రజనీకాంత్ రాజకీయాలకు సరిపోరు...
న్యూఢిల్లీ: దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి స్పందించారు. అంతేకాకుండా రజనీకాంత్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీ రాజకీయాలకు సరిపోరని, ఆయన నిరక్షరాస్యుడని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. కాగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అంతేకాకుండా ఆయన ఎన్డీయేకి మద్దతు ఇస్తారంటూ రజనీ సన్నిహితుడు గురుమూర్తి పేర్కొన్న విషయం విదితమే.