భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో వివాహ కార్యక్రమానికి ప్రముఖ స్థానం ఉంది. పెళ్లి తంతు దేశంలోని ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. కానీ, కన్యాదానం, పెళ్లి కూతురుని అత్తవారింటికి సాగనంపుట వంటివి మాత్రం తప్పసరిగా ప్రతీ పెళ్లిలో ఉంటాయి. బెంగాల్‌కు చెందిన ఓ యువతి మాత్రం ఇవన్నీ తనకు అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. పాత కాలం నాటి పెళ్లి పద్ధతులు పాటించనని తేగేసి చెప్పారు. వినూత్నంగా తన వివాహా కార్యక్రమాన్ని జరిపించారు. తన తల్లితో వరుడి కాళ్లు కడిగించలేదు. అప్పగింతల సమయంలో అందరిలా కన్నీరు పెట్టుకోలేదు.