విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజం యేసుప్రభువు వారి జన్మదినం జరుపుకొనేందుకు నాలుగువారాలు ముందస్తుగా ‘క్రిస్మస్’ వేడుకలు ప్రారంభిస్తున్నారు. దీనినే ‘అడ్వెంట్’ అంటారు. అనగా ఆగమనం/రాకడ/ఆహ్వానం పలుకుటకు ముందస్తుగా ఏర్పాట్లు ప్రారంభించి, డిసెంబరు 24 సాయంత్రంతో ముగిస్తారు.
దేవకుమారుడైన యేసుక్రీస్తు ఆగమనానికి ముందస్తు క్రైస్తవ విశ్వాస సమాజం ప్రార్థనలోను, సంఘ సహవాసంతోను కలిసి దేవుని వాక్యానుసారంగా ప్రార్థించుటకు ‘దేవుని మందిరమైన’ సంఘంలో పాల్గొని ‘క్రిస్మస్’ డిసెంబరు 25న క్రీస్తు జన్మదినం కొరకు సిద్ధపడటమే ‘అడ్వంట్’. చీకటిరాత్రి తొలగి అరుణోదయ కాంతి రావటమే ప్రధానాంశం.
క్రీ.పూ. 5వ శతాబ్ద కాలంలో ‘మాలకీ’ అనే దేవుని దూత చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు అనగా ప్రవాసులుగా భూమియంతట చెందినవారిని, నిస్సహాయక స్థితిలో ఉన్న వారిని భయభక్తులు కలిగి వుండాలని సందేశిమిచ్చాడు. కానీ వారిని భయభ్రాంతుల నిమిత్తం కాదన్నది వాక్యభావం, అందులో ప్రాముఖ్యంగా నియామ ఏకదినము, చిగురపుట్టను అన్న వచనాలు బలపరుస్తూ క్రీ.పూ 742–687 సంవత్సకాలంలో సింధూర వృక్షం నరకబడిన దానిమొద్దులోనుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టునన్న వాక్యం దావీదు వంశావళిలో శాంతి, సమాధానాది ప్రదాతయైన యేసుప్రభువువారు జన్మించునని ముందస్తుగానే ప్రవచించారని వాక్యం స్పష్టీకరించుచున్నది. మలాకీ కాలం క్రీ.పూ. 5వ శతాబ్దం (మలాకీ 4 :1 –6; యెషయా 6 : 13).
ఈ ముందస్తు క్రీస్తు ప్రభువువారి జన్మదిన సిద్ధపాటులో ప్రజలు లేక పెండ్లి విందుకు ఆహ్వానించినవారిలో కొందరు బుద్ధిమంతులు వుంటారని, మరికొందరు బుద్ధిహీనులుగా వుంటారని పెండ్లి కుమారుడు వచ్చేవరకు వేచి వున్న బుద్ధిమంతుల దీపము అనగా భక్తిపరులుగా వాక్యానుసారంగా ఎదురుచూస్తారని ఏల అనగా వారి దీపములలో అనగా భక్తిలో నూనెతో సిద్ధపడతారని, (‘నూనె’ భక్తికి సాదృశ్యం), బుద్ధిహీనులు దానికి బదులుగా విరుద్ధమైన సిద్ధపాటు పడతారని వారు బుద్ధిహీనులని యేసుప్రభువులవారు ఇశ్రాయేలీయుల ప్రజలతో ఉపమాన రీతిలో బోధించారని ఈ వాక్యం తెలియజేస్తున్న పరమార్థం (మత్తయి 5 :1–13).
కనుక ముందస్తు ఆగమనం కొరకు ఎదురుచూసేవారు ఈ నాలుగువారాలు సంఘము నియమింపబడిన సమయంలో భక్తిపూర్వకంగా వాక్యానుసారమైన ప్రార్థన, సంఘ సహవాసంతో కలిసి ప్రార్థనలలో పాల్గొని పరిశుద్ధంగా అనగా ఆ ప్రార్థనల్లో 100 శాతం నిజాలు, ప్రభువు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు వుండేలా సిద్ధపడుదురు గాక.
– కోట బిపిన్‌చంద్రపాల్
Comments
Please login to add a commentAdd a comment