కోహిమాలో స్థానికులతో రాహుల్
చిఫొబొజౌ(నాగాలాండ్): అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ క్రతువు ఎన్నికల రంగులద్దుకుని ‘నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ’ ఫంక్షన్‌గా ముస్తాబవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం నాగాలాండ్‌లోకి అడుగుపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మంగళవారం సైతం వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారుల నడుమ కొనసాగింది.
యాత్రను ముందుండి నడిపిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం రాష్ట్ర రాజధాని కోహిమాలో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అందిన ఆహా్వనాన్ని తమ పార్టీ అగ్రనేతలు సున్నితంగా తిరస్కరించడాన్ని ఆయన గట్టిగా సమరి్థంచారు. ‘‘ మందిరం ప్రారం¿ోత్సవానికి కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పారీ్టల నేతలు ఎవరు వెళ్లినా నేను మనసారా స్వాగతిస్తా. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమం మొత్తం మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ కేంద్రంగా తయారైంది.
చక్కని వేడుకను ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు రాజకీయ వేడుకగా మార్చేశాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లొద్దని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాం«దీ భావించి ఉంటారు. కాంగ్రెస్ పారీ్టకి అన్ని మతాలు, సంప్రదాయాలు సమానమే. 22న అయోధ్య జరిగే కార్యక్రమం.. రాజకీయ ఉత్సవంలా మారిందని స్వయంగా కొందరు హిందూ మత పెద్దలే బహిరంగంగా విమర్శించారు. ఇలా కొత్తరూపును సంతరించుకున్న ఈ కార్యక్రమానికి మేం వెళ్లడం కష్టం. అసాధ్యం కూడా’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘ఇండియా కూటమి బలంగా ఉంది, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పారీ్టతో సీట్ల పంపకం విషయంలో నెలకొన్న విభేదాలు సమసి పోతాయి’’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment