పాలబిందెలో ఉంగరాలాట ఎందుకు ఆడిస్తారు?
నివృత్తం
నూతన వధూవరుల విషయంలో పాటించే ఆచారాలు భలే ఆసక్తికరంగా ఉంటాయి. పాల బిందెలో ఉంగరాలాట వాటిలో ఒకటి. ఓ బిందెను పాలతో నింపేస్తారు. తర్వాత అందులో ఉంగరం వేస్తారు. వధూవరులిద్దరూ ఆ ఉంగరాన్ని వెతికి పట్టుకోవాలి. ఎవరి చేతికి చిక్కితే వారే విజేత. తమ వివాహం జరిగిన తరువాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలిద్దరూ ఈ ఆటను ఆడినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. అందువల్లే ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన దంపతులిద్దరి మధ్య బెరుకు పోగొట్టేందుకే ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టినట్టు పండితులు చెబుతారు.