పాతపట్టణం(శ్రీకాకుళం జిల్లా): బొనిపూర్-పూరి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. శనివారం శ్రీకాకుళం జిల్లా పాతపట్టణం రైల్వేస్టేషన్‌లో ఈ రైలు నిలిచిపోయింది. ఇప్పటికే రెండు గంటలు ఆలస్యం కావడంతో పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.