పరవశభరితం చిన్నారుల సంగీత కచేరి | Children's music concert | Sakshi
Sakshi News home page

పరవశభరితం చిన్నారుల సంగీత కచేరి

Published Mon, Dec 26 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

పరవశభరితం చిన్నారుల సంగీత కచేరి

పరవశభరితం చిన్నారుల సంగీత కచేరి

పుట్టపర్తి టౌన్‌ : క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా చిన్నారులు ఆలపించిన గీతాలు భక్తులను పరవశింపజేశాయి. సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ సభామందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత వివిధ దేశాలకు చెందిన చిన్నారులు క్రిస్మస్‌ గీతాలు ఆలపించారు. తొలుత బాలయేసును సత్యసాయి మహాసమాధి చెంతకు తీసుకువచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ఊయలలో ఉంచి మహాసమాధి చెంత ప్రణమిల్లి వరణువేడారు. ఈసందర్భంగా ఏసుక్రీస్తు జీవితచరిత్ర అంశాలను, బో«ధనలను వివరిస్తూ చక్కటి గీతాలను ఆలపించారు.చిన్నారుల చక్కటి స్వరాలతో నిర్వహించిన ఆలాపనతో సాయికుల్వంత్‌ సభా మందిరం మార్మోగింది. అనంతరంవిద్యార్థులు సత్యసాయి మహాసమాధిని  దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement