హీరోయిన్‌ని మాత్రమే కాదు | i am in all rounder Actress Lakshmi Devi | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ని మాత్రమే కాదు

Nov 19 2014 1:51 AM | Updated on Sep 2 2017 4:41 PM

హీరోయిన్‌ని మాత్రమే కాదు

హీరోయిన్‌ని మాత్రమే కాదు

నేను హీరోయిన్‌ని మాత్రమే కాదు ఇతర రంగాల్లోనూ స త్తా చాటుకుంటానంటోంది నటి లక్ష్మీదేవి.

నేను హీరోయిన్‌ని మాత్రమే కాదు ఇతర రంగాల్లోనూ స త్తా చాటుకుంటానంటోంది నటి లక్ష్మీదేవి. మోడలింగ్   నుంచి చిత్రరంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ మలయాళంలో హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తమిళం, తెలుగు భాషల్లో నటించిన శివని చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ భామ కోలీవుడ్‌లో మకాం వేసింది. మసాలా పడం అనే చిత్రతంలో హీరోయిన్‌గా నటిస్తోంది. యువ నటుడు శివ, బాబి సింహేలు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది.
 
 ఇది కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం అని నటి లక్ష్మీదేవి అంటోం ది. దీని గురించి ఈ ముద్దుగుమ్మ తెలుపుతూ మసాలా పడంలో తాను స్వతంత్ర భావాలు గల మంచి బలమైన పాత్రలో నటిస్తున్నానని తెలి పింది. తన పాత్ర తమిళ ప్రేక్షకులకు సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందని పేర్కొంది. ఇలాంటి చిత్రంలో తాను ఒక భాగం అయినందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పింది. మరో విషయం ఏమిటంటే ఈ మసాలా పడం చిత్రంలో కథానాయకిగా మాత్ర మే కాకుండా ఈ చిత్రానికి స్క్రిప్ట్ తానే రాసినట్లు తెలిపింది. అంతేకాదు వెన్నెల కబడ్డీ కుళు చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన లక్ష్మణ్‌తో కలసి సహ దర్శకురాలిగా పని చేస్తున్నట్లు తెలిపింది. దీంతో మసాలాపడం చిత్రంపై తన బాధ్యత చాలా పెరి గిందని చెప్పుకొచ్చింది. మొత్తం మీద తన కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రం ఇదని లక్ష్మీదేవి అంటోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement