జాతి హితానికి మారుపేరు
సందర్భం
‘దేశ ప్రయోజనాలు ముందు... వ్యక్తిగత జీవితం ఆఖరున’ అనేదే బీజేపీ రాజకీయాలకు ప్రాతిపదిక. అందుకే దేశం గర్వించగలిగేలా, తలెత్తుకు తిరిగేలా సుపరిపాలనను అందించగలుగుతోంది. అవినీతిరహిత పాలన బీజేపీ వల్లనే సాధ్యమని ప్రజలు గుర్తించారు.
భారతీయ జనతా పార్టీ నేడు 36వ ఏట అడుగిడు తోంది. ఈ మూడు దశా బ్దాల కాలంలో బీజేపీ అన్ని రకాల ఆటుపోట్లను తట్టుకుని నిలిచింది. ఎన్నో గుణ పాఠాలను నేర్చుకుంది. భారత సమాజ బాధ్య తలను ఔపోసన పట్టిన, అర్థం చేసుకున్న పార్టీ బీజేపీ ఒక్కటే. సైద్ధాంతిక పునాది, ఉత్తమ మార్గదర్శకత్వం ఉంటే వ్యక్తులైనా, సంస్థలైనా బాగా రాణించడమే కాదు, సమాజానికి మేలు చేయగలుగుతారు. దేశ హితాన్ని ప్రాణ ప్రదంగా భావించే రాజకీయ పార్టీయైన బీజేపీకి ఈ మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. 1980 లోక్‌సభ ఎన్ని కల్లో జనతా పార్టీ పరాజయం బీజేపీ ఏర్పాటుకు కార ణమైంది. ఏ కార్యకర్తయినా కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఉన్నత స్థానాలకు చేరవచ్చనే సిద్ధాంతంతో మొత్తం భారత ప్రజలం దరికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పడింది. నాటి నుంచి 1986 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగారు. 1986లో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన లాల్‌కృష్ణ అద్వానీ 1990లో చేపట్టిన రథయాత్ర దేశ రాజకీయాల్లో ఒక మలుపు.
1991లో 120 స్థానాలను సంపాదించడంతోపాటూ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, బిహార్‌లలో గణనీయంగా ఓట్లను సాధించింది. తర్వాత దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా లలోనూ, తూర్పున ఒడిశా, పశ్చిమాన గుజరాత్, మహారాష్ట్రలలో ప్రభావాన్ని చూపిన బీజేపీ భారతా వనిలోని సరికొత్త జాతీయ పార్టీగా వికసిం చింది.1996 లోక్‌సభ ఎన్నికల్లో 161 స్థానాలను గెలుపొంది వాజ్‌పేయి ప్రధానిగా అది ఏర్పరచిన ప్రభుత్వం 13 రోజులే కొనసాగినా... 1989లో ప్రజలు బీజేపీకి తిరిగి పట్టంగట్టడంతో ఐదేళ్లు కొన సాగిన తొలి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కొద్దిలో అధికా రానికి దూరం కావాల్సి వచ్చినా, రెండేళ్లకే 9 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గుజరాత్‌లో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని విజయవం తంగా నడిపిన నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిగా... 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు ప్రభంజనాన్ని సృష్టించింది. 281 లోక్‌సభ స్థానాలు సాధించి, దేశ చరిత్రలోనే పూర్తి మెజార్టీ సాధించిన మొదటి కాంగ్రెసేతర పార్టీగా రికార్డును సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది.
సంఘ్‌పరివార్ సంస్థల్లో బీజేపీ ప్రముఖ మైనది. బీజేపీకి సైద్ధాంతిక మార్గదర్శిగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)... భారత జాతి ఐక్యత, సమగ్రత, గుర్తింపు, సాంస్కృ తికత ప్రత్యేకతల పరిరక్షణ, కొనసాగింపే లక్ష్యంగా కృషి చేస్తున్నది. భారత జాతికి, భారతీయ సమా జానికి భారతీయతే మూలస్తంభం. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా భారతీయులంతా ఒక్కటేనని బీజేపీ విశ్వాసం. అందరికీ గుర్తింపును తెచ్చేది భారతీయ సంస్కృతే, హిందూ సంస్కృతే. హిందుత్వ, మతంతో సంబంధంలేని జాతీయ తాభావం. ప్రపంచాన్ని వసుధైక కుటుంబంగా విశ్వసించి, ఆ కుటుంబ సౌభాగ్యం, సంక్షేమం, ఉన్నతుల కోసం జీవితాలను ధారవోసి ఆర్‌ఎస్‌ఎస్ క్రమశిక్షణతో, నిబద్ధతతో నిర్విరామంగా కృషి చేస్తోంది. దీన్ని వంటబట్టించుకున్న ఆణిముత్యాలైన వాజ్‌పేయి, మోదీలు స్వతంత్ర భారతావనికి అద్భుత పాలనను చవిచూపిన నేతలు.
ప్రజాస్వామిక సోషలిజం పేరిట దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్‌పార్టీ... కచ్చితమైన సిద్ధాంతాలు, నియమాలు, క్రమశిక్షణ లేని పార్టీగా పదేపదే రుజువుచేసుకుంది. కరుడుగట్టిన కమ్యూ నిస్టులు, ఆ కమ్యూనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రేమించే కేపిటలిస్టులు సహజీవనం చేసే పార్టీ అది. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అన్నట్టు అది పాము, ముంగిస కలగలసి జీవించే పార్టీ. ఒక కుటుంబాన్ని, ఆ కుటుంబ వారసత్వాన్ని ప్రేమించినంతగా దేశాన్ని, ఖండాంతరాలకు విస్తరించిన జాతి వారసత్వాన్ని ప్రేమించలేని పార్టీ అది. స్వామి దయానంద, స్వామి వివేకానంద , శ్రీ అరబిందో, లోకమాన్య తిలక్, మహాత్మాగాంధీ వంటి ఎందరో మహనీ యులు జాతికి మార్గ నిర్దేశనం చేశారు.
స్పష్టమైన సిద్ధాంతం, నిబద్ధత లేని వ్యక్తుల దశాబ్దాల పాలనలో భారతదేశం ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయింది. లోతైన సైద్ధాంతిక పునాదులు. నియమ నిబద్ధతలు, క్రమశిక్షణ, త్యాగనిరతి, నిజాయితీ గల వాజ్‌పేయి, మోదీ వంటి ఎంతో మంది నేతలను ఆర్‌ఎస్‌ఎస్ దేశానికి అందించింది. అందుకే సుపరిపాలన, సమగ్రాభివృద్ధి, బీజేపీ పాలనకు మారుపేరయ్యాయి. ‘దేశ ప్రయోజనాలు ముందు, వ్యక్తిగత జీవితం ఆఖరున’ అనే సూత్రం బీజేపీ రాజకీయాలకు ప్రాతిపదిక. కాబట్టే అవినీతిరహిత పాలన బీజేపీ వల్లనే సాధ్యమని ప్రజలు అనతికాలంలోనే గుర్తించారు. జాతి గొప్ప దనాన్ని గుర్తించిన పార్టీ కాబట్టే బీజేపీ ప్రభుత్వం జాతీయ మౌలిక సదుపాయాల కల్పనకు, అట్టడుగుస్థాయి ప్రజలతో సహా అందరి ఉన్నతికి, అభివృద్ధికి తోడ్పడగల వినూత్న పథకాలను మున్నెన్నడూ ఎరుగని రీతిలో రూపొందించి, అమలుచేయగలుగుతోంది.
దేశం గర్వించేలా, జాతి తలెత్తుకు తిరిగేలా సుపరిపాలనను అందించగలు గుతోంది. జాతీయతకు పట్టంగట్టి, ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తూమన ఘన వారసత్వానికి దీటుగా ప్రపంచంలో భారత జాతిని తిరిగి నాయకత్వ స్థానంలో నిలబెట్టగలిగే సమర్థత భారతీయ జనతా పార్టీకే ఉంది.
నేడు భారతీయ జనతా పార్టీ 36వ ఏట అడుగిడుతున్న సందర్భంగా,
పురిఘళ్ల రఘురాం
వ్యాసకర్త బీజేపీ జాతీయ సంధానకర్త,
raghuram.bjp@gmail.com