lakshmi devi
-
కలలో ఏనుగు కనిపిస్తే..? ఏమవుతుంది?
ఎవరికైనా సరే కలలు రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కలలో పర్వతాలు .. నదులు .. అడవులు .. జంతువులు కనిపిస్తూ ఉంటాయి. పులులు .. సింహాలు .. ఏనుగులు కనిపించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి జంతువులు కలలో కనిపించి నప్పుడు భయం కలుగుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ విషయాన్ని ఇతరులతో పంచుకుని, ఏం జరుగుతుందోననే ఆందోళనకి లోనవుతుంటారు. అయితే కలలో ఏనుగు కనిపిస్తే మంచిదేనని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఏనుగు కుంభస్థలం .. లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. అందువలన కలలో ఏనుగు దర్శనం వలన సంపదలు లభిస్తాయని అంటారు. ఏనుగును దర్శించుకోవడం వలన దారిద్య్రం .. దుఃఖం దూరమవుతాయని చెబుతారు. అదృష్టం .. ఐశ్వర్యం చేకూరతాయని నమ్ముతారు. ఆయా పుణ్య క్షేత్రాల్లో గజ వాహనంగా ఏనుగులు భగవంతుడి సేవలో తరిస్తుంటాయి. గజ ముఖంతోనే వినాయకుడు తొలి పూజలు అందుకుంటూ ఉంటాడు .. అందరి విఘ్నాలను తొలగిస్తూ ఉంటాడు. అలాంటి ఏనుగును కలలోనే కాదు .. బయట చూసినా ఇలాంటి ఫలితాలే కలుగుతాయట. ఇదీ చదవండి : Diwali 2024 దీపావళి లక్ష్మీపూజ : మీ ఇల్లంతా సంపదే! -
శంఖం... లక్ష్మీ స్వరూపం
ప్రాచీన భారతీయ సంస్కృతిలో శంఖానికి విశిష్ట స్థానం ఉంది. శ్రీమన్నారాయణుని మన సనాతన ధర్మంలో శంఖాన్ని మహావిష్ణు స్వరూపంగా, లక్ష్మీప్రదంగా వివరించారు.శంఖంలో పోస్తేనే తీర్థమన్నారు మనవారు. శాస్త్రప్రకారం శంఖం లక్ష్మీస్వరూపం.సముద్రంలో జీవించు ఒక ప్రాణి ఆత్మరక్షణ కోసం శరీరానికి నాలుగువైపుల రక్షణ కవచం నిర్మించుకొంటుంది. కొంతకాలం తర్వాత అది కవచం వదిలి కొత్త కవచం కట్టుకోవడంలో లీనమవుతుంది. ఆ కవచమే మనకు చిరపరిచయమైన శంఖం.అర్చన సమయాలలో శంఖనాదం చేస్తారు. బెంగాల్లో వివాహ సందర్భంగా శంఖధ్వని తప్పనిసరి, శంఖం లోపలి భాగం ముత్యంలా ఉంటుంది. అందులో చెవి పెట్టి వింటే సముద్ర ఘోష వినిపిస్తుంది. శంఖంలో ΄ోసిన తీర్థం సేవించడం వల్ల వాత పిత్త దోషాలు, సమస్త రోగాలు తొలగి ΄ోతాయని పరమపురుష సంహిత చెబుతోంది.శంఖాలలో దక్షిణావర్త శంఖం శ్రీ విష్ణువుకు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అయింది. ఈ శంఖం ఉన్న ఇంటిలో అఖండ సంపదలతో లక్ష్మి నివసిస్తుందని ప్రతీతి. చాలామంది పూజలో ఈ శంఖాన్ని పెడతారు. పుణ్యదినాలలో ఇంట్లో పూజచేసి దేవతార్చనలో పెట్టాలి. శ్రీరామనవమి, విజయదశమి, గురుపుష్యమి, రవిపుష్యమి నక్షత్రాలు, పుణ్యతిథులు ఈ పర్వదినాల్లో తప్పకుండా పూజ చేయాలని పెద్దలు చెప్పారు. -
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్‌లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్‌గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్‌లోని డాలస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్‌లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్‌ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్‌లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్‌గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్‌గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
దీపావళి లక్ష్మీ పూజా విధానం, వ్రత నియమాలు.!
విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీ పక్కనుండటమే అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి, భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు. ఋగ్వేదకాలంలో అదితి,రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం ‘సినీవాలి’ అనే దేవతను ‘విష్ణుపత్ని’గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు. లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదనిm, ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీదేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు. లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మమ్, దీపం సర్వతమోహరమ్, దీపేన సాధ్యతే సర్వమ్, సంధ్యా దీపం నమామ్యహమ్. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి , భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది. ఇక ఈ దీపావళి పర్వదినాన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేలా ఆచరించాల్సిన పూజా విధానం ఏంటంటే.. లక్ష్మీ దేవిని వినాయకుడిని.. దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి. ప్రాణ ప్రతిష్ఠ ‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే బెల్లం ముక్కను నివేదన చేస్తూ ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్ బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. కలశ స్థాపన వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి. ‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య’ లక్ష్మీదేవి అధాంగ పూజ చంచలాయై నమః పాదౌ పూజయామి చపలాయై నమః జానునీ పూజయామి పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి కమలవాసిన్యై నమః కటిం పూజయామి పద్మాలయాయై నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః స్తనౌ పుజయామి లలితాయై నమః -భుజద్వయం పూజయామి కంబ్కంఠ్యై నమః- కంఠం పూజయామి సుముఖాయై నమః- ముఖం పూజయామి శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి సునాసికాయై నమః నాసికం పూజయామి సునేత్రాయై నమః ణెత్రే పూజయామి రమాయై నమః కర్ణౌ పూజయామి కమలాలయాయై నమః శిరః పూజయామి ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి ఈ కింది మంత్రాన్ని పఠిస్తూ దీపం వెలిగించాలి ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవ శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి. లక్ష్మీ దేవికి తిలకాధారణ చేసి విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి, మొదలైనవి సమర్పణలు ఉంచాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్దోదక స్నానం చేయాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం మీ శక్తి కొద్ది స్తోత్రాలను చదివి, దీపం , దూపంలను సమర్పించిన అనంతరమే నైవైద్యం సమర్పించాలి. ఈ క్రింది మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి. యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. చివరిగా సాష్టాంగ నమస్కారం నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి సంధ్యాసమయంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనె/కొబ్బరి నూనెతో దీపాలను ఇంటిముందర ఓ వరస క్రమంలో వెలిగించాలి. (చదవండి: వెలుగుల ఉషస్సు) -
వెయ్యేళ్ల లక్ష్మీదేవి ఆలయం
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామ శివారులోని పురాతన నాగులమ్మ దేవాలయంలో దాదాపు వెయ్యేళ్లనాటి లక్ష్మీదేవి ఆలయం వెలుగుచూసింది. ఈ మేరకు తను గుర్తించిన పలు విషయాలను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి శుక్రవారం వివరించారు. ‘కాకతీయుల కాలంలో నిర్మించిన నాగులమ్మ గుడిలో ద్వికూటాలయానికి మరమ్మతులు చేస్తున్నారు. గుడిచుట్టూ మట్టిని తొలగిస్తుండగా సూర్యుడి విగ్రహం, 13వ శతాబ్దం నాటి శిలాశాసనం బయటపడ్డాయి. ఆ శాసన పాఠం అచ్చుతీసి శాసన పరిష్కర్త కె.మునిరత్నంనాయుడు, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైసూర్‌కు పంపించగా పూర్తి వివరాలు తెలిశాయి. సుమారు ఐదడుగుల ఎత్తైన ఏకశిలపై రాసిన శాసనంలో.. కాకతీయుల కాలంలోని మహాప్రధాని లక్ష్మీదేవికి రంగ¿ోగాలకు భూమిని దానం చేసినట్లు తెలిసింది. ఆ శాసనంపై ‘తుసము, దునెనిమిదిసమ, గూతి శ్రీలక్ష్మీ, రంగ¿ోగలకు, విచ్చితి, మహాప్ర«దాని, క్రయమాత, ముక్య, నానకు’ అనే పదాలు ఉన్నాయని తెలిపారు. ఇటుకల తయారీలో ఇంజనీరింగ్ నైపుణ్యం ఇక్కడి ఇటుకల్లో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం ఉందని, మట్టి, డంగు సున్నం లేకుండా తయారు చేశారని తెలిపారు. ఆలయం ముందున్న పాటిగడ్డ మీద శాతవాహనుల కాలం నాటి రుబ్బు రోలు లభించిందని, అక్కడే కాకతీయుల కాలం నాటి శిథిల దేవాలయం ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. -
టీచర్ @ ఎకో స్మార్ట్ కుండీ
లక్ష్మీదేవికి పాఠాలూ ప్రయోగాలే ఊపిరి. క్లాసులో పాఠంతోపాటు ప్రయోగమూ చేయిస్తారు. మొక్క కోసం నేలకు హాని తలపెడితే ఎలా? అందుకే నేలకు మేలు చేసే పూల కుండీ చేశారు. ఆ.. ఎకో స్మార్ట్ పూల కుండీ... అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శితం కానుంది. ‘టీచర్ ఉద్యోగం ఒక వరం. దేవుడిచ్చిన ఈ అవకాశానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేయాలనేది నా ఆశయం’ అన్నారు కొల్లాటి లక్ష్మీదేవి. ఆమె పుట్టింది, పెరిగింది మచిలీ పట్నంలో. ఎమ్ఎస్సీ, బీఈడీ చేసి 1995లో డీఎస్సీ సెలెక్షన్లో ఉద్యోగం తెచ్చుకున్నారు. తొలి పోస్టింగ్ కృష్ణాజిల్లా, సుల్తానగరంలో. అప్పటి నుంచి మొదలైందామె విజ్ఞాన దానయజ్ఞం. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఉన్న విషయాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించడంతో మొదలైందా యజ్ఞం. పదేళ్ల తర్వాత పెడన మండలం చెన్నూరు ఈస్ట్‌లో మరో స్కూల్‌కి హెడ్మాస్టర్గా బదిలీ. ఆ సంతోషం ఆ స్కూల్‌కి వెళ్లే వరకే. పదిహేనుమంది పిల్లలున్న స్కూల్ అది. అలాగే వదిలేస్తే ఇద్దరు టీచర్ల స్కూల్లో ఒక పోస్ట్ రద్దయ్యే పరిస్థితి. ఇంటింటికీ వెళ్లి ‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. మంచి విద్యనందిస్తాం. మా మీద నమ్మకం ఉంచండి’ అని నచ్చచెప్పి ఎన్రోల్మెంట్ 45కి పెంచారు. సైన్స్ ప్రాజెక్టులు చేయించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ పాఠశాల పిల్లలను అయస్కాంతంలా ఆకర్షించేటట్లు చేశారు. ఆ తర్వాత చెన్నూరు జిల్లా పరిషత్ స్కూల్‌కి వచ్చినప్పటి నుంచి పెద్ద తరగతులకు పాఠం చెప్పే అవకాశం రావడంతో మరింత విస్తృతంగా ప్రయోగాలు మొదలుపెట్టారు. వందకు పైగా ప్రయోగాలు చేసిన ఆమె ప్రయోగాల్లో ఎకో ఫ్రెండ్లీ పూల కుండీ ప్రయోగం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ఆమె విద్యార్థులు మణికంఠ, వినయ కుమార్‌లు యూఎస్‌లోని టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్ నగరంలో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్‌లో ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో ఈ ప్రయోగాన్ని ప్రదర్శించనున్నారు. తన ప్రయోగాల పరంపరను సాక్షితో పంచుకున్నారు లక్ష్మీదేవి. ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటారు! పిల్లల మెదడు కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్లకు మనం మనసు పెట్టి నేర్పిస్తే వాళ్లు అంతే చురుగ్గా నేర్చుకుంటారు. ప్రయోగాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పాఠాలను ప్రయోగాత్మకంగా వివరించడానికి స్లయిడ్లు, స్టెమ్, లీఫ్, ప్లవర్ల భాగాలు నిలువుకోత, అడ్డకోతల నుంచి శరీర అవయవాల పనితీరును వివరించడానికి వధశాలల నుంచి మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులను సేకరించేదాన్ని. ఒక సైన్స్ ఫేర్‌లో సులువైన పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకాన్ని నిరూపించాం. కానీ మా స్కూల్‌కి గణితం విభాగంలో ఒక అవార్డ్ ప్రకటించడంతో అదే స్కూల్‌కి రెండో అవార్డు ఇవ్వకూడదని చెప్పి అప్రిషియేషన్ ఇచ్చారు. నాచుతో సేద్యం ప్రయోగం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. కోవిడ్ సమయంలో ఎక్కువ ఖాళీ సమయం వచ్చింది. మా ఇంటి ఎదురుగా సంతలో అమ్మే మొక్కలు, నర్సరీల వాళ్లు వాడే పాలిథిన్ కవర్ల మీద దృష్టి పడింది. వాటికి ప్రత్యామ్నాయం కోసం ప్రయోగాలు మొదలుపెట్టాను. వేరుశనగపొట్టు, వేపాకు, కొబ్బరి పీచు, మెంతుల మిశ్రమంతో కుండీ తయారీ విజయవంతమైంది. ఎండకు, వానకు తట్టుకుని నిలవడంలో కష్టమవడంతో కలంకారీలో ఉపయోగించే సహజ రంగులను వేయడంతో సమస్య పరిష్కారమైంది. ఇక అవి మట్టిలో కలిసిపోవడం గురించినదే అసలు ప్రశ్న. నెలరోజుల్లో డీ కంపోజ్ అవుతోంది. ఈ కుండీ మట్టిలో కలిసిన తరవాత మట్టికి పోషణనిస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడమూ అవసరమే. ఎన్పీకే చాలా తక్కువగా ఉన్న మట్టిలో వేసి, కలిసిపోయిన తర్వాత మట్టిని మళ్లీ టెస్ట్‌కి పంపిస్తే ఎన్పీకే గణనీయంగా పెరిగినట్లు రిపోర్ట్ వచ్చింది. అంతే కాదు నీటిని నిలుపుకునే శక్తి పెరిగింది, వేపలోని యాంటీ మైక్రోబియల్ స్వభావం వల్ల తెగుళ్లు నివారణ సాధ్యమైంది. పైటో కెమికల్స్ ఉన్నాయని ల్యాబ్టెస్ట్లో నిర్ధారణ అయింది. నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ పెట్టిన సైన్స్ ఫేర్లలో మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయులు దాటి జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శించాం. మెరిటోరియస్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ‘బెస్ట్ గైడ్ టీచర్’ అవార్డు అందుకున్నాను. ఈ ప్రయోగాన్ని అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించడానికి పెడన నుంచి ఈరోజు బయలుదేరుతున్నాం. ఢిల్లీలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని 12వ తేదీన అమెరికా విమానం ఎక్కుతారు మా పిల్లలు’’ అని సంతోషంగా చెప్పారు లక్ష్మీదేవి. ఫ్లోరైడ్ జవాబు దొరికింది! నేను గర్వంగా చెప్పుకోదగిన ప్రయోగాల్లో ఫ్లోరైడ్ నీటిని శుద్ధి చేసే కుండ కూడా ముఖ్యమైనదే. మట్టిలో తులసి, మునగ ఆకులు కలిపి చేశాను. ఫ్లోరైడ్ 3.5 పీపీఎమ్ ఉన్న నీటిలో అడవుల్లో దొరికే చిల్లగింజలను వేసి హార్డ్నెస్ తగ్గించిన తరవాత ఆ నీటిని నేను చేసిన కుండలో పోసి ఆరు గంటల తర్వాత టెస్ట్ చేస్తే పీపీఎమ్ 1.5 వచ్చింది. ఈ కుండలో శుద్ధి అయిన నీటి పీహెచ్ సాధారణ స్థాయుల్లో ఉండడమే కాదు నీటిలో ఉండాల్సిన కంపోజిషన్స్ అన్నీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన స్మార్ట్ ఇండియన్ హాకథాన్‌లో ప్రదర్శించాం. ‘ద ఇనిషి యేటివ్ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టెమ్ (ఐరిస్)’ నిర్వహించిన పోటీలో ప్రదర్శించినప్పుడు నా స్టూడెంట్ ‘సీహెచ్. తరుణ్‌బాబు’కి ‘యంగ్ ఇన్నోవేటర్ అవార్డు’, 45 వేల క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఫిఫ్త్ యాన్యువల్ ఇంటర్నేషనల్ ఇన్నోహెల్త్ ప్రోగ్రామ్ ఢిల్లీ ట్రిపుల్ ఐటీ– ఇన్నో క్యూరియో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫైనల్స్‌కి వచ్చి ఆరు బెస్ట్ ప్రాజెక్టుల్లో రెండవ స్థానం. – కొల్లాటి లక్ష్మీదేవి, బయలాజికల్ సైన్స్ అసిస్టెంట్, బీజీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెడన, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో మేము తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ పూల కుండీని డల్లాస్‌లో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తారు. ఆ కార్యక్రమంలో వంద దేశాలు పాల్గొంటాయి, ప్రదర్శనలో 1800 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని బ్రాడ్‌కామ్ అనే మల్టీనేషనల్ కంపెనీ నిర్వహిస్తోంది. – వాకా మంజులారెడ్డి -
లక్ష్మీ దేవిని ఆరాధిస్తాను: హాలీవుడ్ నటి
మెక్సికో: హిందూయిజంను ఇష్టపడనివారు ఉండరు. వీదేశీయులు కూడా భారత సంస్కృతిని, ఇక్కడి హిందూ దేవుళ్లను ఎంతగానో ఆరాధిస్తారు. భారత్‌లోని ప్రముఖ దేవాలయాలను కూడా వారు తరచూ సందర్శిస్తుంటారు. అలాగే ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హాయెక్ కూడా హిందూయిజంపై తనకు ఉన్న అభిమానాన్ని ప్రకటించారు. తను ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మి దేవిపై దృష్టి పెట్టడం ద్వారా ఇన్నర్ బ్యూటీతో కనెక్ట్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించారు. సల్మా లక్ష్మీ దేవి ఫొటోను షేర్ చేస్తూ.. ఈ ఫొటో తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. ‘నేను నా అంతర్గత సౌందర్యంతో కనెక్ట్ అవ్వాలనుకున్నపుడు ధ్యానం చేస్తాను. ఆ సమయంలో హిందూ దేవత అయిన లక్ష్మీ దేవిని స్మరించుకుంటాను. అది నాకు ఎంతో ఆనందం, ప్రశాంతను ఇస్తుంది. అప్పుడే మీ అంతర్గత సౌందర్యం మరింత గొప్పగా ఉంటుంది’ అంటూ సల్మా రాసుకొచ్చారు. (చదవండి: ‘సినీ వరల్డ్’ మూత ఉద్యోగుల కోత) సల్మా పోస్టు చూసిన బాలీవుడ్ నటి బిపాస బసు ‘అద్భుతం’ అంటూ కామెంటు చేశారు. అంతేగాక సల్మా ఇండియన్ ఫ్యాన్స్ కూడా తను లక్ష్మీ దేవతను ఆరాధిస్తానని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు ఇండియాకు రండి ఇక్కడ మీకు మరింత అంతర్గత శాంతి లభిస్తుంది. అంతేకాదు భారతీయుల ప్రేమను కూడా పొందుతారు’ అంటూ ఆమె పోస్టుకు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అయితే హిందు దేవతలను ఆరాధించే వారిలో సల్మాతో పాటు జూలియా రాబర్ట్, రస్సెల్ బ్రాండ్, మిలే సైరస్ వంటి అంతర్జాతీయ ప్రముఖు నటులు కూడా ఉన్నారు. కాగా మెక్సికో దేశానికి చెందిన సల్మా మెక్సీకన్, అమెరికన్ సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న ఆమె హాలీవుడ్లో ‘డెస్పరాడో’, ‘వైల్డ్ వైల్డ్ వెస్ట్’, ‘ఫ్రిడా’, ‘స్పై కిడ్స్-3’ వన్స్ అపాన్ టైమ్ ఇన్ మెక్సికో’ వంటి చిత్రాలతో నటించారు. (చదవండి: క్యాన్సర్‌తో దిగ్గజ రాక్‌స్టార్ కన్నుమూత) View this post on Instagram When I want to connect with my inner beauty, I start my meditation focusing on the goddess Lakshmi, who in Hinduism represents wealth, fortune, love, beauty, Māyā (literally meaning "illusion" or "magic”), joy and prosperity. Somehow her image makes me feel joyful, and joy is the greatest door for your inner beauty. Cuando quiero conectarme con mi belleza interior, comienzo mi meditación enfocándome en la diosa Lakshmi, quien en el hinduismo representa la riqueza, la fortuna, el amor, la belleza, Māyā (que literalmente significa "ilusión" o "magia"), alegría y prosperidad. De alguna manera su imagen me trae alegria, y piensa que la alegría es la puerta más directa para tu belleza interior. #innerbeauty #hinduism #lakshmi #meditation A post shared by Salma Hayek Pinault (@salmahayek) on Oct 7, 2020 at 6:39am PDT -
పొలంలో పురాతన ఆలయం
బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): వ్యవసాయ పనులుచేస్తుండగా చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం శీలంవారిపల్లె సమీపంలోని కోనాపురం వద్ద పురాతన ఆలయం బయల్పడింది. శిధిలమై పూడిపోయిన ఆలయ శిథిలాలతో పాటు లక్ష్మీదేవి పాలరాతి విగ్రహం లభించాయి. శీలంవారిపల్లె నుంచి కనికలతోపుకు వెళ్లే రోడ్డు పక్కన కోనాపురం అని పిలుచుకునే ప్రాంతంలో 25ఏళ్ల క్రితం అరవ చిన్నప్పకు 81 సెంట్ల భూమికి డీకేటీ పట్టా మంజూరు చేశారు. సోమవారం అతని కుమారులు జేసీబీతో పొలాన్ని లోతుగా చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి వాడే రాళ్లు భూమిలోంచి తీసేకొద్ది వస్తుండగా వాటిని పొలంలోనే కుప్పగా పోశారు. వాటిలో లక్ష్మీదేవి విగ్రహం కనిపించింది. గ్రామస్తులు విగ్రహాన్ని శుద్ధిచేసి పూజలు చేశారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్ఐ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కోనేటిరాయ ఆలయం విరాజిల్లింది కోనాపురం ప్రాంతంలో కోనేటిరాయస్వామి ఆలయం విరాజిల్లినట్టు తెలుస్తోంది. అక్కడ ఆలయానికి సంబంధించిన స్తంభాలు, విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం లేదా పాలెగాళ్ల పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఆలయం వద్దనుంచే అనంతపురం జిల్లాలోని పెనుగొండ నుంచి గుర్రంకొండకు రహదారి ఉండేదని పూర్వీకులు చెప్పేవారని స్థానిక వృద్ధులు తెలిపారు. కోనేటిరాయస్వామి ఆలయం తురుష్కుల దాడుల్లో ధ్వంసం అయివుండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆ శిధిలాలే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయంటున్నారు. కోనేటిరాయ ఆలయం శి«థిలమయ్యాక కొన్ని విలువైన విగ్రహాలు, ధ్వజస్తంభాన్ని పలు ఆలయాలకు తరలించినట్లు తమ పూర్వీకులు చెప్పేవారని శీలంవారిపల్లె మాజీ సర్పంచు శీలం వేణుగోపాల్‌రెడ్డి విలేకరులకు వివరించారు. -
శ్రీసత్య నారాయణుడి కల్యాణం చూతము రారండీ...
సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే లక్ష్మీ సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం, ఇక్కడ రత్నగిరి పై పంపానదీ తీరాన 128 సంవత్సరాల క్రితం వెలసిన భక్తవరదుడు శ్రీ వీర వేంకటసత్యనారాయణ స్వామి. లక్ష్మీదేవి అంశ అయిన శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుడు ఒకే పానపట్టంపై దర్శనమిచ్చి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా సత్యదేవుని ఖ్యాతి జగద్విదితం. శివ కేశవులకు భేదం లేదని తెలిపే విధంగా విష్ణుమూర్తి శివుడు, శక్తి స్వరూపం అనంతలక్ష్మీ అమ్మవారు పక్కపక్కనే దర్శనమివ్వడం ఇక్కడ విశేషం. 14 నుంచి స్వామివారి దివ్యకల్యాణమహోత్సవాలు శ్రీ సత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి అనగా మే14 వ తేదీ నుంచి వైశాఖ బహుళ పాడ్యమి 19వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వైశాఖ శుద్ధ ఏకాదశి, మే 15 రాత్రి తొమ్మిది గంటల నుంచి 11–30 గంటల వరకూ స్వామివారి దివ్య కల్యాణమహోత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారి కల్యాణమహోత్సవం అనంతరం భక్తులకు స్వామివారి తలంబ్రాలు, ప్రసాదాలను కూడా పంపిణీ చే యనున్నారు.ఈసారి స్వామి కల్యాణమహోత్సవాలు ఏడు రోజులకు బదులు ఆరు రోజులు మాత్రమే జరుగుతాయని అధికారులు తెలిపారు. వైశాఖ శుద్ధద్వాదశి, త్రయోదశి రెండు తిథులు ఒకే రోజు వచ్చినందున ఆ రెండు రోజుల కార్యక్రమాలు ద్వాదశినే నిర్వహిస్తున్నారు.భద్రాద్రి రాముని కల్యాణం తరువాత తెలుగు రాష్ట్రాలలో అంత ప్రాముఖ్యత కలిగిన వేడుక రత్నగిరి శ్రీసత్యదేవుని దివ్యకల్యాణం. ఈ వేడుకకి పెళ్లి పెద్దలుగా శ్రీసీతారాములే వ్యవహరిస్తారు. అన్నవరం క్షేత్రానికి క్షేత్రపాలకునిగా శ్రీరాముడు పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. ఆ హోదాలో ఆ వేడుకలకు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. 15 నుంచి ‘పంచహారతుల సేవ’ ఈ కల్యాణమహోత్సవాల వేడుకల్లో భాగంగా శ్రీసత్యదేవుడు, అమ్మవారికి నూతనంగా ‘పంచ హారతుల సేవ’ను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ఈఓ ఎంవీ సురేష్ బాబు తెలిపారు. ఈ సేవకు పెద్దాపురానికి లలితాబ్రాండ్ రైస్ కంపెనీ అధినేతలు మట్టే సత్యప్రసాద్, శ్రీనివాస్ సోదరులు సుమారు 12కిలోల వెండితో చేయించిన ఎనిమిది రకాల ఆకృతులతో వెండిహారతి సామాగ్రి విరాళంగా అందచేస్తున్నారని తెలిపారు. రోజూ రాత్రి ఏడు గంటల నుంచి అర్ధగంట సేపు ఈ సేవ స్వామివారి ప్రధానాలయంలో నిర్వహిస్తారు. రూ.500 టికెట్‌తో రోజూ 20 దంపతులను మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతిస్తారు. మే 14, వైశాఖ శుద్ధ దశమి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి దేవాలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో శ్రీసత్యదేవుడు, అమ్మవారిని వధూవరులను చేస్తారు. అనంతరం రామారాయ కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 15, వైశాఖ శుద్ధ ఏకాదశి, బుధవారం రాత్రి తొమ్మిది నుంచి 11–30 గంటల వరకూ కల్యాణవేదిక మీద స్వామి, అమ్మవార్లకు దివ్యకల్యాణమహోత్సవం నిర్వహిస్తారు. 16, వైశాఖ శుద్ధ ద్వాదశి, త్రయోదశి, గురువారం ప్రధాన స్థాలీపాక హోమాలు, రాత్రి ఏడు గంటలకు అరుంధతి దర్శనం, అనంతరం స్వామి అమ్మవార్లను రాత్రి తొమ్మిది గంటల నుంచి రావణవాహనం మీద, పొన్నవాహనం మీద స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. 17, వైశాఖశుద్ధ చతుర్దశి, శుక్రవారం మధ్యాహ్నం 2–30కు అనివేటి మండపంలో పండిత సదస్యం, సాయంత్రం ఐదు గంటలకు కొండదిగువన దేవస్థానం గార్డెన్స్‌లో శ్రీవారి వనవిహారం. 18, వైశాఖ శుద్ధ్ద పౌర్ణమి, శనివారం ఉదయం 8–30 గంటలకు పంపానదిలో నిర్మించిన పుష్కరిణిలో స్వామివారి ‘శ్రీచక్రస్నానం’. సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన. 19, వైశాఖ బహుళ పాడ్యమి, ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్వామివారి నిత్య కల్యాణమండపంలో శ్రీస్వామి, అమ్మవార్లకు శ్రీపుష్పయోగం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. నాగఫణిశర్మ అష్టావధానం ఈసారి శ్రీసత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలలో ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ అష్టావధాన కార్యక్రమం 16వ తేదీ సాయంత్రం ఏర్పాటు చేశారు. నాగఫణిశర్మ 14న ఎదుర్కోలు ఉత్సవంలో, 15న స్వామివారి కల్యాణమహోత్సవాలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు.కాగా పంపలో నీరు లేకపోవడంతో తాత్కాలిక పుష్కరిణి నిర్మించారు. ఆ పుష్కరిణికి ఏలేరు జలాలు తరలించడంతో పుష్కరిణి కళకళ లాడుతోంది. ఈ పుష్కరిణి లోనే 18న సత్యదేవుని చక్రస్నాన కార్యక్రమం నిర్వహించనున్నారు. అనిశెట్టి వేంకట రామకృష్ణ సాక్షి, అన్నవరం, -
ప్రేమ కానుక
ఇద్దరికీ ఒకరిపట్ల మరొకరికి ప్రేమ అంకురించింది. ఇంకేం, లక్ష్మీనారాయణుల పెళ్లికి సిద్ధమైంది దేవలోకమంతా. తన ప్రేమకానుకగా ఆయన ఆమెకి తన వక్షఃస్థలాన్ని ఇచ్చాడు నివాసంగా. సముద్రంలో నిక్షిప్తమైన ఉన్న అమృతాన్ని, అమృతోపమానమైన వస్తుసామగ్రినీ పొందడం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు దేవతలూ రాక్షసులూ. పాలసముద్రం దగ్గరికొచ్చారు అందరూ కలిసి. సముద్రంలో దాగున్న లక్ష్మీదేవి గమనిస్తోంది. తాము పాము తలవైపు పట్టుకుని చిలుకుతామన్నారు రాక్షసులు. సరేనన్నాడు శ్రీహరి. కొంతసేపయ్యాక తోకవైపు పట్టుకుంటామన్నారు– తలవైపు నుండి విషం వస్తుంటే ఆ ఘాటుకి తట్టుకోలేక. దానిక్కూడ సరేనన్నాడు నారాయణుడు. ఇంతలో కవ్వంగా ఉన్న మందర పర్వతం దిగబడిపోయింది. మేం వెళ్లిపోతాం అన్నారు రాక్షసులు. ‘కాదుకాదని’ రాక్షసుల్ని ఒప్పించి తాను తాబేలు రూపాన్నెత్తి పనిని కొనసాగింపజేశాడు విష్ణువు. ఇలా ప్రతి సందర్భంలోనూ తన కార్యసాధన పద్ధతిని నిరూపించుకుంటూ ఓసారి గద్దించి మరోసారి బతిమాలి ఇంకొకసారి తాబేలు రూపాన్నెత్తి... ఇలా మొత్తానికి అమృతాన్ని సాధించి దాన్ని రాక్షసులకి కానీకుండా చేశాడు జనార్దనుడు. సముద్రపు కెరటాల మీదుగా ఉయ్యాలలూగుతూ వచ్చి శ్రీమన్నారాయణుని కార్యదీక్షాదక్షతకి ఆనందపడి చూపుల్ని కలిపింది క్షీరాబ్ధి తనయ శ్రీ మహాలక్ష్మి శ్రీహరితో. అంతేకాదు, పాదాభివందనం కూడా చేసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలని ధరించి కూడ ఆవంతైనా అహంకారం లేకుండా వినయంతో నమస్కరించింది. ఆనందపడ్డ విష్ణువు చూపుల్ని కలిపాడు లక్ష్మితో. ఇద్దరికీ ఒకరిపట్ల మరొకరికి ప్రేమ అంకురించింది. ఇంకేం, లక్ష్మీనారాయణుల పెళ్లికి సిద్ధమైంది దేవలోకమంతా. తన ప్రేమకానుకగా ఆయన ఆమెకి తన వక్షఃస్థలాన్ని ఇచ్చాడు నివాసంగా. ఆమె శ్రీహరి హృదయం మీదనే నివసిస్తూ– ఆయన ఏ ఆలోచనతో ఉన్నాడో ముందే గమనించి తనవంతు సహకారాన్ని ఇయ్యడం ప్రారంభించింది. ‘రావణుణ్ణి ఎలా వధించాలా?’ అని ఆలోచిస్తుంటే వేదవతీ రూపంతో వెళ్లి రావణునికి మరణ శాపాన్నిచ్చి వచ్చింది. అంటే పెళ్లికి ముందూ పెళ్లికాలంలో పెళ్లయ్యాక కూడ ఉండేదే ప్రేమ అని పురాణ భావం కదా... – డి.వి.ఆర్. -
కల్పవల్లి... ఆండాళ్ తల్లి
వైష్ణవసంప్రదాయంలో 108 దివ్య దేశాలున్నాయి. ఆ క్షేత్రాలలో విష్ణువు నెలకొని ఉంటాడు. వాటిలో ఒకటి శ్రీవిల్లిపుత్తూర్. ఇక్కడే విష్ణుచిత్తుడు అనే భక్తుడుండేవాడు. ఆయనకు తులసివనంలో ఒక బాలిక దొరుకుతుంది. ఆ బాలికకు పుష్పమాలిక అనే అర్థం వచ్చేట్టు కోదై అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ప్రతిరోజూ విష్ణువుకు సమర్పించే మాలలను సిద్ధం చేస్తుంటే తండ్రికి సహాయం చేసేది కోదై. విష్ణువుకు అలంకరించే మాలలు తాను ధరించి అద్దంలో చూసుకుని మురిసిపోయేది. ఒకసారి స్వామి వారికి మాలసమర్పిస్తుంటే పొడవైన కేశం విష్ణుచిత్తుడి కంటపడింది. విషయం గ్రహించి కూతుర్ని మందలించి మరునాటి మాలలను సిద్ధం చేసి తానే తీసుకుని వెళ్తే అది స్వామి స్వీకరించడు. గోదా అలంకరించుకున్న మాలే సమర్పించమంటాడు. ఇన్నాళ్లు తాను పెంచింది సాక్షాత్తు లక్ష్మీదేవినే అని గ్రహించి ఆమెను ఆండాళ్ తల్లి అని సంబోధిస్తాడు. పవిత్రధనుర్మాసంలో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. ఆమెను వివాహం చేసుకోవడానికి తిరుమల నుంచి వేంకటేశ్వర స్వామి, కంచి నుండి వరదరాజస్వామి వస్తుండగా రంగనాథస్వామి గరుడవాహనంపై విచ్చేసి ఆమె చేయందుకుంటాడు. ఇందుకు ప్రతీకగా ఈ ఆలయ ప్రాంగణంలో వేంకటేశ్వర సన్నిధి ఉంది.గర్భాలయంలో గోదాదేవి, రంగనాథస్వామితోపాటు గరుత్మంతుడు కూడా ఉంటాడు. గోదాదేవి ఎడమచేతిలో చిలుకను ధరించి, చేతిని వంపుగా కిందికి వదిలి ఉంటే, రంగనాథస్వామి గోపాలకుడిగా చెర్నాకోలు, ముల్లుకర్ర ధరించి ఉంటాడు. గరుత్మంతుడు అంజలి బద్ధుడై వారిని సేవించుకుంటూ దర్శనమిస్తాడు. ఇటువంటి అపురూపమైన గోదాదేవి దర్శనాన్ని చేసుకుని భక్తులంతా తరిస్తారు. అయితే వటపత్రశాయి సన్నిధి దివ్యదేశం అనీ, ఇప్పటి గోదాదేవి ఆలయం పెరియాళ్వార్ గృహమనీ, అదే కాలక్రమంలో ఆలయంగా రూపుదిద్దుకుందని భక్తులు గ్రహించాలి. గోదాదేవి దర్శనం సకలశుభాలకు నెలవు. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
ఆమె మృతి తీరని లోటు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి కనకాల(78) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు. కనకాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను హైదరాబాద్‌లో లేని కారణంగా లక్ష్మీదేవి కుమారుడు రాజీవ్ కనకాలకు చిరంజీవి ఫోన్ చేసి పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతి మనసుకి ఇవి బరువైన క్షణాలని చిరంజీవి అన్నారు. ‘పేరు లక్ష్మీదేవి అయినా ఆమె నా పాలిట సరస్వతీ దేవి. ఆమె పాఠాలే నా పాఠవాలకి మూలం. నటనలో ఆమె నేర్పిన మెళకువలే నాలోని నటుడికి మెళకువలు. లక్షలాది కుటుంబాలకి అభిమాన కథానాయకుడిగా ఎంత గర్వపడతానో.. లక్ష్మీదేవిగారి శిష్యుడని చెప్పుకునేందుకు అంత గర్వపడుతున్నాను. ఆమె దూరమవ్వడం తీరని లోటు. నాకే కాదు తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న అందరికీ ఇవి బరువైన క్షణాలు. అలా బరువెక్కిన మనసుతో నా చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నానని’ రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి గురించి చిరంజీవి షేర్ చేసుకున్నారు. ఈ విషయాలను పీఆర్వో బీఏ రాజు తన ట్వీటర్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. తల్లి లక్ష్మీదేవితో నటుడు రాజీవ్ కనకాల (ఫైల్ ఫోటో) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవి శనివారం ఉదయం స్వగృహంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. లక్ష్మీదేవి భర్త దేవదాస్ కనకాల కూడా నటుడుగా రాణించారు. కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. కెరీర్ ప్రారంభంలో మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ఎంతో మంది నటీనటులకు ఆమె శిక్షణ ఇచ్చారు. -
మాసం పర్వం
విష్ణుప్రీతికరం... లక్ష్మీప్రదం మన ఇష్టదైవానికి సంబంధించిన నామాలను సాధ్యమైతే ప్రతినిత్యం లేదా సంవత్సరంలో ఆయా దేవతలకు సంబంధించిన మాసంలో లేదా వారంలో ఆయా దేవతలకు ప్రీతిపాత్రమైన రోజున స్మరించడం వల్ల ఇష్టదైవం అనుగ్రహం కలుగుతుందనడంలో సందేహం లేదు. మార్గశీర్షమాసం విష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ మాసం రోజులూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విశిష్ట ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు స్త్రీలోకానికి దక్కిన మహావరం. మార్గశిర గురువార వ్రతాన్ని విధి విధానాలతో ఆచరించడం సర్వశ్రేయోదాయకం. శుభప్రద షష్ఠి మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడానికి సర్వోత్తమమైనది. ఈ రోజున శివపార్వతుల గారాల తనయుడైన కుమారస్వామిని షోడశోపచారాలతో పూజించినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. అదేవిధంగా కుజదోషం ఉన్నవారు, గోచారం ప్రకారం కుజుడు నీచస్థానంలో సంచరిస్తూ, పలు రకాలైన ఇబ్బందులకు గురవుతున్నవారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే, ఆయా దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రోక్తి. వీలయిన వారు పుట్టలో పాలు పోయడం శ్రేయోదాయకం. (24, శుక్రవారం సుబ్రహ్మణ్య షష్ఠి) -
లక్ష్మిఅంటే..?
భగవద్భక్తులపై కోపగించేవారి గృహంలో లక్ష్మీదేవే కాదు. శ్రీ హరి కూడా ఉండడు. అతిథులకు భోజన సత్కారాలు జరగనిచోట. లక్ష్మీదేవి నివసించదు. ఇల్లు కళకళ లాడుతూ ఉండనిచోట, ఇల్లాలు కంటతడి పెట్టినచోట, హృదయంలో పవిత్రత లోపించినా, ఇతరులను హింసిస్తున్నా, ఉత్తములను నిందిస్తున్నా లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. అనవసరంగా గడ్డిపరకలను తెంచినా, పచ్చటి చెట్లను పడగొట్టినా లక్ష్మీ కటాక్షం లోపిస్తుంది. నిరాశావాదులను, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో భోజనం చేసే వారిని లక్ష్మి వరించదు. పశుపక్షులను హింసించే చోట వుండనే వుండదు. సంపద మీద దురాశ ఎక్కువగా కలవారి ఇంట వుండదు. మరి లక్ష్మీదేవి ఎక్కడెక్కడ వుంటుందంటే, శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖధ్వని ఉన్నచోట, కష్టపడి పని చేసే వారి ఇంట, ఆశావాదుల ఇంట, ధనాత్మకమైన ఆలోచనలు చేసే వారి ఇంట, ప్రేమానురాగాలతో పిలుచుకునే వారి ఇంట, అతిథులతోనూ, తోటివారితోనూ ఆత్మీయంగా మసలుకునే వారి ఇంట లక్ష్మి విరాజిల్లుతుంది. అన్నిటి కంటే సంతృప్తికి మించిన ధనం ఎక్కడా లేదు. దానితోనే సంతోషం కలుగుతుంది. అప్పుడు ఎల్లవేళలా శ్రీ మహాలక్ష్మి కరుణ మనతోనే ఉంటుంది. సంపద మన అధీనంలో ఉండాలి కాని, మనం సంపద అధీనంలో ఉండకూడదు. ఏ కాస్త గర్వించినా, అహంకారం చూపినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థం. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. లక్ష్మి అంటే, ఒక వృత్తిదారుడికి చేతినిండా పని దొరకడం, కష్టపడి పని చేసేవారికి తగిన ప్రతిఫలం లభించడం, పండితులకు వారి పాండిత్యానికి, ప్రతిభా సంపత్తులకు తగిన గౌరవం దొరకడం ఆరోగ్యం, విద్యార్థులకు తగిన సీట్లు లభించడం, ఇల్లాలికి భర్త అనురాగం, పిల్లల ప్రేమ లభించడం కూడా లక్షే్మ. -
మహిళపై దాడి
నరసారెడ్డిపల్లె (చెన్నూరు) : మండలంలోని నరసారెడ్డిపల్లెకు చెందిన లక్ష్మిదేవిపై అదే గ్రామానికి చెందిన ఆమె బంధువు బోగాల కొండారెడ్డి దాడి చేశాడు. బాధితురాలు ఈ విషయంపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష్మిదేవి భర్త మృతి చెందడంతో మరో వ్యక్తిని వివాహం చేసుకొంది. గురువారం ఆమె నరసారెడ్డిపల్లెకు వెళ్లి తన భర్త ఆస్తి తనకు ఇవ్వాలని కోరింది. అయితే కొండారెడ్డి తనను తిట్టిడంతో పాటు కొట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినోద్‌కుమార్ తెలిపారు. -
2.5 కిలోల బంగారం పట్టివేత
కేకే.నగర్: చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా రెండున్నర కిలోల బంగారం తీసుకొస్తున్న ఆంధ్రా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి కువైట్ నుంచి కువైట్ ఎయిర్‌లైన్స్ విమానం చేరుకుంది. అందులో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా, ఒక మహిళపై అధికారులకు అనుమానం రావడంతో ఆమె హ్యాండ్బాగ్ని పరిశీలించగా నలుపు పాలథిన్ కవరులో 100 గ్రాముల బరువు గల ఐదు బంగారు బిస్కెట్లు కనిపించాయి. దీంతో ఆమెను ప్రత్యేక గదికి తీసుకెళ్లి సోదా చేయగా లోదుస్తుల్లో రెండు కిలోల బరువు గల ఇరవై బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. ఆంధ్రా రాజంపేటకు చెందిన లక్ష్మీదేవి (38). రెండేళ్ల క్రితం ఇంటి పనులు చేయడానికి కువైట్ వెళ్లిందని, తిరిగి సొంతూరుకు వస్తున్న విషయం తెలిసి అంతర్జాతీయ బంగారం అక్రమ స్మగ్లర్లు ఆమెకు రూ.20వేలు ఇస్తామని చెప్పి బంగారు బిస్కెట్లు ఇచ్చి పంపినట్లు తెలిసింది. బ్యాగులో ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకుంటే వాటికి తగిన మూల్యం చెల్లిస్తామని, లోదుస్తుల్లో ఉన్న బంగారాన్ని మాత్రం వారు చెప్పిన హోటల్‌కు తీసుకువస్తే అక్కడ ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పినట్లు లక్ష్మీదేవి తెలిపింది. అధికారులు ఆమెను విచారణ చేస్తున్నారు. -
వడదెబ్బకు ఇద్దరి మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బతో జనం విలవిల్లాడుతూ ప్రాణాలు వదులు తున్నారు. బుధవారం వివిధ జిల్లాల్లో వడ దెబ్బతో ఇద్దరు మృతి చెందారు. కర్నూలు జిల్లా నందికోట్కూరు మండలంలో ఉపాధి కూలి పనులకు వెళ్లిన మహిళ వడదెబ్బకు గురై మృతి చెందింది. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీదేవి(38) కూలి పనులకు వెళ్లి వడదెబ్బకు గురై సొమ్మసిల్లిపడిపోయింది. ఇది గుర్తించిన తోటి కూలీలు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో వైపు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఏఈగా పని చేస్తున్న నాగభూషణ రావు వడదెబ్బకు గురై మృతి చెందాడు. -
హీరోయిన్ని మాత్రమే కాదు
నేను హీరోయిన్ని మాత్రమే కాదు ఇతర రంగాల్లోనూ స త్తా చాటుకుంటానంటోంది నటి లక్ష్మీదేవి. మోడలింగ్ నుంచి చిత్రరంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ మలయాళంలో హీరోయిన్గా గుర్తింపు పొందింది. తమిళం, తెలుగు భాషల్లో నటించిన శివని చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ భామ కోలీవుడ్‌లో మకాం వేసింది. మసాలా పడం అనే చిత్రతంలో హీరోయిన్గా నటిస్తోంది. యువ నటుడు శివ, బాబి సింహేలు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఇది కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం అని నటి లక్ష్మీదేవి అంటోం ది. దీని గురించి ఈ ముద్దుగుమ్మ తెలుపుతూ మసాలా పడంలో తాను స్వతంత్ర భావాలు గల మంచి బలమైన పాత్రలో నటిస్తున్నానని తెలి పింది. తన పాత్ర తమిళ ప్రేక్షకులకు సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందని పేర్కొంది. ఇలాంటి చిత్రంలో తాను ఒక భాగం అయినందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పింది. మరో విషయం ఏమిటంటే ఈ మసాలా పడం చిత్రంలో కథానాయకిగా మాత్ర మే కాకుండా ఈ చిత్రానికి స్క్రిప్ట్ తానే రాసినట్లు తెలిపింది. అంతేకాదు వెన్నెల కబడ్డీ కుళు చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన లక్ష్మణ్‌తో కలసి సహ దర్శకురాలిగా పని చేస్తున్నట్లు తెలిపింది. దీంతో మసాలాపడం చిత్రంపై తన బాధ్యత చాలా పెరి గిందని చెప్పుకొచ్చింది. మొత్తం మీద తన కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం ఇదని లక్ష్మీదేవి అంటోంది. -
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ
సందర్భం- నేడు వరలక్ష్మీవ్రతం మహిళలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఇళ్లలోనూ, గుళ్లలోనూ, సామూహికంగానూ జరుపుకునే పండుగ వరలక్ష్మీవ్రతం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కాని, ఆ మాసంలోని రెండవ శుక్రవారం కాని ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ రెండు వారాలు కుదరని వారు పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారంనాడైనా సరే ఈ వ్రతం జరుపుకోవచ్చు. పూజావిధానం వ్రతం చేసేరోజు ఉదయాన్నే లేచి తలంటిస్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిముంగిట కళ్లాపు చల్లి, ముగ్గుపెట్టి, గుమ్మాన్ని పసుపు కుంకుమలు, మామిడాకుల తోరణాలతో అలంకరించాలి. ఇంట్లో ఇల్లాలు శుచిగా, కలశం స్థాపించి, అందులో లక్ష్మీదేవిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలి. అనంతరం విఘ్న నివారణకై గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని పూజకు మాత్రమే ఉపయోగించే ఒక పంచపాత్రనుగాని, లోటాను గాని తీసుకుని, అందులో నీరు పోసి అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడువైపులా పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి కలశపూజ చేసుకోవాలి. అనంతరం ఒక అతి ముఖ్యమైన అధికారి లేదా అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏమి చేస్తామో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం... ముందుగా వారిని సాదరంగా ఆహ్వానించి, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిచ్చి, కూర్చోవడానికి ఆసనం ఇచ్చి, తాగడానికి నీళ్లిస్తాం. ఆ తర్వాత సాదరంగా భోజానికి ఆహ్వానించి, రుచిగా, శుచిగా చేసిన పిండివంటలను ఆత్మీయంగా వడ్డించి, దక్షిణతో కూడిన తాంబూలమిచ్చి, విశ్రమింపజేస్తాం. ఆ తర్వాత వారు తిరిగి వెళ్లేటప్పుడు పిండివంటలో, ఇతర వస్త్రాభరణాలో ఇచ్చి, ఘనంగా వీడ్కోలు చెబుతాం. అటువంటిది... సాక్షాత్తూ వరాలనిచ్చే వేలుపు, సకల సంపదలనూ ప్రసాదించే చల్లని తల్లి మన ఇంటికి వచ్చినప్పుడు మనం మరింత భక్తిశ్రద్ధలతో ఆమెను ఆహ్వానించడమే ఆవాహన. ఆ తర్వాత మిగిలినవన్నీ షోడశోపచార పూజలు. అమ్మవారిని మన ఇంటి ఆడపడచుగా భావించి, ప్రేమగా ఆహ్వానించి, పైన చెప్పుకున్న విధంగా ఆమెను శ్రద్ధాభక్తులతో పూజిస్తే ఆమె అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది. మనకు వచ్చిన రీతిలో అమ్మవారిని పూజించి, చివరలో ముమ్మారు ప్రదక్షిణ చేయాలి. నమస్కారం నమస్తే లోక జననీ నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి అంటూ అమ్మవారికి అక్షతలు సమర్పించి నమస్కరించాలి. తోరం కట్టుకున్న తర్వాత వరలక్ష్మీ వ్రత కథ చదువుకోవాలి. ఈ కథ విని అక్షతలు శిరసుపై ఉంచుకోవాలి. ఆ తరువాత ముత్తయిదువలకు పండ్లు, తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించి, ఆనందించాలి. - డి.శ్రీలేఖ -
పాలబిందెలో ఉంగరాలాట ఎందుకు ఆడిస్తారు?
నివృత్తం నూతన వధూవరుల విషయంలో పాటించే ఆచారాలు భలే ఆసక్తికరంగా ఉంటాయి. పాల బిందెలో ఉంగరాలాట వాటిలో ఒకటి. ఓ బిందెను పాలతో నింపేస్తారు. తర్వాత అందులో ఉంగరం వేస్తారు. వధూవరులిద్దరూ ఆ ఉంగరాన్ని వెతికి పట్టుకోవాలి. ఎవరి చేతికి చిక్కితే వారే విజేత. తమ వివాహం జరిగిన తరువాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలిద్దరూ ఈ ఆటను ఆడినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. అందువల్లే ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన దంపతులిద్దరి మధ్య బెరుకు పోగొట్టేందుకే ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టినట్టు పండితులు చెబుతారు. -
ఊరించి..ఉసూరుమనిపించారు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జెడ్పీ పీఠంపై లేనిపోని ఆశలు కల్పించారు. ‘మద్దతు ఇస్తే నువ్వే జెడ్పీ చైర్పర్సన్’ అని ఆ ముగ్గురు మహిళా జెడ్పీటీసీ సభ్యులకు హామీ ఇచ్చారు. తీరా డబ్బు, ఆధిపత్యం కోసం వారిని కాదని ఓర్వకల్లు జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌కు కట్టబెట్టారు. కొందరు నేతలు కలిసి పక్కా పథకంతో వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపి ఇలా చేసినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఆలూరు అసెంబ్లీ టికెట్ ఆశించిన కప్పట్రాళ్ల బొజ్జమ్మకు జెడ్పీ పీఠం కట్టబెడతామని టీడీపీ అధినేత చంద్రబాబానాయుడే హామీ ఇచ్చారు. అందుకే ఆమె ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసి చిప్పగిరి స్థానం నుంచి బొజ్జమ్మ గెలవడంతో జెడ్పీ చైర్పర్సన్ ఆమెకే నంటూ టీడీపీకి చెందిన ముఖ్యనాయకులు ప్రచారం చేశారు. ఆమెను హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. అయితే పదవి చేతికొచ్చే సమయంలో బొజ్జమ్మకు ఇచ్చిన హామీ అటకెక్కింది. కపట్రాళ్ల కుటుంబానికి వచ్చినట్లే వచ్చి చేజారటం ఇది రెండో సారి. గతంలో కపపట్రాళ్ల వెంకటప్పనాయుడుని జడ్పీ చైర్మన్ చేస్తామని చెప్పారు. అయితే అనూహ్యంగా బత్తిన వెంకట్రాముడుకి కట్టబెట్టారు. ఇలా ప్రతిసారీ కపపట్రాళ్ల కుటుంబానికి టీడీపీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆ పార్టీకి చెందిన కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోన్, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతానికి ఆ కుటుంబం కృషి చేసింది. అయితే కొందరు టీడీపీ నా యకులకు ఆ కుటుంబానికి అండగా నిల బడ్డారు. అయితే నేటికీ ఆ కుటుంబానికి టీడీపీలో పదవులు అందని ద్రాక్ష లా మారాయని కపట్రాళ్ల వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఠం దక్కించుకునేందుకు మహిళలకు అన్యాయం... జిల్లా పరిషత్ పీఠానికి అసరమైన బలం టీడీపీకి లేకపోయినా అధికార బలంతో అడ్డదారిలో దక్కించుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శివానందరెడ్డి, మాజీ ఎంపీపీ విష్ణువర్థన్‌రెడ్డిని టీడీపీ నేతలు ఉపయోగించుకున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన జెడ్పీటీసీ సభ్యులను ఈ నాయకులు బలవంతంగా టీడీపీలో చేర్పించారు. ఇష్టం లేకున్నా మభ్యపెట్టి క్యాంపులకు తీసుకెళ్లారు. అందులో నందికొట్కూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవి పేరు తెరపైకి తెచ్చారు. నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులంతా టీడీపీకి మద్దతు తెలిపితే లక్ష్మీదేవికి జెడ్పీ పీఠాన్ని కట్టబెడతామని హామీ ఇచ్చారు. అయితే పరిణామాలు అమెకు అనుకూలంగా లేవని తెలియటంతో తిరిగి వైఎస్సార్సీపీలోకి రావటానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆమెను తిరిగి పార్టీలోకి రాకుండా స్థానిక నాయకుడొకరు అడ్డుకున్నట్లు తెలిసింది. అదే విధంగా పత్తికొండ టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుకన్యకు టీడీపీ నేతలు మాటిచ్చారు. దాదాపు సుకన్యనే జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి అని టీడీపీ నేతలు నిర్ణయించారని ప్రచారం జరిగింది. లేనిపోని ఆశలు చూపి ఈ ఇద్దరు మహిళలకూ టీడీపీ నేతలు అన్యాయం చేశారని మహిళా లోకం మండిపడుతోంది. అదే విధంగా టీడీపీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న నాయకులను కాదని కేవలం పదవి కోసం టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి జెడ్పీ పీఠాన్ని ఎలా కట్టబెడుతారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జెడ్పీ పీఠం చిచ్చు టీడీపీలో చాపకింద నీరులా అసంతృప్తి జ్వాలలు అంటుకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. -
ఆవిడకు టిక్కెట్టా!?... వద్దే వద్దు..
ఈసారీ నాకే ఇద్దురూ! - ఇదీ గుండ మనసులో మాట ‘ఎక్కడైనా బావగానీ.. వంగతోట కాడ కాదు’అన్నట్టుగా ఉంది టీడీపీ సీనియర్ నేత గుండ అప్పలసూర్యనారాయణ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు వస్తుందని భావిస్తున్న లక్ష్మీదేవి తన సహధర్మచారిణి అయినప్పటికీ ఎమ్మెల్యే టిక్కెట్టును మాత్రం వదిలేది లేదన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో స్థితప్రజ్ఞుడిగా గుర్తింపుపొందిన అప్పల సూర్యనారాయణకు ఇప్పుడు చెప్పుకోలేని కష్టం వచ్చిపడింది. ఈసారి తనకు కాకుండా భార్య లక్ష్మీదేవికి అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తారన్న సమాచారం ఆయన్ని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. 1985 నుంచి వరుసగా నాలుగుసార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తొలిసారి 2004లో ఓటమిపాలయ్యారు. ‘మరొక్క ఛాన్స్ ప్లీజ్’అంటూ మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టాలని తెగ ఆరాటపడుతున్నారు. వర్తమాన రాజకీయాలకు ఆయన సరిపడరని చంద్రబాబు 2009లోనే గుర్తించారు. అప్పటి ఎన్నికల్లోనే లక్షీదేవిని అభ్యర్థిగా నిర్ణయిస్తామన్నారు. ఆమెదే టిక్కెట్టు అని అనుకుంటున్న తరుణంలో గుండ వ్యూహాత్మకంగా ఎదురుతిరిగారు. తానే పోటీచేస్తానని కుటుంబ సభ్యుల వద్ద పట్టుబట్టారు. సానుకూలత రాకపోవడంతో అలకపాన్పు కూడా ఎక్కినట్లు ఆయన సన్నిహితులే చెబుతారు. ఆయన చిన్నబుచ్చుకోవడంతో లక్ష్మీదేవి నొచ్చుకున్నారు. ‘ఆయనకే టిక్కెట్టు ఇవ్వండి. నేను పోటీ చేయను’అని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పేశారు. దాంతో అయిష్టంగానే చంద్రబాబు 2009లో కూడా అప్పల సూర్యనారాయణనే అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ భయపడినట్లే ఆయన మళ్లీ ఓడిపోయారు. మళ్లీ అదే సీన్.. ప్రస్తుత ఎన్నికల తరుణంలో గుండ ఇంట మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతోంది. ఈసారి మాత్రం లక్ష్మీదేవికే టిక్కెట్టు ఇస్తామని చంద్రబాబు కొంతకాలంగా సూచనప్రాయంగా స్పష్టం చేస్తూ వస్తున్నారు. అప్పల సూర్యనారాయణ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. ఇటీవల విజయనగరం పర్యటన సందర్భంగా చంద్రబాబు కుండబద్దలు కొట్టేశారు. ‘ఈసారి లక్ష్మీదేవికి టిక్కెట్టు ఇస్తాం. మీరు గెలిపించుకురండి’అని తేల్చిచెప్పేశారు. అప్పటికప్పుడు అధినేత ముందు బయటపడనప్పటికీ ‘గుండ’కు ఈ నిర్ణయం రుచించలేదు. ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి ఆయన మనసు ససేమిరా అంటోంది. ‘టిక్కెట్టు బయటవ్యక్తులకు ఇవ్వడం లేదు కదా. మన ఇంటిలోనే ఉంటోంది కదా! ఒప్పుకోండి’అని కుటుంబ సభ్యులు కూడా చెప్పడంతో ఆయన హతాశుడయ్యారు. అటు పార్టీ అధిష్టానం, ఇటు కుటుంబ సభ్యులు తనను తప్పుకోమనడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని తెలుస్తోంది. రాజకీయాల్లో ఇంతకాలం మచ్చలేకుండా ఉన్న తాను మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండానే రాజకీయ సన్యాసం చేయాల్సి వస్తుందన్న ఊహే ఆయన తట్టుకోలేకపోతున్నారు. తనకున్న అనర్హత ఏమిటని ఆయన తనను తానే ప్రశ్నించుకుంటూ మథనపడిపోతున్నారు. ‘పార్టీ ఏం చెబితే అది చేశాను. ధర్నాలు చేశాను.. వయోభారాన్ని లెక్కచేయకుండా ఆందోళనలు చేశాను. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా ప్రెస్మీట్లు పెడుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాను. కానీ నాకు టిక్కెట్టు ఇవ్వరా?’అని ఆయన సన్నిహితలు వద్ద వాపోతున్నారు. బలమైన రాజకీయ ప్రత్యర్థి ఉన్న జిల్లా కేంద్రంలో పార్టీ జెండాను మోసుకుతిరిగితే చివరికి మిగిలింది ఇదా!’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్టు సాధించడం ఎలాగబ్బా అని మథనపడిపోతున్నారు. ఈసారీ టిక్కెట్టు వదులుకోవాలని లక్ష్మీదేవికి చెప్పలేక.. అలాగని ఆమెనే పోటీచేయనిచ్చేందుకు మనస్ఫూర్తిగా అంగీకరించలేక సతమతమైపోతున్నారు. తన మనోగతాన్ని గుర్తించి లక్ష్మీదేవే తనంతట తానుగా టిక్కెట్టును వదులుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నారు. గుండవారికి ఎంతటి కష్టం వచ్చిపడిందో కదా! -
పల్లె వాకిట పెద్ద పండుగ
భారతదేశంలో హరప్పా, మహంజెదారో కాలం నుంచి ఇంటి ముందు రంగవల్లులు వేయడం ఆనవాయితీ. ముగ్గును శ్రీ అని, లక్ష్మీదేవి అని భావిస్తుంటారు. మొదట్లో స్వస్తిక్ ఆకారంతో ప్రారంభమై వివిధ రూపాలు సంతరించుకుందనే ఆధారాలున్నాయి. లక్ష్మీదేవి కొలువు ఆకారం వేయడం, తర్వాత దశలో చోటు చేసుకున్నాయి. అప్పట్లో ముగ్గులను అల్పనగా పిలిచేవారు. వివిధ ప్రాంతాల్లో ఒక్కోపేరుతో పిలుస్తుంటారు. తమిళనాడు, కేరళలో కోలమ్, కర్ణాటక లో రంగవల్లి, మహారాష్ట్రలో రంగోలీ, బెంగాల్లో అల్పన, గుజరాత్లో సాతిజ్, మన రాష్ట్రంలో ముగ్గు అని పిలుస్తారు. సంక్రాంతి పండుగ రోజుల్లో ముగ్గుకు ఉన్న ప్రత్యేక త అంతాఇంతాకాదు. ఇళ్లముందు రంగు రంగుల ముగ్గులు వేయడానికి యువతులు పోటీ పడతారు. - న్యూస్‌లైన్, పాలకొండ సంక్రాంతి అతిథులు సంప్రదాయాలు, ఆచారాల మేళవింపు సంక్రాంతి. పాత, నవతరాల వారధి ఈ పండుగ. పెద్దపండుగ వచ్చిందంటే గ్రామాల్లో సందడే సందడి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు మరింత ప్రత్యేకత సంతరించుకుంటాయి. కేవలం సంక్రాంతి పండుగ రోజుల్లో మాత్రమే కనిపించే అరుదైన అతిథులు తెలతెలవారుతుండగానే దర్శనమిస్తుంటారు. వీరిలో హరిదాసులు, గంగిరెద్దుల వారు, బుడబుక్కల వారు ముఖ్యులు. వీరు కనిపిస్తేనే అసలైన పండుగు వచ్చినట్టు గ్రామీణులు భావిస్తారు. - న్యూస్‌లైన్, పాలకొండ గూటికి చేరిన వలస పక్షులు ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: బతుకు తెరువు కోసం వలస వెళ్లిన శ్రమ జీవులంతా గూటికి చేరుతున్నారు. సంక్రాంతి పండుగను స్వగ్రామంలో కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి జరుపుకోవడానికి స్వగ్రామాలకు వస్తున్నారు. దీంతో పల్లెల్లో రెండు రోజుల ముందే సంక్రాంతి సందడి నెలకొంది. రాత్రి.. పగలు శ్రమించి పని చేసే శ్రమజీవులంతా ఈ నాలుగు రోజలు పనులకు విశ్రాంతిచ్చి కుటుంబ సభ్యులు, బంధువులతో ఆనందంగా గడుపడుపుతారు. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి సంక్రాంతి కల తప్పింది. అయినా కష్టం.. నష్టంతో సంబంధం లేకుండా పెద్ద పండుగను జరుపుకోవడానికి పల్లెలు సిద్ధమయ్యాయి. వలస కార్మికులతోపాటు, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, విద్య నిమిత్తం స్థిరపడిన వారంతా ఇళ్లకు చేరుతున్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఎచ్చెర్ల మండంలోని పూడివలస, ఇబ్రహింబాద్ గ్రామాల్లో ఆదివారం ‘న్యూస్‌లైన్’ పర్యటించింది. చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లిన వారంతా స్వగ్రామాలకు చేరుతుండడం కనిపించింది. అలాగే ఇళ్లకు రంగులు వేయడం, శుభ్రం చేయడం, షాపింగ్ చేయటం, యువకులు,వృద్ధులు, మహిళలు ఒకచోటు చేరి కబుర్లు చెప్పుకోవటం కనిపించింది. అలాగే పండుగ కోసం పిండి వంటలు చేసే పనిలో ఉన్న మహిళలు తారసపడ్డారు. పూడివలసలో ఎక్కువగా తాపీ మేస్త్రీలున్నారు. వీరు ఎక్కువగా చెన్నై, హైదరాబాద్‌లో ఉంటుంటారు. వీరిలో చాలా మంది ఇప్పటికే గ్రామానికి చేరుకున్నారు. సంప్రదాయానికి పెద్దపీట గార,న్యూస్‌లైన్ : సంక్రాంతి.. సంప్రదాయానికి ప్రతీక. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కూడా పల్లె ప్రజలు పండుగ వేళ సంప్రదాయానికి పెద్దపీట వేస్తున్నారు. మహిళలు ఇష్టమైన గాజులు వేసుకోవడంలో బిజీగా ఉండగా.. పండుగ రోజుల్లో కొత్త రుచులు తినేందుకు వీలుగా అరెసలు, జంతికలు, చేగోడి, గారెలు, బూరెలు ఇతర పిండి వంటలు తయారు చేసే పనిలో మరికొందరు పోటీపడుతున్నారు. సంక్రాంతి పండుగలో నూతన వస్త్రాలదే అగ్రస్థానం. స్థోమతను బట్టీ అందరూ బట్టలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కోట్లాది రూపాయల వస్త్రాలను ప్రజలు కొనుగోలు చేశారు. మరికొందరు ఇళ్లను అందంగా రంగులతో తీర్చిదిద్దారు. యువతులు ముగ్గులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. మరికొందరు గొబ్బమ్మలను పెట్టే పనిలో ఉన్నారు. రైతన్నల సందడి శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్ సంక్రాంతి.. రైతుల పండుగ... ఆరుగాలం శ్రమించి.. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండిన పంటను ఇంటికి చేర్చే పనిలో పండుగ పూట రైతన్న బిజీగా ఉన్నాడు. వరి నూర్పులు చేసేందుకు పోటీ పడుతున్నారు. కుటుంబ సభ్యులంతా వరినూర్పుల్లో బిజీగా కనిపిస్తున్నారు. పండిన పంటను విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో పెద్ద పండుగను ఘనంగా జరుపుకోవాలని భావిస్తున్నారు. పెద్ద పండగకు ఆత్మీయ ఆహ్వానం ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా సంక్రాంతి పండుగ జరుపుకోవడంలో ఉన్న ఆనందం వేరు. ఇంటిల్లిపాది సమిష్టిగా పండుగను జరుపుకోవడం, ఆనందదాయక క్షణాలను ఆస్వాదించడం ఓ వేడుక. - లోలుగు అప్పలనాయుడు, గ్రామ పెద్ద, అంపిలి, పాలకొండ మండలం కుటుంబ సభ్యులంతా ఒకే చోటుకు సంక్రాంతి పండుగ వచ్చిదంటే కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట చేరుతారు. ఎక్కడెక్కడ నుంచో బంధువులు, స్నేహితుల రావడం మరుపురాని అనుభూతి. పెద్ద పండగ జరుపుకోవడంలో ఉన్న ఆనందం చెప్పలేనిది.- శాసపు గోవిందరావు, మాజీ సర్పంచ్, గోపాలపురం, పాలకొండ మండలం బాధలన్నీ పక్కన పెట్టి.. బాధలన్నీ పక్కనపెట్టి ఆహ్లాదంగా ఉండడం సంక్రాంతి పండుగకు ఉన్న గొప్పదనం. కష్టాలు, సమస్యలు, ఆవేదనలు, నివేదనలు నిత్యం ఉండేవే. ఉపశమనం కోసం జరుపుకొనేవి పండుగలు. మంచి వాతావరణంలో అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో ప్రతిక్షణాన్ని మనకు అనువుగా మలుచుకోవాలి. - పాలవలస ఇందుమతి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు, పాలకొండ -
విధి ‘లిఖితం.. ‘వెలుగు’పుష్పం
అందమైన లోకాన్ని చూసేందుకు కళ్లు ఇచ్చిన దేవుడు.. కదల్లేని దేహంతో బయటి ప్రపంచానికి దూరం చేశాడు. నవరత్నాలు రాల్చే నవ్వునిచ్చినా.. జీవితంలో సంతోషం లేకుండా చేశాడు. కడుపులో పెట్టుకుని చూసుకునే తల్లిదండ్రలను ఇచ్చినా.. వారికి మనశ్శాంతి లేకుండా చేశాడు. ఆకలేస్తే అడగలేదు.. ఎవరైనా నవ్వితే ఆ సంతోషాన్ని పంచుకోవడం.. ఏడిస్తే తనూ కన్నీళ్లు రాల్చడమే తెలుసు. అమ్మా.. నాన్నా.. ఇరువురు తమ్ముళ్లే ఆ బాలిక లోకం. నవ మాసాలు మోసి కన్న తల్లి ప్రేమను.. తొమ్మిదేళ్లయినా పొందకనే ఆమె ఈ లోకం వీడింది. వెళ్తూ.. ఇరువురి జీవితాల్లో వెలుగు నింపింది. ఎమ్మిగనూరు టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన డ్రైవర్ టి.వెంకటేష్, లక్ష్మీ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిది మేనరికం వివాహం. పెద్ద కుమార్తె లిఖిత(9) పుట్టుకతోనే మానసిక, శారీరక వికలాంగురాలు. మరో ఇరువురు కుమారులు గురుసాయి, శీను ఆరోగ్యంగానే ఉన్నారు. లిఖితను చిన్నప్పటి నుంచే అనారోగ్యం చుట్టుముట్టింది. మొదటి సంతానం కావడం.. అందునా ఆడపిల్ల కావడంతో ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లుగానే భావించారు ఆ దంపతులు. కదల్లేకపోయినా.. కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇంట్లో అందరినీ చూసుకోవడం ఒక ఎత్తయితే.. ఈమె బాగోగులు మరో ఎత్తు. కదల్లేని బొమ్మే అయినా.. వారు భారమనుకోలేదు. ఆమె నవ్వుతో కష్టమంతా మర్చిపోయేవారు. తమ ఇంటి దీపం కళ్ల ముందుంటే చాలనుకుని అహర్నిశలు ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసుకోసాగారు. విధి ఆ సంతోషాన్ని కూడా దూరం చేసింది.. బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లిఖిత అనారోగ్యంతో లోకం విడిచింది. తమ పాప చూడలేకపోయిన ఈ లోకాన్ని.. ఆమె కళ్లతో మరో ఇరువురు వీక్షించేలా ఆ తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో స్థానిక శ్రీవివేకానంద ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకుడు తిరుమల ఉపదేశం చేశారు. కూతురు భౌతికంగా దూరమైనా.. నేత్రదానంతో ఆమె రెండు దేహాల్లో జీవించే ఉంటుందని భావించారు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ.. కన్నీటి ధారను కట్టడి చేస్తూ లిఖిత జీవితానికి ఆ దంపతులు సార్థకత చేకూర్చారు. తమ నిర్ణయాన్ని కర్నూలు ప్రభుత్వ ప్రాంతీయ కంటి వైద్యశాల ఇన్చార్జి, జిల్లా అంధత్వ నివారణ శాఖ అధికారి డాక్టర్ ఆంజనేయులుకు ఫోన్ ద్వారా తెలియజేశారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కంటి వైద్యశాల టెక్నిషియన్ శంకర్ ఎమ్మిగనూరుకు చేరుకుని లిఖిత కళ్లను సేకరించారు. మానసిక, శారీరక ఎదుగుదల లేని కూతురిని అన్నీ తామై చూసుకున్న ఆ దంపతులు.. మరణానంతరం కూడా ఆ పాప మరో ఇద్దరి జీవితాలు వెలుగు నింపేలా తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
