అంబరమంటిన దీపావళి సంబరం | Diwali celebration stained the sky | Sakshi
Sakshi News home page

అంబరమంటిన దీపావళి సంబరం

Published Mon, Oct 31 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

అంబరమంటిన దీపావళి సంబరం

అంబరమంటిన దీపావళి సంబరం

ప్రశాంతి నిలయంలో దీపావళి పర్వదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అలాగే గుజరాతీయుల నూతన సంవత్సర వేడుకలు సైతం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత వేద మంత్రోచ్ఛారణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు.

సాయంత్రం గుజరాత్‌ భక్తులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదరకు చెందిన సత్యసాయి యూత్‌ సభ్యులు మహాసమాధి చెంత ‘జర్నీ ఆఫ్‌ రిథమ్‌’అన్న పేరుతో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.  అలాగే గుజరాత్‌లోని నవసారికి చెందిన బాలవికాస్‌ విద్యార్థులు శ్రీరాముడిని కొనియాడుతూ భక్తిగీతాలతో నృత్యప్రదర్శన నిర్వహించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement