rituals
-
365 వత్తులు.. కార్తీక పురాణం ఏం చెబుతోంది?
కార్తీక మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున స్నానం, దీపం,దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పవిత్ర కార్తీకమాసంలో పౌర్ణమికిచాలా ప్రాధాన్యత ఉంది. చాలా పవిత్రమైంది భక్తులు పరిగణిస్తారు. ఈ ఏడాది కార్తికపౌర్ణమి ఎపుడు, పూజలు గురించి తెలుసుకుందాం.కార్తీక పౌర్ణమి రోజున ఆలయాలన్నీ దీప కాంతులతో వెలుగొందుతాయి. శివనామ స్మరణలతో శివాలయాలన్నీ మార్మోగుతాయి. కార్తీక పూర్ణిమ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు నమ్ముతారు. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. త్రిపురాసురుని పీడ తొలగిపోయినందుకు దేవతలు స్వర్గమంతా దీపాలతో వెలిగించారట.. అందుకే భక్తులు కూడా ఈ విజయాన్ని ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. దేవాలయాలు , నదీ తీరాల దగ్గర దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా అరటి దొప్పల్లో నేతి దీపాలను వెలగించి నీటిలో వదిలే దృశ్యాలు శోభాయమానంగా ఉంటాయి.ఈ రోజున విష్ణువు తన మత్స్య (చేప) అవతారంలో కనిపించడాన్ని సూచిస్తుందని, ఇది సృష్టి సంరక్షణకు సంబంధించిన విశ్వ చక్రంతో ముడిపడి ఉందని నమ్ముతారు. ఈ పూర్ణిమ నాడు చేసే పుణ్య కార్యాలు ఆధ్యాత్మిక వృద్ధితోపాటు, సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.“అల్పమపి క్షితౌ క్షిప్తం వటబీజం ప్రవర్ధతే.జలయోగాత్ యథా దానాత్ పుణ్యవృక్షో ⁇ పి వర్ధతే॥”“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”కార్తీక పూర్ణిమ నాడు పవిత్ర స్నానం , దానంగంగా , యమునా, కృష్ణ లాంటి వంటి పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం, లభిస్తుందని సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆవునేతిలో ఉంచిన 365 వత్తులను ఆ దేవుడి ముందు వెలిగించి పాపాలను తొలగించి, ముక్తిని ప్రసాదించమని కోరుకుంటారు. సంవత్సరమంతా పూజలు చేయకపోయినా, కార్తీకమాసం అంతా దీపారాధన చేయలేనివారు కనీసం కార్తీక పౌర్ణమిరోజు భక్తితో ఇలా దీపం ముట్టించి, ఆ దేవదేవుడికి నమస్కరిస్తే చాలని కార్తీక పురాణం చెబుతోంది.రోజంతా ఉపవాసం ఉండి శివాలయం లేదా వైష్ణవ ఆలయంలో ఆవునేతి లో నానబెట్టి ఉంచుకున్న 365 వత్తులను వెలిగిస్తారు. భక్తితో పూజాదికాలు సమర్పించి అపుడు ఉపవాసాన్ని విరమిస్తారు. దేవాలయాలక, నదీ తీరాలకు వెళ్లలేని వారు ఇంట్లో చక్కగా శుభ్రం చేసి పిండితో ముగ్గులు పెట్టుకొని అలంకరించుకున్న తులసమ్మ దగ్గర పున్నమి కాంతుల్లో ఈ దీపాలు వెలిగించి నమస్కరించినా, శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతారు. అలాగే కార్తీక పూర్ణిమ నాడు చేసే విరాళం ఈ రోజున అత్యంత ముఖ్యమైనది. బ్రాహ్మణులు ,నిరుపేదలకు ఆహారం, దుస్తులు, ఇతర వస్తువులను దానం చేస్తారు. గరుడ పురాణంతో సహా వివిధ హిందూ గ్రంథాలలో దాతృత్వం గురించిన ప్రాముఖ్యత చెప్పబడింది. మరికొంతమంది ఈ రోజు కేదారీశ్వరుడిని నోము నోచుకొని అన్నదానం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపాలను దానం చేయడం మరో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ, తులసి పూజ కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. జ్వాలా తోరణంతో కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. తద్వారా ఆధ్యాత్మిక ఫలితాలతోపాటు ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. -
ఇదేం పిచ్చో.. కారును సమాధి చేశారు!
వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదేనేమో. సాధారణంగా మనకు బాగా నచ్చిన వాహనాలకు మనతో పాటే ఉంచుకుంటాం, లేదంటే ఎవరికైనా పనికొస్తే ఇచ్చేస్తాం. కొత్త వెహికల్ కొన్నప్పుడు పాత వాహనం మార్పిడి చేసుకుంటాం. కానీ గుజరాత్లో ఓ వ్యాపారి మాత్రం తనకు బాగా అచ్చొచ్చిన కారును సమాధి చేసేశాడు. అదేదో అషామాషీగా చేయలేదు. ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి వేడుకగా ఈ తంతు జరిపాడు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. తీరా చూస్తే ఈ కారు ఏ ముప్ఫైనలబై ఏళ్లనాటిదో కాదు.. జస్ట్ 12 ఏళ్లు మాత్రమే వాడారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.15 అడుగుల లోతు గుంతలో..గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి తనకు, తన కుటుంబానికి సంపద, పేరు తెచ్చిన లక్కీ కారును ఘనంగా సమాధి చేశారు. అమ్రేలి జిల్లా లాఠీ తాలూకా పదార్‌సింగ్ గ్రామం ఇందుకు వేదికైంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు సహా 1,500 మంది హాజరయ్యారు. ఫాంహౌస్‌లో సుమారు 15 అడుగుల లోతు గుంతలో ఉన్న వాగన్ ఆర్ కారు, సంజయ్ పొలారా, అతని కుటుంబం పూజలు చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అంతకుముందు, పూలు, పూలదండలతో అందంగా అలంకరించిన కారును పొలారా కుటుంబీకులు బాజా భజంత్రీలతో గ్రామంలోని తమ ఇంటి నుంచి ఊరేగింపుగా ఫాంహౌస్‌లోని తీసుకువచ్చారు. అక్కడున్న ఏటవాలు నిర్మాణం మీదుగా గుంతలోకి దింపారు. కారుపై పచ్చని వ్రస్తాన్ని కప్పారు. పూజారులు మంత్రాలు చదువుతుండగా పొలారా, కుటుంబసభ్యులు కారుపై పూలు చల్లుతూ పూజలు చేశారు. చివరగా బుల్డోజర్ కారును మట్టితో సమాధి చేసేసింది. વ્હાલસોઈ નસીબદાર કારની સમાધિ !!!અમરેલીમાં પરિવાર માટે લકી કારને વેચવાને બદલે ઘામધૂમથી જમણવાર યોજી સમાધિ અપાઈ, કારના સમાધિ સ્થળે વૃક્ષારોપણ કરાશે #Gujarat #Amreli pic.twitter.com/1c4hiogs7n— Kamit Solanki (@KamitSolanki) November 8, 2024కారొచ్చాక కలిసొచ్చింది..ఈ కారు వచ్చిన తనకు బాగా కలిసొచ్చిందని సూరత్‌లో నిర్మాణ సంస్థను నడుపుతున్న సంజయ్ పొలారా మీడియాతో చెప్పారు. భవిష్యత్ తరాలకు శాశ్వతమైన జ్ఞాపకంగా ఉండాలనే తన లక్కీ కారును సమాధి చేసినట్టు వెల్లడించారు. "దాదాపు 12 సంవత్సరాల క్రితం నేను ఈ కారు కొన్నాను. ఇది మా కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారంలో విజయాలు దక్కాయి. నా కుటుంబ గౌరవం పెరిగింది. అందుకే దీన్ని అమ్మకుండా మా పొలంలో సమాధి చేశామ"ని సంజయ్ వివరించారు. నెటిజనులు మాత్రం ఈ ఉదంతంపై భిన్నంగా స్పందించారు. ఇదేం పిచ్చంటూ సెటైర్లు వేస్తున్నారు. చదవండి: కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు -
ఆలయ ఆగమాలు, ఆచారాల్లో జోక్యం వద్దు
సాక్షి, అమరావతి: ఆలయాల ఆగమ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో దేవదాయ శాఖ కమిషనర్ సహా ఆలయ ఈవో, తదితర అధికారులెవ్వరూ జోక్యం చేసుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైదిక ఆగమ విషయాల్లో ఆలయాలకు స్వయం ప్రతిపత్తిని నిర్ధారించడానికి 1987 నాటి దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్–13(1)కి అనుగుణంగా అధికారులు ఆలయాల ఆచారాలు, సంప్రదాయాల పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్లు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సత్యనారాయణ బుధవారం జీఓ–223ను జారీచేశారు. వివిధ ఆలయాల్లో స్వామివార్లకు నిర్వహించే సేవలకు సంబంధించిన విధానాలు.. యాగాలు, కుంభాభిషేకాలు, ఇతర ఉత్సవాల నిర్వహణ వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడి సీనియర్ అర్చకులు, ఇతర మతపరమైన సిబ్బంది అభిప్రాయాలే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఈఓ వైదిక కమిటీలను ఏర్పాటుచేసుకోవచ్చని ఆయన ఆ ఉత్తర్వుల్లో సూచించారు. ఏదైనా సందేహం, అభిప్రాయభేదం ఏర్పడితే ప్రఖ్యాత పీఠాధిపతులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో ఏ ఆలయానికి ఆ ఆలయం లేదా ఇతర దేవదాయ ధార్మిక సంస్థలు ఒక స్వతంత్ర సంస్థగా పరిగణించబడతాయన్నారు. అలాగే, ఒకే రకమైన ఆగమాలకు సంబంధించిన ఆలయాలు, ధార్మిక సంస్థలైనప్పటికీ సంబంధిత ఆలయ ఆచారాలు, సంప్రదాయాలకు భిన్నంగా వేరొక ఆలయ సంప్రదాయాలు పాటించాలనిలేదని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. -
హజ్‌యాత్రలో అంతిమ ఘట్టం షురూ
సౌదీ అరేబియాలో లక్షలాది మంది ముస్లిం యాత్రికులు ఆదివారం నాడు సైతానును రాళ్లతో కొట్టి చంపే ఆచారాన్ని ప్రారంభించారు. ఈ ఆచారం హజ్‌యాత్ర చివరి రోజులలో నిర్వహిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సంబంధించిన ఈద్ అల్-అధా వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది.సైతాను(దుష్టశక్తి)ను రాళ్లతో కొట్టడం అనేది ఇస్లాంలోని ఐదు ప్రముఖ ఆచారాలలో ఒకటి. ఇది హజ్‌యాత్రలో చివరి ఆచారం. పవిత్ర నగరం మక్కా వెలుపల ఉన్న అరాఫత్ పర్వతం వద్ద లక్షలమంది ముస్లిం యాత్రికులు గుమిగూడి ఈ ఆచారాన్ని నెరవేరుస్తారు. ఐదు రోజుల పాటు ఈ హజ్ ఆచారం కొనసాగుతుంది.యాత్రికులు శనివారం సాయంత్రం ముజ్దలిఫా అనే ప్రదేశంలో గులకరాళ్లను సేకరించారు. వీటితో సైతానుకు ప్రతీకంగా నిలిచిన స్తంభాలను కొడతారు . ఈ స్తంభాలు మక్కాలో మీనా అనే పవిత్ర స్థలంలో ఉన్నాయి.హజ్‌కు వచ్చే యాత్రికులు మూడు రోజుల పాటు మీనాలో ఉంటారు. అక్కడ నుండి వారు భారీ స్తంభాలు కలిగిన బహుళ అంతస్తుల సముదాయానికి వెళ్తారు. యాత్రికులు ఇక్కడి మూడు స్తంభాలను ఏడు గులకరాళ్లతో కొడతారు. దీనిని వారు చెడును తరిమికొట్టడానికి చిహ్నంగా పరిగణిస్తారు. అనంతరం మీనా నుండి మక్కా చేరుకునే ముస్లింలు అక్కడ తవాఫ్ (ప్రదక్షిణ) చేస్తారు. -
Ayodhya Ram Mandir: అయోధ్యలో నేడే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట
భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, ప్రముఖుల సాక్షిగా గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాన వేడుక ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు.. మొత్తం 84 సెకన్లలో గర్భగుడిలో ప్రాణప్రతిష్ట పూర్తవుతుంది. అపూర్వమైన ఈ వేడుకలో భిన్న మతాలు, సంప్రదాయాలు, వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. పర్వతాలు, అడవులు, తీర ప్రాంతాలు, ద్వీపాలు తదితర అన్ని ప్రాంతాలకు చెందినవారు ఒకే చోట ఒక కార్యక్రమంలో పాల్గొంటుండడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలియజేసింది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాల్లో సోమవారం ఉత్సవాలు జరగబోతున్నాయి. నేడు గర్భాలయం లోపల.. ఉదయం 10:00 మంగళ ధ్వనితో శ్రీకారం మధ్యాహ్నం 12.20 ప్రధాన వేడుక ప్రారంభం 12:29:08, 12:30:32 84 సెకన్లలో గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట 7,000 హాజరుకానున్న అతిథులు ఏకకాలంలో వెలిగించనున్న ప్రమిదలు 10,00,000 అయోధ్యలో నేడు కొలువుదీరనున్న బాలరాముడు అద్భుత వాయిద్యాలతో మంగళ ధ్వని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సోమవారం ఉదయం 10 గంటలకు ‘మంగళ ధ్వని’తో శ్రీకారం చుడతారు. ఇందుకు దాదాపు 20 రాష్ట్రాల నుంచి 50కి పైగా అద్భుతమైన వాయిద్యాలను తీసుకొచ్చారు. అయోధ్యకు చెందిన యతీంద్ర మిశ్రా సారథ్యంలో నిర్వహించే ఈ సంగీత ప్రదర్శనకు ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ సహకారం అందించనుంది. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం రామమందిర ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పా ట్లు పూర్తయ్యాయి. ఉదయం ఏడింటి నుంచే ప్రసారాలు మొదలవు తాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రధాన వేడుక జరుగుతుంది. వీటిని డీడీ న్యూస్, డీడీ జాతీయ చానళ్లతోపాటు ప్రైవేట్ చానళ్లలోనూ తిలకించవచ్చు. 84 సెకన్ల శుభ ముహూర్తం గర్భగుడిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు శుభ ముహూర్తం నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు వేడుక ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు మొత్తం 84 సెకన్లలో ప్రాణప్రతిష్ట పూర్తవుతుంది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యులుగా 121 మంది రుతి్వక్కులు వేడుక నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్టలో శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామీ శంకర్, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణు నామి, వాల్మీకి, వీర శైవ మొదలైన సంప్రదాయాలు భాగం కానున్నాయి. 150 మందికిపైగా సంప్రదాయాల సాధువులు, మహామండలేశ్వర్, మహంత్, నాగాలతో సహా 50 మందికి పైగా గిరిజన, గిరివాస, ద్వీపవాస సంప్రదాయాల ప్రముఖులు పాల్గొంటారు. ఇలా పర్వతాలు, అడవులు, తీర, ద్వీప వంటి అన్ని ప్రాంతాలకు వారు ఒకే కార్యక్రమంలో పాల్గొంటుండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలియజేసింది. నగర వీధుల్లో తోరణాలు, కాషాయ జెండాలు అయోధ్య వీధులు కాషాయ రంగు పులుముకున్నాయి. నగరంలో అన్ని వీధులను కాషాయ జెండా, తోరణాలతోపాటు విద్యుత్ దీపాలు, పూలమాలలతో అలంకరించారు. నివాస భవనాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, దుకాణాలపైనా పెద్ద సంఖ్యలో జెండాలు దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో వీటి అమ్మకాలు విరివిగా సాగుతున్నాయి. శ్రీరాముడు, హనుమంతుడు, నూతన రామాలయ చిత్రాలు, జైశ్రీరామ్ నినాదంతో కూడిన ఈ జెండాలు, తోరణాలు చూపరులకు ఆధ్యాత్మిక భావనలు పంచుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలతోపాటు దాతలు శ్రీరాముడి జెండాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అయోధ్యలోని రామ్‌పథ్, ధర్మపథ్‌ను జెండాలతో ప్రత్యేకంగా ఆలంకరించారు. అయోధ్యలో రామచరిత మానస్, రామాయణం పుస్తకాల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీధుల్లో శ్రీరాముడి పాటలు మార్మోగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రామయ్య పండుగ శ్రీరాముడి ప్రాణప్రతిష్ట వేడుక కేవలం ఆయోధ్యకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఉత్సవంలో పాలుపంచుకోబోతున్నారు. సోమవారం ర్యాలీలు, ప్రదర్శనలు, పాదయాత్రలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో దాదాపు 300 ప్రాంతాల్లో ప్రాణప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద కూడా స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. పారిస్‌లో హిందూ సమాజం ఆధ్వర్యంలో భారీ రథయాత్ర నిర్వహించనున్నారు. అలాగే విశ్వ కల్యాణ యజ్ఞం నిర్వహిస్తారు. ఇంగ్లాండ్, ఆ్రస్టేలియా, కెనడా, మారిషస్ సహా 60కిపైగా దేశాల్లో వేడుకలు జరుగుతాయి. ఆయా దేశాల్లోని హిందూ ఆలయాల్లో సాయంత్రం దీపాలు వెలిగించగబోతున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే విద్యుత్ దీపాలు, పూలతో ఆలయాలను అందంగా అలకరించారు. అలాగే రామాయణ పారాయణం కోసం ఏర్పాట్లు చేశారు. నేటితో ముగియనున్న ప్రత్యేక క్రతువులు ప్రత్యేక క్రతువుల్లో భాగంగా ఆదివారం ఔషధ జలంతోపాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల తెచి్చన పవిత్ర జలాలతో రామ్‌లల్లాను శుద్ధి చేశారు. రాత్రి జాగరణ అధివస్ జరిపారు. 16న మొదలైన క్రతువులు సోమవారం ముగుస్తాయి. మూడు నిత్య హారతులు ప్రాణప్రతిష్ట అనంతరం భక్తులకు రామ్‌లల్లా దర్శనం కల్పించడానికి ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. నిత్యం మూడుసార్లు ప్రత్యేక హారతి నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటలకు జాగరణ్ హారతి, మధ్యాహ్నం 12.00 గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఇవ్వనున్నారు. గర్భాలయంలో ఇలా... ► ఉదయం 10 గంటలు: మంగళ ధ్వని ► మధ్యాహ్నం 12.05 నుంచి 12.55: ప్రాణప్రతిష్ట జరుగుతుంది. రామ్‌లల్లా నేత్రాలు తెరిచిన తర్వాత ప్రధాని మోదీ కాటుక దిద్దుతారు. బాలరాముడికి అద్దంలో ప్రతిబింబం చూపిస్తారు. ► మధ్యాహ్నం 12.55: ప్రధాన ఆలయంపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపిస్తారు. గర్భగుడిలోకి ఆ ఐదుగురు గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ దాస్ మహరాజ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. వేడుక పూర్తయిన తర్వాత అతిథులకు రామ్‌లల్లా దర్శనం కల్పిస్తారు. మోదీ పర్యటన ఇలా.. ► ఉదయం 10.25: అయోధ్య విమానాశ్రయం నుంచి ఆలయానికి ► మధ్యాహ్నం 12: గర్భగృహం ఎదుట అతిథులకు పలకరింపు ► మధ్యాహ్నం 1 నుంచి 2 గంటలు: బహిరంగ సభలో మోదీ ప్రసంగం. ఆరెస్సెస్ చీఫ్ భాగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు కూడా ప్రసంగిస్తారు. ► మధ్యాహ్నం 2 గంటలు: శివ మందిరం, కుబేర తిల సందర్శన ► మధ్యాహ్నం 3.30: మోదీ ఢిల్లీకి పయనమవుతారు. 10 లక్షల ప్రమిదల కాంతులు అయోధ్య నగరం సోమవారం సాయంత్రం దేదీప్యమానంగా వెలిగిపోనుంది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని 10 లక్షలు ప్రమిదలను ఏకకాలంలో వెలిగించబోతున్నారు. నగరంలోని 100 ఆలయాలు, ప్రధాన ప్రాంతాల్లో ఈ దీపాలు వెలుగులు పంచబోతున్నాయి. ఈ దృశ్యాలు కనులకు పండుగే అనడంలో సందేహం లేదు. భవ్య రామమందిరంతోపాటు రామ్ కీ పైడీ, కనక్ భవన్, గుప్తార్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ చౌనీ తదితర ప్రాంతాల్లో ప్రమిదలు వెలిగిస్తారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అయోధ్య వాసులు తమ ఇళ్లల్లోనూ దీపాలు వెలిగించబోతున్నారు. దాంతో అయోధ్యాపురం కాంతిమయం కాబోతోంది. రామాలయ ఉపగ్రహ చిత్రాలు విడుదల అయోధ్యలో నూతన రామాలయ ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం విడుదల చేసింది. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ అంతరిక్షం నుంచి గత ఏడాది డిసెంబర్ 16న ఈ దృశ్యాన్ని చిత్రీకరించింది. ప్రధాన ఆలయంతోపాటు దశరథ మహల్, అయోధ్య రైల్వే స్టేషన్, సరయూ నది వంటివి ఈ చిత్రాల్లో చక్కగా కనిపిస్తున్నాయి. వేదమంత్రాల నడుమ రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ట ► మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో కార్యక్రమం ► ఉత్సవానికి ప్రధాన యజమానిగా ప్రధాని నరేంద్ర మోదీ ► ప్రాణప్రతిష్ట అనంతరం ప్రముఖులకు బాలరాముని దర్శనం శుభ ఘడియలు సమీపించాయి. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట వైభవోజ్వల చరిత్రాత్మక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఐదు శతాబ్దాల వనవాసం వీడి, భవ్య మందిరానికి చేరుకున్న రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కమనీయ వేడుకను కనులారా తిలకించడానికి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేశ విదేశాల్లో రామనామ స్మరణతో భక్తులు ఆనంద డోలికల్లో ఊగిపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 7 వేల మందికిపైగా అతిథులు, ప్రముఖులు హాజరుకాబోతున్నారు. 150 మందికిపైగా ప్రముఖులు ఇప్పటికే అయోధ్యలో అడుగుపెట్టారు. సామాన్య భక్తజనం అయోధ్య బాటపట్టారు. కాషాయ పతాకాల రెపరెపలు, రాముడి గీతాలు, భజనలు, స్తోత్రాలు, జైశ్రీరామ్ నినాదాలతో, అందంగా తీర్చిదిద్దిన ప్రధాన భవ్య మందిరంతోపాటు ఇతర ఆలయాలతో అయోధ్య అంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. నగరం ఇప్పటికే జనసంద్రంగా మారింది. భక్తుల పూజలు, వేదమంత్రాల ఘోషతో సరయూ నదీ తీరం కనువిందు చేస్తోంది. నగరంలోని చరిత్రాత్మక కట్టడాలను సైతం సుందరంగా అలంకరించారు. దేశమంతా అయోధ్య నామస్మరణతో సర్వం రామమయంగా మారిపోయింది. – సాక్షి, న్యూఢిల్లీ -
Ayodhya: శోభాయమానం.. రామమయం
అయోధ్య/న్యూఢిల్లీ: రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ అయోధ్య మరింత శోభాయమానంగా మారుతోంది. నగమంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఎటు చూసినా ‘శుభవేళ రానే వచ్చింది’, ‘అయోధ్య సిద్ధమైంది’ అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఆహూతులకు హార్దిక స్వాగతం పలుకుతున్నాయి. లౌడ్‌స్పీకర్ల నిండా రామ నామం, భక్తి గీతాలు మార్మోగుతున్నాయి. అయోధ్య అణువణువూ రామమయంగా మారింది. రామాలయ ప్రారంభ సన్నాహాలు తుది దశకు చేరుతున్నాయి. గర్భాలయంలో కొలువుదీరిన బాలరాముని విగ్రహాన్ని శనివారం పవిత్ర సరయూ నదీజలాలతో అభిషేకించారు. గర్భాలయాన్ని కూడా నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు. మంత్రోచ్చారణ నడుమ శుదీ్ధకరణ కార్యక్రమాలు ముగిశాయి. అనంతరం శా్రస్తోక్తంగా వాస్తు శాంతి, అన్నాధివాస, పుష్పాధివాస క్రతువులు జరిపారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రసాదాలు, పుష్పాలతో బాలరామునికి నివేదన జరిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరించారు. బాలరామునికి ఆదివారం 125 కలశాలతో మంగళస్నానం జరగనుంది... దర్శనాలకు బ్రేక్ తాత్కాలిక మందిరంలో పూజలందుకుంటున్న ప్రస్తుత రామ్‌లల్లా విగ్రహాన్ని నూతన గర్భాలయంలోకి చేర్చే ప్రక్రియకు కూడా అర్చకులు శ్రీకారం చుట్టారు. నూతన విగ్రహంతో పాటు ఈ విగ్రహాన్ని కూడా గర్భాలయంలో ప్రతిష్టించనుండటం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నుంచే తాత్కాలిక ఆలయంలో దర్శనాలు నిలిపేశారు. ఈ విగ్రహాన్ని బహుశా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా గర్భాలయంలోకి తీసుకెళ్తారని అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. గుడారం నుంచి తాత్కాలిక మందిరంలోకి కూడా ఈ విగ్రహాన్ని ఆదిత్యనాథే తీసుకెళ్లారు. విమానాల వరద... అయోధ్యకు వీఐపీల రాక ఇప్పటికే మొదలైంది. ఆదివారం నాటికి ఇది ఊపందుకోనుంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దాదాపు 7,000 మందికి ఆహా్వనాలు అందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని అయోధ్యకు చేరవేసేందుకు సోమవారం ఏకంగా 100కు పైగా చార్టర్డ్ ఫ్లైట్లు రానున్నట్టు చెబుతున్నారు. వీటి తాకిడిని తట్టుకోవడం కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి శక్తికి మించిన పనే కానుంది. ఇప్పటికే 40కి పైగా విమానాల ల్యాండింగ్‌కు విజ్ఞప్తులు అందినట్టు చెబుతున్నారు. కానీ నిబంధనల ప్రకారం ప్రధాని ప్రయాణించే ఎయిరిండియా వన్ ల్యాండయ్యాక విమానాశ్రయంలోకి మరే విమానాన్నీ అనుమతించరు. ఈ నేపథ్యంలో వీఐపీలు దిగీ దిగగానే వచి్చన విమానాన్ని వచి్చనట్టే వారణాసి, లఖ్‌నవూ తదితర సమీప విమానాశ్రయాలకు పంపనున్నారు. ప్రధాని వెనుదిరిగాక వాటిని ఒక్కొక్కటిగా తిరిగి అయోధ్యకు అనుమతిస్తారు. 2 నెలలు..2 కోట్ల మంది! రామాలయ ప్రారంభం అనంతరం అయోధ్యకు దేశ నలుమూలల నుంచీ భారీగా భక్తులను తరలించేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జనవరి 25 నుంచి మార్చి 25 దాకా 2 కోట్ల మందికి దర్శనం కలి్పంచనుంది. ఒక్కో లోక్‌సభ నియోజవర్గం నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 543 లోక్‌సభ స్థానాల నుంచీ భక్తులను తరలించనుంది. ఇందుకోసం వందలాది ప్రత్యేక రైళ్లతో పాటు బస్సులు తదితర ఏర్పాట్లు చేస్తోంది. ఫొటోలు లీకయ్యాయి: పూజారి ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముని విగ్రహం ఫొటోలు లీకవడంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ‘‘ప్రాణప్రతిష్ట జరగకుండా మూలవిరాట్టు ఫొటోలు విడుదల చేయడం సరికాదు. ముఖ్యంగా నేత్రాలను బహిర్గతపరచడం పూర్తిగా నిషిద్ధం. కళ్లు కనిపిస్తున్నది అసలు విగ్రహం కాదు. ఒకవేళ అది అసలు విగ్రహమే అయితే ఫొటోను లీక్ చేసిందెవరో కనిపెట్టి శిక్షించాలి’’ అని కోరారు. ప్రాణప్రతిష్ట జరగనున్న బాలరామునికి సంబంధించి శుక్రవారం రెండు ఫొటోలు వెలుగు చూడటం తెలిసిందే. ఒకదాంట్లో కళ్లకు పసుపు వస్త్రం కట్టి ఉండగా మరొక దాంట్లో కళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టకు సంబంధించి ఎలాంటి తప్పుడు కంటెంట్‌నూ వ్యాప్తి చేయొద్దని ప్రింట్, టీవీ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలకు కేంద్రం సూచించింది. యజమానులుగా 14 మంది దంపతులు ప్రాణప్రతిçష్ట క్రతువులో 14 మంది దంపతులు ముఖ్య యజమానులుగా పాల్గొననున్నారు. వీరిని దేశవ్యాప్తంగా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి ఎంపిక చేశారు. వీరందరి సమగ్ర భాగస్వామ్యంలో పూజలు, క్రతువులు జరుగుతాయని రామ జన్మభూమి ట్రస్టు వర్గాలను ఉటంకిస్తూ ఆరెస్సెస్ నేత సునీల్ అంబేడ్కర్ వివరించారు. జైషే బెదిరింపులు ప్రాణప్రతిష్ట సమీపిస్తున్న వేళ అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చేసిన హెచ్చరిక అలజడి రేపుతోంది. హింసాత్మక ప్రతీకారం తప్పదని శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో హెచ్చరించడంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాలు పరిస్థితిని డేగ కళ్లతో గమనిస్తున్నాయి. ‘రామ’ రైల్వేస్టేషన్లకు విద్యుత్ వెలుగులు రామన్నపేట్ (తెలంగాణ). రామచంద్రపురం (ఆంధ్రప్రదేశ్). రామగిరి (కర్ణాటక). ఇవన్నీ రాముని పేరుతో ఉన్న రైల్వేస్టేషన్లు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 343 రైల్వేస్టేషన్లున్నాయి. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇవన్నీ విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోనున్నాయి. రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాముని పేరిట ఉన్న రైల్వేస్టేషన్లలో అత్యధికంగా 55 ఏపీలో ఉండటం విశేషం! 1,265 కిలోల లడ్డూ, 400 కిలోల తాళం అయోధ్య రామునికి దేశ విదేశాల నుంచి వినూత్న కానుకల వరద కొనసాగుతూనే ఉంది. వీటిలో భాగంగా ఏకంగా 1,265 కిలోల లడ్డూ, 400 కిలోల తాళం శనివారం అయోధ్య చేరాయి. లడ్డూను హైదరాబాద్‌కు చెందిన నాగభూషణంరెడ్డి అనే భక్తుడు, తాళాన్ని యూపీలోని అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ దంపతులు తయారు చేయించారు. శర్మ ఇటీవలే మరణించారు. తాళాన్ని రామునికి సమరి్పంచాలంటూ చివరి కోరిక కోరారు. ఆ మేరకు ఆయన భార్య దాన్ని అయోధ్య చేర్చారు. దీన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తాళంగా చెబుతున్నారు. తాళాల తయారీకి అలీగఢ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. 25 మంది 3 రోజుల పాటు శ్రమించి లడ్డూను తయారు చేసినట్టు నాగభూషణంరెడ్డి చెప్పారు. ఇది నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుందన్నారు. ప్రత్యేక ప్రసాదాలు ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక ప్రసాదాలు అలరించనున్నాయి. టెప్లా, బాదం మిఠాయి, మటర్ కచోరీ తదితరాలను సోమవారం బాలరామునికి నివేదిస్తారు. అనంతరం వాటిని, తిరుమల శ్రీవారి లడ్డూలు, 1,265 కిలోల భారీ లడ్డూతో పాటు దేశ నలుమూలల నుంచి వచి్చన ఇతర ప్రసాదాలను భక్తులకు అందిస్తారు. మరోవైపు బాలరాముని నివేదన కోసం లక్నో నుంచి ఛప్పన్ భోగ్ (56 రకాల భోజన పదార్థాల)తో కూడిన వెండి థాలీ కూడా అయోధ్యకు చేరింది. -
Ayodhya Ram Mandir: అయోధ్యలో కలశ పూజ
అయోధ్య: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. పూజరులు నిర్వహిస్తున్న ప్రత్యేక క్రతువులు రెండో రోజుకు చేరాయి. బుధవారం కలశ పూజ చేపట్టారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా దంపతులు ‘యజమానులుగా’ సరయూ నది తీరంలో కలశ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలశాలను సరయూ నదీ జలాలలో నింపి పూజలు చేశారు. రామ్‌లల్లా ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ఈ కలశాలను తీసుకెళ్తారు. ప్రతిష్టాపన కంటే ముందు ఈ జలాలతో పూజలు చేస్తారు. మొత్తం 121 మంది ఆచార్యులు క్రతువుల్లో పాల్గొంటున్నారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు. గురువారం గణేశ్ అంబికా పూజ, వరుణ పూజ, మాత్రికా పూజ, వాస్తు పూజ నిర్వహిస్తారు. మంగళవారం ప్రారంభమైన ఈ క్రతువులు ఈ నెల 21వ తేదీ దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అయోధ్యకు చేరుకున్న ‘రామ్‌లల్లా’ భవ్య మందిరంలో ప్రతిష్టించబోయే రామ్‌లల్లా విగ్రహం బుధవారం అయోధ్యకు చేరుకుంది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య వాహనంలో ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. గర్భాలయంలోని వేదికపైకి చేర్చారు. కళ్లకు గంతలు కట్టి ఉన్న ఈ విగ్రహం చిత్రాలను తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేయలేదు. ఈ నెల 22న ఇదే విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు. ప్రాణప్రతిష్ట తర్వాతే రామ్‌లల్లా చిత్రాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, రామ్‌లల్లా ప్రతీకాత్మక (సింబాలిక్) విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. 19 నుంచి ‘అఖండ్ పథ్’ అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన కోసం హిందువులతోపాటు ఇతర మతాల ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ మూడు రోజులపాటు ‘అఖండ్ పథ్’ నిర్వహించేందుకు సిక్కు మతస్థులు సిద్ధమవుతున్నారు. అయోధ్యలోని గురుద్వారా బ్రహ్మకుండ్ సాహిబ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్ట సజావుగా జరగాలని ఆకాంక్షిస్తూ అఖండ్ పథ్ నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సిక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. అయోధ్య శ్రీరాముడితో సిక్కులకు చరిత్రాత్మక అనుబంధం ఉందని వివరించారు. 1510లో గురునానక్ అయోధ్యను దర్శించుకున్నారని గుర్తుచేశారు. 1858లో సిక్కు మత పెద్దలు అయోధ్య రామాలయంలో పూజలు చేశారని, గోడలపై రామ్ అని రాశారని చెప్పారు. సిక్కు మత ఆచారాలు, సంప్రదాయాల్లో అఖండ్ పథ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పవిత్ర గురుగ్రంథ సాహిబ్‌ను నిరంతరాయంగా భక్తితో పఠించడమే అఖండ్ పథ్. ఇందుకు 48 గంటలకుపైగా సమయం పడుతుంది. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ సాహిబ్‌లో ‘రామ్’ అనే పదం 2,533 సార్లు ఉందని ఆర్పీ సింగ్ వెల్లడించారు. ప్రాణప్రతిష్టకు ‘ప్రధాన యజమాని’ ప్రధాని మోదీ అయోధ్య: రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ప్రధాన యజమాని’గా వ్యవహరిస్తారని ప్రధాన ఆచార్యుడు పండిత లక్ష్మీకాంత్ దీక్షిత్ చెప్పారు. మొదట రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రాను ప్రధాన యజమానిగా ఖరారు చేశారు. కానీ, ఈ విషయంలో మార్పు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గర్భాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతోపాటు కీలకమైన పూజలను ప్రధాన యజమాని తన చేతుల మీదుగా నిర్వహిస్తారు. అయోధ్యకు 200కుపైగా ఆస్థా ప్రత్యేక రైళ్లు అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత భక్తులు పోటెత్తనున్నారు. వారి సౌకర్యార్థం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు 2 వేల ఆస్థా ప్రత్యేక రైళ్లు నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టయర్–1, టయర్–2 నగరాల నుంచి బయలుదేరి ఈ రైళ్లు అయోధ్య ధామ్ స్టేషన్‌కు చేరుకుంటాయి. ఈ నెల 22వ తేదీ నుంచి 100 రోజులపాటు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇవి పరిమితమైన స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. అయోధ్య ధామ్ స్టేషన్ నుంచి మళ్లీ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ రైళ్లలో ప్రయాణానికి ఐఆర్సీటీసీ ద్వారా మాత్ర మే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా 20 వేల ఉద్యోగాలు అయోధ్య ఇక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారనుంది రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యను ప్రతిఏటా కోట్లాది మంది దర్శించుకోనున్నారు. అదేస్థాయిలో ఇక్కడ ఉద్యోగ, ఉపాధి పెరగడం ఖాయం. ఆతిథ్యం, రవాణా, పర్యాటక రంగాల్లో కలిపి 20 వేల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందని సమాచారం. ప్రతిఏటా శ్రీరాముడికి ‘సూర్య తిలకం’ అయోధ్య రామ మందిరంలో ప్రతిఏటా చైత్ర మాసంలో శ్రీరామనవమి రోజు భక్తులు అపూర్వమైన దృశ్యాన్ని తిలకించవచ్చు. ఆ రోజు గర్భాలయంలో రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. సూర్య కిరణాలే తిలకంగా రామయ్యను అలంకరిస్తాయి. దీన్ని సూర్య తిలకంగా పిలుస్తారు. ఈ తిలకం వ్యవస్థను సీఎస్ఐఆర్–సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీబీఆర్ఐ) సైంటిస్టులు డిజైన్ చేశారు. ఇందుకోసం ఆలయంలో కటకాలు, అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 6 నిమిషాల పాటు సూర్య తిలకాన్ని దర్శించుకోవచ్చు. రామ భక్తులపై మోసాల వల సైబర్ నేరగాళ్లు అయోధ్య రామమందిర ప్రారం¿ోత్సవాన్ని కూడా అక్రమ సంపాదనకు వాడుకుంటున్నారు. అయోధ్య నుంచి రామమందిర ప్రసాదం పంపిస్తామంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెట్ సైట్లలో ఇలాంటి ప్రసాదం కనిపిస్తోంది. డెలివరీ చార్జీల కింద కేవలం రూ.51 ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే చాలు ఈ నెల 22వ తేదీ నాటికి ఉచితంగా ప్రసాదం పంపిస్తామంటూ మరికొందరు నేరగాళ్లు వల విసురుతున్నారు. నిజానికి దీనికి, అయోధ్య రామమందిరానికి ఎలాంటి సంబంధం లేదు. అదంతా నకిలీ ప్రసాదమని అధికారులు అంటున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొందరైతే డొనేషన్లు సేకరిస్తున్నామంటూ రామ్ జన్మభూమి ట్రస్టు పేరిట వాట్సాప్ ద్వారా క్యూఆర్ కోడ్ పంపుతున్నారు. వాటిని స్కాన్ చేస్తే బ్యాంకు ఖాతాల్లో నగదు గల్లంతవుతోంది. అలాగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపనను ప్రత్యక్షంగా తిలకించడానికి వీఐపీ పాసులు అందజేస్తామంటూ ఉచ్చులోకి లాగుతున్నారు. ‘రామ్ జన్మభూమి గృహ్ సంపర్క్ అభియాన్–ఏపీకే’ పేరిట ఇలాంటి సందేశాలను ఫోన్ల ద్వారా పంపిస్తున్నారు. నగదు బదిలీ చేయించుకొని ఫోన్లు స్విచ్ఛాప్ చేస్తున్నారు. -
Rahul Gandi: హాజరవడం కష్టమే
చిఫొబొజౌ(నాగాలాండ్): అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ క్రతువు ఎన్నికల రంగులద్దుకుని ‘నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్–బీజేపీ’ ఫంక్షన్‌గా ముస్తాబవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం నాగాలాండ్‌లోకి అడుగుపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మంగళవారం సైతం వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారుల నడుమ కొనసాగింది. యాత్రను ముందుండి నడిపిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం రాష్ట్ర రాజధాని కోహిమాలో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అందిన ఆహా్వనాన్ని తమ పార్టీ అగ్రనేతలు సున్నితంగా తిరస్కరించడాన్ని ఆయన గట్టిగా సమరి్థంచారు. ‘‘ మందిరం ప్రారం¿ోత్సవానికి కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పారీ్టల నేతలు ఎవరు వెళ్లినా నేను మనసారా స్వాగతిస్తా. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమం మొత్తం మోదీ, ఆర్ఎస్ఎస్ కేంద్రంగా తయారైంది. చక్కని వేడుకను ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయ వేడుకగా మార్చేశాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లొద్దని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాం«దీ భావించి ఉంటారు. కాంగ్రెస్ పారీ్టకి అన్ని మతాలు, సంప్రదాయాలు సమానమే. 22న అయోధ్య జరిగే కార్యక్రమం.. రాజకీయ ఉత్సవంలా మారిందని స్వయంగా కొందరు హిందూ మత పెద్దలే బహిరంగంగా విమర్శించారు. ఇలా కొత్తరూపును సంతరించుకున్న ఈ కార్యక్రమానికి మేం వెళ్లడం కష్టం. అసాధ్యం కూడా’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘ఇండియా కూటమి బలంగా ఉంది, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పారీ్టతో సీట్ల పంపకం విషయంలో నెలకొన్న విభేదాలు సమసి పోతాయి’’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. -
విఘ్నేశ్వరుని పూజ తరువాత వాయనదానం మంత్రం
శో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా! (ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను) ఉద్వాసన మంత్రము: (ఈ కింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్. (వ్రతకల్ప పూజా విధానం సమాప్తం) -
అడవితల్లికి ‘తొలి’ పూజ
కెరమెరి(ఆసిఫాబాద్):సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. ఆషాఢమాసంలో ముందుగా వచ్చే పండుగ అకాడి. నెలవంక కనిపించడంతో అకాడి వేడుకలు ప్రారంభించి వారం రోజులపాటు నిర్వహిస్తారు. మంగళవారం పెద్దసాకడ గ్రామంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో అకాడి పండుగ ప్రారంభించారు. పౌర్ణమి వరకు వేడుకలు నిర్వహించనున్నారు. వనంలో పూజలు.. అకాడి వేడుకల్లో భాగంగా మంగళవారం పెద్దసాకడ గ్రామ పొలిమేరలో ఉన్న బాబ్రిచెట్టు వద్దకు వెళ్లారు. చెట్టుకింద ఉన్న రాజుల్పేన్ దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మణరేఖ లాంటి ఒక గీత గీశారు. ప్రత్యేకంగా తయారు చేసిన తుర్రను ఊదడంతో పశువులు గీతపై నుంచి అడవిలోకి పరిగెత్తాయి. అడవిలోని చెట్లు, ఆకులకు అకాడిపేన్ పూజ చేశాక ఆ ఆకులను ఇళ్లకు తీసుకెళ్లారు. కోడితో జాతకం.. ఆదివాసీల ఆచార వ్యవహారాల్లో భాగంగా గ్రామ పటేల్ ఇంటినుంచి తెచ్చిన కోడిని దేవుడి ముందు ఉంచుతారు. దాని ముందు గింజలు పోసి జాతకం చెప్పించుకుంటారు. అనంతరం ఇంటినుంచి తెచ్చిన కోడిని బలిస్తారు. అక్కడే ఒకచోట వంటలు తయారు చేశారు. అన్నం ముద్దలుగా చేసి ఒక్కొక్కరూ ఒక్కో ముద్ద ఆరగించారు. అనంతరం మేకను బలిచ్చారు. తుర్ర వాయింపు.. ఈ అకాడి పండుగల్లో మరో కొత్త కోణం ఉంది. అడవిలోకి వెళ్లిన పశువులు ఇళ్లకు చేరాలంటే తుర్ర వాయించాలని ఆచారం. పశువుల కాపరుల వద్ద ఈ తుర్ర ఉంటుంది. పశువులు ఎక్కడికి వెల్లినా ఈ తుర్ర వాయిస్తే తిరిగి వస్తాయని వారి నమ్మకం. నెల రోజుల పాటు తుర్ర వాయిస్తూనే ఉంటారని పలువురు కటోడాలు చెబుతున్నారు. ఏత్మాసార్ పేన్కు పూజలు! అకాడి అనంతరం గ్రామంలోకి చేరుకున్న ఆదివాసీలు ఏత్మాసార్ పేన్కు పూజలు చేశారు. నాలుగు మాసాలపాటు ఈ పూజలు కొనసాగనున్నాయి. గ్రామంలో ఉన్న ప్రజలతో పాటు పశువులు క్షేమంగా ఉండాలని, పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు. అకాడి అనంతరం నాగుల పంచమి, జామురావూస్, శివబోడి, పొలాల అమావాస్య, బడిగా, దసరా, దీపావళి పండుగలు చేస్తారు. -
నరబలి కలకలం.. డోర్లు మూసి తాంత్రిక పూజలు చేస్తుండగా..
కేరళ నరబలి ఉదంతం.. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో.. డబ్బు దొరుకుతుందనే ఆశతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. తొలుత బాధిత మహిళలు రెస్లీ, పద్మను నరబలి ఇచ్చి.. వాళ్లను ముక్కలుగా నరికి కాల్చేశారు. ఈ ఘటన మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే తమిళనాడులో మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ ఇంట్లోని పూజ గదిలో కూర్చుని క్షుద్రపూజలు చేస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపం ఎస్బీ నగర్‌లోని ఓ ఇంటిలోని వ్యక్తులు మూడు రోజులుగా బయటకు రాలేదు. దీంతో, వారింట్లో నరబలి పూజలు జరుగుతున్నాయని స్థానికంగా వార్తలు, పుకార్లు బయటకు వచ్చాయి. స్థానికుల అనుమానాలను బలపరుస్తూ.. ఇంటి లోపలి నుంచి తాంత్రిక పూజలు జరుగుతున్న అలికిడి వినిపించడం అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేసింది. దీంతో, ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తీయాలని పోలీసులు ఇంట్లో ఉన్న వారిని కోరారు. అయినప్పటికీ వారు తలుపులు తీయలేదు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న వారు పూజలు చేస్తున్న శబ్ధాలు, గంటల చప్పుడు వినిపించింది. దీంతో, పోలీసులు.. బుల్డోజర్ సాయంతో ఇంటి ముందు భాగాన్ని కూల్చివేయాలని అగ్నిమాపకశాఖ సిబ్బందిని ఆదేశించారు. ఇలా కూల్చివేసిన అనంతరం.. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. పూజగదిలో ఆరుగురు కూర్చుని తాంత్రిక పూజలు జరుపుతూ కనిపించారు. దీంతో, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పూజలపై వారిని ప్రశ్నించగా వారింట్లో ఒకరికి దెయ్యం పట్టిందని సమాధానం ఇవ్వడం గమనార్హం. Acting on a tip-off, Tamil Nadu police thwarted a ritual in Tiruvannamalai, suspecting it to be a ritual of human sacrifice | @Akshayanath https://t.co/Vs65NumjFG — IndiaToday (@IndiaToday) October 15, 2022 -
పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ
ఏడు కొండల శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడాది పొడవునా ఉత్సవాలు, సేవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజూ పండుగే. శ్రావణమాసంలో పవిత్రోత్సవాలను విశిష్ట కైంకర్యంగా చేపడతారు. తెలిసీతెలియక జరిగే దోషాల నివారణార్థం ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని శాసన ఆధారం. సోమవారం నుంచి పదో తేదీ వరకు అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల చరిత్ర తెలుసుకుందాం.. తిరుమల : శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పవిత్రోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తారు. భక్తులు దివ్యమైన అనుభూతిని పొందుతారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం (పురిటి మైల), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాల వల్ల ఆలయంలో తెలిసీతెలియక కొన్ని తప్పులు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి దోషాల పరిహారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇవి కేవలం భక్తుల వల్లే కాకుండా ఆలయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వల్ల కూడా జరగవచ్చు. ఆలయంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానీయకుండా దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఆలయ శాసనాలలో.. తిరుమల ఆలయంలో క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని, అందుకోసం అవసరమైన ఖర్చు, దక్షిణ, వస్తువులు వంటివి భక్తులెందరో దానాలు చేసినట్టు ఆలయంలో లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఈ పవిత్రోత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ క్రమం తప్పకుండా ఏటా శ్రావణమాసం శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది. శాస్త్రోక్తంగా అంకురార్పణ పవిత్రోత్సవాలకు ముందురోజు అంటే శుద్ధ నవమి సాయంత్రం స్వామివారి సేనాపతి అయిన విష్వక్సేనుడు పల్లకీపై తిరువీధుల్లో విహరిస్తూ ఆలయ వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడే భూమి పూజ, మృత్సంగ్రహణం (పుట్టమన్నును) చేసి ప్రదక్షిణగా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ రాత్రే ఆలయంలో నవధాన్యాల బీజావాపం (అంకురార్పణం) చేస్తారు. ఈమేరకు శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, డెప్యూటీ ఈఓ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తొలిరోజు మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో పవిత్రోత్సవ మండపం వేంచేపు చేస్తారు. రంగురంగుల అద్దాలతో తయారు చేసిన పట్టు పవిత్రాలను (పట్టుదండలు) యాగశాలలో ఏడు హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. అదేరోజు సాయంత్రం స్వామివారిని సర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి ఆలయ తిరు వీధుల్లో ఊరేగిస్తారు. మూడోరోజు – ముగింపు హోమాలు, అభిషేక పూజా కైంకర్యాలు పూర్తి చేసి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు వైఖానస ఆగ మోక్త ఆచారాలతో ముగింపు పలుకుతారు. (చదవండి: ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు) మూడు రోజులు ఆర్జిత సేవల రద్దు పవిత్రోత్సవాల సందర్భంగా ఈనెల 8న సహస్ర దీపాలంకరణ సేవ, 9న అష్టదళ పాద పద్మారాధన సేవ, 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కల్యోణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. రెండో రోజు – సమర్పణ తొలి రోజులాగే హోమాలు, అభిషేకం, నైవేద్యం, హారతులు పూర్తిచేసి ముందురోజు ప్రతిష్టించిన పట్టు పవిత్రాలను యాగశాల నుంచి ప్రదర్శనగా తీసుకెళ్లి గర్భాలయంలోని మూలమూర్తి... కిరీటం, మెడ, శంఖచక్రాలు, నందక ఖడ్గం, వక్షస్థలంలోని శ్రీదేవి, భూదేవులు, కటి, వరద హస్తాలు, పాదాలు, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, సీతారామలక్ష్మణులు, రుక్మిణీ, శ్రీకృష్ణులవారికి సమ ర్పిస్తారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని పరివార దేవతలకు పట్టు పవిత్రాలు సమర్పిస్తారు. -
విఫల ప్రేమకు ఏటా కల్యాణం.. 18 ఏళ్లుగా ఇదే తంతు!
సాక్షి, బయ్యారం: బలవన్మరణం పొందిన బిడ్డ జ్ఞాపకంగా గుడి కట్టి ఏటా శ్రీరామనవమి రోజు కుమారుడి విగ్రహానికి కల్యాణం చేయిస్తున్నారు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్‌పోడు తండాకు చెందిన భూక్య లాలు, సుక్కమ్మ దంపతులు. వారికి కుమారుడు, కుమార్తె సంతానం కాగా కొడుకు రాంకోటి ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించడంతో 2003లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కొడుకు రాంకోటి కలలోకి వచ్చి తనకు గుడి కట్టించి, వివాహం జరిపించాలని కోరినట్టు తల్లి సుక్కమ్మ కథనం. ఈ నేపథ్యంలో ఇంటి ఆవరణలోనే గుడి కట్టించి.. అందులో కొడుకు విగ్రహంతోపాటు పెళ్లి కుమార్తె విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఆ విగ్రహాలకు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భూక్య లాలు, సుక్కమ్మ దంపతులు వివాహం జరిపించారు. 18 ఏళ్లుగా వారీ విధంగా చేస్తుండటం విశేషం. -
మతసామరస్యం.. ముస్లిం మతపెద్ద చేతులమీదుగా రాములోరి పెళ్లి
జగిత్యాల జోన్: జగిత్యాల మండలం లక్ష్మీపూర్ రామాలయంలో ఆదివారం మతసామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం మతపెద్ద ఎండీ హబీబ్ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. గ్రామ ఆదర్శ బలహీన వర్గాల సంఘం ఆధ్వర్యంలో రామాలయం నిర్మించి ఏటా సీతారాముల కల్యాణం ఘనంగా జరిపిస్తున్నారు. సంఘం అధ్యక్షుడు స్వామివారి కల్యాణం దగ్గరుండి జరిపించడం ఆనవాయితీ. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముస్లిం మతపెద్ద ఎండీ హబీబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన వేదమంత్రాల సాక్షిగా రాములోరి పెళ్లి జరిపించారు. అనంతరం జరిగిన శోభాయాత్రలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హబీబ్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా తమ గ్రామంలో అన్ని పండుగలు జరుపుకుంటామన్నారు. వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లోనూ పాలు పంచుకుంటామని చెప్పారు. -
మెరిట్స్‌లో కర్మక్రియలు.. మార్చి 3న మంత్రి గౌతమ్‌రెడ్డి పెద్ద కర్మ
సాక్షి, నెల్లూరు(ఉదయగిరి/సంగం): దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కర్మక్రియలను శుక్రవారం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో వేద పండితులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. తండ్రి గౌతమ్‌రెడ్డికి ఆయన తనయుడు మేకపాటి కృష్ణార్జునరెడ్డి సంగంలోని పెన్నానదిలో త్రివేణిలో పిండ ప్రదానం చేశారు. కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేని మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి మణిమంజీరి, గౌతమ్‌రెడ్డి సతీమణి కీర్తి, కుమార్తె సాయి అనన్య ఇతర కుటుంబ సభ్యులు దుఃఖాన్ని భరిస్తూ కర్మక్రతువులు పూర్తి చేశారు. అర్జన్రెడ్డిని ఓదార్చుతున్న మేకపాటి దంపతులు ఈ సమయంలో తండ్రిని కోల్పోయి పుట్టేడు దుఃఖంతో రోదిస్తున్న మవవడు అర్జన్రెడ్డిని రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి తమ దుఃఖాన్ని అణుచుకుంటూ ఓదార్చుతుండడం అందరిని కంట తడి పెట్టించాయి. బిడ్డలు వేదనను చూసిన బంధువులు, పలువురు అధికారులు కంట చెమ్మ పెట్టారు. గౌతమ్‌రెడ్డి చితాభస్మంను దేశంలోని ఏడు పుణ్యనదుల్లో కలిపే నిమిత్తం ఏడు పాదుకుల్లో సేకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అఖిలప్రియ, ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళేశ్వరరెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ చైత్ర వర్షిణి, మేకపాటి కుటుంబ సభ్యులు రాజారెడ్డి, పృధ్వీరెడ్డి, విక్రమ్‌రెడ్డి, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: (గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీ) మార్చి 3న మంత్రి పెద్ద కర్మ మంత్రి గౌతమ్‌రెడ్డి పెద్ద కర్మ శాస్త్రీయ ప్రకారం కాలం చేసిన 11వ రోజు మార్చి 3వ తేదీ ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దకర్మకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీఐపీలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అ«ధికారులు ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
అన్నయ్య పెద్దకర్మకు హాజరైన మహేశ్ బాబు.. కన్నీటి పర్యంతం !
Mahesh Babu Attends Rituals Of His Brother Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. 56 ఏళ్ల రమేశ్ బాబు అనారోగ్యంతో జనవరి 8న రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఘట్టమనేని కుటుంబ సభ్యులకు మహేశ్ బాబుకు కరోనా వచ్చి రమేశ్ బాబు చివరిచూపుకు నోచుకోకపోవడం మరింత కలిచివేసింది. ఈ విషయం అభిమానులను కూడా ఎంతో బాధపెట్టింది. అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న మహేశ్ బాబు శనివారం (జనవరి 22) సోదరుడు రమేశ్ బాబు పెద్దకర్మకు హాజరయ్యారు. (చదవండి: రమేశ్‌బాబు మృతిపై మహేశ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్) ఈ కార్యక్రమంలో తన అన్నయ్య మరణించిన రోజు రాలేకపోయినందుకు ఎంతో బాధపడినట్లు తెలుస్తోంది. అన్నయ్యతో మహేశ్ బాబు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. అన్నయ్య రమేశ్ బాబు అంటే మహేశ్ బాబుకి ఎనలేని ప్రేమ. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రస్తావించిన మహేశ్.. రమేశ్ బాబు చనిపోయినప్పుడు భావోద్వేగంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రమేశ్ బాబు పెద్దకర్మకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. (చదవండి: రమేశ్‌బాబు మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టిన కృష్ణ) -
మంచిమాట.. ముందు నిన్ను నీవు సరిదిద్దుకో!
ఆనందం అంటే బయటికి నిరూపించలేనిది. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అనుభవించే స్థితి. ఒక్కో పదార్థం తినడం వల్ల ఒక్కో రుచికి సంబంధించిన అనుభూతి కలుగుతుంది. అలా ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది..? ఆ అనుభూతిని ఎలా పొందాలి..? ఆనందానికి అర్థం పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? అది తెలుసుకుంటే ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా అన్నిటికీ అతీతంగా జీవిస్తాడు. నీ గురించి నువ్వు ఆలోచిస్తే, నీవు ఎవరో తెలుసుకుంటే చాలు. నిజానికి నీవు ఎవరు అంటే ఆ భగవంతుడివే. ఆ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది. నీ గురించి నీవు తెలుసుకోవడం మొదలుపెట్టగానే అంతరంగం శుద్ధి కావడం మొదలవుతుంది. వేరే వారి గురించి ఆలోచిస్తే నీ అంతరంగం కలుషితమవుతుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటే వారి సమాచారం, వారి భావాలు నీ మనసు లోకి ప్రవేశించి నీ మీద స్వారీ చేస్తాయి. నీవు ఎవరి గురించి అయితే అతిగా ఆలోచిస్తే నీ జీవితం వారికి సమర్పించినట్లు, మీ వ్యక్తిత్వం సహజత్వాన్ని కోల్పోయి అతనికి నీవు బానిసగా ఉన్నట్లే. ఇతరుల పట్ల ఆలోచిస్తున్నాను అంటే మనం వారిపై రాగద్వేషాలు పెంచుకున్నట్లే. ప్రస్తుతం మనుషులు తన జీవితం తను జీవించటం మర్చిపోయి ఇతరుల గురించి అనవసరంగా ఆలోచించుకుంటూ లేని సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు ఈనాటి మానవుడు. ఒకసారి మనసు కలుషితమై పరిపరివిధాల అనవసరమైన విషయాల గురించి మనసులో ఆలోచన చేసి దాని ద్వారా శరీరంలో ప్రాణ శక్తి తగ్గి అనేక రకాల రసాయనిక చర్యలు జరిగి తద్వారా అవయవాలు పని చేయక అనేక రకాల జబ్బులు కలిగి శరీరం తన శక్తిని కోల్పోయి దీర్ఘకాలిక రోగాల పాలవుతున్నారు. మానవునికి ఈ శరీరం ఉంటేనే ఏ కార్యమైనా చేయగలిగేది. నీవు జీవించేది నీ కోసమా..? లేక ఇతరుల కోసమా..? ఆలోచించుకోవాలి. ఇతరుల కోసం జీవిస్తున్నాను అని నీవు అనుకుంటే నీవు మాయలో ఉన్నట్టే... బానిసత్వంలో బతుకుతున్నట్టే. సమాజాన్ని ఉద్ధరించే ముందు నిన్ను నీ కుటుంబాన్ని ఉద్ధరించాలి. నీ కుటుంబాన్ని కాకుండా సమాజాన్ని ఉద్ధరించే ఆలోచన చాలా ప్రమాదకరం. ఇంతవరకు ఎవరు అది సాధించలేదు. సేవ చేయాలి కానీ నీవే తర్వాత సేవ చేయించుకునే పరిస్థితి ఏర్పడకూడదు. నిజానికి సేవ అంటే దాని నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు, అలా ఆశించి సేవ చేస్తే కర్మ రెట్టింపు అవుతుంది. సమాజం చెడిపోయింది. దానిని మంచి వైపు నడిపించాలని తపనతో తమ కుటుంబాన్ని మంచి వైపు నడిపించడం మరచిపోతున్నారు. సమాజాన్ని ఉద్ధరించడం తప్పనిసరి అవసరమే కానీ దానికి ఓ పద్ధతి ఉంది. ముందు తనని తను ఉద్ధరించుకోకుండా, తన బాధ్యతలు, బంధాలను, దాటకుండా సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం సరికాదు. అందుకు సమాజం కూడా సహకరించదు. నీ కోసం నీవు జీవించడమే నిన్ను నమ్ముకున్న వాళ్లకు నీవు ఇచ్చే అత్యున్నత జీవితం. నిన్ను నీవు ఉద్ధ్దరించి ఉన్నప్పుడే సమాజాన్ని సరి చేసే అర్హత వస్తుంది. కాబట్టి మొదలు నిన్ను నీవు సరి చేసుకో. ఆ తర్వాతనే సమాజం గురించి ఆలోచన చేయి. ఈ ప్రపంచంలో ఎవరి జీవితం వారిది. ఎవరి కర్మలు వారివి. కాబట్టి ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణలో ఉండాలి. నీకు ప్రపంచాన్ని మార్చే అర్హత వచ్చినప్పుడు ప్రపంచం నిన్ను వదలదు. నీకు ఆ అర్హత లేకుంటే సమాజం నిన్ను స్వీకరించదు. మేధావులు మాకు అంతా తెలుసు అనుకుంటారు కానీ అదే వారి బలహీనత. తమ ద్వారా సమాజం మారుతుంది అనుకుంటారు. భౌతిక పరమైన అభివృద్ధి ద్వారానే మనిషి ఆనందంగా జీవిస్తున్నా అనుకుంటున్నాడు. అందుకే భౌతికమైన అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. అందరూ తెలుసుకోవాల్సిన నగ్నసత్యం మనిషి జీవితకాలం పరితపించేది ఆనందం కోసమే. కానీ ఆ ఆనందం పొందాలనే తపనలో భౌతిక, శారీరక సుఖాలే ఆనందం అనే భ్రమలో నిజమైన ఆనందాన్ని పొందలేక అసంతృప్తి పడుతున్నాడు. దీనికి మూల కారణం తన గురించి తను ఆలోచించుకోలేకపోవడం. నీ గురించి నీవు తెలుసుకుంటూ నీ జీవితం గురించి ఆలోచించుకోవడమే దీనికి పరిష్కారం. మనిషి ఆనందంగా ఉండలేక పోవడానికి కొంత పూర్వ జన్మ, ఇంకొంత ఈ జన్మలో చేసిన కర్మలు కారణం. ఈ కర్మలను క్రమేణా నివృత్తి చేసుకుంటూ వాటి తీవ్రతను తగ్గించుకొని అనవసరమైన వాటికి విలువ ఇవ్వకుండా అవసరమైన విషయాలకు మాత్రమే విలువ ఇస్తూ ఫలితం పొందితే ఆనందం సిద్ధిస్తుంది. ఆనందం అంటే ఎవరికి వారు స్వయంగా అనుభవించే స్థితి. ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా అన్నిటికీ అతీతంగా జీవిస్తాడు. ► భౌతిక సంపద పెరగడం అంటే మానసిక సంపద తరగడమే. ► సంపద పెరిగితే సంతృప్తి రావాలి ► సంతృప్తిని మించిన సంపద లేదు. ► ఆనందం లేనప్పుడు జీవితానికి అర్థం లేదు, ► మనం ఎందుకు జీవిస్తున్నాం ఎలా జీవిస్తున్నామో తెలుసుకోవాలి. ► ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా జీవిస్తాడు. – భువనగిరి కిషన్ యోగి -
కనులపండువగా పూరీ రథయాత్రకు అంకురార్పణ
భువనేశ్వర్/పూరీ: శ్రీక్షేత్రంలో భంవురి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జరిగిన పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టారు. జగన్నాథుని రథయాత్ర ఘట్టాలను నిర్ణీత కాలంలో ఓ క్రమపద్ధతిలో ముగించడం ఆనవాయితీ కాగా, శ్రీమందిరం రత్నసింహాసనంపై కొలువైన మూలవిరాట్లకు తొలుత పూజలు చేసి, ఆజ్ఞామాలలు సమర్పించారు. అనంతరం 3 రథాలకు వేర్వేరుగా తయారు చేసిన ఆజ్ఞామాలలను రథ నిర్మాణ ప్రాంగణానికి తీసుకువచ్చిన ప్రధానార్చకుల వర్గం ఇరుసు, చక్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజల తర్వాత ఇరుసుకు ఇరువైపులా రెండు చక్రాల చొప్పున అమర్చారు. ఈ ప్రక్రియనే భంవురి ఉత్సవంగా పేర్కొంటారు. దీనినే రథయాత్రలో ప్రధాన భాగంగా కూడా భావిస్తారు. స్థానికంగా అయితే దీనిని చొక్కా డేరా నీతిగా వ్యవహరిచంగా, ఏటా దీనిని కనులపండువగా నిర్వహిస్తుండడం విశేషం. కరోనా విజృంభణ వేళ కూడా కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ శ్రీమందిరం ఆచార వ్యవహారాలకు ఏమాత్రం భంగం కలగకుండా ఉత్సవ ఆద్యంతాలు విజయవంతంగా సాగడం గమనార్హం. -
ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది
ఆ ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది. జనసమ్మర్ధంతో ఉండే ఊరు నిర్మానుష్యంగా మారింది. ఒక్కసారిగా ఊళ్లో నిశ్శబ్దం. ఇదేదో కరోనా మహమ్మరి బారిన పడి ఇలా చేశారనుకుంటే పొరబడినట్లే. దశాబ్దాలుగా పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వస్తున్న గ్రామీణులు తమ ఊరు బాగుకోసం గ్రామదేవతలను వేడుకుంటూ గ్రామం వదిలి వనంబాట పట్టారు. గ్రామ శివారులోని పొలాలు, అడవుల్లోకి వెళ్లి చెట్ల కింద గుడారాలు వేసుకుని, అక్కడే వంటావార్పు చేసుకున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సాక్షి, కుందురీప(అనంతపురం) : పూర్వీకుల ఆచారాన్ని పాటించడంలో భాగంగా కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లి గ్రామం సోమవారం పూర్తిగా ఖాళీ అయింది. గ్రామం చుట్టూ ముళ్లకంచె వేసి సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లారు. చదవండి: ప్యాంట్ కోసం రచ్చ.. మీకెలా కనబడుతున్నాం? దేవుడి ప్రతిమలతో పాటు.. ఆచారంలో భాగంగా గ్రామంలోని నాలుగు ప్రధాన ఆలయాల్లోని దేవుడి ప్రతిమలతో పాటు పెంచుకున్న మూగజీవాలు, కుక్కలు, పిల్లులను కూడా శ్రీమజ్జనపల్లి వాసులు తమ వెంట తీసుకుని, గ్రామం వదిలి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన 280 కుటుంబాలు ఉన్నాయి. 1,120 జనాభా ఉన్న శ్రీమజ్జనపల్లిలో నేటికీ 90 శాతం పూర్వపు ఆచారాలనే అనుసరిస్తూ వస్తున్నారు. ఊరు వదిలి వెళ్తున్న గ్రామస్తులు రోగాలు నయమవుతాయని శ్రీమజ్జనపల్లి వాసులు పాటిస్తున్న ఈ ఆచారం వెనుక సుదీర్ఘ కథనమే ఉంది. గ్రామ పెద్దలు తెలిపిన మేరకు ‘వందేళ్ల క్రితం గ్రామంలో అతిసార సోకి పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో గ్రామ దేవతలు పాలనాయక, పెద్దక్క రాయమ్మ అమ్మవారు అప్పట్లో అర్చకులుగా ఉన్న పుజారి పాలయ్య, ఓబయ్య, హనుమయ్య కలలో కనిపించి 24 గంటల పాటు అందరూ గ్రామాన్ని వదిలి వెళితే ఊరు సుభిక్షంగా ఉంటుందని తెలిపింది. అప్పటి నుంచి గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. ప్రతి మూడు లేదా ఐదేళ్లకు ఓసారి ఇలా పూరీ్వకుల ఆచారాన్ని పాటించడం ఆనవాయితీగా మారింది’. 24 గంటలు గ్రామంలోకి ‘నో ఎంట్రీ’.. గ్రామం వదిలిన తర్వాత 24 గంటల పాటు ఆ ఊళ్లోకి ఎవరినీ అనుమతించకుండా చుట్టూ ముళ్ల కంచె వేశారు. స్థానికులతో పాటు ఇతర గ్రామాల ప్రజలు సైతం గ్రామంలోకి వెళ్లకుండా ఊరు చుట్టూ 30 మంది యువకులు కాపలా కాశారు. ఈ నిబంధన అతిక్రమించి, పొరబాటున ఎవరైనా గ్రామంలోకి కాలుపెడితే.. కాసిపుల్లతో నాలుకపై కాలుస్తారు. గ్రామాన్ని ఖాళీ చేసే ముందు వింత ఆచారాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ శాంతి కోసం జంతు బలులు సమర్పించి పది బస్తాల బియ్యాన్ని వండి పసుపు కుంకుమతో కలిపి గ్రామం చుట్టూ చల్లుతారు. అనంతరం ఏకమొత్తంగా రెండు పూటలకు సరిపడు బియ్యం, బేడలు, కాయగూరలు, పాత్రలు తీసుకుని గ్రామం వదిలి వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామాన్ని ఖాళీ చేసిన శ్రీమజ్జనపల్లి వాసులు.. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇళ్లకు చేరుకుంటారు. ఇళ్లను శుద్ధి చేసిన అనంతరం లోపలకు ప్రవేశిస్తారు. గ్రామం చుట్టూ వేసిన ముళ్లకంచె 80 శాతం నిరక్ష్యరాశ్యులే.. శ్రీమజ్జనపల్లి గ్రామంలో 80 శాతం మంది నిరక్ష్యరాశ్యులే ఉన్నారు. మూఢాచారాలను పాటిస్తూ చిన్న పిల్లలకే పెళ్లిళ్లు చేసేస్తుంటారు. ఏటా పది నుంచి 15 బాల్యవివాహాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ గ్రామస్తులకు దైవభక్తి ఎక్కువే. గోపూజతో దినచర్య ప్రారంభిస్తారు. కోళ్లను పెంచరు. కోడి మాంసం తినరు. ఏటా జనవరిలో నరసింహస్వామి గ్రామోత్సవం, శివరాత్రి పర్వదినాల్లో పాలనాయకస్వామి జాతర్లు వైభవంగా నిర్వహిస్తుంటారు. రూ. కోటి విరాళాలతో గ్రామంలో పాలనాయక స్వామి ఆలయ నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు. -
సూర్యగ్రహణం: నిలబడిన రోకళ్లు.. ప్రత్యేక పూజలు
సాక్షి, శ్రీకాకుళం: సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఏ ఆధారం లేకుండా నిలబెట్టిన రోకళ్లకు స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యగ్రహణం రోజున రోకళ్లు వాటంతట అవే నిలబడతాయని ఇక్కడి స్థానికులు నమ్ముతారు. గిన్నెలో నీళ్లు పోసి రోకలిని ఏ ఆధారంలేకుండా నిలబెడతారు. సూర్యగ్రహణం ప్రభావంతో ఏ సపోర్ట్ లేకపోయినా రోకళ్లు నిటారుగా నిలబడతాయని శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రజలు విశ్వసిస్తారు. ఇలా నిలబెట్టిన రోకళ్లకు పూజలు చేస్తున్నారు. గురువారం సూర్యగ్రహణం సంభవించడంతో శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలం కె.కొత్తవలస గ్రామంలో స్థానికులు రోకలిని నిలబెట్టి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళంలోని పలు మండలాల్లో, గ్రామాల్లో ఈ ఆచారాన్ని స్థానికులు పాటించడం కనిపిస్తోంది. గ్రహణం ఎఫెక్ట్ కారణంగానే సూర్యభగవానుడి శక్తితో రోకళ్లు ఇలా నిలబడతాయని స్థానికులు చెప్తున్నారు. -
వినోదాల దసరా...
దసరా అంటేనే సరదాల పండగ. గంగిరెద్దుల మేళం, బొమ్మల కొలువు, దసరా వేషాలు... అంతా దసరా హడావుడే. ఊళ్లన్నీ కొత్త కొత్త ఆచారాలతో సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా చెప్పుకోవలసినవి దసరావేషాలు. వీటినే పగటివేషాలు లేదా పైటే వేషాలు అంటారు. వీటి ముఖ్య ఉద్దేశం ప్రజావినోదం. ఆయా ప్రాంతాల ప్రజల ఆశలు, ఆశయాలకు ప్రతిబింబంగా ఇవి మనదేశంలో బహుళ ప్రచారం పొందాయి. పగటì పూట మాత్రమే ప్రదర్శించే వేషాలు కావడం వల్ల వీటికి పగటివేషాలనే పేరు వచ్చింది. ప్రేక్షకులను నమ్మించడం ఈ వేషాల గొప్పదనం. అంతేకాక ప్రజల సమస్యలను నాటి పరిపాలకుల దృష్టికి తీసుకురావడం, వర్తమానాలను చేరవేయడం కోసం ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోకి వచ్చాయని ప్రతీతి. ఇందులో పౌరాణికమైనవి, కల్పిత వేషాలు, హాస్య పాత్రలు ఉంటాయి. మొట్టమొదట్లో ఈ కళ భిక్షుక వృత్తిగా ప్రారంభమై తరవాత సంక్లిష్ట రూపంగా మారింది. శాతవాహనుల కాలం నుంచే ఈ కళారూపం ఉందని హాలుని గాథాసప్తశతి ద్వారా తెలుస్తోంది. మారువేషాలు ధరించి గూఢచారులుగా వీరు సమాచారాన్ని అందించేవారని, కాకతీయుల యుగంలో యుగంధరుడు పిచ్చివానిగా నటించి ఢిల్లీ సుల్తానులను జయించాడని చరిత్ర చెబుతోంది. వీటికి ఆదరణ తగ్గడంతో చాలా కళలు భిక్షుక వృత్తిగా మారిపోయాయి.పగటివేషాలు వేసేవారు ముఖ్యంగా దసరా పండుగ సమయంలోనే వేషాలు వేయడం వలన ఇవి దసరా వేషాలుగా ప్రసిద్ధికెక్కాయి. వీరు సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తూంటారు. వీళ్లనే బహురూపులు అని కూడా అంటారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలరోజుల పాటు ప్రదర్శనలు ఇస్తారు. ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ధ వహిస్తారు. చివరిరోజున సంభావనలు తీసుకుని అందరూ పంచుకుంటారు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్ధనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఒకే వ్యక్తి స్త్రీ, పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం ఈ వేషం ప్రత్యేకత. ముఖ మధ్య భాగంలో తెర కట్టుకుని ఒక వైపు శివుడుగా మరోవైపు పార్వతిగా అలంకరించుకుంటారు. తెరమార్చుకోవడంలోనే వీరి నైపుణ్యం ఉంటుంది. ఇదేకాక దసరా పోలీసులు, పిట్టలు దొరలు కూడా ప్రత్యేకంగా వస్తారు. వారు తడబాటు లేకుండా నిరాఘాటంగా పదేసి నిముషాలు చెప్పే కబుర్లు నవ్వు తెప్పిస్తాయి. ఒకప్పుడు దాదాపుగా 64 రకాల వేషాలు వేస్తే, ఇప్పుడు 32 వేషాలు మాత్రమే వేస్తున్నారు. ఆదిబైరాగి, చాత్తాద వైష్ణవం, కొమ్ముదాసరి, హరిదాసు, ఫకీరు, సాహెబు, బుడబుక్కలవాడు, సోమయాజులు – సోమిదేవమ్మ, వీరబాహు, గొల్లబోయిడు, కోయవాడు, దేవరశెట్టి, ఎరుకలసోది, జంగం దేవర, గంగిరెద్దులు, పాములవాడు, పిట్టలదొర, చిట్టిపంతులు, కాశీ కావిళ్లు... వంటి ఎన్నో వేషాలు వేస్తున్నారు. వీటిలో కొన్నింటికి సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే, మరి కొన్నింటిలో... పద్యాలకు, అడుగులకు, వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. బుడబుక్కలవాడు, ఎరుకలసాని వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది. – డా. వైజయంతి -
విజయకృష్ణ గార్డెన్లో విజయనిర్మల అంత్యక్రియలు
-
కర్మకాండలు చేసిన కూతుళ్లు
సాక్షి, నిడమర్రు : నిడమర్రు గ్రామంలో తండ్రి కర్మకాండలు కూతుళ్లు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన యుజ్రోతి సూర్యారావు (73) మంగళవారం మృతి చెందారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. కుమారులు లేకపోవడంతో కూతుళ్లే కొడుకులుగా మారి తండ్రి సూర్యారావు మృతదేహాన్ని కర్మభూమికి తరలించగా పెద్ద కుమార్తె రమణమ్మ తలకొరివిపెట్టింది. మిగిలిన నలుగురు కుమార్తెలు ధనలక్ష్మి, అనంతలక్ష్మి, కృష్ణకుమారి, వరలక్ష్మి పాడెమోసుకుంటూ కర్మభూమికి తీసుకువెళ్లారు. సూర్యారావు బతికుండగానే తన మరణానంతరం కర్మకాండలు కూతుళ్లు చేయాలనే కోరిక మేరకు ఇలా చేశారు. -
హల్వాతో ప్రారంభం.. సూక్తితో ముగింపు
న్యూఢిల్లీ : మరి కొద్ది గంటల్లో మోదీ ప్రభుత్వం కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ మన దేశంలో 26 మంది ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 76 బడ్జెట్ సెషన్లు జరిగాయి. బడ్జెట్‌కి సంబంధించి దాదాపు 72 ఏళ్లుగా మన దేశంలో పాటిస్తున్న కొన్ని సంప్రదాయాలను ఓ సారి చూడండి. 1. నేడు తాత్కలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తయారికి దాదాపు 5 నెలల సమయం పడుతుంది. గతంలో ఆర్థిక సంవత్సరం మార్చి - ఏప్రిల్ వరకూ ఉన్నప్పుడు ఫిబ్రవరి నెలాఖరు వరకూ కూడా బడ్జెట్ తయారి ప్రక్రియ కొనసాగేది. కానీ మోదీ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరాన్ని ఫిబ్రవరి - మార్చికి మార్చింది. ఇప్పుడు జనవరి చివరి రోజు వరకూ బడ్జెట్ తయారీ కొనసాగుతుంది. 2. కొత్త డాటా ప్రకారం తొలుత కీలక అంశాలకు కేటాయింపులు ముగిసిన తర్వాత దీన్ని ఆర్థిక మంత్రికి అంద జేస్తారు. ఈ వివరాలన్నింటిని మార్పు చేయడానికి వీలులేని నీలం రంగు పేపర్లో చేర్చి ఆర్థికమంత్రికి ఇస్తారు. ఆయన దీన్ని పరిశీలించి తిరిగి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. తన దగ్గర ఉంచుకోవడానికి కుదరదు. ఈ నీలం రంగు బడ్జెట్ పేపర్ల సంప్రదాయాన్ని బ్రిటీష్ పార్లమెంటరీ వ్యవస్థ నుంచి తీసుకున్నాం. 3. ఇప్పుడైతే బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెడ్తున్నాం. కానీ 1999 వరకూ కూడా బడ్జెట్‌ను ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రకటించేవారు. ఉదయం 11 గంటలకు ప్రకటించే సంప్రదాయాన్ని యశ్వంత్ సిన్హా 2001 నుంచి ప్రారంభించారు. 4. బడ్జెట్ ప్రసంగం కనీసం ఒక గంటపాటు కొనసాగుతుంది. కానీ 1991లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ సేపు ప్రసంగించారు. దాదాపు 18,650 పదాలు వాడారు. తరువాతి స్థానంలో జైట్లీ నిలిచారు. గత ఏడాది జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ 18,604 పదాలు వాడారు. అతి తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన వ్యక్తి హెచ్ఎమ్ పాటిల్. 1977లో తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పాటిల్ కేవలం 800 పదాలను మాత్రమే వాడారు. 5. ఇక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయం వరకూ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. ఫోన్లను ట్యాప్ చేయడం, జామర్స్, స్కానర్స్, రహస్య కెమరాలను ఏర్పాటు చేస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టేవరకూ ఎక్కడ ఎటువంటి సమాచారం లీక్ కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. 1950 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. 6. అన్ని శాఖల వారిగా బడ్జెట్ కేటాయింపులు ముగిసాక ఆర్థిక మంత్రి కార్యాలయంలోని బేస్మెంట్లో ఉన్న ప్రెస్‌లో బడ్జెట్ ప్రతులను ముద్రించడం జరుగుతుంది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టాడానికి వారం ముందుగా ముద్రణ ప్రారంభమవుతుంది. హల్వా తయారీతో బడ్జెట్ ప్రింటింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆర్థికమంత్రి దాదాపు 100 మంది అధికారులకు, సిబ్బందికి ఈ హల్వా తినిపిస్తారు. 7. పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించేవరకూ ఆ శాఖకు సంబంధించిన సిబ్బందిని నార్త్ బ్లాక్ పరిసరాల్లోనే ఉంచుతారు. వారు బయటకు వెళ్లడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, సెల్ ఫోన్లు వాడటం వంటివి నిషేధం. వారికి వడ్డించే ఆహారాన్ని కూడా పరీక్షిస్తారు. వైద్యులతో పాటు ఇంటిలిజెన్స్ అధికారులు, పోలీసుల భద్రత ఏర్పాటు చేస్తారు. 8. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి బడ్జెట్ పత్రాలున్న రెడ్ కలర్ లెదర్ బ్యాగ్‌ను పార్లమెంట్ బయట ప్రెస్ ఫోటోకాల్ నిమిత్తం ప్రదర్శిస్తారు. ఈ సంప్రదాయం రాణి విక్టోరియా కాలం నుంచి కొనసాగుతుంది. యశ్వంత్ సిన్హా, ప్రణబ్ ముఖర్జి వాడిన లెదర్ బ్యాగ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. 9. బడ్జెట్ ప్రసంగానికి ముందు ఆర్థిక మంత్రి ప్రసిద్ధి చెందిన వ్యక్తులు చెప్పిన సూక్తులతో ప్రారంభిస్తారు. గతంలో మన్మోహన్ సింగ్ తన ప్రసంగానికి ముందు రవీంద్రనాథ్ ఠాగూర్, విక్టర్ హ్యూగో సూక్తులను ఉటంకించగా.. పి చిదంబరం వివేకానంద, తిరరువల్లువారు సూక్తులను ప్రస్తావించారు. వీరికి విరుద్ధంగా ప్రణబ్ ముఖర్జీ కౌటిల్యుడు, షేక్స్పియర్ సూక్తులను ఉటంకించారు. -
‘నేనలా చేయను.. నా పెళ్లి నా ఇష్టం’
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో వివాహ కార్యక్రమానికి ప్రముఖ స్థానం ఉంది. పెళ్లి తంతు దేశంలోని ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. కానీ, కన్యాదానం, పెళ్లి కూతురుని అత్తవారింటికి సాగనంపుట వంటివి మాత్రం తప్పసరిగా ప్రతీ పెళ్లిలో ఉంటాయి. బెంగాల్‌కు చెందిన ఓ యువతి మాత్రం ఇవన్నీ తనకు అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. పాత కాలం నాటి పెళ్లి పద్ధతులు పాటించనని తేగేసి చెప్పారు. వినూత్నంగా తన వివాహా కార్యక్రమాన్ని జరిపించారు. తన తల్లితో వరుడి కాళ్లు కడిగించలేదు. అప్పగింతల సమయంలో అందరిలా కన్నీరు పెట్టుకోలేదు. ‘ఏడవాల్సిన అవసరం నాకేముంది. నేనెక్కడికి పోతున్నాను. నా పుట్టింటికి తరచుగా వస్తుంటాను. ఇది నా ఇల్లు’ అని అక్కడున్న సంప్రదాయ వాదులకు సమాధామిచ్చారామే. వీడ్కోలు సందర్భంగా తన తల్లి ఒడిలో బియ్యం పోయాల్సిందిగా ఆమె బంధువొకరు చెప్పగా.. ‘ఎందుకూ..? తల్లిదండ్రుల రుణం తీరిపోయిందని చెప్పేందుకేనా ఈ సంప్రదాయం. అయితే, నాకు అలాంటిది అవసరం లేదు. ఎందుకంటే.. తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీరిపోదు’ అని తనదైన స్టైల్లో బదులిచ్చారు. మెట్టినింటికి వెళ్తున్న క్రమంలో కూడా.. నవ్వుతూ ఫొటోలకు పోజిచ్చారు ఈ బెంగాలి యువతి. కాగా, ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాతకాలం నాటి.. మహిళలను, వధువు తరపున వారిని తక్కువగా చేసి చూపించే పెళ్లి పద్ధతులు పాటించాల్సి అవసరం లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.