అరెస్టులకు భయపడేది లేదు | Do not be afraid to arrests | Sakshi
Sakshi News home page

అరెస్టులకు భయపడేది లేదు

Published Wed, Jan 6 2016 12:41 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

Do not be afraid to arrests

వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉదయభాను
 
వీరులపాడు : ప్రజా సమస్యల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, అరెస్టులకు భయపడేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను అన్నారు. పెనుగంచిప్రోలులో మంగళవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జగ్గయ్యపేట నియోజకవర్గం, జిల్లా ప్రజల సమస్యలపై వినతిప్రతం ఇచ్చేందుకు వెళుతున్న ఉదయభానును అరెస్టు చేసిన విషయం విదితమే. నందిగామ నియోజకవర్గం వీరుల పాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. 

రెండో విడత జన్మభూమిలో ప్రజల నుంచి అందిన 28.50లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందే తెలపటం ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమన్నారు. జన్మభూమి గ్రామ కమిటీలను ఏర్పాటు చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేయటమేనన్నారు. సంక్షేమ పథకాల అమలులో జన్మభూమి గ్రామ కమిటీలే తుది నిర్ణయమని ముఖ్యమంత్రి ప్రకటించటం ఆయన దివాలుకోరు తనానికి నిదర్శనమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందజేసిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు మాట్లాడుతూ సమస్యలను తెలిపేం దుకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయటం నీతిమాలిన చర్య అన్నారు.జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మదార్‌సాహెబ్, వత్సవాయి, వీరులపాడు, పెనుగంచిప్రోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీన ర్‌లు గాదెల రామారావు, కోటేరు ముత్తారెడ్డి, కంచేటి రమేష్, ఎస్సీసెల్ ప్రెసిడెంట్ అన్నెపాక నరసింహారావు, పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement