విశాఖపట్నం: గురుపౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టు భక్తులు ప్రదక్షిణ మొదలుపెట్టారు.
సింహగిరి తొలి పావంచా దగ్గర కొబ్బరి కాయ కొట్టి నమో నరసింహా అంటూ నడక ప్రారంభించిన భక్తులు... అడవివరం, ముడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్ల పాలెం, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, వెంకోజీ పాలెం మీదుగా సీతమ్మధార, పోర్టు స్టేడియం, కప్పరాడ, మురళీనగర్, మాధవధారకు చేరుకుంటారు. అక్కడ నుంచి హైవేపై ఆర్ అండ్ బీ, ఎన్ఏడీ, గోపాలపట్నం మీదుగా సింహాచలం కొండకు వెళ్తారు.