హొటగి మఠంలో వీరతపస్వి చెన్నవీర శివాచార్య 69వ వర్థంతి వేడుకలు
హాజరైన పలువురు ప్రముఖ శివాచార్యులు
ఆత్మజ్యోతితో వీరతపస్వికి శ్రద్ధాంజలి
అట్టహాసంగా జ్యోతి ఊరేగింపు, రథోత్సవం
సోలాపూర్: శ్రీ వీరతపస్వి చెన్నవీర శివాచార్య మహాస్వామిజీ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తరఖసుబాలోని హొటగిమఠంలోచిటుగుప్పాకు చెందిన గురులింగ శివాచార్య మహాస్వామి గురువారం తెల్లవారుజామున రెండు గంటల పది నిమిషాలకు ఆత్మజ్యోతిని ప్రజ్వలింప చేసి శ్రీ వీరతపస్వికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వడంగిలికి చెందిన పండితారాధ్య శివాచార్య, మగ నగిరికి చెందిన విశ్వ రాధ్య శివాచార్య, చెడుగుప్పాకు చెందిన ఉత్తరాధికారి శివాచార్య మహా స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బృహన్మఠ్ అధ్యక్షుడు చెన్నయోగి రాజేంద్ర శివచార్య తన శిరస్సుపై ఆత్మజ్యోతిని ప్రతిష్టింపచేసుకుని ఊరేగింపుగా తరలివెళ్లారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు ‘శ్రీ వీర తపస్వి చెన్నవీర శివాచార్య మహారాజ్‌కి జై, తపో రత్న యోగి రాజేంద్ర శివాచార్య మహారాజ్ కీ జై’అంటూ నినాదాలు చేశారు.
పవిత్ర జలకలశాలతో జ్యోతికి స్వాగతం
ఊరేగింపులో ముందు వరుసలో శ్రీ వీరతపస్వి చిత్రపటంతో పువ్వులతో అలంకరించిన ట్రాక్టర్ వాహనం, బ్యాండ్ మేళాలు, పల్లకీలు, విద్యార్థుల బృందాల వెంటరాగా రథం బ్యాండ్ బాజా భజంత్రీలు, వివిధ గ్రామాల నుండి వచ్చిన పల్లకీలు, విద్యార్థుల బృందాలు వెంటరాగా మల్లికార్జున మందిర్ నుంచి వివిధ మార్గాల మీదుగా మజిరేవాడి వద్దకు చేరుకున్న ఎడ్లబండి రథానికి మహిళలు రంగు రంగుల ముగ్గులు, పవిత్ర జల కలశాలతో స్వాగతం పలికారు.
చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్‌ప్రైజ్ గిప్ట్
హొటగికి చేరుకున్న అనంతరం ఊరేగింపు ముగిసింది. ఈసందర్భంగా గ్రామస్తులు జ్యోతికి గ్రామస్తులు మంగళహారతులు పట్టారు. పలువురు ప్రముఖ శివాచార్యులు ధార్మిక ప్రసంగాలు చేసి భక్తులకు మార్గదర్శనం చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ రథోత్సవంలో నాగంసూర్‌కు చెందిన శ్రీకాంత్ శివచార్య మహాస్వామీజీ, శిఖర్ సింగన్ పూర్కు చెందిన సిద్ధలింగ శివాచార్య, సిద్ధన కెరకికి చెందిన రాచోటేశ్వరలతోపాటు బృహన్మఠ్ ఆధ్వర్యంలోని బోరామని ,దోత్రి ,దర్గాహలి, ఖానాపూర్ , బోరేగావ్, శతాందుధాని, సారాం బరి, హోటగి గ్రామాలకు చెందిన ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు. రథోత్సవ మార్గాలలో భక్తులకు దాతలు ప్రసాదాలను పంచారు. శ్రీ సిద్దేశ్వర సహకార ఫ్యాక్టరీ తరపును చెరకు రసం పంపిణీ చేశారు.
చదవండి : Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!
Comments
Please login to add a commentAdd a comment