
ఆలయ ప్రాంగణంలోని గోముఖ తీర్థంలో పవిత్ర జలధార
సాక్షాత్తూ కాశీ గంగా ప్రవాహమే ఇక్కడ తీర్థంలో నీటిధారగా జాలువారుతోందని భక్తుల నమ్మిక
వ్యర్థాలతో 35 ఏళ్ల క్రితం మూసుకుపోయిన గోముఖ రంధ్రం
ఆలయ నిర్వహణ పనుల్లో భాగంగా గోముఖం పునరుద్ధరణ
తీర్థధార పునఃప్రారంభంతో భక్తుల్లో ఆనందోత్సాహాలు
సోలాపూర్: మహారాష్ట్రవాసుల ఆరాధ్య దైవం శ్రీ తుల్జా భవాని మాత ఆలయంలో పవిత్ర గోముఖ తీర్థంనుంచి జలధారలు మళ్లీ జాలువారుతున్నాయి. అనేక సంవత్సరాలుగా గోముఖ తీర్థానికి నీటిప్రవాహం నిలిచిపోవడంతో ఆవేదన చెందిన భక్తులు ప్రస్తుతం నీటిబుగ్గ పునఃప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పవిత్ర కాశీ పుణ్యక్షేత్రం నుంచి తుల్జాపూర్ భవానీ ఆలయంలోని గోముఖతీర్థంలోకి గంగా ప్రవాహం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. గోముఖం నుంచి తీర్థ గుండం లోకి 24గంటలపాటు ఈ సహజ నీటి ధార జాలవారుతుంది. అందుకే కాశీకి వెళ్లలేకపోయినా ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే దుంఖాలు, పాపాలు నశిస్తాయని భావిస్తారు. అందుకే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఈ తీర్థం నిత్యం కిటకిటలాడుతుంటుంది. అయితే గత 35 ఏళ్లుగా ఈ సహజ నీటిధార ఆగిపోయింది. వ్యర్థాల కారణంగా ఆనాడు ఆగిపోయిన సహజ నీటిధార ప్రస్తుతం మళ్లీ దానంతటదే పునఃప్రారంభం కావడంతో భక్తులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ నీటిప్రవాహం ఆలయం చుట్టుపక్కల ఉన్న బాలఘాట్ కొండల నుంచి వస్తుందని భావించినా, ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయతి్నంచినా ఇంతవరకూ జలధార మూలం అంతుచిక్కలేదని ఆలయ కమిటీ సీఈవో, తహసిల్దార్ మాయ మానే తెలిపారు.
భక్తుల కొంగుబంగారం భవానీదేవి..
కోరిన కోర్కెలు తీర్చే తుల్జాపూర్ శ్రీ భవాని దేవి రాష్ట్ర వాసుల ఇలవేల్పు. చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయాన్ని 17 లేదా 18 శతాబ్దాల్లో నిరి్మంచారు. సభా మందిరానికి పశి్చమ దిశలో గర్భగుడి, అక్కడ తూర్పుముఖంగా వెండి సింహాసనంపై శ్రీ తుల్జా భవాని దేవి మూలమూర్తిని ప్రతిష్టించారు. అమ్మవారిని మహిషాసుర మర్దిని మణిహార రూపంగా భక్తులు భావిస్తారు. ఏడాదిలో మూడుసార్లు అమ్మవారి విగ్రహాన్ని గర్భగుడి నుంచి తరలించి మంచికి(మంచం)పై అధిరోహింపచేస్తారు.
వ్యర్థాల వల్లే ఆటంకం
భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు ఆలయ కమిటీ సాయి ఫ్రేమ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో గోముఖ తీర్థం నిర్వహణ పనులు చేపట్టింది. ఇంజనీర్ సూరజ్ జాదవ్ మార్గదర్శకత్వంలో సైట్ మేనేజర్ అమోల్ సురువసే పర్యవేక్షణలో కారి్మకులు గోముఖంపై భాగం వద్ద రాతితో కొడుతుండగా ఒక్కసారిగా నీరు ఉబికి వెలుపలికివచి్చంది. గోముఖ రంధ్రంలో వ్యర్థాలు, చెత్త కూరుకుపోవడంతో ఇంతకాలం నీటిధార నిలిచిపోయిందని సూరజ్‌జాదవ్ తెలిపారు. రంధ్రానికి చుట్టుపక్కల ఉన్న వ్యర్థాలను తొలగించిన తర్వాత నీటి ప్రవాహం మళ్లీ ప్రారంభమైందని పేర్కొన్నారు.
గోముఖ తీర్థమే ప్రధాన ఆకర్షణ
తుల్జాపూర్ లోని తుల్జా భవాని ఆలయ ప్రాంగణంలో కల్లోల తీర్థం , సభా మందిరం వంటివి ఉన్నా గోముఖ తీర్థమే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆవునోరు రూపంలో ఉన్న రంధ్రం నుంచి జాలువారే నీటిధారను భక్తులు సాక్షాత్తూ పవిత్ర గంగా జలంగా భావించి పుణ్యస్నానాలాచరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment