'ప్రతి ఇంటికి పెద్ద కొడుకు వైఎస్ జగన్'
అమరావతి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని విశాఖ జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. పెద్ద కొడుకును అని చెప్పుకొని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు అందర్నీ మోసం చేశారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి వెంకయ్య, చంద్రబాబు కలిసి రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. ఆదివారం ఇక్కడ జరుగుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖను, రాజధాని ప్రాంతాన్ని చంద్రబాబు దోచుకుంటున్నారని ఆరోపించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూ దొంగలను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు. మరోపక్క, ఇదే ప్లీనరీలో మరో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాజధాని భూ కుంభకోణంపై సీబీఐ విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ కుంభకోణాలు ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓటుకు కోట్లు కేసులో చిక్కుకొని చంద్రబాబు అమరావతికి పారిపోయి వచ్చారని విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూములు సింగపూర్ సంస్థలకు చంద్రబాబు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ సంస్థలకు ప్రజాధనంతో మౌలిక సదుపాయాలు, విద్యుత్, రోడ్లు వేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
చదవండి:
నాయకుడంటే ప్రజల గుండె చప్పుడు: వైఎస్ విజయమ్మ
మాట తప్పడం మా రక్తంలో లేదు: వైఎస్ షర్మిల
'వచ్చే ఎన్నికల్లో బాబుకు ఒకటి, పప్పుకొకటి'
ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేసిన వైఎస్ జగన్
ఎన్టీఆర్‌తోనే చంద్రబాబు హత్యా రాజకీయాలు
వైఎస్‌ఆర్ అంటేనే ఓ ప్రేమ మత్తు..