విజయ దీపావళి...విజయాలకు ఆవళి
వెలుగంటే ఇష్టం ఉండనిదెవరికి? అందులోనూ వెలుగును ఆనందించే జాతి మనది. భా అంటే వెలుగు. రతి అంటే ఆనందించగల ఇష్టం. అందుకే ఈ వెలుగును వాంఛించే జాతి ఉండే భూమిని భరత వర్షం, భరత ఖండం అని పేర్కొన్నారు ప్రాచీనులు. ఇటువంటి భూమి మీద ఒకప్పుడు అందరికీ వెలుగు అందకుండా దూరం చేసిన వాడొకడు ఉండేవాడట. అందుకే వాడు చనిపోతే అందరూ కరువుతీరా దీపాలు వెలిగించుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఎన్నో వరుసలలో దీపాలు వెలిగించుకున్నారు కనుక ఈ వేడుకని దీపావళి అన్నారు. చీకటి, వెలుగు అనే మాటలని కాంతి అనే సందర్భంలోనే కాక ఎన్నింటికో ఉపయోగిస్తుంటాము. లోకంలో కావలసిన వాటిని, కోరుకోదగిన వాటిని వెలుగుగాను, పనికి రాని వాటిని, హాని కలిగించేవాటిని చీకటిగానూ చెబుతుంటాము. అవిద్య, అజ్ఞానం, అనారోగ్యం, దుఃఖం, బాధ, చికాకు, దరిద్రం, అపకీర్తి, అవమానం, పాపం మొదలైన మనిషి నాశనానికి, నిరాశానిస్పృహలకి హేతువులైనవన్నీ చీకటిగానూ, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కీర్తి, పుణ్యం మొదలైన మానవునికి కోరుకోదగిన, ఉపయోగపడేవన్నీ వెలుగుగానూ సంకేతించారు. అందువల్లనే అన్ని విధాలైన చీకట్లను పోగొట్టే వెలుగు అంటే ఇష్టపడే జాతి భారత జాతి. కనుకనే దీపాన్ని ఆరాధిస్తాము, పూజిస్తాము. దీపం జ్యోతి పరమ్ బ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తు తే అని దీపాన్ని ప్రార్థిస్తాము. ఇది నిత్యకృత్యం. వరుసలుగా వందలాది, వేలాది దీపాలు వెలిగించడానికి ఎంతటి సంతోషం ఉప్పొంగి ఉండాలో కదా! అటువంటి సందర్భం ద్వాపరయుగం చివరలో వచ్చింది. దానికి బీజం కృతయుగంలోనే పడి త్రేతాయుగంలో మొలకెత్తింది. యజ్ఞవరాహమూర్తిగా తనను ఉద్ధరించిన మహావిష్ణువుని చూసి వలచింది భూదేవి. తనకు కుమారుని ప్రసాదించమని కోరింది. ఆ సమయంలో గర్భధారణ జరిగితే మహా బలవంతుడు, లోకకంటకుడు అయిన కుమారుడు జన్మిస్తాడని అన్నాడు విష్ణువు. భూదేవి తమకంతో బలవంతం చేసింది. తప్పలేదు విష్ణుమూర్తికి. లోకకంటకుడు భూదేవి గర్భంలో ఉన్నాడని తెలిసిన దేవతలు ఆ బాలుడు గర్భంలో నుండి బయటకు రాకుండా చూశారు. భూదేవి విష్ణువుని వేడుకుంది. త్రేతాయుగం చివరలో కుమారుడు ఉదయిస్తాడని అభయం ఇచ్చాడు. ఆ బాలుడే నరకుడు. అతడికి పదునారు సంవత్సరాలు వచ్చిన తర్వాత బ్రహ్మపుత్రా నదీపరీవాహక ప్రాంతంలో ప్రాగ్జ్యోతిషం రాజధానిగా కామరూపానికి రాజుని చేస్తూ, ధర్మం తప్పవద్దని, గోబ్రాహ్మణులకు హాని తలపెట్టవద్దని, అలా చేస్తే కీడు వాటిల్లుతుందని హెచ్చరించాడు. ఆ మాటను అనుసరించి చాలాకాలం భుజబలంతో తనకెవ్వరూ ఎదురులేని విధంగా ధర్మబద్ధంగానే పాలించాడు. కాని, ద్వాపరయుగం చివరలో అతడిలోని అసుర లక్షణాలు బహిర్గతమయ్యాయి. వేదధర్మానికి దూరమై, తాంత్రిక సాధన సత్వర ఫలవంతమని అనుసరించడం మొదలు పెట్టాడు. దానికోసం కామాఖ్యాదేవికి బలి ఇవ్వటానికి ఎంతోమంది రాజకుమారులను, పదునారువేలమంది రాజకుమార్తెలను చెరబట్టి ఉంచాడు. అదితి కుండలాలను, వరుణుని ఛత్రాన్ని హరించాడు. దేవతలకు నిలువ నీడ లేకుండా చేశాడు. మరెన్నో దురంతాలు చేయసాగాడు. ఇంద్రుడు కోరిన మీదట శ్రీకృష్ణుడు నరకునిపై యుద్ధానికి వెడుతుంటే సత్యభామ తానూ వెంటవస్తానని ముచ్చటపడింది. అక్కడ కృష్ణుడు మూర్ఛపోతే అతడికి సేదతీర్చుతూనే యుద్ధంలో నరకుని నిలువరించింది. సత్యభామ ఉపచారాలతో తేరుకున్న శ్రీకృష్ణుడు చక్రంతో నరకుని తెగటార్చాడు. అది ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి. సత్యభామ కోరిక మేరకు ఆ రోజుని నరకుడి పేరుతో నరక చతుర్దశి అని పిలవటం జరిగింది. ఆ మరునాడు అంటే అమావాస్యనాడు ప్రజలందరూ దీపాలు వెలిగించుకుని సంబరాలు చేసుకున్నారు. ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని ఈ సందర్భంలో ఒకరు చనిపోతే చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందుకంతగా సంతోషప్రదమయింది? నరకుడు భూదేవి పుత్రుడు. భూమి వసుంధర. అన్ని రకాలైన ఓషధులు, ఖనిజాలు ఇచ్చేది భూదేవియే. భూపుత్రుడైన నరకుకునికి వాటన్నింటి మీద వారసత్వపు అధికారం ఉంది. కాని అతడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. సంపదలతో పాటు వెలుగుని కూడా ఎవరికీ అందకుండా తానే స్వంతం చేసుకున్నాడు. ప్రాగ్జ్యోతిషమంటే ముందుగా వెలుగు ప్రసరించే ప్రాంతం. భారతదేశంలో మొదటి సూర్యకిరణం భూమిని సోకేది అక్కడే కదా! ముందుగా తనకి అందిన వెలుగుని ఇతరులకి చేరకుండా అడ్డుపడేవాడట. నరకుని భయానికి పగటిపూట బయటకు రావటానికి కూడా భయం. వద్దామన్నా వెలుగులేదు. రాత్రిపూట దీపం వెలిగిస్తే తమ ఉనికి తెలుస్తుందనే భయం. మొత్తానికి భయమనే చీకట్లో మగ్గారు ప్రజలందరూ. భయకారణం పోగానే ఇన్నాళ్ల దీపాలు కరువుతీరా వెలిగించుకుని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకున్నారు. ఆ శుభసంఘటనని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ కృష్ణ అమావాస్యనాడు దీపాలు వెలిగించటం సంప్రదాయం అయింది. ఇది చీకటిపై వెలుగు. గెలుపుకి సంకేతం. స్వంత కొడుకైనా దుష్టుడైతే సంహరించటానికి అంగీకరించే ఉత్తమురాలైన మాతృహృదయానికి సంకేతం. అమావాస్య అంత శుభప్రదమైంది కాదనే విశ్వాసం చాలామందికి ఉన్నా, ఆశ్వయుజ కృష్ణ అమావాస్యనాడు ఎన్నో శుభసంఘటనలు జరిగాయని చరిత్ర చెబుతోంది. ఈ రోజే విక్రమాదిత్య చక్రవ ర్తి 30 లక్షలమంది శకులను, హూణులను భరత ఖండం నుండి తరిమికొట్టి, సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్టించాడు. విక్రమశకం ఈనాటినుండే మొదలయింది. ఇది వేదధర్మ విజయ సంకేతం. శిక్కుల గురువు గురు గోవిందసింగ్ని పరివారంతోపాటు జహంగీర్ చక్రవర్తి గ్వాలియర్ కోటలో బంధించాడు. కొంతకాలానికి ఆయన ఒక్కడిని విడుదల చేస్తానంటే తన పరివారాన్నంతటినీ విడుదల చేయాలని పట్టుబట్టాడు. చివరికి జహంగీర్ అందుకు సమ్మతించి అందరినీ విడుదల చేశాడు. అది కూడా దీపావళినాడే. అందువల్ల శిక్కులు దీపావళిని త్యాగానికి సంకేతంగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుశ అమావాస్యనాడు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించింది. విష్ణువుని వివాహమాడింది. దానితో దేవతలకు పోయిన స్వర్గలక్ష్మి లభించింది. కనుక దేవతలు దీపావళిని నష్టరాజ్య లాభానికి సంకేతంగా జరుపుకుంటారు. ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనసులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని అంతా వెలిగేటట్టు చేయడం దీపం వెలిగించడంలోని ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచంలోని అన్ని దేశాలవారు, అన్ని జాతులవారు ఏదో ఒక సందర్భంలో దీపాల పండుగ చేసుకుంటారు. చీకటి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కదా! ప్రతిమనిషి గుండెలోని, సమాజంలోని అన్ని విధాలైన చీకట్లను పోగొట్టి, సకల శుభాలను, సుఖసంతోషాలను, ఆనందోత్సాహాలను విజయ దీపావళి నింపాలనుకుంటూ దీపాలను వెలిగిద్దాం. మన ఇంట్లో వెలిగించిన ఒక్క దీపమైనా ముల్లోకాల చీకట్లను పోగొట్టాలన్నది మన ఆశంస. సాజ్యం త్రివర్తి సంయుక్తం... వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం... త్రైలోక్య తిమిరాపహం - డా. ఎన్. అనంతలక్ష్మి