ప్రదోష కాలం అంటే ఏంటి, ప్రదోష పూజ ఎలా చేయాలి? | What is Pradosha period and how to perform puja? | Sakshi
Sakshi News home page

ప్రదోష కాలం అంటే ఏంటి, ప్రదోష పూజ ఎలా చేయాలి?

Published Thu, Feb 20 2025 10:30 AM | Last Updated on Thu, Feb 20 2025 10:48 AM

What is Pradosha period and how to perform puja?

జాతకంలోని ఎలాంటి దోషాన్నైనా శివుడు తొలగిస్తాడు. అందుకు ప్రదోష కాలంలో శివార్చన చేయాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. గత జన్మలలో చేసిన  పాపాలు కూడా ప్రదోషకాల పూజలో పాల్గొంటే తొలగిపోతాయి. అలాగే ప్రదోష వ్రతాన్ని ఆచరించే వారికి సకలసంపదలు చేకూరుతాయని శాస్త్రోక్తి. రోజూ సూర్యాస్తమయానికి ముందు 24 నిమిషాలు, తర్వాత 24 నిమిషాలు.. అంటే మొత్తం 48 నిమిషాలను ప్రదోష కాలం అంటారు. ఇది నిత్య ప్రదోషకాలం. 

కృష్ణపక్ష త్రయోదశిని పక్ష ప్రదోషం అంటారు. శుక్లపక్ష త్రయోదశి తిథిలో వచ్చే ప్రదోషాన్ని మాస ప్రదోషం అంటారు ముఖ్యంగా శనివారం, శుక్లపక్ష త్రయోదశి తిథిలో వచ్చే ప్రదోషాన్ని మహా ప్రదోషం అంటారు. దీన్నే శని మహాప్రదోషం అని పిలుస్తారు. దేవతలు పాలకడలిని చిలికినప్పుడు వెలికి వచ్చిన విషాన్ని శివ పరమాత్ముడు తీసుకుని.. లోకాన్ని సంరక్షించిన రోజును శనిప్రదోషంగా పిలుస్తారు. సంవత్సరమంతా వచ్చే ప్రదోషాలకు ఉపవాసం వుండకపోయినా పర్లేదు. కానీ శనివారం వచ్చే ప్రదోషం రోజున ఉపవసించి.. శివార్చన చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని.. ఆ సమయంలో దేవాలయాల్లో వెలసిన మహేశ్వరుడిని స్తుతించడం, ఆరాధించడం, పూజించడం, అభిషేకించడం ద్వారా జాతకదోషాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం. ప్రదోష కాల పూజ చేస్తే.. శివుడిని మాత్రమే కాదు.. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. (అన్నీ వింత సందేహాలే...బుర్ర తిరిగిపోతోంది..!

ఇదీ చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలు
 

ఇంకా నందీశ్వరుడికి తగిన గౌరవం ఇచ్చేది ప్రదోషకాల పూజనే. నాలుగు వేదాలు, 64 కళలను అభ్యసించిన నందీశ్వరుడిని ప్రదోష కాలంలో పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అన్ని చదువులున్నా.. నందీశ్వరుడు వినయంతో వుంటాడని.. శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నందీ శ్వరుడు నివృత్తి చేస్తాడని నమ్మకం. ప్రదోషకాల పూజలో పాల్గొంటే బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం దక్కు తుంది. 

ప్రదోష కాలంలో ఆవు పాలతో శివునికి అభిషేకం చేయించి, బిల్వ పత్రాలు, శంఖుపూలను సమర్పించుకుని స్తుతిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. సాయంత్రం 4.30 నుంచి ఆరుగంటల వరకు గల సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో శివార్చన ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయి.ఈ శని ప్రదోషాల్లో స్వామిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక  పండితులు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement