వరంగల్ జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
వరంగల్: వరంగల్ జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా ములుగు మండల కేంద్రంలో క్షుద్రపూజలు చేస్తుండగా ఓ బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు ములుగు మండలానికి చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
(ములుగు)