తెరకు దూరమైన ఆమె క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉందనడంలో అతిశయోక్తి లేదు. స్టార్ హీరోయిన్ రెంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె అప్పుడప్పడు టీవీ షోలు, మూవీ ఈవెంట్స్‌లో దర్శనమిస్తూ ప్యాన్స్‌ని పలకరిస్తోంది. చదవండి: షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్, వీడియో వైరల్ ఇప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్‌ను బిగ్‌బాస్ నిర్వహకులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట. అందుకే ఆమెను సంప్రదించి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉదయభాను బిగ్‌బాస్ ఆఫర్‌పై పెద్దగా ఆసక్తి చూపించిడం లేదని తెలుస్తోంది. దీంతో ఎలాగైనా ఆమెను ఒప్పించి బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట. ఉదయభానుతో నేరుగా మాట్లాడి ఒప్పింయే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. అంతేకాదు ఇప్పటివరకు ఎవ్వరికీ ఇవ్వని రేంజ్లో ఉదయభానుకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా బిగ్‌బాస్ నిర్వహకులు సిద్ధంగా ఉన్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతుంది.. బిగ్‌బాస్ 6లో ఉదయభాను సందడి చేస్తుందా?లేదా? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సింది. -
జోరుగా.. హుషారుగా
జూబ్లీహిల్స్: మహిళలను ఎక్కడ పూజిస్తారో.. గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, శక్తిస్వరూపిణులైన అతివలు వారిలోని నైపుణ్యాలను, అభిరుచులను ప్రదర్శించడం అభినందనీయమని ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను అన్నారు. యూసుఫ్‌గూడ సవేరా ఫంక్షన్హాల్లో బుధవారం నారీలోకం పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వృత్తి, ఉపాధి, కుటుంబ బాధ్యతల్లో మునిగితేలే మహిళలకు ఒక ఆటవిడుపులా కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా మహిళలంతా ఆటపాటలు, వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో మునిగితేలారు. ర్యాంప్‌వాక్‌తో అదరగొట్టారు. విజేతలకు బహుమతులు అందించారు. రెడ్‌రోజ్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బుల్లితెర నటీమణులు రోహిణి, రాగిణి, ఇంటూరి వాసు, రిషిక, రాంజగన్, భాను సహా పలువురు పాల్గొన్నారు. సంస్థ నిర్వాహకుడు రాజేష్, జెమినీ టీవీ ప్రతినిధి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
'ప్రతి ఇంటికి పెద్ద కొడుకు వైఎస్ జగన్'
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. పెద్ద కొడుకును అని చెప్పుకొని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు అందర్నీ మోసం చేశారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి వెంకయ్య, చంద్రబాబు కలిసి రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. ఆదివారం ఇక్కడ జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖను, రాజధాని ప్రాంతాన్ని చంద్రబాబు దోచుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూ దొంగలను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు. మరోపక్క, ఇదే ప్లీనరీలో మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాజధాని భూ కుంభకోణంపై సీబీఐ విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ కుంభకోణాలు ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓటుకు కోట్లు కేసులో చిక్కుకొని చంద్రబాబు అమరావతికి పారిపోయి వచ్చారని విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూములు సింగపూర్ సంస్థలకు చంద్రబాబు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ సంస్థలకు ప్రజాధనంతో మౌలిక సదుపాయాలు, విద్యుత్, రోడ్లు వేయిస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి: నాయకుడంటే ప్రజల గుండె చప్పుడు: వైఎస్ విజయమ్మ మాట తప్పడం మా రక్తంలో లేదు: వైఎస్ షర్మిల 'వచ్చే ఎన్నికల్లో బాబుకు ఒకటి, పప్పుకొకటి' ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేసిన వైఎస్ జగన్ ఎన్టీఆర్తోనే చంద్రబాబు హత్యా రాజకీయాలు వైఎస్ఆర్ అంటేనే ఓ ప్రేమ మత్తు.. -
డబుల్ వరం
ఉదయభాను ఉదయించినప్పటి నుంచీ... జీవితంలో అన్నీ కష్టాలే! నాలుగేళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకుంది. తర్వాత నా అనుకున్నవాళ్లు దూరం అయ్యారు. అయినా పోరాడింది. తల దించకుండా పోరాడింది. యాంకర్ సామ్రాజ్యానికి తలమానికం అయింది. కష్టనష్టాల నుంచి... పేరుప్రతిష్టల కవలలకు తల్లి అయింది. దీన్నే డబుల్ వరం అంటారు! ఇవాళ... ఈ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చదవండి. వారం తిరిగేలోపు ‘ట్విన్ మమ్మీ’కి విషెస్ చెప్పండి. ► ఉదయభానుకి చాన్సులు తగ్గాయా? ఎక్కడా కనిపించడం లేదు. ఇండియాలోనే ఉందా? అనే గాసిప్ వెబ్ మీడియాలో ప్రచారంలో ఉంది. అసలేమైపోయారు? ఉదయభాను: ఎక్కడికీ వెళ్లిపోలేదండి. హైదరాబాద్‌లో హాయిగా ఉన్నా. బొజ్జలో ఇద్దరు బుజ్జోళ్లో.. బుజ్జెమ్మలో ఉన్నారు. నా జీవితంలోనే చాలా ఆనందమైన క్షణాలను అనుభవిస్తున్నాను. ఎందుకంటే మరో వారం, పది రోజుల్లో ఇద్దరు పండంటి కవల పిల్లలకి జన్మనివ్వబో తున్నా. ఈ విషయం తెలియక నరం లేని నాలుక. ఏది అనిపిస్తే అది వాగేస్తూ ఉంటారు. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు అవతలివాళ్లు మాట్లాడేవి పట్టించుకోకపోతేనే బతకగలుగుతాం. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటారేమో. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఈ ఫీల్డ్‌లో ఏ అమ్మాయి లైఫ్ అయినా ఒక గ్లాస్ హౌస్‌లో ఉన్నట్లుగా ఉంటుంది. దాని మీద ఎవరైనా రాయి వేయొచ్చు. అది తగలకుండా జాగ్రత్తపడాలి. తగిలి నా ఎదుర్కొని, యుద్ధం చేయగల సాహసం ఉండాలి. ► ఎప్పుడైనా అనిపించిందా.. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి ఎందుకు వచ్చామా అని? ఈ ఫీల్డ్‌లో అడ్వాంటేజ్, డిస్ అడ్వాంటేజ్ రెండూ ఉంటాయి. ఇక్కడికి రావడం ఒక రకంగా శాపం, ఒక రకంగా వరం. రూమర్స్, మనీ, ఫేమ్ అన్నీ వస్తాయి. ఏదేమైనా సక్సెస్‌లో ఉన్నవాళ్లను చూస్తే, ఏదో ఒక రాయి విసరకుండా ఉండలేరు చాలామంది. బట్ ఐ డోంట్ కేర్ దట్. గుళ్లో దేవతను చూసి వీధిలో కుక్కలు మొరుగుతూ ఉంటాయ్, దానివల్ల దేవత గొప్పతనం పడిపోదని నా ఫ్రెండ్ అమ్ములు అంటుంది. అది కచ్చితంగా నిజం. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. నేను చిన్న వయసులోనే రావడం వల్ల చాలా చూశా. ఎన్నో జీవిత పాఠాలు నేర్చేసుకున్నా. అందుకే ఆడపిల్లలు పుడితే చాలా చాలా స్ట్రాంగ్‌గా పెంచాలనుకుంటున్నా. ► మీ మాటలు విన్నప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు స్ట్రాంగ్ పర్సన్ అని ఎవరికైనా అనిపిస్తుంది.. మీరలా కాదా? స్ట్రాంగే.. కానీ, ఎవరైనా బాధపడితే ఎమోషనల్ అయిపోతాను. కెరీర్ బిగినింగ్‌లో ఓ వ్యక్తి వచ్చి ఆరోగ్యం బాగా లేదంటే నా దగ్గర జస్ట్ పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. పదివేలు ఇచ్చేశాను. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏమయ్యాడో తెలియదు. ఇలాంటివి లెక్కలేనన్ని జరిగాయి. సొంత వాళ్లకీ, బయటి వాళ్లకీ చాలానే చేశాను. అర్హత లేనివాళ్లకు ప్రేమ పంచి టైమ్ వేస్ట్ చేసుకున్నా. నేను ఎవరికేం చేసినా వాళ్ల నుంచి ఆశించేది జస్ట్ ప్రేమ మాత్రమే. అది ప్యూర్‌గా దక్కలేదు. బట్ ఐయామ్ లక్కీ ఇనఫ్. నాకు కావల్సినంత ప్రేమ విజ్జూ (భర్త విజయ్) నుంచి దక్కింది. ఒక్కటి కచ్చితంగా చెప్పగలను. ప్రపంచమంతా ఒక్కటై నావైపు వేలెత్తి చూపిస్తున్నా.. ఆ వేలుని విరిచి నా వెన్నంటే ఉండే భర్త దొరికాడు. ఇంకేం కావాలి? ఇప్పుడు నా బిడ్డలు రాబోతు న్నారు. ప్రపంచంలోని ప్రేమ అంతా నా సొంతం కాబోతోంది (ఆప్యాయంగా పొట్ట నిమురుకుంటూ). వియ్ ఆర్ హ్యాపీ ► విజయ్‌గారూ మీ గురించి? మాది విజయవాడ. మాకు థియేటర్లున్నాయి. విజయవాడలోనే భానూతో పరిచయం. మా ఇంట్లోవాళ్లకి కూడా తనంటే చాలా ఇష్టం. ఎంబీఏ ఇక్కడే హైదరాబాద్‌లో చేశా. మా పెళ్లయినప్పుడు నేను చదువుకుంటున్నాను. మా ఇంట్లో చెప్పి, పెళ్లి చేసుకోలేదని బాధపడ్డారు. పది రోజులకి అదే సర్దుకుంది. ► హరీబరీగా పెళ్లి చేసుకున్నారెందుకని? అప్పటి పరిస్థితి అది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆర్య సమాజ్‌లో చేసుకున్నాం. నౌ వియ్ ఆర్ ది మోస్ట్ హ్యాపీయస్ట్ కపుల్. ► మీరేం చేస్తుంటారు? నాది కన్స్ట్రక్షన్ బిజినెస్. ఈ మధ్యే నాలుగైదు అపార్ట్మెంట్స్ కంప్లీట్ చేశాం. ప్రొఫెషనల్‌గా ఇద్దరం బిజీ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే తను వర్క్ చేయకూడదనుకున్నా ను. మామూలుగా నాలుగైదు నెలలు చేయొచ్చంటారు కానీ, ఏ ఒత్తిడీ లేకుండా పీస్‌ఫుల్‌గా ఉంటే బాగుంటుందనిపించింది. దాదాపు పదిహేనేళ్ల క్రితం లైఫ్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు మాకిద్దరు రాబోతున్నారు. వెరీ వెరీ హ్యాపీ. ► విజయ్‌గారితో మీ పెళ్లై పదేళ్లకు పైనే అయింది కదా.. పిల్లలను లేట్‌గా ప్లాన్ చేసుకున్నారేంటి? భార్యాభర్తలుగా మేం ఫైనాన్షియల్‌గా జీరోతో స్టార్ట్ అయ్యాం. సెటిల్ కావడానికి టైమ్ పట్టింది. రెండేళ్ల క్రితం పిల్లలు ప్లాన్ చేద్దామని విజ్జూ అన్నాడు. ప్లాన్ చేసేశాం. ► ట్విన్స్ అని తెలియగానే ఎలా అనిపించింది? డాక్టర్ చెప్పగానే కన్నీళ్లు ఆగలేదనుకోండి. మీరు వెనక్కి తిరిగి చూస్తే గోడ మీద రాముడు, సీత ఫొటోలు ఉంటాయి. ఆ బొమ్మలను చూసినప్పుడల్లా ‘మీకు ఇద్దరు బిడ్డలు కదా.. నాకూ ఇద్దర్ని ఇవ్వండి’ అని కోరుకునేదాన్ని. నా చిన్నప్పుడు జంట అరటిపండ్లు, జంట టమోటాలు, జంట వంకాయలు తింటే కవల పిల్లలు పుడతారని అనేవాళ్లు. నేను కావాలని అవే తినేదాన్ని. ఈవెన్ వంకాయ కూర వండేటప్పుడు జంట కాయలుంటే కట్ చేయకుండా, వండేదాన్ని. నేను కవలల్ని కోరుకున్న ప్రతిసారీ ఆ దేవతలు ‘తథాస్తు’ అని ఆశీర్వదించారేమో అనిపిస్తోంది. ► ఇద్దరు బిడ్డల్ని మోయడం ఎలా అనిపిస్తోంది? రెండు ప్రాణాలు నాలో కదులుతున్నాయ్. దేవుణ్ణి చూసినప్పుడు కలిగే ఫీలింగ్ కలుగుతోంది. మెల్లిగా నడవడం అనేది నా హిస్టరీలో లేదు. ఇద్దర్ని మోస్తున్నాను కాబట్టి మెల్లిగా నడవక తప్పడం లేదు. కానీ, వేగం తగ్గినా ఆనందంగా ఉంది. గంటలు గంటలు నిలబడి యాంకరింగ్ చేస్తాను కాబట్టి, గతేడాది రైట్ లెగ్ లిగమెంట్ టియర్ అయింది. కొద్ది రోజుల తర్వాత మెట్లు దిగుతుంటే పడిపోయాను. ఎడమ కాలికి ఫ్రాక్చర్ అయింది. అయినా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేశాను. ఈ సందర్భంలో ఒకటి చెప్పాలనిపిస్తోంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా రాసేస్తా ఉంటారు కొందరు. మంచి రాయడానికి కదిలే కలాలు తక్కువ. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి మాట్లాడేవాళ్లు ఉండరు. రెండు కాళ్లకూ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా షోలు చేశాను. చాలామందికి నా పరిస్థితి తెలుసు. అదే హీరోకో, హీరోయిన్‌కో చిటికెన వేలికి దెబ్బ తగిలినా రాస్తారు. నాలాంటి వాళ్ల గురించైతే నెగిటివ్ విషయాలు తప్ప పాజిటివ్‌గా మాట్లాడరు. ► పదిహేనేళ్లకు పైగా నాన్‌స్టాప్‌గా వర్క్ చేశారు. ఇప్పుడు పీస్ఫుల్ స్పేస్‌లో ఉన్నట్లనిపిస్తోంది? నాకోసం నేను ఆలోచించుకోలేనంత బిజీగా ఉండేదాన్ని. నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు కెరీర్ మొదలైంది. యాంకర్‌గా కాస్ట్యూమ్స్ చూసుకోవడం, మేకప్ చేసుకోవడం, చుట్టూ ఉన్న ‘స్టుపిడిటీకి’ ఆన్సర్ చేయడంతోనే సరిపోయింది. ఫిజిక్ మెయిన్టైన్ చేయాలి. దాంతో బాగా సంపాదిస్తున్నా ఐదు వేళ్లతో కడుపు నిండుగా తిన్న సందర్భాలు తక్కువ. ఇప్పుడు నా కోసం, నా ఇద్దరి బిడ్డల కోసం ఫుల్లుగా లాగిస్తున్నా. నో టెన్షన్. పీస్‌ఫుల్‌గా అనిపిస్తోంది. ఇంకో వారం, పది రోజుల్లోపే నా బిడ్డలు వచ్చేస్తారు. ‘అయామ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ డే’. ► అసలు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి ఎలా వచ్చారు? నా చిన్నప్పుడే మా అమ్మ క్లాసికల్ డ్యాన్స్ నేర్పించారు. స్టేజి షోలు చేశాను. వాటి ద్వారా అవకాశాలు వచ్చాయి. ‘ఎర్ర సైన్యం’ నా మొదటి సినిమా. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశా. ఎక్కువగా టీవీపై దృష్టి పెట్టాను. పల్లెటూరి నుంచి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చా. ప్రాంతాల వివక్ష, కుల వ్యవస్థ అన్నింటినీ ఎదుర్కొని నిలదొక్కుకోవడం చిన్న విషయం కాదు. ఇప్పుడు కావల్సినంత తీరిక దొరికింది కాబట్టి, రకరకాల ఆలోచనలు వస్తుంటాయ్. ‘ఇన్ని కష్టాలు పడ్డామా?’ అనిపిస్తోంది. ► ఇంతకీ కడుపులో ఉన్న బిడ్డలు తమ మూమెంట్స్ ద్వారా ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా? కుడివైపు ఉన్న బేబీ డిష్యుమ్ డిష్యుమ్ అంటూ ఒకటే హడావిడి. ఎడమవైపు బేబీ అమ్మను ఇబ్బంది పెట్టకూడదన్నట్లు కామ్. ఇప్పుడు కావల్సినంత తీరిక కాబట్టి, నా లైఫ్ స్టార్ట్ అయిన విధానం, ఇక్కడిదాకా వచ్చింది ఆలోచించుకుంటుంటాను. బాధాకరమైన సంఘటనలు గుర్తొచ్చి ఫీలైతే కడుపులో ఉన్న బేబీలు కదలడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘డోంట్ వర్రీ అమ్మా’ అని అన్నట్లు అనిపిస్తోంది. ‘దటీజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్’. ►జనరల్‌గా గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్లంటేచిన్న చూపు ఉంటుంది. చూసే చూపుల్లో, మాట్లాడే మాటల్లో వ్యంగ్య ధోరణి కనిపిస్తుంది. అవన్నీ ఎలా తట్టుకుంటారు? కష్టమే. పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు వెకిలి శబ్దాలు చేస్తారు. మీద పడటానికి ట్రై చేస్తారు. చదువుకున్నవాళ్లకు సంస్కారం ఉంటుందంటారు. కానీ, చాలా చోట్ల ఆ మాట తప్పని పిస్తుంది. ఫ్లైట్‌లో అమ్మాయి కనిపిస్తే ఎగాదిగా చూస్తుంటారు. ఒక్కోసారి నేను తట్టుకోలేక, ‘కొంచెం తల తిప్పుకోవయ్యా’ అన్న సందర్భాలు న్నాయి. బాధగా ఉంటుంది. ఏం చేస్తాం చెప్పండి? ఏ ఆడపిల్లనైనా రెస్పెక్ట్ చేసే సంస్కారం పెరగాలి. అది తక్కువ మందికి ఉంది. ► వృత్తిపరమైన పోటీ, అసూయ కామన్. ఆ పరంగా చేదు అనుభవాలు ? ఒకటి చెబుతా. యూఎస్‌లో ఒక ప్రోగ్రామ్ చేశాం. మన తెలుగు పరిశ్రమలో ఆవిడ మంచి సింగర్. తనను స్టేజి మీదకు పిలిచే ముందు వీలైనంతగా పంప్ కొట్టేదాన్ని. నేను స్టేజి మీదకు రాగానే హైప్ క్రియేట్ అవుతుంది. తను రాగానే కొంచెం డౌన్ అవుతుంది. దాంతో ‘నేను ముందు వెళతాను’ అని తనే వెళ్లి పాడుతోంది. అందర్నీ స్టేజి మీదకు పిలుస్తోంది.. పాడుతోంది. నన్ను పిలవడంలేదు. కట్ చేస్తే.. యాంకర్స్ మీద సెటైర్ వేసే స్కిట్ రన్ అవుతున్నప్పుడు.. ‘యాంకర్ ఉదయభాను వస్తారు’ అని ఆ స్కిట్ చేసేవాళ్లే పిలిచారు. నేను స్టేజి మీదకు వెళ్లేటప్పుడు ఆర్కెస్ట్రా వాళ్లు నీరసం వచ్చే బీట్ ఒకటి వేశారు. వాళ్లను ఆవిడ తీసుకొచ్చింది. షో అయిపోయి, గుడ్‌బై చెప్పేటప్పుడు నన్ను తప్ప మొత్తం టీమ్‌ని పిలిచింది. అయినా నేను స్టేజి మీదకు వెళ్లి, ‘థర్టీ డేస్ నుంచి ఈ షో చేస్తున్నా. ఈరోజు లాస్ట్ షో. మీ అందరికీ గుడ్‌బై చెబుదామనుకున్నా. మేడమ్ పిలవలేదు. అందరూ అంటున్నారు మేం మళ్లీ రావాలని. నేను మళ్లీ రాను. రావాలని కూడా లేదు. ఇక్కడకు వచ్చి ఎన్నో సాధించారు. మీరు మన దేశం రావాలి. అక్కడ ఒకామె ఎదురు చూస్తోంది. ఆవిడే మీ అమ్మ. మీ దేశం కోసం, మీ ఊరి కోసం మీరు రావాలి. చేతనైనంత సాయం చేయండి. వస్తారని ఆశిస్తున్నా’ అన్నాను. అందరూ చప్పట్లు కొట్టారు. మాట్లాడి వచ్చేశాక ‘నేను పిలవాలనే..’ అంటూ సాగదీసింది. ఇలాంటివి చాలా జరిగాయి. అందుకే ఇండస్ట్రీలో నాకు స్నేహితులు తక్కువ. బయట నా కోసం ప్రాణమిచ్చే స్నేహితులున్నారు. ► ఆకలి బాధ, ఆర్థిక కష్టాలు తెలుసా? మా నాన్నగారిది చాలా పెద్ద కుటుంబం. జమిందార్లు. నా నాలుగేళ్ల వయసులోనే నాన్న చనిపోయారు. అప్పుడు నాన్న ఆస్తిలో అమ్మ చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు. లక్షలు లక్షలు తీసుకుని ఎవరైనా మోసం చేస్తే ఎంత బాధ ఉంటుందో తెలుసు. అందుకే ఎవరైనా కష్టం అంటే వెంటనే సహాయం చేయాలనిపిస్తుంది. అనాథ పిల్లలకు పదివేలిస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు, సొంతవాళ్లకి మీరేమైనా ఇవ్వండి అది ఉండదు. మనం ఎదుగుతుంటే ఒకటే ఏడుపు. ఈ మధ్య ఓ అమ్మాయికి చిన్న సాయం చేశాను. తను అన్న మాటలు ఎప్పటికీ మరచిపోలేను. హెల్ప్ చేసినందుకు జీవితాంతం విశ్వాసంగా ఉండమని కాదు.. మన ఎదుగుదల చూసి, వాళ్లు ఆనందపడితే అప్పుడు మనకూ హ్యాపీగా ఉంటుంది కదా. ► అప్పట్లో ‘లీడర్’లో ఐటమ్ సాంగ్ చేశారు.. ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? శేఖర్ కమ్ముల అడిగారు. బేసిక్‌గా నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి, ట్యూన్ నచ్చి చేశాను. ఆ పాట తర్వాత దాదాపు 25 ఐటమ్ సాంగ్స్‌కి అవకాశం వచ్చింది కానీ, చేయలేదు. ‘జులాయి’లో చేశాను. ► ఆడపిల్లలు కావాలనుకుంటున్నారా? మగపిల్లలా? నాకూ, విజ్జూకి ఎవరైనా ఓకే. ‘ఇప్పటికే ఇల్లంతా నీ బట్టలు, నీ నగలు.. నాకు ఒక్క కబోర్డ్ ఇచ్చావ్. ఇక, ఇద్దరు ఆడపిల్లలు పుడితే వాళ్ల బట్టలు, నగలు... నాకు ఆ కబోర్డ్ కూడా ఉండదు’ అని నవ్వుతాడు. ► ఇక ఇంటికే పరిమితం కాదల్చుకున్నారా...? కొన్ని నెలలు బ్రేక్ తీసుకుని, మళ్లీ కెరీర్ స్టార్ట్ చేస్తాను. నేను, విజ్జూ ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేశాం. ఈలోపు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో పక్కన పెట్టాం. ► మీ ఇద్దరు.. మీకిద్దరు. చాలా.. ఇంకా? లేదండీ. నాకింకా పిల్లలు కావాలని ఉంది (నవ్వుతూ). ► మరో వారంలో మీ ఇద్దరి జీవితంలోకి మరో ఇద్దరు రాబోతున్నారు.. తల్చుకుంటే ఏమనిపిస్తోంది? ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నా. రేపో మాపో.. ఐదు రోజుల్లోనో మా ఇంటికి పిల్లలు వచ్చేస్తారు. నా గురించి గాసిప్స్ రాసేవాళ్లు వీలైతే ఆశీర్వదించండి. హర్ట్ మాత్రం చేయొద్దు. ► ఆల్ ది బెస్ట్ . పండంటి బిడ్డలు పుట్టాలని కోరుకుంటున్నాం... థ్యాంక్యూ సో మచ్. - డి.జి.భవాని -
అరెస్టులకు భయపడేది లేదు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉదయభాను వీరులపాడు : ప్రజా సమస్యల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, అరెస్టులకు భయపడేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను అన్నారు. పెనుగంచిప్రోలులో మంగళవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జగ్గయ్యపేట నియోజకవర్గం, జిల్లా ప్రజల సమస్యలపై వినతిప్రతం ఇచ్చేందుకు వెళుతున్న ఉదయభానును అరెస్టు చేసిన విషయం విదితమే. నందిగామ నియోజకవర్గం వీరుల పాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండో విడత జన్మభూమిలో ప్రజల నుంచి అందిన 28.50లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందే తెలపటం ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమన్నారు. జన్మభూమి గ్రామ కమిటీలను ఏర్పాటు చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేయటమేనన్నారు. సంక్షేమ పథకాల అమలులో జన్మభూమి గ్రామ కమిటీలే తుది నిర్ణయమని ముఖ్యమంత్రి ప్రకటించటం ఆయన దివాలుకోరు తనానికి నిదర్శనమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందజేసిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ సమస్యలను తెలిపేం దుకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయటం నీతిమాలిన చర్య అన్నారు.జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మదార్‌సాహెబ్, వత్సవాయి, వీరులపాడు, పెనుగంచిప్రోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీన ర్లు గాదెల రామారావు, కోటేరు ముత్తారెడ్డి, కంచేటి రమేష్, ఎస్సీసెల్ ప్రెసిడెంట్ అన్నెపాక నరసింహారావు, పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేత ఉదయభాను అరెస్ట్
జగ్గయ్యపేట(కృష్ణా జిల్లా): ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ నేత ఉదయభానును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురువారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ఆర్టీసీ డిపో వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. సమ్మె నేపథ్యంలో జగ్గయ్యపేట ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు ప్రయత్నించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. వీరికి వైఎస్సార్సీపీ నేత ఉదయభాను మద్దతుగా నిలిచారు. అందరూ కలిసి డిపో ఎదురుగా బైఠాయించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉదయభానును అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తిరువూరులో... తిరువూరులో ఆర్టీసీ డిపోలో నుంచి బయటకు వస్తున్న బస్సులను ఆ సంస్థ కార్మికులు అడ్డుకుని డిపో ముందు ఆందోళనకు దిగారు. దీంతో డిపో వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న 13 మంది కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
వాసుకు కన్నీటి వీడ్కోలు
అంతిమయాత్రలో పాల్గొన్న వేలాదిమంది పలువురు నేతల నివాళులు సమగ్ర దర్యాప్తునకు ఉదయభాను డిమాండ్ చందాపురం(నందిగామ రూరల్) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొగ్గవరపు శ్రీ శైల వాసు అంతిమ యాత్ర బుధవారం సాయంత్రం గ్రామంలో భారీ జనసందోహం నడుమ కొనసాగింది. గ్రామంలోని ఆయన గృహాం వద్ద నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో వేలాది మంది అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కిలోమీటరుపైగా కొనసాగిన ఈ యాత్రలో అభిమానుల నినాదాలతో మార్మోగింది. గ్రామ సమీపంలోని ఆయన పొలం వరకు ఈ యాత్ర సాగింది. వాసు కుమారుడు రామకృష్ణతో చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నవారంతా కంటతడి పెట్టారు. ఈ అంతిమ యాత్రలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మొండితోక జగన్మోహన్రావు, కార్యాలయ ఇన్చార్జి అరుణ్‌కుమార్, పలువురు పార్టీ నాయకులు, వివిధ పార్టీల నేతలు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబానికి అండగా ఉంటాం... శ్రీశైల వాసు కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కోనేరు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. వాసు మృతదేహాన్ని బుధవారం ఆయన సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కోనేరు మాట్లాడుతూ మంచి నాయకుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని అన్నారు. ఆయన కుటుంబానికి ఎటువంటి అవసరం వచ్చినా పార్టీ అండదండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ నేత సామినేని ఉదయభాను మాట్లాడుతూ శ్రీ శైల వాసు హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. వాసు హత్య వెనుక కుట్ర ఉందనే అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఓ మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వెంట పార్టీ నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మొండి తోక జగన్మోహనరావు, కోవెలమూడి వెంకటనారాయణ తదితరులు ఉన్నారు. నా భర్త చనిపోలేదు... బొగ్గవరపు శ్రీ శైలవాసు మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులు పడుతున్న వేదన వర్ణనాతీతం. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వాసు అనతి కాలంలోనే రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదగటంతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా నందిగామ ప్రాంత ప్రజల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, ఆయన ద్వారా సహాయం పొందినవారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీ శైల వాసుకు భార్య లక్ష్మీసుజాత, పిల్లలు విష్ణుప్రియ, రామకృష్ణలు ఉన్నారు. విష్ణుప్రియ ఏడో తరగతి చదువుతుండగా, రామకృష్ణ ఐదో తరగతి చదువుతున్నాడు. తండ్రి మృతదేహం వద్ద వారు విషణ్ణ వదనాలతో ఉండటం చూపరులను ఆవేదనకు గురిచేసింది. కాగా భర్త మృతి చెందాడన్న వార్త తెలిసినప్పటి నుంచి లక్ష్మీసుజాత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెను ఓదార్చేందుకు వచ్చిన పెద్దల ముందు తన భర్త చనిపోలేదంటూ విలపించడం వారిని కంట తడి పెట్టించింది. ఒక దశలో వాసు మృతదేహం వద్దకు వచ్చిన భార్య.. ‘నాడి కొట్టుకుంటుంది ఒక్కసారి పరీక్షించ ండి’ అని డాక్టర్ జగన్మోహనరావును కోరుతూ విలపించింది. దీంతో ఆయన ఆమెను ఓదార్చేందుకు యత్నించారు. ఈ ఘటనను చూసి అక్కడ ఉన్నవారు తీవ్ర ఆవేదన చెందారు. నిందితుల కోసం పోలీసుల ప్రత్యేక బృందాలు నందిగామ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొగ్గవరపు శ్రీ శైలవాసు హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నందిగామ డీఎస్పీ రాధేష్ మురళీ బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన తుపాకీకి సంబంధించిన ఒక తూటాను అక్కడే స్వాధీనం చేసుకున్నారు. వాసును కాల్చడానికి రెండు తూటాలు ఉపయోగించినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా తెలిసినట్లు ఇన్స్పెక్టర్ భాస్కరరావు పేర్కొన్నారు. హత్య అనంతరం దుండగులు మోటార్ బైక్‌పై పరారయ్యారు. హనుమంతుపాలెం క్రాస్ వద్ద జాతీయ రహదారిపై అక్కడ సిద్ధంగా ఉన్న కార్లలో వారు పరారైనట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరు చందాపురం గ్రామానికి చెందిన ఉన్నం హనుమంతరావు కాగా, రెండో వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకుడు పాషాగా గుర్తించారు. పాషా ఫొటో కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దీపావళి పండుగ రోజున మృతుడు వాసు వెంబడి వీరిద్దరూ పలు కార్యక్రమాల్లో అనుసరించినట్లు తేలిం ది. ఆ సమయంలో నందిగామ మెయిన్ సెంటర్లో సంజీవని ఫార్మసీలో పాషా మందులు కొనుక్కునేందుకు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ దుకాణంలోని సీసీ కెమెరా పుటేజీని పరిశీ లించారు. ఎర్రషర్టు ధరించిన పాషాను గురించి, ఫుటేజీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడైన హనుమంతరావు కుటుంబ సభ్యులను తీసుకువచ్చి విచారణ చేసినట్లుగా సమాచారం. కొందరు పెద్దలు రూపొందించిన పథకం ప్రకారం.. హనుమంతరావు కిరాయి హంతకునితో హత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందుతున్నట్లు తెలిసింది. కిరాయి హంతకుడిని తీసుకువచ్చి హత్య చేయించే ఆర్థిక స్తోమత హనుమంతరావుకు లేదని పలువురు పేర్కొంటున్నారు. నిందితులను త్వరిత గతిన పట్టుకోవాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.