
సత్యరాజ్, వశిష్ట ఎన్. సింహా, సాంచి రాయ్, ‘సత్యం’ రాజేష్, ఉదయ భాను నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. మారుతీ టీమ్‌ప్రోడక్ట్ సమర్పణలో వానర సెల్యూలాయిడ్‌పై విజయపాల్ రెడ్డి ఆదిదల నిర్మించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ నుంచి యాంకర్, నటి ఉదయ భాను పోషించిన వాకిలి పద్మ పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
‘భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడు బార్బరిక్ (బార్బరికుడు) పాత్రను ఆధారంగా తీసుకుని ‘త్రిబాణధారి బార్బరిక్’ రూపొందించాం. చాలా ఏళ్ల తర్వాత వాకిలి పద్మ అనే మంచి పాత్రలో ఉదయ భాను నటించారు. నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కుశేందర్ రమేష్ రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్.