సంస్కృతీ సంప్రదాయాల ‘గోపురం’!
ఆచారాలు బోలెడుంటాయి. అవి ఎందుకొచ్చాయో మనకి తెలీదు. సంప్రదాయాలను బాగానే పాటిస్తాం. కానీ ఎందుకు పాటించాలి, ఏ విధంగా పాటించాలి అన్న అవగాహన ఉండదు. పెద్దవాళ్లు చెబుతున్నారని కొందరు, అందరూ పాటిస్తున్నారని కొందరు పాటించేస్తూ ఉంటారు. కానీ ఇలా ఎందుకు చేయాలి అని ప్రశ్నించుకున్నప్పుడు బుర్రలో బోలెడన్ని సందేహాలు పుట్టుకొస్తుంటాయి. వాటన్నిటినీ తీర్చడానికి రూపొందించిందే ‘గోపురం’ కార్యక్రమం. జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం సంస్కృతీ సంప్రదాయాల చుట్టూ తిరుగుతుంది. డా॥సంధ్యాలక్ష్మి వివరణ ద్వారా మనం పాటించే సంప్రదాయాల వెనుక ఉన్న కథలు తెలుస్తాయి. మన విధి విధానాల్లోని పొరపాట్లు అవగతమవుతాయి. కొన్ని కొత్త విషయాలు బోధపడతాయి. సంస్కృతీ సంప్రదాయాలకు విలువిచ్చే వారికి నచ్చే కార్యక్రమమిది.