మెక్సికో: హిందూయిజంను ఇష్టపడనివారు ఉండరు. వీదేశీయులు కూడా భారత సంస్కృతిని, ఇక్కడి హిందూ దేవుళ్లను ఎంతగానో ఆరాధిస్తారు. భారత్‌లోని ప్రముఖ దేవాలయాలను కూడా వారు తరచూ సందర్శిస్తుంటారు. అలాగే ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హాయెక్ కూడా హిందూయిజంపై తనకు ఉన్న అభిమానాన్ని ప్రకటించారు. తను ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మి దేవిపై దృష్టి పెట్టడం ద్వారా ఇన్నర్ బ్యూటీతో కనెక్ట్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించారు. సల్మా లక్ష్మీ దేవి ఫొటోను షేర్ చేస్తూ.. ఈ ఫొటో తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. ‘నేను నా అంతర్గత సౌందర్యంతో కనెక్ట్ అవ్వాలనుకున్నపుడు ధ్యానం చేస్తాను. ఆ సమయంలో హిందూ దేవత అయిన లక్ష్మీ దేవిని స్మరించుకుంటాను. అది నాకు ఎంతో ఆనందం, ప్రశాంతను ఇస్తుంది. అప్పుడే మీ అంతర్గత సౌందర్యం మరింత గొప్పగా ఉంటుంది’ అంటూ సల్మా రాసుకొచ్చారు. (చదవండి: ‘సినీ వరల్డ్’ మూత ఉద్యోగుల కోత)
సల్మా పోస్టు చూసిన బాలీవుడ్ నటి బిపాస బసు ‘అద్భుతం’ అంటూ కామెంటు చేశారు. అంతేగాక సల్మా ఇండియన్ ఫ్యాన్స్ కూడా తను లక్ష్మీ దేవతను ఆరాధిస్తానని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు ఇండియాకు రండి ఇక్కడ మీకు మరింత అంతర్గత శాంతి లభిస్తుంది. అంతేకాదు భారతీయుల ప్రేమను కూడా పొందుతారు’ అంటూ ఆమె పోస్టుకు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అయితే హిందు దేవతలను ఆరాధించే వారిలో సల్మాతో పాటు జూలియా రాబర్ట్, రస్సెల్ బ్రాండ్, మిలే సైరస్ వంటి అంతర్జాతీయ ప్రముఖు నటులు కూడా ఉన్నారు. కాగా మెక్సికో దేశానికి చెందిన సల్మా మెక్సీకన్, అమెరికన్ సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న ఆమె హాలీవుడ్‌లో ‘డెస్పరాడో’, ‘వైల్డ్ వైల్డ్ వెస్ట్’, ‘ఫ్రిడా’, ‘స్పై కిడ్స్-3’ వన్స్ అపాన్ టైమ్ ఇన్ మెక్సికో’ వంటి చిత్రాలతో నటించారు. (చదవండి: క్యాన్సర్‌తో దిగ్గజ రాక్‌స్టార్ కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment