rathayatra
-
భక్తజన సంద్రంగా సింహాచలం..గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు.. (ఫొటోలు)
-
వైభవంగా సింహ‘గిరి’ ప్రదక్షిణ
సాక్షి, విశాఖపట్నం: మహావిశాఖ నగరం.. భక్తజన సంద్రంగా మారింది. శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు సింహాచల గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మధ్యాహా్ననికి భక్తుల సంఖ్య లక్షలకు చేరింది. సంప్రదాయం ప్రకారం సింహగిరి దిగువన ఉన్న తొలి పావంచా వద్ద మధ్యాహ్నం 2.40 గంటలకు సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథ్, నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ కొబ్బరికాయ కొట్టి ప్రచార రథయాత్రని ప్రారంభించారు. సింహాచలం నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా హనుమంతవాక జంక్షన్, తెన్నేటి పార్కు, ఎంవీపీ డబుల్ రోడ్డు, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెం, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలం దేవస్థానానికి చేరుకున్నారు. మొత్తం 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసిన అనంతరం.. వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. విశాఖ వాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. ఏటా గిరి ప్రదక్షిణ రోజు నగరంలో వర్షం కురవడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం సాయంత్రం కూడా వర్షం కురవడంతో సింహాద్రి అప్పన్న మహిమ అంటూ.. భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గాల్లో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాల్ని పరిశీలించారు. సముద్రస్నానం చేసే భక్తులకు అప్పూఘర్ వద్ద ఏర్పాట్లు చేశారు. అనేకమంది భక్తులు సముద్రస్నానం ఆచరించి మళ్లీ ప్రదక్షిణ కొనసాగించి.. స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు సీపీ త్రివిక్రమవర్మ ఆధ్వర్యంలో 2,100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో భక్తులు గిరిప్రదక్షిణ సమయంలోను, స్వామి దర్శన సమయంలోను ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ చర్యలు చేపట్టారు. జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఎస్ఈ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మొత్తం 102 పాయింట్లలో 7.34 లక్షల మందికి మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించారు. భక్తులకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 31 వైద్య శిబిరాలను వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. 20కి పైగా ప్రైవేట్ ఆస్పత్రులు కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించాయి. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ వంతున మొత్తం 16 అంబులెన్స్‌లను ఉంచారు. గిరి ప్రదక్షిణ మార్గములో పలు స్వచ్ఛంద సేవాసంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా తాగునీరు, శీతలపానీయాలు, మజ్జిగ, టీ, బాదంపాలు, అన్న ప్రసాదాలు పంపిణీ చేశాయి. నేడు ఆషాఢ పౌర్ణమి గిరి ప్రదక్షిణ అనంతరం సోమవారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నని లక్షలాదిమంది దర్శించుకోనున్నారు. స్వామి దర్శనం సులభంగా జరిగేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న క్యూ లైన్లకు అదనంగా క్యూ లైన్లను కొండపైన ఉన్న బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యేలా ఏర్పాటు చేశారు. సోమవారం ఆర్జితసేవల్ని రద్దుచేసిన దేవస్థానం.. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు స్వామి దర్శనానికి అనుమతి వేళలుగా నిర్ణయించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్యాన్నదానం చేయనున్నారు. -
పాపం!.. ఆ మంత్రి దురదకు తాళలేక నడిరోడ్డు మీద కుర్తా తీసి..
మధ్యప్రదేశ్‌లో బీజేపీ వికాస్ రథయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే యాత్ర చేస్తున్న మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆ యాత్ర ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ మేరకు మంత్రి బ్రజేంద్ర సింగ్ అసెంబ్లీ నియోజకవర్గం మంగవోలిలోని ఓ గ్రామం గుండా యాత్రకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దురద పెట్టించే పౌడర్‌ను చల్లాడు. దీంతో ఆ మంత్రికి విపరీతమైన దురద రావడంతో.. నడిరోడ్డుపైనే కుర్తా విప్పే పరిస్థితికి దారితీసింది. ఆ దురదకు తాళలేక మంత్రి నీళ్లతో చేతులను, ముఖాన్ని కడుక్కున్నారు. అందుకు సంబంధించిన వీడియోని కొందరూ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మాజీ సర్పంచ్ వికాస్ యాత్ర అవసరమా అని బ్రిజేంద్ర సింగ్‌ని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అంతేగాదు వీడియోలో..ఈ ప్రాంతంలో మూడు కిలోమీటర్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేయలేకపోయింది. మేము కాంగ్రెస్ చెడ్డదనుకున్నాం, కానీ మీరు అంతకంటే అధ్వాన్నంగా ఉన్నారు. మాకు మంచి రహదారులను ఇవ్వండి లేకపోతే మీకు ఓటు వేయం అని ఆ వ్యక్తి ఎమ్మెల్యే ముఖం మీదే అంటున్నట్లు వినిపిస్తుంది. దీనికి మంత్రి కూడా ఓటు వేయకండి అదీ మీ హక్కు అని అతనికి బుదులిస్తున్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఇలానే రెండు రోజుల క్రితమే ఖండ్వా జిల్లాలోని ఒక గ్రామం గుండా వెళ్తుండగా మరో వికాస్ రథ్ రోడ్డుపై ఇరుక్కుపోయింది. ఇదిలా ఉండగా, ఈ వికాస్ యాత్రలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది. अशोकनगर, मध्य प्रदेश जनसंपर्क पर निकले मंत्री को लगाया #खुजली पाउडर। यात्रा रोक, नहाना पड़ा। PHE मंत्री / भाजपा नेता बृजेंद्र सिंह यादव को जनसंपर्क के दौरान किसी ने लगाया खुजली पाउडर। खुजा खुजा कर हुआ था बुरा हाल ! pic.twitter.com/w5GZtCWmyy — काश/if Kakvi (@KashifKakvi) February 9, 2023 (చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం) -
రథయాత్రలో కరెంట్ షాక్: ఇద్దరు దుర్మరణం
దామరగిద్ద (నారాయణపేట): రథసప్తమి ఉమ్మడి పాలమూరు జిల్లాలో విషాదం నింపింది. రథయాత్రలో విద్యుదాఘాతం సంభవించి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రథసప్తమి సందర్భంగా గ్రామ శివారులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం రథాన్ని ఊరేగిస్తుండగా విద్యుదాఘాతం సంభవించింది. జాతర కోసం నూతనంగా తయారు చేయించిన ఇనుప రథాన్ని తరలిస్తుండగా పైనున్న విద్యుత్ తీగలు తగలి చంద్రప్ప, హనుమంతు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని వెంటనే నారాయణపేటలోని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఉత్సాహంగా సాగుతున్న రథయాత్రలో ఒక్కసారిగా అల్లకల్లోలం ఏర్పడింది. భక్తులందరూ భయాందోళన చెందారు. అయితే ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. -
రాష్ట్రంలోకి రామరథయాత్ర
జోగుళాంబ శక్తిపీఠం(అలంపూర్): అయోధ్య రామమందిరంలో ఓంకార ధ్వనులను ప్రతి ధ్వనింపజేసే ఘంటానాదానికి ఐదో శక్తిపీఠం అమ్మవారు జోగుళాంబదేవి ఆశీస్సులు అందాయి. భక్తురాలు రాజ్యలక్ష్మి ఈ గంటను రామ రథయాత్ర ద్వారా అయోధ్యకు చేరుస్తున్నారు. రామేశ్వరం టు రామ జన్మభూమి పేరిట 613 కిలోల ఈ గంటను అయోధ్యకు చేర్చేందుకు సెప్టెంబర్ 17న రామరథ యాత్రను ప్రారంభించారు. శుక్రవారం ఈ యాత్ర తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయానికి చేరుకుంది. ఆలయ ఈఓ ప్రేమ్‌కుమార్ అర్చకులతో కలసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 21రోజుల పాటు 4,552 కిలోమీటర్లు, పది రాష్ట్రాల మీదుగా భక్తుల పూజలందుకుంటూ అయోధ్యకు ఈ గంటలను చేరుస్తామని రథసారథి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. -
ఘనంగా శ్రీజగన్నా«థ రథయాత్ర
కర్నూలు(న్యూసిటీ) : కర్నూలులోని ఎగ్జిబిషన్ ఆవరణలో ఇస్కాన్ ఆధ్యర్యంలో శ్రీజగన్నాధ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు బలదేవి, సుభద్రదేవి సమేత జగన్నాథస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నృసింహ, తులసి హారతులు ఇచ్చారు. సాయంకాలం 1008 ఆహార పదార్థాలతో అమ్మవార్లు స్వామికి నివేదన చేశారు. ఇస్కాన్ కర్నూలు ప్రాజెక్టు డైరెక్టర్ రూపేశ్వర్ చైతన్యదాస్, నరసరావుపేట ఇన్చార్జి వైష్ణవ ప్రభుదాస్, కర్నూలు ఇన్చార్జి చైతన్య చంద్ర ప్రతిదాస్ పాల్గొన్నారు. -
అందరికీ ఆదర్శం అద్వానీ
సందర్భం ఆజాద్, బోస్, జేపీ లాంటి నాయకుల తర్వాత దేశం గర్వించ దగ్గ రాజకీయ నాయకులు అరుదు. అద్వానీ నేటి తరాలకు లివింగ్ లెజెండ్ మాత్రమే కాదు నడుస్తున్న చరిత్ర కూడా. సువిశాలమైన పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్ నుంచి ఎంపీల లైబ్రరీ గదివైపు వచ్చి, రూమ్ నెంబర్ 5 సమీపంలో వరం డాలో నడుచు కుంటూ పక్కనే ఉన్న ఎన్డీఏ, బీజేపీ కార్యాలయంలోకి ఆరడుగుల ఎల్కే అద్వానీ నెమ్మ దిగా నడుచుకుంటూ వెళుతుంటే.. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఫ్లోర్ లీడర్లు, ఎంపీలు, సందర్శకులు అంతా చేతు లెత్తి నమస్కరిస్తుంటారు. అందరికీ ప్రతి నమస్కారం చేస్తూ చిద్విలాసంగా ఆయన వెళుతుంటారు. లోక్‌సభలో తొలి వరుస బెంచీల్లో కూర్చుని కార్యకలాపాలను ఆసాంతం వినటం, పార్టీ ఎంపీలకు సల హాలు, సూచనలు ఇవ్వటం ఆయనకు రివాజు. ప్రతి రాష్ట్రంతోనూ, దాదాపు ప్రతి ప్రాంతంతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయని, స్వయంగా ఆయన ఆ ప్రాంతా లన్నిటిలో తిరిగారని అంటే నమ్మలేకపో వచ్చు. స్వాతంత్య్ర కాలం నాటి గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్, వల్లభ్ భాయ్ పటేల్, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్ర బోస్, జయప్రకాశ్ నారాయణ్ లాంటి నాయ కులను పక్కనపెడితే.. ఆ తర్వాత దేశం యావత్తూ గర్వించదగ్గ రాజకీయ నాయ కులు పెద్దగా కనబడరు. 89వ వసంతంలోకి అడుగు పెడుతున్న అద్వానీ నేటి తరాలకు లివింగ్ లెజెండ్, నడుస్తున్న చరిత్ర. అద్వానీ అఖండ భారత్‌లో, నేటి పాకిస్తాన్లో కరాచీలో పుట్టారు. ఉన్నత విద్య కోసం ముంబై వచ్చారు. స్వాతంత్య్రోద్యమ సమయంలోనే ఆర్ఎస్ఎస్లో చేరి, పద్నా లుగేళ్ల ప్రాయంలోనే జీవితాన్ని జాతి సేవకు అంకితం చేశారు. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి, రెండేళ్ల పాటు అద్వానీని జైల్లో పెట్టారు. 1970లో తొలిసారి రాజ్య సభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగు పెట్టిన ఆయన నాలుగుసార్లు రాజ్యసభకు, ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. బీజేపీ నిర్మాణంలో అద్వానీ పాత్ర అనన్య సామాన్యం. ముఖ్యంగా 80, 90 దశకాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయితో కలసి ఆయన బీజేపీకి సుస్థిరమైన పునాదులు వేశారు. ఆయన కృషి, పట్టుదల ఫలితమే రెండు లోక్‌సభ స్థానాలుగల బీజేపీ 1989 ఎన్ని కల్లో 86 సీట్లు గెల్చుకుంది. ఆ తర్వాత 121, 161.. ఇలా స్థానాలు పెంచుకుంటూ ఢిల్లీ గద్దెను సొంతం చేసుకుంది. సొంత బలంతో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆయన మాట కూడా 2014లో సాకారమైంది. 63 ఏళ్ల వయసులో అద్వానీ తన మొదటి రథయాత్ర.. రామ్ రథయాత్రను 1990లో ప్రారంభించారు. 1993లో రెండు ముసాయిదా చట్టాలను వ్యతిరేకిస్తూ.. జనా దేశ్ యాత్ర, స్వాతంత్య్రం సిద్ధించి 50 ఏళ్లు గడిచిన నేపథ్యంలో 1997లో స్వర్ణ జయంతి రథయాత్ర, దేశ చరిత్రలో తొలిసారి ఐదేళ్ల సుపరిపాలన అందించి, వృద్ధిని పరుగులె త్తించిన నేపథ్యంలో 2004లో భారత్ ఉదయ్ యాత్ర, తీవ్రవాదం, మైనార్టీ రాజకీ యాలు, అవినీతి, అధిక ధరలు, రాజ్యాంగ పరిరక్షణల కోసం 2006లో భారత్ సురక్ష రథయాత్ర, కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతి రేకంగా 2011లో జన చేతన యాత్ర జరి పారు. నైతిక విలువలు పాటిస్తూ రాజ కీయాల్లో మచ్చలేని మనిషిగా ఇన్నేళ్లు గడ పటం మామూలు విషయం కాదు. జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యా యల లాగా వాజ్‌పేయి, అద్వానీలు ఐదు దశాబ్దాలపాటు పని చేశారు. దేశ రాజకీ యాల్లో బీజేపీని తిరుగులేని శక్తిగా తయారు చేశారు. నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ మొదలైన నేటి తరం నాయ కులను తొలినాళ్లలోనే గుర్తించి, వారి ప్రతి భను ప్రోత్సహించినది కూడా అద్వానీయే. ఆరు దశాబ్దాల ప్రజా జీవితంలో మచ్చలేని ఉక్కుమనిషిగా, విలువలే శ్వాసగా, ప్రజా స్వామ్య పరిరక్షణకు అంకితమై, విశాల జాతీయ దృక్పథంతో మొదట దేశం, తర్వాత పార్టీ... చివరగా వ్యక్తిగతం అని నిన దిస్తున్న కురు వృద్ధుడు ఆయన. నేడుఎల్కే అద్వానీ జన్మదినం పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ raghuram.bjp@gmail.com -
10 నుంచి మాదిగల ధర్మపోరాటం
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండువీరయ్య మాదిగ కర్నూలు సీక్యాంప్: ధర్మపోరాట రథయాత్ర కార్యక్రమం నవంబర్ 10 నుంచి ప్రారంభమవుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దండువీరయ్య మాదిగ తెలిపారు. సోమవారం అంబేడ్కర్‌భవన్‌లో రాష్ట్ర ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ..ఎన్నికల మందు వర్గీకరణ చేస్తానని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మాటతప్పి మాదిగలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మోసాలను వివరిస్తూ నవంబర్ 10వ తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మపోరాట రథయాత్ర ప్రారంభమవుతుందని..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతటా పర్యటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నరసింహులు మాదిగ, పూలరాజు, ఈశ్వర్, గోపి, మట్టి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. -
జాతి హితానికి మారుపేరు
సందర్భం ‘దేశ ప్రయోజనాలు ముందు... వ్యక్తిగత జీవితం ఆఖరున’ అనేదే బీజేపీ రాజకీయాలకు ప్రాతిపదిక. అందుకే దేశం గర్వించగలిగేలా, తలెత్తుకు తిరిగేలా సుపరిపాలనను అందించగలుగుతోంది. అవినీతిరహిత పాలన బీజేపీ వల్లనే సాధ్యమని ప్రజలు గుర్తించారు. భారతీయ జనతా పార్టీ నేడు 36వ ఏట అడుగిడు తోంది. ఈ మూడు దశా బ్దాల కాలంలో బీజేపీ అన్ని రకాల ఆటుపోట్లను తట్టుకుని నిలిచింది. ఎన్నో గుణ పాఠాలను నేర్చుకుంది. భారత సమాజ బాధ్య తలను ఔపోసన పట్టిన, అర్థం చేసుకున్న పార్టీ బీజేపీ ఒక్కటే. సైద్ధాంతిక పునాది, ఉత్తమ మార్గదర్శకత్వం ఉంటే వ్యక్తులైనా, సంస్థలైనా బాగా రాణించడమే కాదు, సమాజానికి మేలు చేయగలుగుతారు. దేశ హితాన్ని ప్రాణ ప్రదంగా భావించే రాజకీయ పార్టీయైన బీజేపీకి ఈ మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. 1980 లోక్‌సభ ఎన్ని కల్లో జనతా పార్టీ పరాజయం బీజేపీ ఏర్పాటుకు కార ణమైంది. ఏ కార్యకర్తయినా కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఉన్నత స్థానాలకు చేరవచ్చనే సిద్ధాంతంతో మొత్తం భారత ప్రజలం దరికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పడింది. నాటి నుంచి 1986 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగారు. 1986లో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన లాల్‌కృష్ణ అద్వానీ 1990లో చేపట్టిన రథయాత్ర దేశ రాజకీయాల్లో ఒక మలుపు. 1991లో 120 స్థానాలను సంపాదించడంతోపాటూ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, బిహార్లలో గణనీయంగా ఓట్లను సాధించింది. తర్వాత దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా లలోనూ, తూర్పున ఒడిశా, పశ్చిమాన గుజరాత్, మహారాష్ట్రలలో ప్రభావాన్ని చూపిన బీజేపీ భారతా వనిలోని సరికొత్త జాతీయ పార్టీగా వికసిం చింది.1996 లోక్‌సభ ఎన్నికల్లో 161 స్థానాలను గెలుపొంది వాజ్‌పేయి ప్రధానిగా అది ఏర్పరచిన ప్రభుత్వం 13 రోజులే కొనసాగినా... 1989లో ప్రజలు బీజేపీకి తిరిగి పట్టంగట్టడంతో ఐదేళ్లు కొన సాగిన తొలి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కొద్దిలో అధికా రానికి దూరం కావాల్సి వచ్చినా, రెండేళ్లకే 9 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గుజరాత్లో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని విజయవం తంగా నడిపిన నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిగా... 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు ప్రభంజనాన్ని సృష్టించింది. 281 లోక్‌సభ స్థానాలు సాధించి, దేశ చరిత్రలోనే పూర్తి మెజార్టీ సాధించిన మొదటి కాంగ్రెసేతర పార్టీగా రికార్డును సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. సంఘ్‌పరివార్ సంస్థల్లో బీజేపీ ప్రముఖ మైనది. బీజేపీకి సైద్ధాంతిక మార్గదర్శిగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)... భారత జాతి ఐక్యత, సమగ్రత, గుర్తింపు, సాంస్కృ తికత ప్రత్యేకతల పరిరక్షణ, కొనసాగింపే లక్ష్యంగా కృషి చేస్తున్నది. భారత జాతికి, భారతీయ సమా జానికి భారతీయతే మూలస్తంభం. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా భారతీయులంతా ఒక్కటేనని బీజేపీ విశ్వాసం. అందరికీ గుర్తింపును తెచ్చేది భారతీయ సంస్కృతే, హిందూ సంస్కృతే. హిందుత్వ, మతంతో సంబంధంలేని జాతీయ తాభావం. ప్రపంచాన్ని వసుధైక కుటుంబంగా విశ్వసించి, ఆ కుటుంబ సౌభాగ్యం, సంక్షేమం, ఉన్నతుల కోసం జీవితాలను ధారవోసి ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణతో, నిబద్ధతతో నిర్విరామంగా కృషి చేస్తోంది. దీన్ని వంటబట్టించుకున్న ఆణిముత్యాలైన వాజ్‌పేయి, మోదీలు స్వతంత్ర భారతావనికి అద్భుత పాలనను చవిచూపిన నేతలు. ప్రజాస్వామిక సోషలిజం పేరిట దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్‌పార్టీ... కచ్చితమైన సిద్ధాంతాలు, నియమాలు, క్రమశిక్షణ లేని పార్టీగా పదేపదే రుజువుచేసుకుంది. కరుడుగట్టిన కమ్యూ నిస్టులు, ఆ కమ్యూనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రేమించే కేపిటలిస్టులు సహజీవనం చేసే పార్టీ అది. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అన్నట్టు అది పాము, ముంగిస కలగలసి జీవించే పార్టీ. ఒక కుటుంబాన్ని, ఆ కుటుంబ వారసత్వాన్ని ప్రేమించినంతగా దేశాన్ని, ఖండాంతరాలకు విస్తరించిన జాతి వారసత్వాన్ని ప్రేమించలేని పార్టీ అది. స్వామి దయానంద, స్వామి వివేకానంద , శ్రీ అరబిందో, లోకమాన్య తిలక్, మహాత్మాగాంధీ వంటి ఎందరో మహనీ యులు జాతికి మార్గ నిర్దేశనం చేశారు. స్పష్టమైన సిద్ధాంతం, నిబద్ధత లేని వ్యక్తుల దశాబ్దాల పాలనలో భారతదేశం ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయింది. లోతైన సైద్ధాంతిక పునాదులు. నియమ నిబద్ధతలు, క్రమశిక్షణ, త్యాగనిరతి, నిజాయితీ గల వాజ్‌పేయి, మోదీ వంటి ఎంతో మంది నేతలను ఆర్ఎస్ఎస్ దేశానికి అందించింది. అందుకే సుపరిపాలన, సమగ్రాభివృద్ధి, బీజేపీ పాలనకు మారుపేరయ్యాయి. ‘దేశ ప్రయోజనాలు ముందు, వ్యక్తిగత జీవితం ఆఖరున’ అనే సూత్రం బీజేపీ రాజకీయాలకు ప్రాతిపదిక. కాబట్టే అవినీతిరహిత పాలన బీజేపీ వల్లనే సాధ్యమని ప్రజలు అనతికాలంలోనే గుర్తించారు. జాతి గొప్ప దనాన్ని గుర్తించిన పార్టీ కాబట్టే బీజేపీ ప్రభుత్వం జాతీయ మౌలిక సదుపాయాల కల్పనకు, అట్టడుగుస్థాయి ప్రజలతో సహా అందరి ఉన్నతికి, అభివృద్ధికి తోడ్పడగల వినూత్న పథకాలను మున్నెన్నడూ ఎరుగని రీతిలో రూపొందించి, అమలుచేయగలుగుతోంది. దేశం గర్వించేలా, జాతి తలెత్తుకు తిరిగేలా సుపరిపాలనను అందించగలు గుతోంది. జాతీయతకు పట్టంగట్టి, ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తూమన ఘన వారసత్వానికి దీటుగా ప్రపంచంలో భారత జాతిని తిరిగి నాయకత్వ స్థానంలో నిలబెట్టగలిగే సమర్థత భారతీయ జనతా పార్టీకే ఉంది. నేడు భారతీయ జనతా పార్టీ 36వ ఏట అడుగిడుతున్న సందర్భంగా, పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ జాతీయ సంధానకర్త, raghuram.bjp@gmail.com -
నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు..
పాతపట్టణం(శ్రీకాకుళం జిల్లా): బొనిపూర్-పూరి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. శనివారం శ్రీకాకుళం జిల్లా పాతపట్టణం రైల్వేస్టేషన్లో ఈ రైలు నిలిచిపోయింది. ఇప్పటికే రెండు గంటలు ఆలస్యం కావడంతో పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
జై జగన్నాథ..
నెల్లూరు(బృందావనం) : హరేరామ..హరేకృష్ణ..కృష్ణకృష్ణ హరేహరే..రామరామ హరేహరే..జై జగన్నాథ నామస్మరణతో సింహపురి వీధులు మార్మోగారుు. ఆనందపారవశ్యులైన భక్తుల నృత్యాలు, కీర్తనలు, భక్తగీతాలు, కోలాటాలు, విద్యుత్ దీపాలంకరణలు, మంగళవారుుద్యాల నడుమ సోమవారం నెల్లూరులో జగన్నాథ రథయూత్ర కనులపండువగా సాగింది. మహిళలు రంగురంగుల రంగవళ్లులు తీర్చిదిద్ది రథోత్సానికి స్వాగతం పలికారు. జగ న్నాథుడి దర్శనంతో పాటు నైవేద్యాలు సమర్పించేందుకు దారిపొడవునా భక్తులు బారులుదీరారు. బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథంపై కొలువుదీరిన జగన్నాథుడు భక్తులను అనుగ్రహిస్తూ ముందుకు సాగారు. స్వామి వారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4వ జగన్నాథ రథయూత్ర నవాబుపేటలోని శివాలయం ప్రాంగణం నుంచి ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, ఆర్టీసీ మీదుగా కేవీఆర్ పెట్రోలు బంకు సెంటర్ సమీపంలోని కస్తూరిదేవి విద్యాలయం ప్రాంగణం వరకు సాగింది. రథయూత్రను ఇస్కాన్ కేంద్ర గవర్నింగ్‌బాడి కమిషనర్ భానుస్వామి మహరాజ్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోరుున అనిల్‌కుమార్‌యూదవ్, మేయర్ అబ్దుల్ అజీజ్, పారిశ్రామికవేత్త, వితరణశీలి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి తదితరులు ప్రారంభించారు. నవాబుపేట శివాలయం వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో రథయూత్ర విశిష్టత, జగన్నాథతత్వాన్ని వక్తలు వివరించారు. జగన్నాథుని దర్శనం మంగళదాయకం జగన్నాథుడి దర్శనం మంగళదాయకమని ఇస్కాన్ కేంద్ర గవర్నింగ్ బాడి కమిషనర్ భానుస్వామి మహరాజ్ అన్నారు. కృష్ణభగవానుడి ఆరాధనతో జీవితం సుసంపన్నమౌతుందన్నారు. ప్రస్తుత ఆధునిక,ఒడిదుడుకుల జీవితంలో భగవంతుడిని నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు. భగవంతుని సేవతో జీవితం పునీతమౌతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. కురుక్షేత్ర ఇస్కాన్ మందిర నిర్వాహకుడు సాక్షి గోపాల్ మాట్లాడుతూ జగన్నాథతత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న కాంక్షతో 1966లో ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు భక్తివేదాంత ప్రభుపాద అమెరికాలో జగన్నాథ యూత్ర ప్రారంభించారన్నారు. నేడు అది ఎంతో విశిష్టతగా సాగుతోందన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ భగవంతుని ప్రార్థించడమంటే నీతివంతముగా జీవించడమేనన్నారు. ప్రతి ఒక్కరు తోటి వ్యక్తిలో దైవత్వాన్నిచూడాలన్నారు. మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవగా భావించి ఇస్కాన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. నెల్లూరు ఇస్కాన్ మందిర అధ్యక్షుడు సుఖదేవస్వామీజీ మాట్లాడుతూ జగన్నాథ రథయూత్రకు తోడ్పాటు అందిస్తున్న వదాన్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కసూర్తిదేవి విద్యాలయం ఆవరణలో జరిగిన ముగింపు కార్యక్రమంలో స్వామీజీల సందేశాల తర్వాత జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు 56 వంటకాల నైవేద్యం సమర్పించారు. మొదట జగన్నాథ రథయూత్ర టీషర్టులను మేయర్ అజీజ్, ఇస్కాన్ మందిర బ్యాగులను వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జగన్నాథుడి లీల వైభవం పుస్తకాన్ని ఎమ్మెల్యే అనిల్, సుఖదేవస్వామి ఆలపించిన శ్రీకృష్ణభక్తి గీతాల సీడీని మాజీ ఎమ్మెల్యే ముంగమూరు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూలమూరి రంగయ్యనాయుడు, ఆనం జయకుమార్‌రెడ్డి, ఇస్కాన్ ప్రతినిధులు వేదాంత చైతన్యదాస్, సత్యగోపినాథ్ దాస్, సహదేవ్‌దాస్, శ్రీవత్సదాస్ తదితరులు పాల్గొన్నారు. జగన్నాథుని సేవలో ఎంపీ మేకపాటి రథయూత్ర గాంధీబొమ్మ సెంటర్లో సాగుతున్న సమయంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలను దర్శించుకుని స్వామీజీల ఆశీస్సులు పొందారు.